Thumbnail for అత్యాశ భార్య  | Telugu neethi kathalu | Moral stories in telugu | Telugu stories by Mana Oori Kathalu

అత్యాశ భార్య | Telugu neethi kathalu | Moral stories in telugu | Telugu stories

Mana Oori Kathalu

24m 55s2,572 words~13 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:04]Section 1

అనగనగా, రావులపాలెం అనే ఊరిలో అందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో రాఘవయ్య గారి కుటుంబం నివసించేది. ఆ ఊరికే రాఘవయ్య కుటుంబం...

[2:24]Section 2

వాడి కూతురిని మన ఇంటి కోడలిగా చేసుకుంటున్నామని తెలిస్తే వాడు చాలా సంతోషపడతాడు.

[3:00]Section 3

అని సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవయ్య కూడా వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రాఘవయ్య సులోచన మీనకూడల్ని వాళ్ళ పెద్దబ...

[10:06]Section 4

అప్పుడు సుగుణ ఇలా అంటుంది. చూడు శ్రావణి నాకు ఎలాగో ఇద్దరు పిల్లలు పుట్టారు కాబట్టి నీకు పిల్లలు లేరని నువ్వు అంతలా బాధపడుతూ ఉంటే నేను చూడ...

[12:14]Section 5

అనగనగా మిరియాలగూడెం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఆ ఊరిలో మాధవయ్య అనే జమిందారు ఉండేవాడు. ఆయన చాలా...

[20:18]Section 6

అదే స్వామి ఇందాక మనం పొరుగు ఊరు నుంచి వచ్చినప్పుడు ఒకరి ఇంట్లో కూర్చొని భక్తి ప్రవచనాలు చెప్పాం కదా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా సంచికి ఆ ఇంట్...

Pull quotes
[0:04]ఆ ఊరికే రాఘవయ్య కుటుంబం మంచి పలుకుబడి డబ్బు ఉన్న కుటుంబం కావడం వల్ల రాఘవయ్య అతని కుటుంబం అంటే ఆ ఊరంతా చాలా గౌరవంగా అభిమానంగా ఉండేవారు.
[0:04]ఆ మాట విన్న సులోచన టీ తీసుకొచ్చి రాఘవయ్యకి ఇచ్చి నూనెతో రాఘవయ్య తలకు మర్దన చేస్తుంది.
[0:04]చాలు చాలు లేవయ్యా పెళ్లికి వచ్చిన ఇద్దరు కొడుకులు ఉండగా ఈ వయసులో నీకు సరసాలు ఏంటయ్యా.
[0:04]ఇప్పుడే వాళ్ళు కూడా నాలాగ బాగా వ్యవసాయం చేసి బాగా డబ్బు సంపాదించి నాకు మంచి పేరు సంపాదిస్తారు.
Use this transcript
Related transcript hubs

[0:04]అనగనగా, రావులపాలెం అనే ఊరిలో అందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో రాఘవయ్య గారి కుటుంబం నివసించేది. ఆ ఊరికే రాఘవయ్య కుటుంబం మంచి పలుకుబడి డబ్బు ఉన్న కుటుంబం కావడం వల్ల రాఘవయ్య అతని కుటుంబం అంటే ఆ ఊరంతా చాలా గౌరవంగా అభిమానంగా ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు రాఘవయ్య తన భార్య సులోచనతో ఇలా అంటాడు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. నూనె తీసుకొచ్చి తలకు రాయు. అలాగే కాస్త కమ్మటి టీ కూడా తీసుకురా. ఆ మాట విన్న సులోచన టీ తీసుకొచ్చి రాఘవయ్యకి ఇచ్చి నూనెతో రాఘవయ్య తలకు మర్దన చేస్తుంది. అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. సులోచన నీ చేతిలో ఏదో మహత్యం ఉంది. ఇంతవరకు తలనొప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు నీ చెయ్యి నా తలపై పడగానే తలనొప్పి వెంటనే మటుమాయమైపోయింది. అని భార్య చేతులు పట్టుకొని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు సులోచన ఆ పొగడతలకు మురిసిపోతూ ఇలా అంటుంది. చాలు చాలు లేవయ్యా పెళ్లికి వచ్చిన ఇద్దరు కొడుకులు ఉండగా ఈ వయసులో నీకు సరసాలు ఏంటయ్యా. అయినా నీ కొడుకులకి ఎప్పుడు పెళ్లి చేస్తావ్. వాళ్ళకి పెళ్లి చేసే ఆలోచన ఏమైనా ఉందా లేదా నీకు? అప్పుడే వాళ్ళ పెళ్లికి అంత తొందరేం వచ్చిందే వాళ్ళకి ఇంకా చిన్నతనం పోలేదు. అలాగే వ్యవసాయంలో మెలకువలన్నీ వాళ్ళకి బాగా నేర్పాలి. ఇప్పుడే వాళ్ళు కూడా నాలాగ బాగా వ్యవసాయం చేసి బాగా డబ్బు సంపాదించి నాకు మంచి పేరు సంపాదిస్తారు. అదేంటయ్యా అలా అంటావ్. మన ఊర్లో ఉన్న వాళ్ళు ఏడు పిల్లలందరికీ పెళ్లిళ్ళై పిల్లలు కూడా పుట్టేసారు. నువ్వు మాత్రం ఇంకా నీ కొడుకులు చిన్న పిల్లలే అన్నట్టుగా మాట్లాడుతున్నావ్. అదంతా తెలియదయ్య నువ్వు వెంటనే వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడాలి. ఈ ఏడాది ఎలాగైనా వాళ్ళకు పెళ్లి చేసేయాలి. అని పంతం పట్టుకు కూర్చుంటుంది. అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. సరేలే నువ్వు అంతలా పంతం పడుతున్నావు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాం. అలాగేనయ్యా ఇప్పుడే మా అన్నయ్యకి ఈ విషయం చెబుతాను.

