[0:00]మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వ శుభాలు. గుడ్ ఫ్రైడే అనేది కలువరిలో ఏసుక్రీస్తు వారు సిలువ వేయబడి మరణించిన సంభవాన్ని స్మరించుకునే ఒక పవిత్రమైన రోజు. గుడ్ ఫ్రైడే చరిత్ర ఏంటి? ఎలా వచ్చింది? అది ఎలా మారింది? మొదటి నుంచి నేటి వరకు ఎలాంటి ఆవిర్భావాలు జరిగాయి? అనేది మనం చూద్దాం. ఏసుక్రీస్తు వారు చనిపోయిన రోజు నుంచి అపోస్తుల నాటి కాలం నుంచి అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవుల నుంచి నేటి వరకు కూడా గుడ్ ఫ్రైడే మారిన విధానాన్ని ఆ చరిత్రను మనం తెలుసుకుందాం. అలానే గుడ్ ఫ్రైడే లో ఉన్న పవర్ఫుల్ విషయాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఈ వీడియోను పూర్తిగా చూడండి. మంచి విషయాలు అర్థం చేసుకుంటారు. ముందుగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం లేదా మంచి శుక్రవారం అని పిలవడానికి కారణం ఏంటి? ఆ పదం ఏంటి? దాని అర్థం ఏంటి అని ముందు చూద్దాం. మీరు సాధారణంగా గుడ్ బాయ్ అనే మాట విని ఉంటారు. సాధారణంగా మనుషులు మాట్లాడుకునేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు గాని బాయ్ అని లేదా గుడ్ బాయ్ అని మాట్లాడతారు కదా. దీని అసలు ఫుల్ ఫార్మ్ ఏంటో తెలుసా? దీనికి గుడ్ ఫ్రైడే కి సంబంధం ఏంటి అనుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే పేరులో కూడా అలాంటి మ్యాజిక్ ఏ ఉంది. ఇంగ్లీషులో గుడ్ ఫ్రైడే అనే పదం ప్రత్యేకమైనదే కానీ ఇతర దేశాల్లో ఈ ఫ్రైడే ని హోలీ ఫ్రైడే అంటారు. పవిత్ర శుక్రవారం అని లేదా సారోఫుల్ ఫ్రైడే అంటారు జపనీయ లాంటి కంట్రీస్ లో. సో ఇలా అర్థం వచ్చే పేర్లని ఉపయోగిస్తారు. తెలుగులో కూడా శుభ శుక్రవారం అని పిలుస్తున్నారు. ఎందుకు అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇది మంచిది అని సూచించే పదం కాదు. పాత ఇంగ్లీష్ వాడుకలో ముఖ్యంగా ఇలాంటి పవిత్ర రోజులను వర్ణించేటప్పుడు గుడ్ అనే పదాన్ని వాడేవారు. గుడ్ అనగానే పవిత్రమైన లేదా భక్తిపూర్వకమైన అనే మీనింగ్స్ వస్తూ ఉండేవి అని ఓల్డెన్ ఇంగ్లీష్ నుంచి మనం తీసుకుంటాం. పవిత్ర కాలాలను సూచించడానికే గుడ్ టైడ్ అనే దాన్ని కూడా ఉపయోగిస్తారు. గుడ్ టైడ్ అంటే కూడా ఇలాంటి పవిత్ర కాలాన్ని సూచించేది. సో ఇలా పండుగల విషయంలో కూడా ఇదే విధంగా ఉపయోగించేవారు. అలానే గుడ్ బాయ్ అనే పదం కూడా ముగింపు మాటగా సూచించేది దీవనకరమైన మాటగా సూచించేది. వాళ్ళ కాన్వర్సేషన్ ఎండ్ అవ్వడానికి వాళ్ళ మాటలు ముగిసి వెళ్తూ ఉన్నప్పుడు వారిని దీవెనకరమైన మాటగా వాడేదే ఈ గుడ్ బాయ్ అనేది. దాని అసలు ఫుల్ ఫార్మ్ గుడ్ బి విత్ ఈ అని అర్థం. గుడ్ బి విత్ ఈ అంటే యు అని అర్థం. అంటే గాడ్ బి విత్ యు ఈ గాడ్ బి విత్ యు అనే మాటే షార్ట్ గా గుడ్ బాయ్ అని ట్రాన్స్ఫామ్ అయ్యింది. కావాలంటే సెర్చ్ చేసి చూడండి. గుడ్ బాయ్ ఎలా అయితే రూపాంతరం చెందిందో అదే విధంగా గాడ్స్ ఫ్రైడే గాడ్స్ ఫ్రైడే నుంచి రూపాంతరం చెందింది అని స్కాల్డర్స్ అంటున్నారు. సో ఇది గాడ్స్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే ఇది ఆ రోజు యొక్క ప్రత్యేకతను దేవుని రక్షణ కార్యానికి చెందింది అని ప్రత్యేకంగా నొక్కి చెప్పడానికే ఇది గుడ్ ఫ్రైడే గా ట్రాన్స్ఫామ్ అయ్యింది. ఇది దాని అసలు అర్థం. భాషకు అతీతంగా అనేకులు ఈ రోజు దాని లోతైన అర్థాన్ని చెప్పడానికి గుడ్ ఫ్రైడే లో గుడ్ అనేది మంచిది అని సూచిస్తున్నారు. అది భయంకరమైన శ్రమను గుర్తు చేస్తున్నప్పటికీ క్రీస్తు మరణం ద్వారా దేవుడు రక్షణను, సమాధాన్ని, నిత్యజీవ వాగ్దానాన్ని తీసుకొచ్చాడు కాబట్టి అది ప్రజలందరికీ మంచిది. సింపుల్ గా ఆయన త్యాగం విమోచన అందించి మానవ పాపాలను ప్రక్షాళన చేసే దైవ కార్యం కాబట్టి అది గాడ్స్ ఫ్రైడే. అది మానవుల కోసమే మానవ క్షేమం కోసమే కాబట్టి మనకి గుడ్ ఫ్రైడే. సో గుడ్ ఫ్రైడే మీనింగ్ అంతా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మరణం నుంచి ఆ చరిత్ర ప్రారంభిస్తే మానవాళి దేవునితో సమాధాన పరచడానికి నూతన జీవితానికి మార్గాన్ని తెరవడానికి ఏసుక్రీస్తు మన పాపాల కొరకు ఒక్కసారి మరణించారు. యేసు వారిని రోమన్ సిలువకు మేకులతో కొట్టి నేరస్తులతో పాటు వధించారు. రోమనులు తిరుగుబాటుదారులకు అత్యంత నీచమైన నేరస్తులకు క్రూరులకు మాత్రమే కేటాయించే అవమానకరమైన బహిరంగ మరణాన్ని ఆయన అనుభవించారు. సిలువ పైన ఉన్నప్పుడు ఆయన తల వంచి మరణించే ముందు సమాప్తమైనది అని పలికి మరణించారు. సువార్త గ్రంథాలు నొక్కి చెప్పేది ఏంటి అంటే యూదుల విశ్రాంతి దినానికి ముందు సూర్యాస్తమానికి ముందే ఏసుక్రీస్తు వారు మరణించారు. ఆయన శరీరాన్ని వెంటనే క్రిందకి దించి అరిమతి యూసేపు ఏర్పాటు చేసిన సమాధిలో ఉంచారు. మూడు రోజుల తర్వాత ఆయన మృతులలో నుంచి లేచారు. పునరుద్ధానం ద్వారా ధృవీకరించబడిన దేవుని రక్షణ ప్రణాళిక అందరికీ అర్థమైంది. అందరికీ కావలసిన రక్షణ ప్రణాళిక యేసు వారి పరిచర్య అపోస్తుల పరిచర్య అన్నిటికీ మరణ పునరుద్ధానాలే కేంద్రమయ్యాయి. కొత్త నిబంధనలో బోధనలు, పత్రికలు, ఏసుక్రీస్తు వారు మన పాపముల కొరకు మరణించి మన రక్షణ కొరకు తిరిగి లేచాడని నొక్కి చెబుతున్నాయి. ఇదే మొదటి శతాబ్దపు మిషనరీలు యూదులకు అన్యులకు ప్రకటించిన సువార్తకు మూల ఆధారం. అపోస్తుల కార్యముల్లో అలాగే కొన్ని కొత్త నిబంధన పత్రికల్లో కూడా ఏసుక్రీస్తు వారు పాపాన్ని భరించి పాపులను దేవునితో సమాధాన పరిచి మరణం దుష్ట శక్తులపై విజయం సాధించి వాటి ప్రాముఖ్యతను ప్రకటించారు. అదే స్థలాన్ని సిలువను ఆయన్ను చూసిన కళ్ళు అన్నీ కూడా సాక్ష్యంగా మారాయి. బలి విమోచన సమాధానం విజయంగా సిలువ మరణం గురించిన ఈ సువార్త అపోస్తుల అవగాహనే ఆ తర్వాత కాలంలో గుడ్ ఫ్రైడే రోజుల వరకు పునాదిగా మారాయి. తర్వాత మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి మాట్లాడితే