[0:00]శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రేసస్ 69 ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి.
[0:13]ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
[0:16]మీరు ఇచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది గనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.
[0:25]ఈ వీడియోలో మూడు ముద్రలు చెప్పబోతున్నానండి.
[0:30]ఒకటి లలిత, లలితా పరమేశ్వరి లలితా త్రిపుర సుందరి ఆ తల్లి ముద్ర.
[0:40]దుర్గా ముద్ర దుర్గా భవాని, దుర్గా దేవి.
[0:46]తన ముద్ర, మహాకాళి కాళీ ముద్ర. ఈ మూడు ముద్రలు కూడా ఇదే వీడియోలో చెబుతున్నాను.
[0:54]దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. మూడు ముద్రలు, ప్రియమైన ఆత్మ బంధువులు చాలా మంది అడుగుతున్నారు.
[1:05]కొందరు లలితా ముద్రని, కొందరు దుర్గా ముద్రని, కొందరు కాళీ ముద్రని దత్తాత్రేయ ముద్ర, బాల ముద్ర ఇవన్నీ అడుగుతూ ఉన్నారు.
[1:15]అమ్మ ఒకటే అయినప్పటికీ మూడు స్వరూపాలతో, మూడు శక్తులతో, మూడు నామాలతో విరాజిలుతున్న ఆ తల్లిని ఒకే వీడియోలో మీకు తెలియపరచాలని మీ సౌకర్యం కోసం ఒకే వీడియోలో ఇవ్వడం
[1:36]అమ్మవారి భక్తులైన అనేక మందికి ఉపయోగపడుతుందని ఎవరికి ఇష్టం కలిగిన ముద్రను వారు స్వీకరించి సాధన చేస్తారని ఆ మాతను ప్రార్థిస్తూ మీకు ఈ ముద్రలు తెలియపరుస్తున్నాను.
[1:50]ఈ ముద్రల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఏ తల్లినైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ నామంతో, ఏ రూపంతో ఆ యొక్క ముద్రను పెట్టుకొని ఆ తల్లిని ధ్యానిస్తే మనం కోరిన కోరిక తప్పక త్వరితగతిన ఫలిస్తుందని పెద్దల ఊహాచా.
[2:15]ఈ పెద్దలు చెప్పిన దాన్ని మనం తూచా తప్పక ఆచరించిననాడు గురువాకు, బ్రహ్మవాకు, ఋషివాకు, బ్రాహ్మణవాకు ఇలా ఈ వాక్కులు చాలా శక్తివంతమైనవి.
[2:33]అటువంటి ఆ మహత్తుల యొక్క మాటను మనం ఆదర్శంగా శిరోధార్యంగా తీసుకొని మనం ఆచరించడం వలన మన ఇష్ట దైవాన్ని మనం పూజించి ప్రార్థించే దైవాన్ని
[2:47]అతి త్వరగా ప్రసన్నం చేసుకోగలిగే ముద్రలే ఈ ముద్రలు. దైవారాధన, దైవ ధ్యానం, దైవ జపం ఇటువంటి క్రియలు మనం చేసి మన దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.
[3:04]అటువంటి ఆ దేవతల యొక్క ముద్రను మనం పెట్టుకొని ఆ దేవి యొక్క నామాన్ని, బీజాక్షరాలని ఉచ్చరించిన నాడు ఆ తల్లి చాలా త్వరగా మనల్ని అనుగ్రహిస్తుంది అనేది సుస్పష్టం.
[3:25]కనుక ఈ మూడు ముద్రలను కూడా పరిశీలనగా గమనించి మీకు ఏ నామంతో, ఏ రూపంతో తదాత్వియం చెంది ఆ తల్లిని మీరు అధికంగా ప్రేమిస్తారో ఆ ముద్రను మీరు తీసుకోండి, ఆ దేవిని మీరు తీసుకోండి.
[3:45]సాధన చేయండి ఆ అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.
[3:52]అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పారు పెద్దలు. ప్రధానమైనది అమ్మ.
[3:59]భువిలో గాని దివిలో గాని అమ్మ లేని చోటు లేదు.