[2:24]వాడి కూతురిని మన ఇంటి కోడలిగా చేసుకుంటున్నామని తెలిస్తే వాడు చాలా సంతోషపడతాడు.

[3:00]అని సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవయ్య కూడా వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రాఘవయ్య సులోచన మీనకూడల్ని వాళ్ళ పెద్దబ్బాయి భానుకు ఇచ్చి ఇక రెండో అబ్బాయి శ్రీనుకి శ్రావణి అనే అమ్మాయిని ఇచ్చి వాళ్ళ ఊర్లోని అంగరంగ వైభవంగా ఇద్దరి కొడుకుల పెళ్లిళ్లు జరిపిస్తారు. అలా రాఘవయ్య కుటుంబం కొడుకు కోడళ్ళతో హాయిగా జీవనం సాగిస్తూ ఉంటుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు రాఘవయ్య చిన్న కోడలు శ్రావణి చిన్న కోడుకు శ్రీను దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. ఏమండీ మీ అమ్మగారు మీ వదినని స్వయానా మీ అమ్మకి మేనకోడలని ఆమినే కాస్త ప్రేమగా చూసుకుంటుంది. నన్ను కాస్త దూరంగా చూసుకుంటూ నాపై ఎప్పుడూ చిరుబుర్లాడుతూ ఉంటుంది. కానీ నేను ఏ రోజు మీ అమ్మని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు రక్త సంబంధమని నేను అర్థం చేసుకున్నాను. అని కాస్త శ్రీనుకి మాయమాటలు చెప్పి వాళ్ళ అమ్మపై కోపం తెప్పించాలని అబద్ధాలు చెబుతుంది. అప్పుడు ఆ మాట విన్న శ్రీను శ్రావణిపై కోప్పడుతూ ఇలా అంటాడు. ఒసేయ్ నీ మాయ మాటలు నేను నమ్మను. మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు. అలాగే మా వదిన కూడా చాలా మంచిది. మా అమ్మ చిన్న కోడల్ని ఒకలా పెద్ద కోడల్ని ఒకలా ఎప్పుడూ చూడదు చూడలేదు కూడా. నువ్వు ఏవో కట్టు కథలు చెప్తే నేను నమ్మను. అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా శ్రీనుని ఆపి శ్రావణి ఇలా అంటుంది. మీరు ఇలానే మీ అమ్మని వెనకేసుకు వస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీ అమ్మ ఈ ఆస్తినంతా మీ వదిన పేరే రాసేస్తుంది. అప్పుడు మీరు చేతిలో చిప్ప పట్టుకొని ముష్టెత్తుకుంటారు. అంతవరకు రాకూడదని అంటే ఈ ఆస్తిని వెంటనే రెండు వాటాలుగా విభజించి మీ ఆస్తి మీకు ఇచ్చేయమని చెప్పండి. అప్పుడు మనం ఈ ఇల్లు వదిలి ఇంకొక పెద్ద ఇంటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ మాట విన్న శ్రీను శ్రావణి చెంపపై కొట్టి ఇలా అంటాడు. అయినా నీకు డబ్బు అంటే బాగా పిచ్చి పట్టింది. అందుకే ఇలా డబ్బుపై అత్యాశతో మా అమ్మపై నాకు లేనిపోనివన్నీ చెప్పి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేయాలని చూస్తున్నావ్. ఆ పని ఎన్నటికీ నేను చేయను. నా కుటుంబాన్ని ఈ ఇంటిని వదిలి నేను రాను. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రావణి కూడా వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సులోచన ఇద్దరి కోడళ్ళతో ఇలా అంటుంది. సుగుణ, శ్రావణి మీ ఇద్దరికీ పెళ్ళై చాలా రోజులు అవుతుంది. కానీ మీ ఇద్దరూ ఇంకా నెల తప్పలేదు. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు ముందు నెల తప్పి ఈ ఇంటికి ముందుగా వారసుడిని ఇస్తారో వాళ్ళకి నా పేరున ఉన్న 10 ఎకరాల పొలాన్ని రాసేస్తాను. ఆ మాటలు విని సుగుణ శ్రావణి చాలా సంతోషపడతారు. అలాగే కాస్త సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక కొన్ని రోజుల తర్వాత సుగుణ శ్రావణి ఇద్దరూ కూడా ఒకేసారి నెల తప్పిస్తారు. అప్పుడు రాఘవయ్య సులోచన తమ వారసుడు వారసురాలతో ఆడుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఒక రోజు శ్రావణి తన గదిలో ఉండి ఇలా అనుకుంటుంది. అయ్యో నేనే ముందు నెల తప్పి ఇంటికి వారసుడిని ఇస్తే బాగుండు. ఇప్పుడు చూడు ఆ సుగుణ కూడా నెల తప్పింది. దానికి గాని ముందు ప్రసవమై ఈ ఇంటి వారసుడిని ఇచ్చేస్తే మా అత్త దానీ కొడుకే తన 10 ఎకరాల భూమిని రాసేస్తుంది. కాబట్టి ఎలాగైనా ఈ ఆస్తిని నాకు పుట్టిన పిల్లలకే సొంతమయ్యేట్టు చేయాలి. అలా జరగాలంటే సుగుణ కడుపులో బిడ్డ ఉండకూడదు. అని అనుకొని తనకే డబ్బంతా రావాలని అత్యాశతో తనకు తెలిసిన నాటు వైద్యుడి దగ్గరికి వెళ్లి సుగుణ కడుపు పోయేటట్టు ఒక మందు తీసుకొచ్చి సుగుణ తినే అన్నంలో కలిపి సుగుణ కడుపులో బిడ్డను చంపేయాలని చూస్తుంది. అయినా సరే సుగుణ శ్రావణి మందు కలిపిన అన్నం తినదు. అనుకోకుండా తను మందు కలిపిన అన్నాన్ని శ్రావణీనే తినేస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు శ్రావణి కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోతుంది. అప్పుడు వైద్యుడిని పిలిపించి పరిశీలిస్తే శ్రావణికి కడుపులోనే పిండం కరిగిపోయిందనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు. శ్రావణి కూడా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అప్పుడు శ్రావణిని ఓదార్చుతూ సుగుణ ఇలా అంటుంది. శ్రావణి నువ్వేం బాధపడకు. అనుకోకుండా ఏదో జరిగింది. అయినా మళ్ళీ నువ్వు నెల తప్పుతావ్. నీకు ఖచ్చితంగా పండంటి బిడ్డ పుడతాడులే. అని భరోసా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రావణి తన మనసులో ఇలా అనుకుంటుంది. నీకేమి నువ్వు వెన్నైనా మాటలు చెబుతావ్. చనిపోయింది నీ కడుపులో బిడ్డ కాదుగా నా కడుపులో బిడ్డ కదా. అయినా నేను దీని కడుపులో బిడ్డ చంపడానికి నేను అన్నంలో మందు కలిపితే పొరపాటున ఆ అన్నం నేనే తినేసినట్టు ఉన్నాను. అందుకే నా కడుపులో పిండం కరిగిపోయింది. అని తను చేసిన తప్పును మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. అయినా సరే ఆస్తంతా తన బిడ్డకే రావాలని ఆ డబ్బు పై అత్యాశతో సుగుణ కడుపులో బిడ్డని ఎలాగైనా చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా తొమ్మిది నెలలు గడిచిపోతాయి. సుగుణ ఒక రోజు పురిటి నొప్పులతో బాధపడుతూ ఇంట్లోనే సాధారణ ప్రసవం అవుతుంది. ఇద్దరూ కవల మగ బిడ్డలు పుడతారు. అప్పుడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడి వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అప్పుడు సులోచన సుగుణతో ఇలా అంటుంది. చూడు సుగుణ నేను పెట్టిన శరతు ప్రకారం నువ్వే ముందుగా ఈ ఇంటికి వారసుడిని ఇచ్చావు. కాబట్టి నాకున్న 10 ఎకరాల భూమిని నీ కొడుకుల పేరున రాస్తాను. ఆ మాటలు విన్న శ్రావణి సుగుణపై కుళ్ళుతో తనకున్న డబ్బు పై అత్యాశతో ఇలా అంటుంది. నాకు ముందే తెలుసు అత్తయ్యగారు మీరు మీ మేనకోడలైన సుగుణకే మీ పేరున ఉన్న భూమిని రాసేస్తారని. కాబట్టి మీరేదో మందు పెట్టి నా కడుపులో బిడ్డని చంపేసారు. ఇదంతా మీరే చేశారు. నా కడుపులో బిడ్డను చంపిన పాపం మీకు తగలకుండా పోదు. నా ఊసురు మీకు తప్పకుండా తగులుతుంది. అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. అప్పుడు సుగుణ ఇలా అంటుంది. చూడు శ్రావణి అత్తయ్యగారు ఏంటి నీ బిడ్డని చంపడం ఏంటి. అయినా ఈ ఆస్తి అంతస్తులు నాకేం అవసరం లేదు. కావాలంటే నువ్వే ఈ 10 ఎకరాల భూమిని అలాగే మావయ్యగారి ఆస్తినంతా నువ్వే తీసుకో. నాకు చిల్లి గవ్వ కూడా వద్దు. నాకు అత్త మామల ప్రేమ ఆప్యాయత ఉంటే చాలు. అలాగే మన కుటుంబం అంతా కలిసి ఉండాలి. అని చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. అప్పుడు శ్రావణి బెటకారంగా ఇలా అంటుంది. అయినా మీరిచ్చే ముష్టి ఎవరికి కావాలి. నాకేం వద్దు. అయినా నా కడుపులో బిడ్డని నాకు కాకుండా చేసింది మీరే. అని తన నాటకం బయటపడకుండా ఇంట్లో వాళ్ళని దోషలు చేసి తనపై జాలి కలిగేటట్టు ఆస్తంతా తనకే వచ్చేటట్టు కొత్త నాటకం మొదలు పెడుతుంది.

