[0:00]హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మచేతి వంట ఈరోజు వీడియోలో ఉసిరికాయతో ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. జనరల్ గా మనం ఉసిరికాయతో పెట్టే ఊరగాయ ఎలా చేస్తాము కంప్లీట్ ఉసిరికాయని ఊరగాయగా పెట్టుకుంటూ ఉంటాం కదా. బట్ నేను ఈరోజు వీడియోలో మీకు అలా చూపించబోవట్లేదండి ఉసిరికాయ తొక్కు చేసి దాంతో నిల్వ పచ్చడి చేస్తున్నాను అన్నమాట. సో ఉసిరికాయ తొక్కుతో కూడా మనం నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అండి అండ్ ఈ పచ్చడి కూడా సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడు పెట్టుకునే ఉసిరికాయ ఊరగాయతో పోలిస్తే ఈ పచ్చడి చేసుకోవడం చాలా తేలిక ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు. సో ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఉసిరికాయతో క్విక్ గా ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ పావు కేజీ దాకా రాసి ఉసిరికాయలు తీసుకుంటున్నానండి ఈ ఉసిరికాయలు మీడియం సైజులో ఉన్నవన్నమాట. మొత్తంగా ఒక 15 దాకా ఉసిరికాయలు తీసుకుంటున్నాను సో ఉసిరికాయలని శుభ్రంగా వాష్ చేసేసుకుని అస్సలు తడి లేకుండా బాగా తుడిచేసుకుని ఆరపెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి మధ్యలో ఉండే విత్తనాన్ని తీసేసేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకోండి. ఇలా కొంచెం కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 నుండి 12 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు 30 గ్రాముల దాకా ఉప్పు అంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 40 గ్రాముల దాకా కారం వేసుకోండి అంటే వన్ థర్డ్ కప్పు దాకా కారం అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా మెంతి పిండి వేయండి. మెంతుల్ని దోరగా వేయించి మెత్తటి పొడి చేసుకుని ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసం వేయండి వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్స్ గా బ్లెండ్ చేసుకోండి. అన్ని ఇంగ్రిడియంట్స్ కూడా బాగా కలిసే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక గాజు బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గాలి లేకుండా చక్కగా అడిగి పెట్టుకుని మూత పెట్టేసి ఒక రోజంతా అలా ఊరనివ్వండి. ఇలా ఒకటి లేదా రెండు రోజుల పాటు బాగా ఊరనిచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్ లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 300 ml దాకా నూనె వేసుకోండి నేను ఇక్కడ పప్పుల నూనె వాడుతున్నాను. పప్పుల నూనె అయితే రుచి బాగుంటుంది అండ్ అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. కప్స్ లో గనుక చూసుకుంటే ఒకట పావు కప్పు దాకా నూనె పడుతుందండి. నిల్వ పచ్చడి కదా కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి. నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలని తలగొట్టి వేసుకోండి. అలాగే తాలింపు గింజలు కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు కూడా వేసి తాలింపుని కొద్దిగా ఫ్రై చేయండి. తాలింపు చక్కగా వేగిపోయాక చివరిగా ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసేసి బాగా కలిపేసేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఊరబెట్టుకున్న ఉసిరి తొక్కు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలపండి. ఇలా అంతా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోండి ఇలా బౌల్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పచ్చడి కంప్లీట్ గా చల్లారిపోయాక గాజు సీసాలో గాని జాడీలో గాని ఎత్తి పెట్టేసుకుంటే చక్కగా టేస్టీగా సంవత్సరం పైనే నిల్వ ఉండే ఉసిరి తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు కదా సో పచ్చడిని చూస్తే చాలా ఈజీ అనిపించిందా. మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది. మరి మీరు ఇంట్లో ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.

సంవత్సరం నిల్వ ఉండే ఉసిరి తొక్కు నిలవ పచ్చడి😋 Usirikaya Nilava Pachadi Recipe👌Amla Pickle In Telugu
Amma Chethi Vanta
3m 49s540 words~3 min read
YouTube auto captions
Transcript source
YouTube auto captions
This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.
Pull quotes
[0:00]హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మచేతి వంట ఈరోజు వీడియోలో ఉసిరికాయతో ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను.
[0:00]జనరల్ గా మనం ఉసిరికాయతో పెట్టే ఊరగాయ ఎలా చేస్తాము కంప్లీట్ ఉసిరికాయని ఊరగాయగా పెట్టుకుంటూ ఉంటాం కదా.
[0:00]బట్ నేను ఈరోజు వీడియోలో మీకు అలా చూపించబోవట్లేదండి ఉసిరికాయ తొక్కు చేసి దాంతో నిల్వ పచ్చడి చేస్తున్నాను అన్నమాట.
[0:00]సో ఉసిరికాయ తొక్కుతో కూడా మనం నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అండి అండ్ ఈ పచ్చడి కూడా సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది.
Use this transcript
Related transcript hubs
Watch on YouTube
Share
MORE TRANSCRIPTS


