[0:00]జై కాంగ్రెస్ గట్టిగా తోడేలు బయటికి వెళ్ళింది. తోడేలు గుండెలు అదరాలి. సరేనా? జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా, ప్రజాపాలన
[0:26]ప్రగతిని ప్రణాళికలో భాగంగా మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు ఈ ప్రాంతానికి మూడో తరం ప్రజాప్రతినిధిగా దేశంలోనే కీర్తిని గడించిన పి.వి. నరసింహారావుగారు, ఆ తర్వాత కీర్తిశేషులు దుద్దిళ్ళ శ్రీపాదరావుగారు, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మూడో తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు నా మిత్రుడు మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రైతు భరోసా రెండవ విడత నిధుల కార్యక్రమాన్ని విడుదల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు వ్యవసాయశాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావుగారి నేతృత్వంలో ఈరోజు మంథని శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల పైగా రైతులకు ఈ నిధుల విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు సాగునీటి పారదలా శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డిగారిని అదే విధంగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అదే విధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని అద్లూరు లక్ష్మణ్ గారిని సోదరి మణి ములుగు సీతక్క గారిని అదే విధంగా మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు కాకా వెంకట్ స్వామి గారి వారసులు వివేక్ వెంకట్ స్వామి గారిని అదే విధంగా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ్యులైన వేమ్ నరేంద్ర రెడ్డి గారిని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరామ్ నాయక్ గారిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ మిత్రులు గడ్డం వంశీ కృష్ణ గారిని అదే విధంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాడు అధికారంలో పార్టీని తీసుకొచ్చే సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యదీక్షతో పనులు నిర్వహించిన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అదే విధంగా శాసనసభ విప్ లు ఆది శ్రీనివాస్ గారిని విజయ రమణారావు గారిని గన్నర సత్యనారాయణరావు గారిని రాజ్ ఠాకూర్ గారిని డాక్టర్ సంజయ్ గారిని నాయిని రాజేందర్ రెడ్డి గారిని నాగరాజు గారిని కవ్వంపల్లి సత్యనారాయణ గారిని మందుల సామెల్ గారిని మాధవ రెడ్డి గారిని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారిని మేడిపల్లి సత్యం గారిని ఇంకా ఇతర శాసనమండలి సభ్యులను శాసన సభ్యులను వివిధ కార్పొరేషన్ల చైర్ పర్సన్లను అదేమీద ఈ ప్రాంతానికి సంబంధి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రభుత్వ అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఎంతో ఆలస్యమైన ముక్క ఓని కార్యదీక్షతతో ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు పాలపిట్టల్లాగా దసరా పండుగ నాడు పాలపిట్టలను చూసినంత ఆనందంగా ఉంది. ఈ రోజు మా అక్కలందరు ఆశీర్వదించడానికి ఇంటి దగ్గర ఇంట్లో ఆయన ఆకలి అవుతుంది అన్నా అన్నం వండేది ఆలస్యమైనా మా తమ్ముడు మంచి మంతలాబుతోను వచ్చిండు మేము ఆశీర్వదించాలి అన్ని ఇంత సేపైనా కూర్చున్న మా అక్కలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యువ మిత్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా ఇయ్యాల మనం ఆలోచన చేయాలి ఈ దేశానికి వెన్నెముకనే రైతులు. ఆ రైతు వెన్నెముక ఆ రైతు నిటారుగా నిలబడాలి ఈ దేశానికి వెన్నెముక రైతైనప్పుడు ఆ రైతును ఆదుకొని నిటార నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మన ప్రజాప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం అనేది నినాదము కాదు అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులను బాకరనంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి వరకు పెద్ద పెద్ద నదుల మీద ప్రాజెక్టులను కట్టి రైతులకు సాగునీరు అందించిన చరిత్ర
[5:33]కాంగ్రెస్ పార్టీది చరిత్ర పుటలలో ఒక్కసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మిత్రులారా ఆనాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దలార్ల చేతుల్లో దోపిడికి గురవుతుంటే రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి ఆ రైతులను ఆదుకోవాలి రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టాలని ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చింది ఈనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మిత్రులారా రైతులు పండించిన పంటను కొనడమే కాదు పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఈ దేశంలోనే రాణించింది ఏదైనా రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉందని నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. ఆనాడు కరెంటు లేక కరెంటు ఉన్నా రైతుల మీద కేసులు కట్టి కరెంటు బిల్లుల కోసం పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్న మోటార్లు కష్టాలలో ఉంటే డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేవెళ్ళ నుంచి చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రైతాంగ కష్టాన్ని కల్లీడ తూర్చడానికి దేశంలోనే మొదటిసారి ఉచిత కరెంటు అనే గొప్ప పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల రైతులకు వివిధ రాష్ట్రాలలో ఉచిత కరెంటు అందుతుంది ఆ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి ఆలోచన చేయండి.