[10:06]అప్పుడు సుగుణ ఇలా అంటుంది. చూడు శ్రావణి నాకు ఎలాగో ఇద్దరు పిల్లలు పుట్టారు కాబట్టి నీకు పిల్లలు లేరని నువ్వు అంతలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నా పిల్లల్లో ఒక బాబుని నువ్వు తీసుకో. అలాగే ఈ ఆస్తిని కూడా నువ్వే తీసుకో. నేను మా ఆయన అత్తమామలతో కలిసి బయటికి వెళ్ళిపోతాం. అని చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ మాట విన్న శ్రావణికి ఏమనాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండగా ఇంతలో శ్రీను అక్కడికి వచ్చి శ్రావణి చెంపపై కొట్టి ఇలా అంటాడు. ఏంటే నువ్వు చేసిన పని నీకు డబ్బు పై అత్యాశతో ఈ ఆస్తి అంతా నువ్వే దక్కించుకోవాలని మా వదిన కడుపులో బిడ్డను చంపాలని నాటు వైద్యుడి దగ్గరికి వెళ్లి మందు తెచ్చి ఆ మందును అన్నంలో కలిపి మా వదిన చేత తినిపించాలని చూస్తావా? అయినా ఇలాంటి దానిని నా భార్యగా నేను అంగీకరించలేను. వెంటనే నువ్వు ఈ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపో. అని శ్రావణిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు శ్రీను. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సుగుణ సులోచన వింతగా చూస్తూ ఉంటారు. అప్పుడు శ్రావణి భయపడిపోయి అందరితో ఇలా అంటుంది. ఏమండీ నన్ను క్షమించండి. నేను తెలియక ఈ డబ్బుపై వ్యామోహంతో ఏదో తప్పు చేశాను. అయినా నేను చేసిన పాపం నాకే తగిలింది. అందుకే ఆ దేవుడు ఆ మందు కలిపిన అన్నం నన్నే తినేట్టు చేశాడు. మీ వదినకి పండంటి మగ బిడ్డలు పుట్టేటట్టు చేశాడు. కాబట్టి ఆ దేవుడే నాకు శిక్ష వేశాడు. మళ్ళీ మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేసి ఇంత పెద్ద శిక్ష వేయకండి. అత్తయ్య సుగుణక్క మీరైనా చెప్పండి. అని తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాప పడుతూ అందరి కాళ్ళకి నమస్కారం చేసి తను డబ్బుపై అత్యాశతో చేసిన తప్పులకి క్షమాపణ కోరుతుంది. అప్పుడు అందరూ శ్రావణిని క్షమించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలా శ్రావణి డబ్బుపై అత్యాశతో తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుంటుంది. అలా ఆ రోజు నుంచి శ్రావణి ఎలాంటి అత్యాశ లేకుండా సుగుణ బిడ్డనే తన బిడ్డగా చూసుకుంటూ అందరితో కలిసి మెలిసి హాయిగా జీవనం సాగిస్తూ ఉండేది.

[12:14]అనగనగా మిరియాలగూడెం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఆ ఊరిలో మాధవయ్య అనే జమిందారు ఉండేవాడు. ఆయన చాలా మంచి మనిషి. ఎవరికైనా సహాయం చేసే గుణం కలవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు ఊరిలో మాధవయ్య నడుచుకొని వెళ్తూ ఉండగా ఆ ఊరి చివరన చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చొని ఉండటం గమనిస్తాడు. అప్పుడే జమిందారు స్వామీజీ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. స్వామి మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎందుకు ఇలా మా ఊరి చివర కూర్చున్నారో నాకు కొంచెం సెలవిస్తారా? నాయనా నీ ముఖం చూస్తే చాలా మంచి వాడిలా ఉన్నావు. అలాగే నీ మంచితనం వలనే నీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిత్యం తాండవిస్తూ ఉంటుంది. కానీ నువ్వు నీ కూతురికి మంచి సంబంధం కోసం చాలా కాలంగా వెతుకుతున్నావు. ఆ కోరిక కూడా తొందరలోనే నెరవేరుతుంది. మాధవయ్య స్వామీజీ అలా తన గురించి చెప్పడం విని ఆశ్చర్యంగా స్వామీజీ వైపు చూసి ఇలా అంటాడు. అవును స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను నా కూతురు పెళ్లి కోసం చాలా రోజుల నుంచి సంబంధం కోసం వెతుకుతున్నాను. కానీ నా కూతురికి సరైన సంబంధం దొరకలేదు. నా కూతురికి ఈ సంవత్సరమైనా పెళ్లి అవుతుందా? నీ కూతురికి మంచి పెళ్లి సంబంధం ఈ నెల ఆఖర్లోగా కుదురుతుంది. కానీ ఈ విభూది నీ కూతురు నుదిటిన పెళ్లి అయ్యేంతవరకు ఉదయం సాయంత్రం పెట్టుకోవాలి. అలా చేస్తే నీ కూతురికి నీకు అంతా మంచి జరుగుతుంది. అని ఒక విభూది పొట్లాన్ని తన సంచిలో నుంచి తీసి మాధవయ్యకి ఇస్తాడు. అలా మాధవయ్య ఆ విభూదిని ఇంటికి తీసుకొని వెళ్లి తన కూతురు లక్ష్మికి ఇచ్చి ఇలా అంటాడు. అమ్మ లక్ష్మి ఈ విభూదిని నువ్వు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మర్చిపోకుండా నీ నుదిటిన పెట్టుకో. అని లక్ష్మి చేతికి ఆ విభూది ఇస్తాడు. అప్పుడు లక్ష్మి విభూదిని చూసి ఇలా అంటుంది. ఎందుకు నాన్నగారు ఈ విభూదిని నేను ఉదయం సాయంత్రం పెట్టుకోవాలి. ఇదేమైనా గుడిలో పూజ చేసి పంతుల కర్ర ఇచ్చారా? లేదమ్మా నేను అలా బీది చివరికి వెళ్తే ఒక స్వామీజీ ఈ విభూది నిన్ను ధరించమని చెప్పారు. అలా అయితే నీకు నెల తిరగకుండానే మంచి సంబంధం కుదురుతుంది అని కూడా చెప్పారు. మాధవయ్య అలా చెప్పడం వల్ల లక్ష్మి ప్రతిరోజు మర్చిపోకుండా ఆ స్వామీజీ ఇచ్చిన విభూదిని ఉదయం సాయంత్రం నుదిటిన పెట్టుకునేది. అలా స్వామీజీ చెప్పినట్టుగానే లక్ష్మికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. అలా పెళ్లి ముహూర్తం కూడా కాయం చేస్తారు. అప్పుడు మాధవయ్య ఆ స్వామీజీని వెతుక్కుంటూ మళ్ళీ ఊరి చివరికి వెళ్తాడు. అప్పుడు స్వామీజీ ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు మాధవయ్య స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి మీరు చాలా మహిమ గలవారు. ఎన్నాళ్ళ నుంచో నా కూతురికి మంచి సంబంధం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాను. కానీ మీరు ఇచ్చిన విభూది నా కూతురు పెట్టుకోవడం వలన మీరు చెప్పినట్టుగానే నా కూతురికి ఒక మంచి సంబంధం కుదిరింది. అంతా మీ మహిమే. స్వామి ఇంతకీ మీరు ఏ ఊరు? ఎక్కడి నుంచి మా ఊరికి వచ్చారు? మాధవయ్య మాటలు విన్న స్వామీజీ చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. చూడు బాబు నాకంటూ ప్రత్యేకంగా ఇల్లు ఊరు అవేవి ఉండవు. నేను ఊరు ఊరు తిరుగుతూ ప్రవచనాలు చెబుతూ జీవనం సాగిస్తూ ఉంటాను. అలాగే నా దగ్గరికి వారు కోరికలు తీర్చమని వచ్చిన భక్తులకి నాకు తోచినంత సహాయం చేస్తూ ఉంటాను. అదేంటి స్వామి మీలాంటి గొప్ప స్వామిలో ఊరు ఊరు తిరగడం ఏంటి? మీలాంటి వారు మా ఊరిలో ఉంటే మా ఊరికి ఎలాంటి కష్టం ఉండదు. కావున మీరు మా ఊరిలో ఉండడానికి అంగీకరించండి అయ్యా. మీరు మా ఊరిలో ఉండడానికి కావలసిన