[0:03]ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు చనిపోయాడా? ఇరాన్ ఇతన్ని టార్గెట్ చేసి మిసైల్ తో అంతం చేసిందా? ఎందుకంటే దీనికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. ఆన్లైన్లో బెంజమిన్ నేతన్యాహు ఇక లేరు ఈయన ఇరాన్ చేసిన మిసైల్ స్ట్రైక్ లో చనిపోయాడు అని చెప్తున్నారు. రీసెంట్ గా బెంజమిన్ నేతన్యాహు మీడియాతో మాట్లాడుతున్న ఒక వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియో చూడడానికి కాస్త ఏఐ వీడియో లాగా కనిపిస్తుంది. అందులో ఈయన చేతులు కదుపుతున్నప్పుడు తన చేతికి ఆరు వేళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా ఏఐ వీడియోస్ తో జరుగుతుంది. అయితే దీన్ని చూపిస్తూ చాలామంది ఇది ఏఐ వీడియో. బెంజమిన్ నేతన్యాహు చనిపోయాడు. కానీ ఇజ్రాయిల్ ఇంకా ఇతను బతికే ఉన్నాడు అంటూ ఈ విషయాన్ని కవర్ చేస్తుంది. ఎందుకంటే ఇతన్ని ఇరాన్ చంపేసింది అని తెలిస్తే ఇజ్రాయిల్ ప్రజలు అండ్ వాళ్ళ ఆర్మీది మోరల్ డౌన్ అయిపోతుంది. అందుకే వీళ్ళు ఈ పూర్తి విషయాన్ని కవర్ చేస్తున్నారు అని చెప్తున్నారు.
[1:08]కానీ మీ అందరికీ నేను క్లియర్ గా చెప్పేది ఏమిటంటే బెంజమిన్ నేతన్యాహుకు ఏమీ కాలేదు. ఈయన చనిపోయాడు అనే వార్త కంప్లీట్ గా ఫేక్. స్వయంగా ఇజ్రాయిల్ ఆఫీస్ నుంచి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇరాన్ ఆర్మీ చాలా క్లియర్ గా ఒక వార్నింగ్ ని ఇచ్చింది. బెంజమిన్ నేతన్యాహు మా సుప్రీం లీడర్ చావడానికి కారణమయ్యాడు. అతన్ని మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా అతని చావు మా చేతుల్లోనే ఉంది అన్నట్టుగా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ మీరు ఆర్టికల్ లో చూడవచ్చు. ఇఫ్ హి ఈస్ అలైవ్ ఇరాన్ వోస్ టు పర్స్యూ అండ్ కిల్ నేతన్యాహు. అంటే ఓవరాల్ గా ప్రెసెంట్ బెంజమిన్ నేతన్యాహు ఇరాన్ కి ఒక అతి పెద్ద టార్గెట్ గా మారారు. ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయిల్ పైన ఇతన్ని టార్గెట్ చేసే మిసైల్ ని వేస్తుంది. అమెరికా అండ్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ ని దాదాపు 30 మిసైల్స్ వేసి అంతం చేసేసారు. ఇప్పుడు చనిపోయిన ఆ సుప్రీం లీడర్ కొడుకు మోస్తాబా కమీని ఇరాన్ కి కొత్త సుప్రీం లీడర్ గా మారాడు. అయితే రీసెంట్ గా ఇంకో న్యూస్ బయటికి వచ్చింది. అందులో చెప్పేది ఏమిటంటే ఈ ఇజ్రాయిల్ కొత్తగా ఎంపికైన సుప్రీం లీడర్ ని కూడా చంపేసింది అని. యాస్ ఆఫ్ నౌ ఈ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసే ఎటువంటి సోర్స్ లేదు. ఇజ్రాయిల్ కొత్త సుప్రీం లీడర్ ని చంపే అంత పవర్ కలిగిన దేశం.
