[0:22]Hi, అందరికీ నమస్తే. మనం ఫిష్ బిర్యానీ చేశాం, చికెన్ బిర్యానీ చేశాం, మటన్ బిర్యానీ చేశాం. చాలా మంది కామెంట్ లో బాబాయ్ గారు అన్ని బిర్యానీలు చేశారు, ప్రాన్స్ బిర్యానీ కూడా చేసి చూపించమని అడుగుతున్నారండి. అందుకే నేను ఈరోజు ఒక కేజీ రొయ్యలతో ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ గా రొయ్యల బిర్యానీ అయిపోద్దండి. ఎందుకంటే చికెన్ లేట్ అవుద్ది, మటన్ లేట్ అవుద్ది. ఈ ప్రాన్స్ బిర్యానీ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. మంచి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అందుకే మీకు ఎలా చేయాలో, ఏమేం వేస్తానో కరెక్ట్ గా చూడండి. మీరు కూడా చేసుకునే విధంగా సింపుల్ గా మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇంక ఆలస్యం ఎందుకు, ప్రాన్స్ కడుక్కుందాం, బియ్యం నానబెట్టుకుందాం, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే. ఇవి రెండు కిలోల రొయ్యలు తీసుకున్నాను నేను. రెండు కిలోలు వలిస్తే పైన పొట్టు, వేస్టేజీ, నరం తో సహా తీసేసిన తర్వాత ఒక కేజీ రొయ్యలు వచ్చినాయి మనకు కరెక్ట్ గా. ఈ రొయ్యల్ని ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు వేసుకుని బాగా నాలుగైదు సార్లు కడిగి నీసు వాసన పోయే వరకి కడుక్కుందాం. చూసారా, రొయ్య అనేది బిర్యానీలో తినడానికి ఈ సైజు ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇదిగో చూశారు కదా, నరం కూడా తీసేశాను, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. కొంచెం పసుపు, అర చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. నేను కేజీ రొయ్యలకి 750 గ్రాములు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం.
[2:26]మన రొయ్యల బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి రండి, చూపిస్తాను. ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా మిరియాల పొడి, రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు చెంచాల ధనియాల పొడి, 400ml పెరుగు, ఒక ఏడు పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. కోసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు, మూడు ఉల్లిపాయ ముక్కలు, ఒక గుప్పుడు పుదీనా ఆకు, ఒక గుప్పుడు కొత్తిమీర, కోసి పెట్టుకున్న రెండు నిమ్మకాయ ముక్కలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. ఇవండి మన ప్రాన్స్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా మూడు చెంచాల నూనె వేసుకుందాం అండి. నూనె వేడెక్కాక ఐదు యాలక్కాయలు, రెండు బిర్యానీ ఆకు, ఒక చెంచా షాజీరా, ఒక ఇంచ్ దాల్చిన చెక్క, ఒకటి స్టార్ పువ్వు, అలాగే కొంచెం రాతి పువ్వు, అనాస పువ్వు, ఒక అర చెంచా మిరియాలు, ఒక ఆరు లవంగాలు. ఇవి నూనెలో వేసి వేయించుకుందాం.
[3:40]ఈ ఉల్లిపాయలు కలర్ మారాలండి. కలర్ మారే వరకు వేయించుకుందాం, ఓకే.
[3:50]చూసారా, ఉల్లిపాయలు ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసి వేయించుకుందాం. ఈ టమాటా కొంచెం మెత్తబడే వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకుందాం అండి. బిర్యానీలో టమాటాలు వేస్తున్నా ఏమిటి బాబాయ్ అని మీరు అనుకోవచ్చండి. కానీ ఈ టమాటా వేసినందువల్ల ప్రాన్స్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకి దీన్ని బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు ఒక చెంచా కారం, ఒక చెంచా ఉప్పు వేసి కలుపుకుందాం. వెంటనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం.
[4:38]దీన్ని ఒకసారి ఇలా కలుపుకుని, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా ఒకసారి అలా బాగా కలిపిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసేసుకుందాం.
[4:58]ప్రాన్స్ వేసిన వెంటనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం.
[5:11]ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని మూడు నాలుగు నిమిషాలు ఇలా వదిలేస్తే రొయ్యల్లో ఉన్న పచ్చివాసన అంతా పోద్దన్నమాట.
[5:28]మూడు నాలుగు నిమిషాలు అయిందండి, ఇప్పుడు పెరుగు వేసుకుని ఒకసారి అలా కలుపుకుందాం. పెరుగు వేసిన తర్వాత రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే చిక్కగా గ్రేవీ లెక్క వస్తదండి, ప్రాన్స్ కర్రీ లెక్క తయారవుద్ది. నీరంతా దగ్గరపడే వరకి వేగనియ్యాలి. చూసారా, ఈ విధంగా నూనె పైకి రావాలి.
[5:57]నాకైతే ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. ఉప్పు గనక ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే సరిచేసుకుని, ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న రెండు నిమ్మకాయ ముక్కల్లో ఒక నిమ్మకాయ ముక్క దీంట్లో పిండుకుని తీసి పక్కన పెట్టి మూత పెట్టేద్దాం. ఓకే.
[6:26]రైస్ బాయిల్ చేయడానికి ఐదు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక ఇంచ్ దాల్చిన చెక్క, ఒక చెంచా షాజీరా, ఐదు లవంగాలు, ఒక స్టార్ పువ్వు, రెండు బిర్యానీ ఆకు, నాలుగు యాలక్కాయలు, చిన్న ముక్క రాతి పువ్వు. ఇవన్నీ వేసుకుందాం.