అన్ని వస్తులను నేను మీకు సమకూరుస్తాను. అని మాధవయ్య స్వామీజీని బ్రతిమలాడతాడు. సరే బాబు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నేను మీ ఊరిలో ఉండడానికి అంగీకరిస్తాను. కానీ నేను అప్పుడప్పుడు తపస్సు చేయడానికి హిమాలయాలకు కూడా వెళ్తాను. అలాగే ప్రవచనాలు చెప్పడానికి కూడా వేరే ఊరు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు రావడానికి చాలా సమయం పట్టవచ్చు. లేదా రాకపోవచ్చు కూడా. స్వామి మీకు నచ్చినని రోజులు మా ఊరిలో ఉండండి. మీరు మా ఊరిలో ఉన్నని రోజులు మా ఊరి ప్రజల కోరికలను తీర్చడానికి ప్రయత్నించండి. మా ఊరిలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత మీదే. అని చెప్పి స్వామీజీకి ఒక ఇల్లు మాధవయ్య ఏర్పాటు చేస్తాడు. అలా స్వామీజీ ఇంట్లో ఉంటూ ఆ ఊరిలో ఉండే ప్రజల కోరికలను తన మహిమలతో తీరుస్తూ ఉండేవాడు. అలాగే స్వామీజీకి ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు కూడా ఊరిలో వారు ఏర్పాటు చేసేవారు. అలాగే కానుకలను కూడా ఇచ్చేవారు. అలా స్వామీజీ ఆ ఊరిలోని బాగా డబ్బులు సంపాదించాడు. తను సంపాదించిన డబ్బులన్నింటినీ తన దగ్గరున్న ఒక లక్క పెట్టెలో దాచేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు స్వామీజీ సాయంత్రం పూట ప్రవచనాలు చెప్పి భక్తులు ఇచ్చిన కానుకలను స్వీకరించి వాటన్నింటినీ తన పెట్టెలో దాస్తాడు. ఇంతలో స్వామీజీ దగ్గరికి రంగా అనే వ్యక్తి వచ్చి స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి దండాలు స్వామి నాకు బాగా ఆకలి వేస్తుంది. తినడానికి ఏమైనా పెట్టండి స్వామి. ఆ మాట విన్న స్వామీజీ రంగపై జాలిపడి తన దగ్గరున్న పళ్ళు ఫలాలు రంగకు పెడతాడు. అప్పుడు రంగా ఆ పళ్ళు ఫలాలను కడుపు నిండా తిని స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి చాలా రాత్రి అయిపోయింది. నేను ఈ చీకటిలో మా ఊరికి వెళ్ళలేను. కావున ఈ రాత్రికి ఇక్కడే మీ దగ్గరే నిద్ర చేసి పొద్దున్నే వెళ్ళిపోతాను. అని చాలా అమాయకంగా ముఖం పెట్టి స్వామిని ప్రాధేయపడతాడు. దానికి స్వామీజీ అంగీకరిస్తాడు. అలా రంగా ఆ రాత్రంతా స్వామీజీ ఇంట్లోనే నిద్రపోతాడు. ఇక తెల్లవారిపోతుంది. అప్పుడు రంగా నిద్ర లేచి స్వామీజీ నుంచి వెళ్ళిపోతూ ఉండగా రంగా స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి నేను ఒక అనాధని నాకు ఎవరూ లేరు. నాకు ఉండడానికి ఇల్లు లేదు. కావున మీరు నాపై కాస్త దయ చూపి మీతో పాటు నన్ను మీ శిష్యుడిగా మీ దగ్గరే ఉండనివ్వండి. మీకు సేవ చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటాను. మీలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టం నాకు కల్పించండి స్వామి. అని స్వామీజీని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ రంగపై జాలిపడి ఇలా అంటాడు. సరే నీకు ఎవరూ లేరు అంటున్నావు కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుంచి నాతో పాటు ఉండు. నాకు ఈ ఊరిలో వారు భోజనం ప్రతిరోజు తెస్తారు. దానిలో నువ్వు కూడా సగం తినవచ్చు. అలా స్వామి మాటలు విన్న రంగా చాలా సంతోషిస్తాడు. అలా రంగా ప్రతి రోజు స్వామీజీకి సేవలు చేస్తూ ఆ ఊరిలో వారు స్వామీజీకి తీసుకొచ్చిన ఆహారంలో స్వామీజీ తినగా మిగిలిన ఆహారాన్ని రంగా తినేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు స్వామీజీ తన శిష్యుడైన రంగాని తీసుకొని పొరుగు ఊరు భక్తి ప్రవచనాలు చెప్పడానికి అని వెళ్తాడు. అక్కడ ప్రజలు స్వామీజీ ప్రవచనాలకు మెచ్చి చాలా ఎక్కువ మొత్తంలో కానుకలు ఇస్తారు. అలా స్వామీజీ రంగా ఆ కానుకలను తీసుకొని ఇంటికి వస్తారు. అప్పుడు రంగా తీసుకొచ్చిన సంచికి ఒక చీపురు పుల్ల అంటుకుంటుంది. రంగా ఆ చీపురు పుల్లను చూసి స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి మహా పాపం జరిగిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయింది.