మొదటి శతాబ్దపు క్రైస్తవ బోధకులు క్రీస్తు మరణంపై లోతుగా ధ్యానించారు. సిలువ త్యాగాన్ని దాని లోతైన అర్థాన్ని గ్రహించారు. ఆ అర్థాన్ని వ్యక్తపరచడానికి వాక్యాల నుంచి గ్రహించిన అనేకమైన రూపకాలను ఉపయోగించారు. ఒక బలి అర్పణ విమోచనా క్రయం పాపులకు తీర్పు తీర్చవలసిన భారాన్ని ఆయన తీర్చడం అపవాదు నుంచి విడుదల మానవాళి యొక్క భ్రష్టత్వానికి స్వస్థత చేకూర్చడం క్రయధనం ఆయన చెల్లించడం ఇలా వాటిని ప్రత్యేకంగా బోధనలో ఉంచారు. యూసేవియస్ చరిత్రకారుడు గాని అతనేషియస్ చరిత్రకారుడు గాని ఇలాంటి రచయితలు కూడా పాపులు శిక్ష నుంచి విముక్తి పొంది పునరుద్ధాన జీవితంలో పాలు పొందేలా క్రీస్తు వారి స్థానంలో ధర్మశాస్త్ర శిక్షను భరించాడు అని వారు కూడా చెప్పారు. ఇవన్నీ ముందే వాక్యంలో చెప్పబడినవే కానీ వాటిని అర్థం చేసుకోవడానికి పట్టిన కాలం మాత్రం గొప్పది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాటిని ధ్యానం చేసి వాటి అర్థాన్ని ఇలా సువార్తలో ప్రకటించడం మొదలు పెట్టారు. సిలువ మరణం పునరుద్ధానం ఇవి అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి గొప్పవిగా ముఖ్యంగా స్మరించుకునే ఒక రక్షణాత్మకమైన కార్యంగా చూశారు. అందుకే ఈ ప్రత్యేకమైన రక్షణ కార్యాన్ని అంటే ఆయన మరణం పునరుద్ధానాన్ని ప్రత్యేకంగా చూసి ప్రత్యేకంగా వాటి గురించి కేటాయించేవారు. వాటికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి ఇష్టపడేవారు. ఇప్పుడు దాన్ని ఆచరణగా గుడ్ ఫ్రైడే ఎలా ప్రారంభించారు అని చూద్దాం. దీనిలో మొదటిగా అసలు పునాది పస్కా వేడుక. మొదటి శతాబ్దపు క్రైస్తవులలో ఈ క్రైస్తవులు పస్కా రహస్యం మొత్తాన్ని కూడా అంటే ఏసుక్రీస్తు వారి చివరి విందు సిలువ వేయబడడం సమాధి చేయబడడం పునరుద్ధానం. ఇవన్నీ కలిపి ఈస్టర్ అనే పండుగ పేరుతో ఒకేలా చేసేవారు ఒకే పండుగగా చేసేవారు. ఒకే పండుగగా సుదీర్ఘమైన వేడుకగా జరుపుకునేవారు. పండుగ ఒకటే కానీ రోజులు అనేకం. ఈ హోలీ వీక్ అని చెప్పి ఇప్పుడు చూస్తున్న ఈ హోలీ వీక్ లో జరుపుకునే పండుగలన్నీ కూడా ఒకే పండుగగా అన్ని రోజులు కలిపి చేసుకునేవారు. అలా వేరు చేయబడిన రోజులు కాకుండా కలిపి ఒకే వేడుకగా చేసేవారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ కాలాన్ని సంబరాలతోనూ ఆనందాలతోనూ కాదు. ఉపవాసంతో ప్రార్థనతో రాత్రంతా మెలుకువగా ఉండే ఆల్ నైట్ లా పాటించేవారు. ఇందులో ఏసుక్రీస్తు వారి శ్రమలు పునరుద్ధానాన్ని కలిపి స్మరించుకునేవారు. ఒకానొక కాలంలో శుక్రవారం రోజున ప్రత్యేకమైన ఆరాధనా క్రమం అనేది ఉండేది కాదు. ప్రత్యేకమైన రోజుగా దాన్ని భావించేవారు కాదు. కలిపి ఒకే వేడుకగా చేసేవారు. దానికి బదులుగా శనివారం సాయంత్రం ప్రారంభమయ్యే ఒక గొప్ప ప్రార్థన. రాత్రంతా ఉపవాసంతో ప్రార్థనతో ఆరాధించేవారు. అలా ఆరాధికులను ఏసుక్రీస్తు వారి శ్రమల దుఃఖం నుంచి అలా ప్రారంభమై పునరుద్ధానపు ఆనందంలోకి