[6:49]ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాం అండి. ఉప్పు సరిపోలేదండి. నీళ్లు టేస్ట్ చేస్తే సముద్రం నీళ్లు లాగా ఉండాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇదంతా బాగా మరగనిద్దాం. ఈ లోపల బిర్యానీ అండి చుట్టూ అడుగున ఒక చెంచా నెయ్యి ఇలా పూసుకోవాలి. ఆహ్, నీళ్లు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాం.
[7:29]అలాగే ఒక అర పొద్ద నిమ్మకాయ ముక్క కూడా పిండుకుందాం. ఈ రైస్ 80% బాయిల్ అవ్వాలండి, గుర్తుంచుకోండి.
[7:49]చూసారండి, 80% ఉడికింది. ఇప్పుడు బిర్యానీ లేయరింగ్ చేసుకుందాం. ముందుగా రైస్ వేసుకుని, ఆ తర్వాత కొంచెం ప్రాన్స్ మసాలా వేసుకుని అంతా సమాంతరంగా సర్దుకుందాం.
[8:07]అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మళ్ళీ రైస్, ప్రాన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ లేయరింగ్ చేసుకోవాలండి.
[8:34]పొయ్యి మీద ఒక పెనం పెట్టుకుని, దాని మీద బిర్యానీ అండి పెట్టుకోండి.
[8:49]ఆవిరి బయటికి రాకుండా నేనైతే అరిటాకు వేస్తున్నానండి.
[8:58]ఇది ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు, లో ఫ్లేమ్ లో 12 నిమిషాలు దమ్ము అవ్వనివ్వాలి, గుర్తుంచుకోండి.
[9:12]15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు కిందకి దింపి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం.
[9:24]మామూలుగా లేదండి రొయ్యల బిర్యానీ వాసన. నోట్లో అయితే నీళ్లు ఊరుతున్నాయి.
[9:34]చూసారా, పర్ఫెక్ట్ గా వచ్చింది, బాగా దమ్ అయింది. రైస్ గాని, రొయ్య గాని పర్ఫెక్ట్ గా దమ్ అయిందండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లెక్క, ప్రాన్స్ ముక్కలు సరిగా కనపడవండి. మసాలా అంతా పట్టుకుని రొయ్య అంతా చుట్టుకుని ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఎలా ఉందో బిర్యానీ. పర్ఫెక్ట్ గా వచ్చింది కదూ. మీరు కూడా తప్పక ట్రై చేయాల్సిన రొయ్యల బిర్యానీ ఇది. బాగా స్పైసీగా, టేస్టీగాను ఉంటుందండోయ్. నాకు మాత్రం బాగా ఆకలేస్తుందండి. వడ్డించుకుని టేస్ట్ చేసి చూద్దాం. చెలో.
[10:49]అబ్బా, రొయ్యే రొయ్యేనండి. రొయ్య టేస్టే వేరు. రైస్ బాగా దమ్ అయింది. అలాగే రొయ్య కూడా బ్రహ్మాండంగా ఉడికింది. అన్నీ పాలు కరెక్ట్ గా సరిపోయినాయి. ఈ విధంగా ప్రాన్స్ బిర్యానీ గనక చేసుకుని ఇవన్నీ కలుపుకుని సంపాళలో పడి తింటే అబ్బా, అసలు ఆ మజే వేరండి.
[11:18]సూపర్ గా ఉడికింది రొయ్య మాత్రం. చూసారా, రొయ్య ఏ సైజు ఉందో. రొయ్య బిర్యానీకి ఈ సైజు ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. అబ్బా, సూపర్ టేస్ట్ అండి.
[11:39]భలే కుదిరిందండి బిర్యానీ మాత్రం. సూపర్ టేస్ట్ గా ఉంది అసలు. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని ఒకసారి అలా కలుపుకుని ఇలా తినేస్తాం కదూ.
[12:00]బిర్యానీ తింటే తప్పనిసరిగా పెరుగు చట్నీ ఉండాల్సిందేనండి. ఇలా లాస్ట్ లో కలుపుకుని రెండు ముద్దలైనా పెరుగు చట్నీతో తింటే అసలు ఆ మజే వేరండి. ఆ టేస్టే వేరు, అబ్బబ్బబ్బబ్బబ్బ. నాకైతే ఇలా తినడం చాలా ఇష్టం అండి. మీలో ఎంత మందికి ఇలా పెరుగు చట్నీ కలుపుకుని ఇలా ప్రాన్స్ ముక్క పెట్టుకుని అబ్బబ్బబ్బబ్బబ్బ, స్వర్గమే. చికెన్ గాని, మటన్ గాని, రొయ్య గాని ఎప్పుడైనా సరే లాస్ట్ లో ఒక ముక్క పక్కన పెట్టుకుని ఇలా తినేస్తాం కదా. లాస్ట్ లో ఇలా ముక్క పక్కన పెట్టుకుని తింటే అసలు ఆ కిక్కే వేరుంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇప్పుడు దీని రుచి పరిపూర్ణంగా వచ్చిందన్నమాట. నాకు ఇలా తినడం చాలా ఇష్టం. చూశారు కదండీ ఎలా తిన్నానో, ఎలా చేశానో. బ్రహ్మాండమైన రుచి గల ప్రాన్స్ బిర్యానీ. మీరు ఇదే మెజర్మెంట్ లో చేసుకుని తప్పకుండా ఇంట్లో గనక చేసుకుని ఇంటిల్లేపాది కూర్చుని హ్యాపీగా తినొచ్చు అన్నమాట. అంత రుచికలమైనది, అంత ఆరోగ్యవంతమైనది కూడా ప్రాన్స్ బిర్యానీ. ఎందుకంటే చేపలు ఏవైనా ఆరోగ్యమే, ప్రాన్స్ ఇంకా ఆరోగ్యం. తప్పనిసరిగా ఇలాగే చేసుకోండి, ఆస్వాదిస్తూ తినండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై.