[2:26]కానీ ఈసారి కొత్త సుప్రీం లీడర్ విషయంలో ఇరాన్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అతని డీటెయిల్స్ ని లొకేషన్ ని ఎవరికి తెలియకుండా ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ ని నమ్మలేము. వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేస్తారో శత్రువులకు ఏ మాత్రం అర్థం కాదు. అయితే ఈ ఇజ్రాయిల్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ని చంపేందుకు ట్రై చేసింది. ఆ దాడిలో మోస్తాబా కమ్యూనిక్ కి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి కానీ చనిపోలేదు అని ఇరాన్ చెబుతుంది. బట్ మీరు ఇక్కడ గమనించండి ప్రెసెంట్ యుద్ధం ఏ దశకు చేరింది అంటే ఈ రెండు దేశాలు ఆయా దేశాల టాప్ లీడర్స్ ని టార్గెట్ చేస్తున్నాయి. ఇజ్రాయిల్ అయితే ఇరాన్ ఎన్నుకున్న ప్రతి కొత్త లీడర్ ని టార్గెట్ చేస్తుంది. అలాగే ఇరాన్ ఇప్పుడు నేతన్యాహుని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి అని అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దాంతో పాటు వీళ్ళు ఆన్లైన్ లో బెంజమిన్ నేతన్యాహు చనిపోయాడు అనే న్యూస్ ని కూడా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. దీని వల్ల ఇజ్రాయిల్ సైనికుల మోరల్ ని డౌన్ చేయాలి అనేది వీళ్ళ ప్లాన్. కానీ ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. అండ్ అక్కడ ఆర్మీ కూడా గవర్నమెంట్ తో వెల్ కనెక్టెడ్ గా ఉంటుంది. అలాంటి దేశంలో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఒకవేళ ఇజ్రాయిల్ మన ఇండియా లాగా పెద్ద దేశం అయి ఉంటే ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి ఆ దేశంలో పానిక్ ని క్రియేట్ చేయొచ్చు. పాకిస్తాన్ మన దేశం పైన ఇలా ప్రతిసారి చేస్తూ ఉంటుంది. కానీ ఇజ్రాయిల్ తో అలా చేయడం ఇంపాసిబుల్. ఈ బెంజమిన్ నేతన్యాహు బతికి ఉన్నాడా లేదా అనే డిబేట్ ఇదిగో ఈ వీడియోతో స్టార్ట్ అయింది. ప్రెస్ తో మాట్లాడుతూ ఈ వీడియోలో నేతన్యాహు తన చేతుల్ని ఇలా కిందికి పైకి కదుపుతాడు. ఆ స్పీడ్ కి ఒక ఇల్యూషన్ క్రియేట్ అయింది. కొన్ని ఫ్రేమ్స్ లో ఇతని చేతికి ఆరు వేళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గమనించి దాన్ని స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తున్నారు. ఇది ఏఐ వీడియో. బెంజమిన్ నేతన్యాహు చనిపోయాడు కాబట్టి ఇజ్రాయిల్ ఏఐ ని యూస్ చేసి వీడియోస్ ని షేర్ చేస్తుంది అంటూ ప్రాపగండా చేయడం మొదలుపెట్టారు. బై ద వే మీకో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనం ఎక్స్ ప్లాట్ఫామ్ లో అంటే ట్విట్టర్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి నిజం తెలుసుకోవాలి అంటే వెంటనే గ్రోక్ ని టాగ్ చేసి అడుగుతాము. ఇది మంచి విషయమే. ఈ గ్రోక్ వచ్చినప్పటి నుంచి చాలా మంది ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. కానీ ఈ గ్రోక్ కూడా మిస్టేక్ చేస్తుంది. ఇది ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని కూడా గుడ్డిగా నమ్మేయకండి. ఎందుకంటే కొంతమంది ఈ గ్రోక్ ని బెంజమిన్ నేతన్యాహు ఈ వీడియో ఏఐ అని అడిగితే అవును ఇది ఏఐ వీడియో అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది సమయానికి లేదు లేదు ఇది ఒక ఒరిజినల్ వీడియో అంటూ సమాధానం ఇస్తుంది. కాబట్టి గుడ్డిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా నమ్మేయకండి. కొన్ని సార్లు అవి కూడా మిస్టేక్ చేస్తాయి. ఇక ఈ వీడియో గురించి నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇది 100% నిజం. నేతన్యాహు తన చేతిని వేగంగా కదపడం వల్ల ఒక ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ అయి తన చేతికి ఆరు వేలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి అలా లేవు. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయిల్ గవర్నమెంటే కన్ఫర్మ్ చేసింది. ప్రెసెంట్ ఇరాన్ అడ్వాన్స్ మిసైల్స్ తో ఇజ్రాయిల్ పైన రోజు దాడి చేస్తుంది. అందుకే కంటిన్యూగా జరుగుతున్న ఈ దాడులను చూసి చాలామంది నిజంగానే ఇరాన్ చేసిన దాడిలో నేతన్యాహు చనిపోయి ఉంటాడు అనుకున్నారు. ఇప్పటికైతే అలా జరగలేదు కానీ భవిష్యత్తులో అలా జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు కంటిన్యూగా ఈ నేతన్యాహు ఉండే ఇల్లునే టార్గెట్ చేస్తుంది. అలాగే మీరు గమనించండి అమెరికా అండ్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ కమీని ఇంటి పైన దాడి చేసినప్పుడు ఆ దాడిలో ఆ సుప్రీం లీడర్ చనిపోయాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ గ్రౌండ్ లెవెల్ లో తమ ఏజెంట్స్ ని ఉపయోగించి కన్ఫర్మ్ చేసింది. అక్కడ ఇరాన్ అబద్ధం చెప్పడానికి ఇజ్రాయిల్ అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే ఇరాన్ కూడా అవును మా సుప్రీం లీడర్ అటాక్ లో చనిపోయాడు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేసింది. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికీ చాలామంది ఈ అలీ కమీని చనిపోలేదు ఇతను తప్పించుకున్నాడు అని నమ్ముతున్నారు. కొంతమంది అయితే ఇతను తప్పించుకొని ఏదో ఎడారిలో ఉన్నట్టు ఫోటోస్ ని కూడా షేర్ చేస్తున్నారు కానీ అది అబద్ధం. ఇరాన్ సుప్రీం లీడర్ తన ఇంటి బంకర్ లో ఇతర మినిస్టర్లతో మీటింగ్ చేస్తున్న సమయంలో పర్ఫెక్ట్ ప్లాన్ చేసి ఇజ్రాయిల్ అతన్ని ఎలిమినేట్ చేసింది. ఆ దాడిలో అతను బతకలేదు బతికే ఛాన్స్ కూడా లేదు. అలాగే రీసెంట్ గా మీడియా వాళ్ళు ఈ ఇరాన్ మిలిటరీని మీరు నేతన్యాహుని టార్గెట్ చేసి ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా చాలా క్లియర్ గా ఎస్ ఈ చిన్న పిల్లల్ని చంపే ఈ రాక్షసున్ని మేము టార్గెట్ చేస్తున్నాము వాడిని వదిలేది లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొందరికి నేతన్యాహు చిన్న పిల్లల్ని ఎప్పుడు చంపాడు అని డౌట్ రావచ్చు. విషయం ఏమిటంటే ఇజ్రాయిల్ ఇరాన్ స్టార్ట్ అయిన మొదటి రోజు ఇజ్రాయిల్ ఇరాన్ కి చెందిన ఒక నేవల్ బేస్ ని టార్గెట్ చేస్తూ మిసైల్ వేసింది. అయితే దురదృష్టవశాత్తు ఆ నేవల్ బేస్ కి పక్కనే ఒక స్కూల్ కూడా ఉంది. అందులో చిన్న పిల్లలు మోస్ట్లీ అమ్మాయిలే ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ కన్ఫ్యూజ్ అయిందా లేదా మిసైల్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు. కానీ ఆ మిసైల్ డైరెక్ట్ గా వెళ్లి ఆ అమ్మాయిలు ఉన్న స్కూల్ పైన పడింది. ఆ దాడిలో దాదాపు 170 కన్నా ఎక్కువ మంది చిన్న పిల్లలు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. మీరు ఇక్కడ మ్యాప్ లో చూసినట్లయితే ఇదిగో ఇటు సైడ్ ఉన్నవి ఇరాన్ నేవల్ బేసెస్. దీనికి పక్కనే ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్ పైన మిసైల్ పడి 170 కి పైగా చిన్న పిల్లలు చనిపోయారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలా జరగాల్సింది కాదు. ఈ విషయం పైన మన ఇండియా కూడా రెస్పాండ్ అయింది. యుద్ధంలో చిన్న పిల్లల ప్రాణాలు పోవడం చాలా బాధాకరం అని చెప్పింది. ఇదే విషయాన్ని ట్రంప్ కి అడిగితే ట్రంప్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? పిల్లల్ని చంపింది మేము కాదు. ఇరాన్ మిసైల్ డిఫెన్స్ సిస్టం చాలా వరస్ట్ గా ఉంటుంది. బహుశా వాళ్ళ మిసైలే మిస్ ఫైర్ అయి ఆ స్కూల్ పైన పడి ఉంటుంది. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని రిజెక్ట్ చేసేసాడు. you just suggested that Iran somehow got its hands on a tomahawk and bombed its own elementary school on the first day of the war. But you're the only person in your government saying this, even your Defense Secretary wouldn't say that when he was asked, standing over your shoulder on your plane on Saturday. Why are you the only person saying this? Because I just don't know enough about it. I think it's something that I was told is under