ఒకే నిరంతర ప్రోగ్రాం గా నిరంతర ఆరాధనలోకి తీసుకువెళ్ళేవారు. ఈ ఏకీకృత వేడుక సిలువ మరణము ఆయన పునరుద్ధాన శక్తి రెండూ కూడా వేరు వేరు కాదని విడదీయరానివి అని నొక్కి చెప్పేవి ఆ పండుగలు. మరణించిన అదే క్రీస్తు తిరిగి లేస్తారు. దుఃఖించి అదే సమాజం ఆనందిస్తుంది. ఉపవాసంతో దుఃఖంతో ప్రారంభించి ఆనందంతో ముగించేవారు. అలాంటి ప్రోగ్రాం ఉండేది. ఆ తర్వాత నాలుగో శతాబ్దం నాటికి ఈ రోజులను విభజించారు. నాలుగో శతాబ్దం నాటికి క్రైస్తవ సమాజాలు క్రీస్తు యొక్క శ్రమలు పునరుద్ధానంలోని విభిన్నమైన సంఘటనలు వీటిని పవిత్ర వారంలో వేరు వేరు సంభావాలుగా వేరు వేరు రోజులతో హోలీ వీక్ అంతా జరుపుకోవడం ప్రారంభించారు. ఎగేరియా అనేటువంటి ఒక హిస్టరీ నుంచి ఎగేరియా అనేది పిలిగ్రిమేజ్ అకౌంట్స్ అంటారు యాత్ర వృత్తాంతాలు అంటారు. ఈ చరిత్రలో ప్రతి దశను సూచిస్తూ ఎరుషలేములో జరిగే విస్తృతమైన వేడుకల గురించి ఈ చరిత్ర వివరిస్తుంది. గురువారం నాటి చివరి విందు నుంచి శుక్రవారం సిలువ మరణం దుఃఖించడం ఉపవాస ప్రార్థనలు చేయడం ఆ తర్వాత గొప్ప ఈస్టర్ తో ఫుల్ నైట్ తో ముగిస్తుంది. పునరుద్ధాన విందు వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసేవారు. గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం వరకు పండుగలే ప్రార్థనలే. ఈ ప్రక్రియ అంతా సిలువ వేయబడిన మరణించిన రోజును ఒక ప్రత్యేక సంతాప దినంగా ఏర్పడడానికి దారి తీసింది. అది క్రమంగా ఈస్టర్ కు ముందు వచ్చే శుక్రవారంగా గుర్తించబడింది. ఇలా ఎలా సెట్ చేస్తారు ఎలా గుర్తిస్తారు? ఈస్టర్ ని ఈ శుక్రవారాన్ని ప్రతి సంవత్సరం ఎలా గుర్తిస్తారు? వారాలు మారవు గాని రోజులు మారుతూ వస్తూ ఉన్నాయి. ఏ రోజు పెడతారు అని కాలిక్యులేషన్స్ అన్నీ చాలా క్లియర్ గా ఇంతకు ముందు వీడియో లోనే ఇచ్చాను. చూడని వారు ఆ వీడియో చూడండి. ఇలా ప్రత్యేకమైన రోజుగా ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగింది. అలా శుక్రవారం అనేది ఏసుక్రీస్తు వారి సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఉపవాసంతోను దుఃఖంతోను సిలువ మరణం గురించిన ప్రత్యేకమైన ఆరాధన చేసే రోజుగా దాన్ని ప్రత్యేకించారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఆరాధన యొక్క చారిత్రక అభివృద్ధి ఎలా జరిగింది అనేది. రోమన్ కల్చర్ ప్రకారం ప్రాచాత ఆరాధన పద్ధతుల ద్వారా ముఖ్యంగా చివరి ప్రాచీన కాలం నుంచి మధ్యయుగ కాలం నుంచి గుడ్ ఫ్రైడే వరకు క్రమంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థీకృతమైన సిస్టమేటిక్ ఆరాధన విధానాన్ని సంతరించుకుంది అని చరిత్ర అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ గుడ్ ఫ్రైడే యొక్క ప్రధాన ప్రత్యేకమైన అంశం వాక్యా ఆరాధన. ఇందులో పవిత్ర గ్రంథాలు లేఖనాలు చదవడం చదివించడం క్రీస్తు శ్రమల మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం పాటలు