[7:12]మిత్రులారా ఉచిత కరెంట్ ఏ కావచ్చు కనీస మద్దతు ధర కావచ్చు 500 రూపాయల బోనస్ ఏ కాదు. అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కోసం రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోనే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్క కలం పోటుతో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి దేశం మొత్తం మీద రైతులను రుణవిముక్తులను చేసిన చరిత్ర ఆనాటిదైతే ఈనాటి ఈ ప్రజాపాలనలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆనాడు నేను సమ్మక్క సారలమ్మ సాక్షిగా ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలుపెడితే మా మిత్రులు ఉపముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు బోథ్ శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాదులో నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే 25 లక్షల 35 వేల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు
[8:42]ఇయ్యాల రైతుల ఖాతాలలో రైతు భరోసా వేసినం ఈనాడు కూడా ఈనాడు కూడా ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతలో 3,500 కోట్లు
[9:03]రెండో విడత 2200 కోట్లు మొత్తం 5700 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇయ్యాల రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతోనే ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం మిత్రులారా. ఇంత మంచి పండుగ కార్యక్రమం చేసుకుంటూ రైతులను ఆదుకుంటూ రైతుల కష్టాలు తీర్చుకుంటూ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ రైతుల అవసరాలు ఏమున్నాయో అడుగుతూ ఇల్లు ఇల్లు తిరుగుతూ రైతులు పండించిన సన్న వడ్లను ఈనాడు పేదలకు మూడు కోట్ల 15 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఇయ్యాల సన్న బియ్యం తెలంగాణ పండించిన బియ్యాన్ని ఇయ్యాల పేదలకు అందిస్తున్నాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో నేను ఇయ్యాల సూటిగా సవాలు విసురుతున్నాను. గొప్పలు చెప్పుకునేటోళ్ళు దబ్బలు జర్చుకునేటోళ్ళు తొడలు కొట్టుకునేటోళ్లకు సూటిగా నేను సవాలు విసురుతున్నాను ఎన్నడైనా కలలో కూడా మీరు పేద వాళ్ళకు సన్న బియ్యం ఇయ్యాలి ఈ సన్న బియ్యం తల్లిదండ్రులు కన్న తల్లి తన బిడ్డకు సంటి బిడ్డకు బుక్కడు బువ్వ తినిపించే పథకం ఎన్నడైనా మీరు ఆలోచన చేసిండ్రా. మీరు గడీలలో ఉండి సన్న బియ్యం తింటుంటే దావతులు చేసుకుంటుంటే బిర్యానీలు తింటుంటే పేద వాళ్ళకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినలేక పశువులకు దాన పెడుతుంటే ఎప్పుడైనా మీకు వాళ్ళ పట్ల కనికరం కలిగిందా అని నేను అడుగుతున్నాను. ఇయ్యాల నేను అడుగుతున్న మిత్రులలో ఈ వేదిక మీద నుంచి ఒకాయన అంటున్నాడు ఇంతకాలం శ్రీధర్ బాబు గారు అద్లూరు లక్ష్మణ్ గారు అనే వాళ్ళు ఆయన పెద్దాయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్దాయననో కాదో నాకైతే తెలవదు కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్నాను మా మిత్రులను ప్రజాపాలన ఎందుకు పోవాలి ఫామ్ హౌసుల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్నాను ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్దాయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు గాసేలా మువ్వోర్నెల్ల జెండాను మోస్తే ఈనాడు ఈ ప్రజాపాలన వచ్చింది నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే నీకు మంత్రి పదవి ఇయ్యకపోతే ప్రజాపాలన పోవాలా? ఇయ్యాల నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను ఇయ్యాల పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి పాపాల భైరవుడు అధికారంలోకి ఎందుకు రావాలనో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం నీ అధికారం కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్లి ఆయన పుట్టు పూర్వ తరాలు పుట్టు మచ్చలు ఇయ్యాలి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను. ఆయన