[20:18]అదే స్వామి ఇందాక మనం పొరుగు ఊరు నుంచి వచ్చినప్పుడు ఒకరి ఇంట్లో కూర్చొని భక్తి ప్రవచనాలు చెప్పాం కదా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా సంచికి ఆ ఇంట్లో ఉన్న చీపురు పుల్ల అంటించేసింది. అంటే పరుల సొమ్ము పాముతో సమానం కదా. అందుకే పాపం జరిగిపోయింది అన్నాను. మనది కానీ సొమ్మును మనం ఆశించరాదని మీరు చెప్పారు కదా. అందుకే ఈ చీపురు పుల్లను వెంటనే ఆవిడకి ఇచ్చేదానికి వెళ్తాను. అని అనుకొని ఆ చీపురు పుల్లని పట్టుకొని వెళ్లి అలా చాలా సేపు కాలక్షేపం చేసి మళ్ళీ స్వామీజీ ఇంటికి వస్తాడు. అప్పుడు స్వామీజీ రంగాని చూసి ఇలా అంటాడు. అరే రంగా నేను చూసి మొదట్లో ఏమో అనుకున్నాను. కానీ నువ్వు చాలా మంచి వాడివి రా. నేను చెప్పిన మంచి మాటలు నీకు బాగా వంటబట్టాయి. నీది కాని సొమ్మును నువ్వు ఆశించలేదు. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి రా. అని స్వామీజీ రంగాని పొగుడుతూ ఉంటాడు. అలా రాత్రి అయిపోయింది. స్వామీజీ రంగా భోజనం చేసేసి నిద్రపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒక రోజు స్వామీజీ తన లక్క పెట్టెలో ఉన్న డబ్బు అంతటిని లెక్కపెట్టి అటక మీద పెడతాడు. ఇదంతా రంగా గమనిస్తూనే ఉంటాడు. అప్పుడు రంగతో స్వామీజీ ఇలా అంటాడు. ఒరేయ్ రంగా నేను ప్రవచనాలు చెప్పడానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న రావులపాలెం వెళ్తున్నాను. అదేంటి స్వామి అలా అంటున్నారు. నన్ను మీతో పాటు తీసుకువెళ్ళారా అక్కడ నేను మీతో పాటు లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. అంతసేపు నేను మీకు సేవలు చేయకుండా ఉండలేను స్వామి. పొరపాటు వాళ్ళు కాదులేరా రంగా నేను సాయంత్రానికల్లా ఇంటికి వస్తాను. అంత దూరం నువ్వు నాతో పాటు ఎందుకులే. నీకు అసలే రాత్రి కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయన్నావు కదా. కాబట్టి నువ్వు ఇంట్లో ఉండే విశ్రాంతి తీసుకో. అలాగే లక్క పెట్టెలో డబ్బులు దాచి ఉంచాను. కాబట్టి ఇంటికి కొంచెం తాళం వేసుకొని నిద్రపో. నువ్వు పరుల సొమ్ము ఆశించకపోవచ్చు. కానీ లోకంలో చాలా మంది దొంగ విదవలు ఉన్నారు. కాబట్టి డబ్బుల కోసం దొంగలు ఎవరైనా ఇంటికి రావచ్చు. అని ఇంటి తాళాలు లక్క పెట్టె