investigation, but tomahawks are are used by others, as you know, uh, numerous other nations have tomahawks, they buy them from us, uh, but I will certainly whatever the report shows, I'm willing to live with that report. కానీ తర్వాత ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆ స్కూల్ బిల్డింగ్ ని డెస్ట్రాయ్ చేసింది అమెరికన్ మిసైల్ అని తెలిసింది. మరి ఈ మిసైల్ ని అమెరికా యూస్ చేసిందా ఇజ్రాయిల్ యూస్ చేసిందా కన్ఫర్మ్ గా తెలియదు. బట్ ఈ చిన్న పిల్లల చావుకు కారణం మాత్రం అమెరికా తయారు చేసిన మిసైల్. అందుకే ఈ విషయంలో ఇరాన్ ప్రజలు అండ్ అక్కడి ఆర్మీ చాలా సీరియస్ గా ఉంది. దీనికి బాధ్యులైన నేతన్యాహుని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి అని ప్లానింగ్ లో ఉంది. ఇప్పటికైతే బెంజమిన్ నేతన్యాహుకు ఏమీ కాలేదు. అతను ఎప్పటిలాగే యాక్టివ్ గా ఉన్నాడు. ఈ యుద్ధం రోజు రోజుకి పెద్దది అవుతుంది. అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఈ యుద్ధం ఇప్పటిదాకా జరుగుతుంది అనుకోలేదు. యుద్ధం స్టార్ట్ అయి ఇవ్వాటికి 17 రోజులు గడిచిపోయాయి. ఇజ్రాయిల్ దగ్గర ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయడానికి మిసైల్స్ అయిపోతున్నాయి. వీళ్ళు స్టార్టింగ్ లోనే హెవీగా ఇరాన్ పైన బాంబింగ్ చేసి తమ మిసైల్స్ అన్నిటిని యూస్ చేసేసారు. ఇక్కడ ఇరాన్ చాలా స్మార్ట్ గేమ్ ఆడింది. మీకు నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలాసార్లు చెప్పాను. ఇరాన్ దాడి చేయడానికి మిసైల్స్ ని ఎక్కువగా యూస్ చేయలేదు. వాళ్ళు తమ షాహిద్ డ్రోన్స్ ని ఉపయోగించారు. ఇలాంటి డ్రోన్స్ వీళ్ళ దగ్గర లక్షల్లో ఉన్నాయి. ఎందుకంటే వీటిని తయారు చేయడం చాలా ఈజీ వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ. కేవలం 50000 డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో ఇది 46 లక్షలకు సమానం. అయితే ఇరాన్ యూస్ చేస్తున్న ఈ డ్రోన్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి అమెరికా అండ్ ఇజ్రాయిల్ మిసైల్స్ ని యూస్ చేస్తున్నాయి. అయితే ఆ మిసైల్స్ డ్రోన్ కంటే చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కో మిసైల్ కాస్ట్ దాదాపు మూడు మిలియన్ డాలర్స్ ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఇది 27 కోట్ల రూపాయలకు సమానం. ఇలా ప్రతిసారి 40 లక్షల రూపాయల డ్రోన్ ని ఇరాన్ యూస్ చేసిన ప్రతిసారి దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ఇజ్రాయిల్ అండ్ అమెరికా 27 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. దీని వల్ల మెల్లమెల్లగా అమెరికా ఈ యుద్ధంలో భారీగా నష్టపోవడం మొదలైంది. మీరు నమ్మరు ప్రెసెంట్ ఈ యుద్ధంలో అమెరికా ప్రతిరోజు 1 బిలియన్ డాలర్స్ కి పైగా నష్టపోతుంది. దీన్నే నిజంగా ఇరాన్ మాస్టర్ స్ట్రోక్ అనవచ్చు. ఎందుకంటే ఇరాన్ యూస్ చేసే ఈ డ్రోన్స్ చాలా చీప్ అండ్ వీటిని డెస్ట్రాయ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇవి చాలా తక్కువ ఎత్తుకు ఎగురుతాయి కాబట్టి రాడర్ కి కూడా అంత ఈజీగా అందవు. అందుకే ఇప్పుడు ఇజ్రాయిల్ దగ్గర మిసైల్స్ తక్కువ పడుతున్నాయి. అమెరికా తమ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి స్టాక్ అయి ఉన్న మిసైల్స్ అన్నిటిని యూస్ చేసేసింది. ఇప్పుడు వీళ్ళు చైనా కోసం స్టోర్ చేసిన ఏషియన్ దేశాల్లో ఉన్న తమ మిలిటరీ బేస్ లోని మిసైల్స్ ని ఇరాన్ పైన యూస్ చేస్తున్నారు. అండ్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్టు సౌత్ కొరియా అండ్ జపాన్ దగ్గర ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టం ని కూడా వీళ్ళు ఇరాన్ పైన యూస్ చేయడానికి వాటిని మిడిల్ ఈస్ట్ కి షిఫ్ట్ చేస్తున్నారు. నిజం చెప్తున్నాను చైనా తైవాన్ దేశాన్ని ఆక్యుపై చేయడానికి ఇంతకన్నా గోల్డెన్ ఆపర్చునిటీ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో కంప్లీట్ గా