నీతేంది ఆయన జాతి ఏంది ఆయన దోస్తేందో ఈయాల మీ అందరి ముందల నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మిత్రులారా 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాద పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం దట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టిఆర్ ను వెన్నుపోటు పొడిసి నాదెండ్ల భాస్కర్ రావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కర్ రావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నాను పెద్ద మనిషిని ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గం కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎంపి ఒకసారి ఎమ్మెల్సీ 14 15 సార్లు బి ఫార్మ్ ఇస్తే దుఃఖాన్ని దిగమింగుకొని ఎన్టిఆర్ ను వెన్నుపోటు పొడిసిన నిన్ను నాదెండ్ల భాస్కర్ రావు అనిచరుడైన నిన్ను ఎమ్మెల్యే గా ఎంపి గా ఎమ్మెల్సీ గా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా మిత్రులారా. 40 ఏళ్ళు నీ కోసం నీ పదవి కోసం నీ కుటుంబంలో జెపిటిసి ఎంపిపి ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా. గ్రామంలో ఉన్నోడు గ్రామంలోనే ఉండాలి మండలంలో ఉన్నోడు మండలంలోనే ఉండాలి జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలోనే ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా. మన్నె నేను జగిత్యాల కార్యకర్తలను కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినను. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతోని కన్నీళ్లు కారిన ఆనంద భాష్పాలు కారిన మెట్రోలో నన్నిట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నడు నన్ను గాంధీ భవన్ కు తీసుక రాలేదు అని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది.
[14:50]ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బిమాఫీ ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుండానే ఆయన వెనకాల నిలబడి ఆయన అండగా నిలబడి ఆయనను భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్నాను మిత్రులారా. ఇది న్యాయమా ఇదేనా నీ జాతి నీ నీతి ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రు సంకన చేరుతవా. శత్రు సంకలే చేరి ప్రజాపాలన పోవాలంటావా ఇట్లాంటి ఓడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట పెట్టకపోతే సావు కోరుకున్నాడంట ఇంతకంటే ఉదాహరణ ఇంకేమైనా ఉన్నదా. నేను అడుగుతున్నాను ఈ పెద్ద మనిషిని ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి 10 వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టిసి లో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి పోవాలన్నా మా అక్కలందరినీ ఆర్టిసి లో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా. తెలంగాణ ఉద్యమంలో సమితలైన శ్రీకాంత్ ఆచారి వేణుగోపాల్ రెడ్డి ఈసన్ రెడ్డి కానిస్టేబుల్ కిస్తే ఆదర్శంగా మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 డాక్టర్లను ఇంజనీర్లను 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన పోవాలనా. ఆనాడు ఒరేస్తే ఒరేసుకున్నట్టే అని మాట్లాడిన నువ్వు నీ ఫామ్ హౌజుల 150 ఎకరాలలో ఒరేసుకుని 402, 4200 రూపాయలకు క్వింటాలు అమ్ముకొని నువ్వుంటే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే 8,000 కొనుగోలు కేంద్రాలని తెరిసి ఉత్తం కుమార్ రెడ్డి గారు 2 కోట్ల 58 లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం వడ్లు కొన్నందుకు ప్రజాపాలన పోవాలనా సన్న బియ్యం సన్న వడ్లు వండించి సంటి పిల్లలకు సన్న బియ్యం తిప్పిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలనా. మూడు కోట్ల 15 లక్షల 17 లక్షల మంది ఈరోజు సన్న బియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలనా. ఇయ్యాల పేదవాళ్ళు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటివి డబ్బా ఇల్లు ఒద్దంటివి కొడుకు కోడలు ఉంటే ఆడ అంటారు అంటివి అల్లుడు బిడ్డ పండుగకు వస్తే యాడ అంటారు అంటివి కుక్క పిల్ల గొర్రె పిల్లు ఉంటే యాడ కట్టాలి అంటివి. నేను అడుగుతున్నాను వీడు ఉన్న మా యువకులను మీ ఊర్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా. ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిండా 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇయ్యలే గానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జనవాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు మోహినాబాద్ లో తాటి చెట్టు నిర్మించుకున్నది శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌసులు. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు వాస్తు సక్కలేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకి ఎవరికైనా ఇల్లు ఇచ్చిండా. సంవత్సరానికి 2 లక్షల ఇన్ని ఇన్ని ఇస్తుంటే కూడా పేదలకు ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈ రోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. తండాలలో గూడాలలో మానుముల పల్లెలో ఉన్న ఆదివాసులు లంబాడీలు గిరిజనులు లేకపోతే ఇతర పేదలు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉండేటోళ్ళు కదా. 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినను గాని 20,000 ఇండ్లు కూడా పేదలకి ఇయ్యలేకపోయినవ్. ఈ రోజు 4.5 లక్షల ఇండ్లు పేద వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మాట నిజం కాదా ఈరోజు మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా మిత్రులారా గుండెల మీద చేయి ఏసుకొని ఆలోచన చేయండి. ఇయ్యాల పేదలకు 4 లక్షల ఇన్ని 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో మోసం చేసిన పాపాల భైరవుడు రావాలనా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇండ్లే కాదు ఇల్లాల కళ్ళలో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంట్ ప్రతి ఇంట్లో వెలుగులు నింపినందుకు పేదవాడి కళ్ళలో ఆనందం చూసినందుకు ప్రజాపాలన పోవాలనా. ఇయ్యాల అదే కాదు మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఈ రోజు ప్రజాపాలన పోవాలనా అని నేను అడుగుతున్నాను మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇల్లు ఇస్తేనే ఇంట్లో కరెంట్ ఇస్తేనే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తేనే సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా బువ్వ పెట్టిమే ఎందుకోసం ఈ రోజు ప్రజాపాలన పోవాలనా అంటే ఈ ప్రభుత్వాలు దొరలకు ఊడిగం చేయాలి గడీల ముందల బానిస బతుకు బతకాలి అని నేను అడుగుతున్నాను. ఇయ్యాల ఈ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసింది ఈ ప్రభుత్వం 28 నెలల లో రైతులు ఒక లక్ష 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజం కాదా. ఆనాడు మా అక్కలు వీడు ఉన్నారు పాలపిట్టల్లాగా బతుకమ్మ చీరలు ఇస్తే ఏం చేసిండ్రు అక్క పొలాల కాడ పిట్టలను బెదరగొట్టడానికి కట్టిండ్రు అవునా. ఎన్నడన్న ఈ తెలంగాణలో ఏ ఆడబిడ్డ అన్న బతుకమ్మ చీరలు కట్టుకున్నారా ఎన్నడన్న పండుగ చేసుకున్నారా. నేను ఇయ్యాల మా అక్కలను అడుగుతున్నాను ఇందిరమ్మ చీరలు మా సీతక్క మీకు పంచిస్తే ఈ రోజు వేలాది మంది పాలపిట్టలక్క చీరలు కట్టుకొని మా తమ్ముడు వచ్చిండు మాకు చీర పెట్టిండు మాకు సారీ పెట్టిండు మా తమ్ముని ఆశీర్వదించాలని ఇయ్యాల వేలాది మంది మా అక్కలు ఆత్మ గౌరవంతోని కట్టుకున్నారు. ఈ పక్కలున్న మా సోదరులు అమ్మో మా ఆవిడ కూడా మంచిగా అందంగా ఉందే ఏందో అనుకున్నాను అని పాలపిట్ట చీరల భార్యను చూసి సంతోషపడుతున్నారు. ఇయ్యాల కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇచ్చినందుకు ఇందిరమ్మ చీరలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినందుకు ఇయ్యాల మేము దిగిపోవాలనా. 67 లక్షల స్వయం సహాయక సంఘాలకు మా సీతక్క 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినందుకు ఆడబిడ్డలని శ్రీమంతుల్ని చేసినందుకు మేము దిగిపోవాలనా కోటి ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నందుకు ఈ రోజు ప్రజాపాలన పోవాలనా. నేను అడగదలుచుకున్నాను ఇయ్యాల ప్రజాపాలన పోవాలి పాపాల భైరవుడు రావాలి అంటుంది.