పాడడం కీర్తనలు ప్రసంగాలు వీటితో పాటు లోకం కోసం సంఘం కోసం గంభీరమైన ఉపవాస ప్రార్థనలు కన్నీటి విజ్ఞాపనలు ప్రార్థనలు ఉండేవి. ఆ తర్వాత దీన్ని సిస్టమేటిక్ గా ఒక నిర్మాణాత్మకమైన కీలక అంశాలతో కూడిందిగా మార్చారు. గిలాసియన్స్ సాక్రిమెంటరీ గ్రంథాలు అలాగే రోమన్ ఆడినెన్స్ వంటి గ్రంథాలు గుడ్ ఫ్రైడే ఆరాధనను వివరిస్తాయి. దీని యొక్క మౌలిక నిర్మాణాలు ఆ తర్వాత కాలంలో ఆచరించిన ఆచరణ ఇలా ప్రభావితం చేసింది. అంటే ఈ ఉపవాసం రోజు నిశ్శబ్దంగా ప్రవేశించడం సహస్రాంగా నమస్కారాలు అత్యుత్తమమైన ఆరాధన వాక్య పఠనాలు ఏసుక్రీస్తు శ్రమల గురించి పాటలు గంభీరమైన విజ్ఞాపనలు కన్నీటితో కూడిన ప్రార్థనలు సార్వత్రిక ప్రార్థన అని పిలుస్తారు దాన్ని. అలా చేసేవారు. సిలువను పూజించడం సిలువ గురించి ధ్యానం చేయడం గురువారం రాత్రి తయారుచేసి భద్రపరచబడిన పవిత్ర సంస్కారపు విందు అంటే కమ్యూనియన్ స్వీకరించడం ఇలా మొదలైంది. అలా కీలక అంశాలు దానిలో యాడ్ అయ్యాయి. అలా అన్నీ ఒక్కొక్కటిగా కలిసి ప్రపంచ వైవిధ్యంగా మారింది. నేడు జరుగుతున్న గుడ్ ఫ్రైడే లో కూడా క్రైస్తవ సాంప్రదాయల్లో కూడా గుడ్ ఫ్రైడే అనేకమైన విభిన్న రీతిలో పాటిస్తున్నారు. కొందరు నిశ్శబ్ద ధ్యానానికి ఉపవాసానికి ప్రాధాన్యతను ఇస్తే మరికొందరు సుదీర్ఘమైన ప్రసంగాల కోసం దేవుని వాక్యం కోసం సమావేశం అవుతారు. మరికొందరు ఊరేగింపులతోను ఏసుక్రీస్తు శ్రమలను పరిచయం చేయడానికి లోకానికి సువార్త ప్రకటించడానికి క్రీస్తు శ్రమలను ప్రదర్శనలుగా చేస్తారు. కొంతమంది సామూహికంగా విలాపంగా ప్రార్థనలు చేస్తారు కన్నీటి ప్రార్థనల మీద దృష్టి పెడతారు. ఇలాంటి వైవిధ్యం ఉన్నప్పటికీ కొన్ని ఉమ్మడి అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. క్రీస్తు శ్రమల వృత్తాంతాన్ని దేవుని యొక్క వాక్యాలని ఆయన సిలువ ధ్యానాన్ని చదవడం ధ్యానించడం వాటిని ప్రదర్శించడం నాటకీకరించడం కూడా ప్రపంచం కోసం ప్రార్థించడం సిలువ మరణాన్ని ధ్యానించడం సిలువ మరణం గురించి ప్రకటించడం మరియు పశ్చాత్తాపం చెందిన ఏసుక్రీస్తు త్యాగపూరితమైన ప్రేమపై విశ్వాసం ఉంచమని పిలుపునివ్వడం ఇలాంటివి చేస్తున్నారు. దైవ కుమారుడిని ప్రకటించి దైవ ఉద్దేశ్యాన్ని ప్రకటించి సువార్త చేయడం ఉపవాసంతో విజ్ఞాపన ప్రార్థనలు చేయడం. అనేకులకు ఆయన త్యాగాన్ని ప్రకటించడం ఇలా ఆయన మరణాన్ని సెపరేట్ చేసి ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రపంచమంతా ఆ రోజును ఆయన త్యాగాన్ని మరణాన్ని విమోచనను జ్ఞాపకం చేసుకునే రోజులా మారింది. కొత్త నిబంధన కాలం నుంచి క్రైస్తవ బోధకులు సిలువ వేయబడిన క్రీస్తు యొక్క సందేశాన్ని సువార్తకు కేంద్రంగాను రక్షణ కొరకు దేవుని శక్తిగాను చూశారు. సాంస్కృతి పరంగా ఆరాధనా పద్ధతుల్లో మార్పులు వచ్చినప్పటికీ ఆధునిక గుడ్ ఫ్రైడే లు నేడు జరుగుతున్న ఈ గుడ్ ఫ్రైడే ఆచరణలు ఇప్పటికీ ప్రాచీన క్రైస్తవ పద్ధతుల యొక్క