ట్రాప్ అయిపోయింది. ఇప్పుడు సడన్ గా చైనా తైవాన్ పైన దాడి చేసినప్పటికీ తైవాన్ ని కాపాడడానికి అమెరికా రాలేదు. ఎందుకంటే అమెరికా ఇలా అన్ని యుద్ధాల్లో స్ట్రెచ్ అవ్వలేదు. ఈ యుద్ధం స్టార్ట్ అయి 17 రోజులు గడుస్తుంది. ఇప్పటికి ఇరాన్ ఈ గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్, యూఏఈ పైన వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏమిటంటే కువైట్ అండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా ఇరాన్ డ్రోన్స్ తో దాడి చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ యుద్ధంలో హెవీగా లాస్ అయింది యుద్ధం స్టార్ట్ చేసిన అమెరికా కాదు యుద్ధాన్ని ఫేస్ చేస్తున్న ఇరాన్ కూడా కాదు. మధ్యలో ఉంటూ ఈ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ అండ్ బహరాన్. ఈ దేశాలు సీవియర్ గా ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ దేశాలు చాలా సేఫ్ వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ తో పాటు అల్ట్రా లగ్జరీ కూడా దొరికేది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఈ దేశాల్లో లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ దేశం పైన వరుసగా మిసైల్స్ అండ్ డ్రోన్స్ పడడంతో అన్ని చోట్ల దాడులు జరగడంతో ఇన్వెస్టర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు ఎవరు కూడా ఈ దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఈ దేశాలు గత 50 సంవత్సరాలుగా తమ ఇమేజ్ ని మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం మొత్తాన్ని ఈ యుద్ధం సర్వనాశనం చేసింది. అయితే ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా నేవీ పవర్ ని ఉపయోగించి ఏదో పెద్దది చేయబోతున్నారు. నెక్స్ట్ వీక్ అమెరికా నేవీ పవర్ ఏంటో చూపిస్తాను అంటూ ఈయన ఒక స్టేట్మెంట్ ని ఇచ్చారు. నాకు తెలిసి వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో ఏదో పెద్ద ఆపరేషన్ చేయబోతున్నారు. ఆ ఆపరేషన్ తర్వాత ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కంప్లీట్ గా అమెరికా అండర్ లో వచ్చేస్తుంది అని చెప్తున్నారు. నిజం చెప్తున్నాను ఇరాన్ దగ్గర ఉన్న మేజర్ వెపన్ వాళ్ళు యూస్ చేసే మిసైల్ డ్రోన్స్ కాదు. ఇదిగో ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. దీన్ని వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ గా చోక్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అండ్ గ్రాస్ క్రైసిస్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ చేతిలో ఉన్నన్ని రోజులు ఈ యుద్ధం ఎండ్ అవ్వదు. అయితే ఇప్పుడు ట్రంప్ చెబుతున్నట్టు నిజంగానే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని అమెరికా తన కంట్రోల్ లోకి తెచ్చుకోగలిగితే చాలా క్లియర్ గా ఈ యుద్ధంలో అమెరికా గెలిచినట్టే ఎందుకంటే వన్స్ ఈ ప్రాంతాన్ని అమెరికా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటే ఇరాన్ చేయడానికి ఇంకేమీ మిగలదు. కానీ ఇలా చేయడం అంత ఈజీ కాదు. అమెరికా ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ అమెరికా ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే ఈ యుద్ధం ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. లేదా ఇది ఇలాగే నెలల పాటు జరిగే అవకాశం ఉంది. దీని గురించి మీరేం అనుకుంటున్నారు? అమెరికా తమ నేవీ ఫుల్ పొటెన్షియల్ ని యూస్ చేసి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని ఇరాన్ నుంచి తన కంట్రోల్ లోకి తీసుకోగలదా? అలాగే ఈ ఇరాన్ కి ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నేతన్యాహుని చంపే అంత సీన్ ఉందా? మీరేం అనుకుంటున్నారు మీ ఆలోచనలని కింద కామెంట్ లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్ తో పనిచేస్తున్నాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్ లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై.