[21:14]నేరల దళితులను ఇసుక లారీల కింద తొక్కిచ్చినందుకు పాపాల భైరవుడు రావాలనా ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల భైరవుడు రావాలనా. గ్రూప్-1 పరీక్షల్లో అల్లా పరీక్ష పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి పఠానీలలో అమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకులను ఉసురు కొట్టినందుకు పాపాల భైరవుడు రావాలనా. పండించిన పంట కొనుగోలు చేయక ఒరేసుకుంటే ఒరేసుకుంటా ఒరేసుకున్నట్టే అన్న పాపాల భైరవుడు ఇయ్యాల రావాలనా దేనికోసం పాపాల భైరవుడు రావాలి అని నేను అడుగుతున్నాను. లక్ష కోట్లు లక్ష అంటే లక్ష ఈ రోజు ఆ కాలేజీలో మొత్తం చూసొచ్చినా కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆదమిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఉరేసిన తప్పు లేదు లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మార్సితివి ఊరు మార్సితివి అంచనాలు మార్సితివి లక్ష కోట్లు దిగమింగితివి కాలేశ్వరం అని కడితే మూడేళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మి మేము ఈ రోజు సిబిఐ విచారణకి ఇచ్చినం తప్ప చెట్టుకి కట్టేసి కొట్టలేము. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లు తప్పు చేసినోళ్ళు ఊర్ల కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కల్లో కొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసినోళ్ళను. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ప్రభుత్వం మంచిది కాబట్టే ఈ రోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా దేనికోసం రావాలి మళ్ళా కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి అల్లున్ని మంత్రిని చేయడానికి సారాలో సోడా పోసేటోన్ని రాజ్యసభ చేయడానికి బిడ్డకు ఎమ్మెల్సి చేయడానికి పాపాల భైరవుడు రావాలనా. దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నాను. ఈ కరీంనగర్ లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అద్లూరు లక్ష్మణ్ లేచి నిలబడి లక్ష్మణ్ ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యే కాదు ఇయ్యాల మంత్రిగా చేసినందుకు మా పార్టీ ఓడిపోవాలనా జగిత్యాలలో ఇయ్యాల పొన్నం ప్రభాకర్ ఒక బలహీన వర్గాల బిడ్డను మంత్రిం చేసినందుకు ప్రజాపాలన పోవాలనా ఒక ఆది శ్రీనివాసను విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా. ఒక విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈ రోజు ప్రజాపాలన పోవాలనా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో మూడు మంత్రులు రెండు విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా. నీ ఒక్కనికి పదవి ఇయ్యకపోతే ఒక దళిత బిడ్డ అద్లూరు లక్ష్మిను మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేనని నువ్వు అసలు మనిషివేనా గింత అసూయ గింత ద్వేషం ఎవరికైనా ఉంటదా కడుపుల. ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు ఈనాళాకు ఆ ముసుగు తొలిగిపోయింది కడుపు నిండా విషమే విషం ఉన్నోడు విషం ఉన్నోడు ఇయ్యాల కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం ఆయన ప్రభుత్వం అంటే ఈయనకు పద్మ పదవి ఇస్తాడంట నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టక పోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కెసిఆర్. 2023 లో నిన్ను ఓడగొట్టిన 2024 లో నీకు గుండుసున ఇచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో పాతరేసిన మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన జూబ్లియన్స్ కంటోన్మెంట్ లో నీకు గోరు కట్టిన వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు ఇదే నా సవాల్ ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున.