[4:06]అమ్మ ఉంటేనే సర్వము. కనుక అమ్మ అనుగ్రహం ఉన్నప్పుడు సర్వము మనకు ఉన్నట్టే.
[4:15]ఆరోగ్యము, ఐశ్వర్యము, ధైర్యము, కుశలము, కౌశల్యము ఒకటేమిటి సమస్తము యశస్సు, కీర్తి, సమస్తం కూడా మనతో ఉంటుంది, మన యందే ఉంటుంది.
[4:31]కనుక దివ్య ఆత్మ స్వరూపులు
[4:38]ఈ ముద్రను సాధన చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి ముద్ర శ్రీ లలిత త్రిపురసుందరి.
[4:51]ఆ యొక్క ముద్రను జాగ్రత్తగా చూడండి ఈ చేతులను
[5:01]దీనిని పృథ్వీ ముద్ర అంటారు. ఇలా మనం పెట్టుకుంటే కానీ దీంట్లోనే ఆ పెట్టే భంగిమను బట్టి అది అమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి యొక్క ముద్రగా మార్పు చెందుతుంది.
[5:17]ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహాన్ని లభింపజేస్తుంది. దీనిని ఇలా తీసుకొచ్చి ఈ హృదయం దగ్గర ఇలా ఉంచండి.
[5:28]ఇలా ఉంచి ఎనిమిది ప్రాణాయామములు చేయండి. ప్రాణాయామం మీకు చెప్పాను కదా పూర్తిగా గాలి తీసుకోవాలి.
[5:38]ఎక్కడా కూడా కండరాలని బిగించకండి. ఊపిరితిత్తుల పైన గాని, గుండె పైన గాని, పొట్టలో గాని, గొంతు గాని ఎటువంటి ఒత్తిడి కలగజేయకండి.
[5:54]సుకుమారంగా, సులభంగా, సుఖంగా మీరు ఎంత తీసుకోగలిగితే అంత గాలిని తీసుకోండి. కుంభించండి.
[6:05]అంటే లోపల ఆపండి. ఎంతసేపు ఆపగలిగితే అంత సేపే ఆపండి.
[6:13]తర్వాత నిదానంగా పొట్టలో ఉన్న గాలినంతా విడిచి పెట్టేయండి. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ బయట మనం పొట్టలో ఏ గాలి లేకుండా ప్రశాంతంగా
[6:27]ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇలా ఈ నాలుగు విధాలు చేస్తే ఒక ప్రాణాయామం.
[6:36]అటువంటి ప్రాణాయామములు ఎనిమిది ప్రాణాయామములు చేయండి. చేసి మీరు కళ్ళు మూసుకొని ఆ తల్లిని, ఆ తల్లి యొక్క రూపాన్ని స్మరిస్తూ
[6:54]ధ్యానిస్తూ చక్కగా ఆ తల్లి యొక్క బీజాక్షరాలని ఉచ్చరించండి.
[7:04]లేదా మనసులోనే చెప్పుకోండి. బయటికి చెప్పే విధంగా అయితే మీకు మాత్రమే వినిపించేంత శబ్దంతో బయటికి చెప్పండి.
[7:14]ఆ తల్లి యొక్క లలితా త్రిపుర సుందరిని ఈ విధంగా ధ్యానించండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.
[7:52]నేను నిదానంగా చెప్పాను. మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని కూడా చెప్పుకోవచ్చు.
[8:07]మీరు కౌంటింగ్ చేయాలంటే ఇబ్బంది పడతారేమో.
[8:12]మీరు ఒక సమయాన్ని పెట్టుకోండి. ఓ 10 నిమిషాలా, పావు గంటా పెట్టుకొని మీరు ఉండగలిగితే చేయగలిగితే అరగంట చేసిన తప్పు లేదు పర్వాలేదు.
[8:24]కనుక మీ శక్తి కొలది మీ శరీర శక్తి మీ మానస స్థితిని బట్టి మీరు ఎంత సమయం చేసుకోవాలనుకుంటున్నారో అంత సమయం చేయండి. ఇది కౌంటింగ్ తో పనిలేదు.
[8:37]ఇది శ్రీ మాత లలితా త్రిపుర సుందరి యొక్క బీజాక్షరము లలితా త్రిపుర సుందరి ముద్ర.
[8:49]శ్రీ మాత్రే నమః. ఇప్పుడు దుర్గా ముద్ర చెబుతున్నానండి. దుర్గా దుర్గా భవాని, దుర్గా దేవి
[9:02]ఈమె యొక్క ముద్రను మనం ఇలాగే పెట్టుకొని ఆమె యొక్క బీజాక్షరాలను కూడా మనం జపం చేసుకోవచ్చు.
[9:12]ఆమె రూపాన్ని పది చేతులతో సింహవాహిని అయి ఆ అమ్మ మనల్ని ప్రసన్నవదనంతో చూస్తున్నట్లు
[9:30]అనుగ్రహిస్తున్నట్లు మనం ఏ మూర్తిని ధ్యానం చేసినా మన పట్ల ప్రసన్నవదనంతో మనల్ని ప్రేమగా చూస్తున్నట్లు భావన చేస్తూ ధ్యానం చేయండి.
[9:40]ఇప్పుడు దుర్గా ముద్ర చూడండి. ఈ చూపుడు వేలు మధ్య వేలు మధ్యలోకి బొటన వేలు పెట్టండి.
[9:52]పెట్టి ఈ నాలుగు వేలుని ఇలా ముయ్యండి.
[9:57]చూశారు కదా ఇంకొకసారి చూడండి ఈ బొటన వేలుని ఇలా పెట్టి ఇలా చూశారు కదా దాన్ని తీసుకొచ్చి ఇలా హృదయం దగ్గర పెట్టుకోండి.
[10:15]పెట్టుకొని ముందు చెప్పిన విధంగానే ఎనిమిది ప్రాణాయామాలు చేయండి.
[10:22]ఎనిమిది ప్రాణాయామాలు చేసిన తర్వాత మీరు ప్రార్థన వస్తే మనం ఏ తల్లిని మనం ధ్యానిస్తున్నామో ఆ తల్లికి ఒకసారి ప్రార్థన చేయండి.
[10:37]తర్వాత ఆమె యొక్క బీజాక్షరాలని ఆమె నామంతో చెప్పండి. ఈ దుర్గా దేవి యొక్క బీజాక్షరం
[10:48]హ్రీం దుం. హ్రీం అని కూడా చెప్పవచ్చు. హ్రీం దుం దుర్గాయై నమః అని కూడా చెప్పవచ్చు.
[10:59]మనం పూర్తిగా ఓం హ్రీం దుం దుర్గాయై నమః అని చెప్పుకుంటాం.
[11:32]ఇది పూర్తి నామం. మీరు త్వరగా ఇలా చెప్పుకోవచ్చు.
[11:38]ఓం హ్రీం దుం దుర్గాయై నమః ఓం హ్రీం దుం దుర్గాయై నమః ఓం హ్రీం దుం దుర్గాయై నమః ఓం హ్రీం దుం దుర్గాయై నమః ఓం హ్రీం దుం దుర్గాయై నమః ఓం హ్రీం దుం దుర్గాయై నమః అని చాలా నిదానమైన స్వరంతో బయటికి ఉచ్చరించవచ్చు.
[11:54]లేదా ఆంతరికంగా మీరు చెప్పుకోవచ్చు. ఇది అమ్మవారి యొక్క దుర్గా భవాని యొక్క నామం బీజాక్షరం.
[12:06]శ్రీ మాత్రే నమః. ఇప్పుడు కాళీ మహాకాళీ మహాకాళీ ముద్ర మీకు చెబుతున్నానండి.
[12:18]ఈ ముద్ర కూడా మీరు జాగ్రత్తగా సాధన చేయండి.
[12:26]ఆ తల్లిని రౌద్ర రూపం కాదండి.
[12:31]ఆమె చూపుని, ఆమె నాలుక బయటికి చాపి పుర్రెల మాలాతో నల్లని శరీరంతో కేవలం మొలక మాత్రమే అచ్ఛాదనతో చేతిలో కడ్గంతో ఆ కాళీ రూపం మనకి ఎక్కడ చూసినా ఉంటుంది.
[12:53]దాంట్లోనే ఆ దృష్టిని మాత్రం మీరు ప్రసన్నంగా చూడండి. ఆమె చూపుని ప్రసన్నంగా ఉన్నట్లు భావన చేయండి.
[13:03]ఇవన్నీ కూడా భావనలే. ప్రధానంగా భక్తి అంటే ఒక భావన, ఒక ఆచరణ, ఒక ధర్మం.
[13:13]అటువంటి ఆ ధర్మాన్ని, ఆ ఆచరణని, ఆ భావనని మనం కచ్చితంగా సవ్యంగా చేస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా
[13:24]అంతే త్వరితిగతిన మనం పొందగలుగుతాం. మనకి ఎటువంటి భయాలు కూడదు అండి.
[13:32]మీరు భయపడకండి. ఈ ముద్రలు మాత్రం మీరు 16 ఏళ్ల లోపు పిల్లలకి చేపించకండి.
[13:40]16 ఏళ్ళు నిండిన వారు మాత్రమే ఇది చేయండి ఎందుకంటే శక్తి ఆ తల్లి యొక్క వైబ్రేషన్స్ అద్భుతంగా ఉంటాయి.
[13:52]ఆ తల్లి మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ప్రకంపనలు కలగొచ్చు. దర్శనం కలగొచ్చు. లేదా ఇంకా ఏమైనా మీ యొక్క స్థితిని బట్టి మీకు అనుభవాలు కలగొచ్చు.
[14:05]అటువంటప్పుడు చిన్న పిల్లలైతే భయపడతారు. కనుక పక్వత చెందాలి అంటే మానసిక స్థితి, ధైర్యము, అవగాహన కలగాలంటే ఆడపిల్లలైన, మగపిల్లలైన 16 ఏళ్ళు నిండాలి.
[14:23]కనుక మీరు చెప్పేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఒకసారి పక్కన ఉండి వాళ్ళతో ఇవి చేపించండి.
[14:33]అలవాటు పడతారు కదా ఈ లోపు భయం పోతుంది. అప్పుడు వారే ఒంటరిగా సాధన చేసుకోవచ్చు.
[14:40]ఇది భక్తి సాధన ధర్మబద్ధమైన సాధన. కనుక భయపడాల్సిన పని లేదు.
[14:50]అమ్మ దగ్గర భయం ఎందుకండీ మనకి? అమ్మ దగ్గర బెదురు లేదు, అదిరు లేదు.
[14:57]సంశయం కూడా లేదు. ఏమవుతుందో అనే భయం కూడా బెంగ కూడా ఉండకూడదు.
[15:04]ఆ తల్లి తల్లి ఒడిలోకి చేరుతున్నాం మనం. ఆ తల్లిని మన ఒడిలో తీసుకుంటున్నాం. మనమే ఆ తల్లిగా మారుతున్నాం. ఆ తల్లే మనమై కూర్చుంటుంది. అదే సాధన.
[15:18]దీనిని ఈ సాధన వల్ల వచ్చిన శక్తిని మనం సద్వినియోగపరచాలి. మనం మన కుటుంబం, మన పరిసర ప్రాంతాలు
[15:30]మనం అంతా కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సేవా భావంతో, ప్రేమ భావంతో నడుచుకోవాలి.
[15:43]ఆ తల్లి ఇంకా ఇంకా ఇంకా మనకి శక్తిని అనేక రెట్లు అనేక రెట్లు మనల్ని పెంచుతూ మనల్ని సంరక్షిస్తూ ఉంటుందండి.
[15:54]గమనించండి. ఇప్పుడు కాళీ ముద్ర చెబుతున్నాను. జాగ్రత్తగా చూడండి. చూశారు కదా ఇలా ముడవండి.
[16:03]ఇలా ముడిచి చూపుడు వేలును రెండు ఇలా పెట్టండి. చూశారు కదా ఇలా ముడిచి చూపుడు వేలును తీసుకొని ఇలా హృదయం దగ్గరకు తీసుకురండి.