బలమైన ఆనవాళ్లుగా కనబడుతున్నాయి. ఉపవాసం, నిగ్రహం క్రీస్తు శ్రమల యొక్క గాధను విస్తృతంగా ధ్యానించడం ప్రపంచం మొత్తం కోసం గంభీరమైన కన్నీటి విజ్ఞాపనలు వాక్యము ప్రార్థన గౌరవం కమ్యూనియన్ స్వీకరించడం ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్ల వేరు వేరుగా ఉన్నప్పటికీ ఎవరికి వారు వారికి అనుకూలంగా చేసుకునే పరిస్థితులు ఉన్నా ప్రపంచానికి క్రీస్తు ప్రేమను క్రీస్తు త్యాగాన్ని ప్రకటిస్తూ జ్ఞాపకం చేసుకునే రోజు గుడ్ ఫ్రైడే. కాలక్రమేనా దాని ఆరాధనా రూపాలు మారి వైవిధ్యభరితంగా మారినప్పటికీ దాని సారం మాత్రం స్థిరంగానే ఉంటుంది. సిలువ వేయబడిన క్రీస్తును ఏకాగ్రతతో స్మరించుకోవడం ఆయన మరణమే ప్రపంచం పట్ల దేవుని ప్రేమ రక్షణకు సంబంధించిన నిర్ణయాత్మకమైన బలి. ఇది పాటించడం పాటించకపోవడం నమ్మడం నమ్మకపోవడం డినామినేషన్స్ ను బట్టి వారి బోధనను బట్టి ఉంటుంది. నమ్మినా నమ్మకున్న ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఇది. వినయంతో పశ్చాత్తాపపడి కన్నీటితో వేడుకొని హృదయాలను మార్చుకొని జీవితాలను బాగు చేసుకొని క్షమాపణ సయోధ్య అనే బహుమతిని కొత్తగా స్వీకరించడానికి పునరుద్ధానం చెందిన ప్రభువు యొక్క శక్తితో సిలువ వంటి జీవితాలను గడపడానికి పంపబడడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తించబడింది. హింస అన్యాయం తీవ్రతమైనటువంటి వ్యక్తిగత సామాజిక గాయాలతో నిండిన ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కుల మత రాజకీయాల పట్ల చుట్టుముట్టినటువంటి ఈ విశ్వాసంలో చెడు పట్ల దేవుని సమాధానం ఉదాసీనత కాదని బాధలోకి ప్రవేశించి దాన్ని అంతర్గతంగా జయించేటువంటి ఆత్మార్పన ప్రేమ అని మరోసారి ప్రకటించడానికి గుడ్ ఫ్రైడే ఒక అవకాశంగా మారింది. అలా ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడా గుడ్ ఫ్రైడే అనేది ఇలా జరపబడుతుంది. సో దీని చరిత్ర అయితే ఇది. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇదంతా చాలా క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇంకేదైనా సందేహాలు ఉన్నా ప్రార్థన అవసరతలు ఉన్నా whatsapp నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. whatsapp మాత్రమే చేయండి. అలాగే మా వేయే ప్రయాసలకు పరిచరికు సహాయం చేయాలి అన్న కానుకలు పంపించాలి అన్న స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ సహాయం చేసి పరిచర్యలో పాలిభాగస్తులుగా మాతో సహకరించాలని కోరుతున్నాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో అంతా చాలా క్లియర్ గా మీకు అర్థమైతే మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి.
[15:00]మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరొక వీడియో ద్వారా నేను మళ్ళా వస్తాను. అంతవరకు దావాతి దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచి మిమ్మల్ని నడిపించును గాక.