[24:48]చూసుకుందాం కెసిఆర్ నువ్వు పో నేనో వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా ప్రజాపాలన పాపాల భైరవుడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా
[25:01]లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గు ఎట్లా వచ్చింది అని నేను అడుగుతున్నాను. అందుకే మిత్రులారా ఇయ్యాలటి నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడు వచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి చరిత్రల కెసిఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది 94 నుంచి 2004 వరకు రెండు సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు రెండు సార్లు వైయస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది 2014 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో
[26:17]ప్రజాపాలన ఉంటుంది ఆనాడు వైయస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు మళ్ళీ ఈరోజు చెప్తున్నా. అదే వైయస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లా అయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రులు మహేష్ గౌడ్ రెండో సార్లు అధికారంలోకి తీసుకొస్తాము ప్రజాపాలన ను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను చరిత్ర పునరావృత్తం చేసే బాధ్యత మాది చరిత్రను నిర్మించే బాధ్యత నాది చరిత్రలో సువర్ణ సువర్ణ అక్షరాలతోని లిఖించే విధంగా ప్రజాపాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కాదు హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది కూలిపోయిన కూలేశ్వరాన్ని సక్క చేసుకుని మళ్ళీ నీళ్లు అందించే బాధ్యత మనది. పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతలు కావచ్చు జూరాల కావచ్చు భీమ కావచ్చు నెటెంపాటి కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు శ్రీరాం సాగర్ కావచ్చు దేవాదుల కావచ్చు సీతారామ ప్రాజెక్టు కావచ్చు కాలేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మా మిత్రుడు చెప్పిన చిన్న కాలేశ్వరాన్ని పూర్తి చేపించే బాధ్యత నాది మిత్రులారా మీకు అండగా నిలబడి మీరు అండగా ఉండండి నాతో పాటు నడవండి ఎవడు వచ్చినా తొక్కుకుటవాయ బాధ్యత మనం తీసుకుందాం ఈ దేశంలోనే ఈ దేశంలోనే నేను చెప్పదలుచుకున్నా ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీ తోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంట్లును గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నాది మీది ఈ రోజు ప్రతిజ్ఞ బూనుదాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం మీరందరూ సిద్ధమైనా సిద్ధమైనా సిద్ధమైనా సిద్ధమైనా అక్కడున్న వేలాది మంది సోదరులు సిద్ధమైనా సిద్ధమైనా సిద్ధమైనా సిద్ధమన్నోళ్ళందరు చేయి పైకెత్తి పిడికిలి బిగించండి వేదిక మీద ఉన్న సోదరులు కూడా నాయకులందరు నిలబడి చేతులు ఎత్తండి మీరందరు నిలబడి చేతులు ఎత్తండి జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మిత్రులారా. ప్రజాపాలన ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనాలి సరేనా ఔర్ ఏక్ బార్ నేను అంటే కాంగ్రెస్ సర్కార్ అని మీరు అనాలి.
[28:54]రెడీనా రెడీనా ఔర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్