[16:21]తీసుకొచ్చి పెట్టి ముందుగా చెప్పిన విధంగానే ఎనిమిది ప్రాణాయామములు చేయండి. ఎనిమిది ప్రాణాయామములు చేసి ఒక 30 సెకండ్ల పాటు ఆ మౌనంలో ఆ ప్రశాంతతని ఆస్వాదించండి.
[16:40]తర్వాత జాగ్రత్తగా ఆ కాళీ మాతను మీ దృష్టిపదంలోకి తెచ్చుకోండి. తెచ్చుకొని ఆమె కోటి సూర్యుల వెలుగుతో ప్రేమ మూర్తిగా, దయామయిగా, కరుణామయిగా
[17:05]మనల్ని ప్రేమతో చూస్తున్నట్లు భావన చేయండి. చేసి ఈ బీజాక్షరంతో అమ్మ నామాన్ని చెప్పండి. మహాకాళీ యొక్క బీజాక్షరం క్రీం.
[17:15]క్రీం క దానికి పైన గుడి దానికి దీర్ఘం కింద కారావడి పక్కన సున్నా. ఇది క్రీం ఇంగ్లీషులో K.R.I.I.M. క్రీం.
[17:43]ఈ క్రీం ని తలుస్తూ మనం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు.
[18:07]క్రీం క్రీం క్రీం క్రీం క్రీం క్రీం క్రీం క్రీం క్రీం క్రీం క్రీం అని కూడా చెప్పుకోవచ్చు. లేదు
[18:19]ఆ బీజాక్షరంతో పాటు అమ్మవారి నామాన్ని ఓం క్రీం కాళికాదేవ్యై నమః ఇది కూడా మీరు చెప్పుకోవచ్చు.
[18:58]నేను చాలా నిదానంగా చెప్పాను. ఓం క్రీం కాళికాదేవ్యై నమః ఓం క్రీం కాళికాదేవ్యై నమః ఓం క్రీం కాళికాదేవ్యై నమః అని కూడా ఇంకా త్వరతిగతిన మీ నోరు తిరిగితే మీరు చెప్పుకోవచ్చు.
[19:20]చక్కగా అమ్మవారిని ప్రసన్న వదనంతో ఆమె ఉండాలి మనం కూడా ప్రసన్నంగా ఉండాలి.
[19:29]మనసులో ఎటువంటి అలజడి వద్దు ఎటువంటి ఒత్తిడి కూడా వద్దండి. చాలా సుఖంగా, ప్రశాంతంగా మన అమ్మ దగ్గర ఉన్నాం.
[19:40]మన అమ్మ ఎప్పుడైతే ఉందో అక్కడ నాన్న కూడా ఉంటాడని ఆ శివుడు అర్ధనారీశ్వరుడు. ఆ తల్లి శివుని అర్ధ శరీరమై ఉంటుంది.
[19:54]లలితగా అయితే ఆమె పరమేశ్వరుని పైనే కూర్చొని ఉంటుంది. దుర్గా మల్లేశ్వరుడితో ఉంటుంది. కాళీ మహాకాళేశ్వరుడితో ఉంటుంది.
[20:05]వారు భిన్నమైన వారు కాదు, అభేదమైన వారు. ఎక్కడ అమ్మ నామం ధ్వనిస్తుందో అక్కడ శివుడు కనిపిస్తాడు. ఎక్కడ శివుడి నామం ధ్వనిస్తుందో అక్కడ అమ్మ శక్తి ఉంటుంది.
[20:21]కనుక మీరు భక్తి ప్రపత్తులతో, సుహృదయంతో, ప్రేమపూర్వకంగా సాధన చేయండి.
[20:30]తప్పక మీకు అమ్మ అనుగ్రహం లభిస్తుంది. మీ అభిష్టం నెరవేరుతుంది.
[20:36]మన యొక్క జీవితం చాలా ఆనందమయంగా, గౌరవప్రదంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండి ఉంటుందండి. ఇది సత్యం. కనుక భక్త మహాశయులంతా కూడా ప్రేమమూర్తులైన, ఆత్మ స్వరూపులైన ప్రతి ఒక్కరు ఈ యొక్క బీజాక్షరాలతో ఈ ముద్రలు వేసి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఆ తల్లిని వేడుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః స్వస్తి.