తాళాలు రంగాకి ఇస్తాడు. ఇన్నాళ్ళు నీ దగ్గర పనివాడిలా చేరి నీకు సేవలు చేసింది ఇందుకే కదా. నువ్వు నన్ను నమ్మి ఎప్పుడెప్పుడు నీ లక్క పెట్టె తాళాలు ఇస్తావా అని గోతి కాడు నక్క లాగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్నాలకి నీకు నా మీద నమ్మకం కలిగి నీ లక్క పెట్టి తాళాలు ఇచ్చి నన్ను ఇంట్లో ఉంచి నువ్వు బయటికి వెళ్తున్నావు. ఎన్నాళ్ళ నుండి ఎదురు చూసానో ఈ రోజు కోసం. అలాగే స్వామి మీరు వచ్చేవరకు ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. మీతో పాటు నన్ను తీసుకెళ్ళకుండా మీరు ఒక్కరే వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అని బయటికి బాధతో చెబుతూ లో లోపల సంతోషిస్తూ ఉంటాడు. స్వామీజీ వెళ్ళిపోతాడు. అలా స్వామీజీ వెళ్ళిపోగానే రంగా అటక మీద ఉన్న లక్క పెట్టె కిందకు దించి దాని తాళాలు తీసేసి అందులో ఉన్న డబ్బులన్నిటినీ తన భుజంపై ఉన్న కండువాలో మూట కట్టి తనతో పాటు వాటిని పట్టుకొని ఆ ఇంటి నుంచి పారిపోతాడు. అలా సాయంత్రం అయిపోతుంది. స్వామీజీ ప్రవచనాలు చెప్పి ఇంటికి వస్తాడు. అప్పుడు స్వామీజీ ఇలా అరుస్తూ ఉంటాడు. రంగా రంగా ఎక్కడికి వెళ్ళావురా? అని గట్టిగా కేకలు వేస్తూ ఇల్లంతా వెతుకుతాడు. అలా బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారిని కూడా అడుగుతాడు. అయినా కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పుడు స్వామీజీ తన లక్క పెట్టెలో తను పెట్టిన డబ్బులు లేకపోవడం చూసి ఇలా అంటాడు. రేయ్ రంగా ఎంత నమ్మక ద్రోహం చేసావురా. నువ్వు ఇన్నాళ్ళు నా దగ్గర శిష్యుడిగా నాకు సేవలు చేస్తూ నన్ను నమ్మించి నేను కష్టపడి ప్రవచనాలు చెబుతూ సంపాదించిన డబ్బుల్ని దొంగతనం చేసి పట్టుకొని వెళ్ళిపోతావా? నన్ను నమ్మించడానికి ఎన్ని నీతి కబుర్లు చెప్పావురా. నీలాంటి వాడికి పుట్టగతులు ఉండవు. పురుగులు పట్టిపోతావురా. అని స్వామీజీ రంగాని శాపనార్ధాలు పెడుతూ ఉంటాడు. అలా రంగా చేసిన నమ్మక ద్రోహం వల్ల అప్పుడు స్వామీజీకి ఎవర్ని గుడ్డిగా నమ్మరాదని విషయం తెలిసి వస్తుంది. అలా తన తప్పు తాను తెలుసుకొని ఆ రోజు నుంచి ఎవర్ని నమ్మకుండా జీవనం సాగిస్తూ ఉండేవాడు.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript