[0:00]ఇది ఒక రాగి వస్తువు. దీనిని బంగారు వస్తువుగా మార్చాలంటే ఒక ఫార్ములా ఉంది. కానీ అది మనకు అర్థం కాని సంస్కృతంలో ఉంటుంది. శుద్ధం గంధకం లిమేన భావయేత్ ఏకోనవింశతి। అండం కుక్కుటజం చతుర్వారం భస్మీకృత్య తత్ పునః ॥ తామ్రపత్రం సంలేప్య పుటపాకం సప్తతిః కృతమ్ | త్రిభాగం రాజతం భాగం తామ్రం యోజయ చ ॥ యావత్ తామ్రం విలీనం తత్ స్వర్ణద్వాదశభాగకమ్ | పూర్వం స్వర్ణం చతుర్దశభాగం మిలితం భవేత్ ॥ ఇది ఎగ్జాక్ట్ గా కాపర్ ని గోల్డ్ గా మార్చే ఒక ఫార్ములా. దీనిని ఎలా డీకోడ్ చేయాలో రాబోయే కొన్ని నిమిషాల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం బంగారు ధరలు పైకి, కిందకి మారుతూ ఉన్న ఈ సమయాల్లో ఏ మెటల్ నైనా బంగారంగా మార్చగలిగే తంత్రాలు ఉన్నాయని చదివాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అదేంటో తెలుసుకోవాలని మీకు చూపించాలని వీలైతే తయారు చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది. కానీ ఇది చేయడానికి ఆరు నెలల తయారీ సమయం పడుతుంది. ఇప్పటికే ఎపిసోడ్లు లేట్ గా వస్తున్నాయని ఎన్నో కామెంట్లు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అందుకే దీనిని చేయటం పక్కనపెట్టి ముందుగా నేను ఏం తెలుసుకున్నానో మీతో పంచుకోబోతున్నాను. ఈ చరాచర జీవులు, వృక్షాలు, నదులు, పర్వతాలు, సముద్రాల మధ్య బంగారాన్ని వెతికి పట్టుకోవడం ఎంత కష్టమో దానిని అర్థం చేసుకోవడం కూడా అంతకంటే కష్టమైనది. అలాంటిది ఒక తంత్రంతో ఏ మెటల్ నైనా బంగారంగా మార్చగలరు అంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం సైన్స్ అది కుదరదు అని చెబుతుంది కాబట్టి. కానీ మీకు తెలుసా కిమోథెరపీ, కెమికల్ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్, సర్జరీస్ వీటన్నిటినీ మొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన సుశ్రుత సంహితలోని రసశాస్త్రంలో క్లియర్ గా ఆల్కమి గురించి మెన్షన్ చేసి ఉన్నారు. ఇటువంటి రహస్య విద్యలని డీకోడ్ చేసి మరింత ప్రాచూర్యం పొందిన వ్యక్తి మన తెలుగు నేల మీద కూడా జీవించాడు. లోహాలని బంగారంగా మార్చి ఎందరికో పంచిపెట్టాడు. రసవాదం అని చెప్పబడే ఈ ఫార్ములాల గురించి వెతికే ప్రయత్నంలో నాకు ఈ విశ్వం యొక్క లోతైన రహస్యాలు కనిపించాయి. నిజానికి నా ఈ జర్నీ ఇప్పటిది కాదు. ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా శోధిస్తూ ఉన్న విషయాలు. నేను కనుక్కున్న ఇంకొక విచిత్రం ఏంటంటే భూమిలో దొరికే ఒక రాయిలాగా కనిపించే ఈ బంగారం కేవలం ఒక లోహం కాదు. అది మన భవిష్యత్తుని పసిగట్టే పసిడి. అదేంటి ప్రాణం లేని ఒక స్టోన్ - మనిషి భవిష్యత్తుని కనుక్కుంటుందా? అవును మరికొన్ని నిమిషాల్లో నేను మీకు అది ఎలానో చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ. మీరు స్పెండ్ చేసే ఈ 10 టు 20 మినిట్స్ అస్సలు వేస్ట్ అవ్వదు. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే అసలు బంగారం అనేది ఈ భూమికి చెందిందే కాదు.
[2:29]అది 1973. యోమ్ కిప్పూర్ యుద్ధం జరుగుతుంది. అరబ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ ఉన్న కంట్రీస్ కి ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేయడాన్ని బ్యాన్ చేసింది. దానితో ప్రపంచం అంతా ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో 278 రూపాయలు ఉన్న తులం బంగారం ఆ క్రైసిస్ తర్వాత 506 రూపాయలకి చేరింది. ఆల్మోస్ట్ డబల్ అయింది. ప్రతి ఒక్కరు చెప్పే ఒకే మాట ఈ క్రైసిస్ వలన బంగారం ధర పెరిగింది అని. జనరల్ గా యుద్ధ సమయాల్లో బంగారం ధర పెరుగుతుంది. యుద్ధం వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు వేరే చోటకి తరలి వెళ్లాలని అనుకున్నప్పుడు వారి భూముల్ని, ఇళ్లని, పశువుల్ని, ఆస్తుల్ని తీసుకుని వెళ్లలేరు. దానితో పాటు ఈ ఆస్తుల ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. వీటన్నిటినీ వదిలి వెళ్ళడం తప్ప వేరే ఏ మార్గము లేదు. కానీ బంగారం దాని ధర పెరిగినా, తగ్గినా ప్రపంచమంతా ఒకే రేటు ఉంటుంది. చీకటి సమయాలలో మనిషికి ఈ బంగారం ఒక రాయిలాగా కాదు సూర్యుడిలా కనిపించింది. మన ఆస్తులని కేవలం ఒక తలపాగలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అందుకే యుద్ధ సమయాల్లో ప్రజలకి ఆస్తుల మీద, డబ్బు నోట్ల మీద నమ్మకం పోతుంది. అందరూ బంగారం వైపే చూస్తారు. కానీ బంగారం మనకి లిమిటెడ్ గా ఉంటుంది. ఎక్కువ మందికి ఒకేసారి దానిపై ఆసక్తి పెరిగితే అందరికీ సరిపడే సప్లై ఉండదు కనుక ఆటోమేటిక్ గా ప్రైస్ పెరిగిపోతుంది. సో ఈ విధంగా యుద్ధం లాగా పెద్ద పెద్ద సంఘటనలు జరిగితే బంగారం ధర పెరుగుతుంది. కానీ క్షుణ్ణంగా గమనిస్తే ఈ క్రైసిస్ రావడానికి 10 నెలల ముందు నుండే బంగారం ధరలు పెరగటం ఆల్రెడీ మొదలై ఉంది. క్రైసిస్ వచ్చే సమయానికి ఆల్రెడీ 160 రూపాయల నుండి 270 వరకు చేరి ఉంది. అంటే దీని అర్థం సంక్షోభం వచ్చిన తర్వాత బంగారు ధరలు పెరగడం తగ్గడం జరగట్లేదు. బంగారు ధరల్లో మార్పులు వచ్చిన తర్వాతే సంక్షోభాలు రావటం మొదలవుతున్నాయి. అంటే దాని అర్థం ఈ సంక్షోభాలు రావడానికి ముందే బంగారు దీన్ని పసిగడుతుంది. అంతేకాదు 2001 సెప్టెంబర్ లో అమెరికాలోని ట్విన్ టవర్స్ పై అటాక్ జరిగింది. మార్కెట్స్ అన్నీ కూలిపోయాయి. బంగారం పెరిగింది. ఇది జరిగింది సెప్టెంబర్ లో కానీ జనవరి నుండే బంగారం ధరలు పెరగటం మొదలై ఉంది. 2020 కోవిడ్ లాక్ డౌన్ టైం లో కూడా ఇంతే. బంగారం 2019 చివరి నుండే పెరగడం మొదలై ఉంది. చివరిగా 2022 రష్యా-ఉక్రెయిన్ వార్ సమయంలో కూడా ఇదే జరిగింది. యుద్ధం ఫిబ్రవరి 24న మొదలైంది. కానీ డేటాని గమనిస్తే 2021 అక్టోబర్ వరకు కూడా గోల్డ్ ప్రైసెస్ ఫ్లాట్ గా ఉంది. అక్టోబర్ నుండి పెరగడం మొదలైంది. అండ్ ఎగ్జాక్ట్ గా నాలుగే నాలుగు నెలల్లో యుద్ధం మొదలైంది. అండ్ ప్రెసెంట్ 2026 ఫిబ్రవరిలో బంగారం అమాంతం ఆకాశాన్నే అంటింది. అంటే ప్రస్తుతం కూడా బంగారం దేనినో ప్రెడిక్ట్ చేస్తూ ఉంది. అదేంటి బంగారాన్ని కొనేది మనుషులు కదా దాని వలనే కదా బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక సంఘటన జరిగే ముందు దాన్ని ప్రెడిక్ట్ చేసేది మనుషులేనా అని మీకు డౌట్ వస్తుంది. ఇది ఒక కామన్ డౌట్. అందుకే మీకు ఒకటి చూపించాలి. మీరు ఎప్పుడైనా సోలార్ ఫ్లేర్స్ గురించి విన్నారా? మన సూర్యుడు ఇంటెన్స్ గా నిప్పులు కక్కడమే సోలార్ ఫ్లేర్స్. ఈ సోలార్ ఫ్లేర్స్ మన భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ ని కబళిస్తుంది. ఇలా ఇంపాక్ట్ అయిన మాగ్నెటిక్ ఫీల్డ్ ని జియో మాగ్నెటిక్ స్టోమ్స్ అని అంటారు. ఈ జియో మాగ్నెటిక్ స్టోమ్స్ అనేవి జీవరాశులలో హార్ట్ బీట్ ని, బ్లడ్ ప్రెషర్ ని, స్లీప్ ప్యాటర్న్స్ ని, మూడ్స్ ని కబలిస్తుంది అని స్టడీస్ లో తేలింది. బయోలాజికల్ గా అండ్ మన నర్వస్ సిస్టం లో మార్పులు జరుగుతాయని స్టడీస్ లో కన్ఫర్మ్ అయింది. ఇలా సోలార్ ఫ్లేర్స్ మరింత ఎక్కువగా సంభవించినప్పుడు దానిని సోలార్ మాక్స్ అని అంటారు. అలెగ్జాండర్ షిజావ్స్కీ అనే బయో ఫిజిసిస్ట్ ఏమని ప్రూవ్ చేశాడంటే చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద సంఘటనలు 80% అంటే యుద్ధాలు, వలస వెళ్ళడం, పాలించడం, మార్పులు జరగడం ఇవన్నీ సోలార్ మాక్స్ సమయంలోనే జరిగాయని ప్రూవ్ చేశాడు. అండ్ ప్రస్తుతం మోడర్న్ సైన్స్ కూడా దీనిని అప్రూవ్ చేస్తూ ఉంది. ఈ సోలార్ మాక్స్ వలన యుద్ధాలు జరగడం, మనిషి ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులు రావటం, పవర్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మీద, జియో పాలిటిక్స్ మీద, స్టాక్ మార్కెట్స్ మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు. ఒక పెద్ద సోలార్ స్టామ్ వస్తే అది గడిచే ఐదు సంవత్సరాలలో 1.2 ట్రిలియన్ డాలర్స్ నుండి 9.1 ట్రిలియన్ డాలర్స్ వరకు నష్టాలని చేకూరుస్తుందని డేటా చెబుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇదంతా మాగ్నెటిక్. చిన్నప్పుడు మనం చదివే ఉంటాం ఎక్కడైతే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుందో అక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని. అండ్ ఎక్కడైతే మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా ఉంటుంది అని. అంటే దాని అర్థం ఈ భూమికున్న మాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏదో ఒక ఎలక్ట్రికల్ సోర్స్ నుండే వస్తూ ఉండాలి. దీని గురించి మరింతగా వెతికాక నాకు మైకేల్ స్టెయిన్ బాకర్ అనే జియో ఫిసిస్ట్ వేసిన ఒక మ్యాప్ దొరికింది. అందులో అతను ఈ భూమి లోపల ప్రవహించే విద్యుత్ ప్రవాహాలని ఒక మ్యాప్ రూపంలో గీశాడు. దానితో పాటు అతను ఈ భూమిలో గోల్డ్ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మ్యాప్ గీశాడు. ఆ రెండిటినీ పక్క పక్కన పెట్టి చూస్తే అవి రెండూ ఒకేలా ఉన్నాయి. అంటే ఎక్కడ నుండి అయితే ఎర్త్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉందో అక్కడ ప్రతి చోట బంగారం ఉంది అనమాట. ఆర్ మే బీ ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మీరు గమనించారా కంప్యూటర్ కి ప్రాణమైన మదర్ బోర్డ్, సిపియు, రామ్, కనెక్టర్ చిప్స్ ప్రతి దానిలో బంగారాన్ని వాడి ఉంటారు. ఎందుకో తెలుసా అక్కడ పవర్ స్టేబుల్ గా ఫ్లో అవ్వడానికే బ్యాలెన్స్ అవ్వడానికి. అండ్ అంతే కాదు బంగారం ఎప్పటికీ తుప్పు పట్టదు. మీకు అర్థమవుతుందా ఈ బంగారమే మన భూమి నుండి వచ్చే ఎలక్ట్రికల్ అండ్ మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. ఈ సోలార్ ఫ్లేర్ ఎఫెక్ట్ వలన డైరెక్ట్ గా మనకు ఎఫెక్ట్ జరగదు. ఆ ఎఫెక్ట్ అనేది ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ గుండా వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో ఈ బంగారం పాలన వహిస్తూ ఉంది. గమనించండి ఈ సోలార్ ఫ్లేర్స్ వల్ల మనుషుల్లో బయోలాజికల్ గా సైకలాజికల్ గా మార్పులు వస్తూ ఉన్నాయి. యుద్ధాలు, పెద్ద పెద్ద సంఘటనలు ఈ సమయంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మాగ్నెటిక్ ఫీల్డ్ గుండా జరుగుతూ ఉంది. అండ్ ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంది బంగారం. అంటే ఒక పెద్ద సందర్భం లేదా సంఘటన మనదాకా రాకముందే అది బంగారాన్ని దాటి వెళ్తుంది. అందుకే దానికి భవిష్యత్తు తెలుస్తూ ఉంది. బంగారం గుండా వెళ్ళినంత మాత్రాన దానికి ఎలా తెలుస్తుంది దానికి కాన్షియస్నెస్ లేదు కదా. ఇది తెలియాలంటే అసలు బంగారం ఎలా పుట్టిందో మీకు తెలియాలి. మొదట్లో అంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యం నుండి గాలి, గాలి నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి పుట్టింది అని మనం చివరి ఎపిసోడ్స్ లో చెప్పుకుని ఉన్నాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి భూమి అంటే కేవలం ఎర్త్ అని అర్థం కాదు. భూమి అంటే మెటీరియల్ వరల్డ్. అలా శూన్యం అంటే సున్నా అని అనుకుందాం. దానికి ఒకటి తోడైంది. ఆ ఒకటి అంటే ఒక అణువులో ఉన్న న్యూక్లియస్ కి అంటుకుని ఉన్న ప్రోటాన్. దీనినే మనం హైడ్రోజన్ అని అంటాం. మనందరికీ పిరియాడిక్ టేబుల్ బాగా తెలుసు. అందులో ఉన్న మొదటి ఎలిమెంటే హైడ్రోజన్. ఇలా ఈ విశ్వంలో ఏ ఆటం లోని న్యూక్లియస్ కైనా ఒకే ప్రోటాన్ ఉంటే అది హైడ్రోజనే. హైడ్రోజన్ అంటే గ్యాస్, గాలి. చూడండి శూన్యం నుండి మొదటిగా గాలి పుట్టింది అంటే అర్థం ఇదే. కొన్ని మిలియన్ల సంవత్సరాల ఉష్ణోగ్రత, ఒత్తిడి తర్వాత ఈ హైడ్రోజన్ న్యూక్లియస్ ఇంకొక హైడ్రోజన్ న్యూక్లియస్ తో కలిసినప్పుడు దాని నుండి ఎంతో శక్తి విడుదల జరిగింది. ఒకే ప్రోటాన్ ఉన్న హైడ్రోజన్ లోకి రెండు ప్రోటాన్లు వచ్చాయి. దీనినే మనం హీలియం అని అంటాం. మీరు గమనించారా ఈ హైడ్రోజన్ అండ్ హీలియం యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ ఏ మన సూర్యునిలో జరుగుతూ ఉంటుంది. అది ఎంతో శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఏ సెల్ఫ్ రన్నింగ్ ఇంజిన్. ఇలా గాలి నుండి అగ్ని పుట్టింది అనడానికి సాక్ష్యం ఇదే. పిరియాడిక్ టేబుల్లో కనిపించేవి కేవలం ఎలిమెంట్స్ మాత్రమే కావు అది సృష్టి ఎలా మొదలైందో చెప్పే రహస్యం. ఇలా ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ తో ఫ్యూజన్ జరిగి ఇంకొక కొత్త రూపాన్ని పొందుతూ వచ్చింది. కొత్త రూపాన్ని పొందిన ప్రతిసారి విపరీతమైన శక్తి విడుదల జరుగుతూ వచ్చింది. ఈ సృష్టి మొత్తం ఈ శక్తి యొక్క స్వరూపాలే. ఐ మీన్ ఈ విశ్వం ఒక శక్తి స్వరూపమే. ఇలా మనం చూసే పంచభూతములు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ ఇలా ఎలిమెంటల్ ఫ్యూజన్ జరుగుతూనే ఉద్భవించాయి. మరి మనం, మనం కూడా అలానే ఉద్భవించాం. మనం కూడా నక్షత్రాల యొక్క భాగాలమే. ఇవన్నీ ఎలిమెంట్స్ యొక్క రూపాలు. ఎలిమెంట్స్ యొక్క ఫ్యూజన్ జరగడం అనేది ఏదో ల్యాబ్ లో జరిగేది మాత్రమే కాదు. ఇది మన సృష్టి యొక్క ఎవల్యూషన్. మరి అయితే పిరియాడిక్ టేబుల్ లో ఐరన్, ప్లాటినం, గోల్డ్ అన్నీ ఉన్నాయి కదా. మరి అవి మనలో కూడా ఉంటాయా అంటే ఎస్ ఉంటుంది. మన రక్తంలో ఐరన్ ఉంది. ప్రతి అణువుల్లో ఆక్సిజన్ ఉంది. ప్రతి అవయవం కార్బన్ తో తయారై ఉంటుంది. పొటాషియం, క్యాల్షియం, నైట్రోజన్ అన్నీ ఉంటాయి. ఆఖరికి రెండు మిల్లీగ్రాముల గోల్డ్ కూడా ఉంటుంది. వీ ఆర్ నథింగ్ బట్ ఏ స్టార్ డస్ట్. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉన్న ఈ కథలో ఒక మాయాజాలం కనిపించింది. మనం గమనిస్తే ఇలా ఒక ఎలిమెంట్ కి ఇంకొక ప్రోటాన్ యాడ్ అయితే అది నెక్స్ట్ ఎలిమెంట్ అవుతుంది. ప్రతి కొత్త ఎలిమెంట్ పుట్టే టైం లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలా మీరు ఐరన్ ని గమనించండి. దాని నెంబర్ 26 అంటే 26 ప్రోటాన్లు ఉంటాయి. కానీ ఐరన్ యొక్క న్యూక్లియస్ అనేది ఈ విశ్వంలోనే అత్యంత స్థిరమైన న్యూక్లియస్. ది మోస్ట్ స్టేబుల్ న్యూక్లియస్. ఇది ఇంకొక దానితో ఫ్యూజన్ కనుక జరిగితే ఎంత శక్తిని అయితే విడుదల చేస్తుందో అంతకంటే ఎక్కువ శక్తిని ఇది పీల్చుకుంటుంది. ఒక కొండ పై నుండి ఒక చక్రాన్ని దొర్లిస్తే అది ఫ్లో ద్వారా శక్తిని రిలీజ్ చేస్తుంది. అదే పైకి పంపించాలంటే శక్తిని ఖర్చు పెడుతుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం పడుతుంది. ఇక్కడ ఐరన్ ఫ్యూజన్ లో కూడా శక్తిని ఎంత విడుదల చేస్తుందో అంతకంటే ఎక్కువ శక్తిని ఇది పీల్చుకుంటుంది. తద్వారా శక్తిని కోల్పోతుంది. శక్తి కోల్పోతే ఇంకొక ఎలిమెంట్ పుట్టదు. ఒక నక్షత్రం తన కోర్లో ఐరన్ ని ఎప్పుడైతే ఫ్యూజన్ చేస్తుందో అది తన చావుని కొనితెచ్చుకున్నట్టే. ఎప్పుడైతే ఐరన్ ఫ్యూజన్ జరుగుతుందో మొత్తం రివర్స్ అయిపోతుంది. ఒక సెకనులోనూ 100లో ఆ నక్షత్రం తన లోపలికి తాను కూలిపోతుంది.
[11:03]తర్వాత ఒక్కసారిగా పేలిపోతుంది. దీనినే సూపర్ నోవా అని అంటారు. అంటే ప్రకృతి ధర్మాల ప్రకారంగా ఐరన్ తర్వాత ఫ్యూజన్ జరగడం అనేది ముమ్మాటికీ కుదరని పని. మరి అయితే 79 ప్రోటాన్లు కలిగిన బంగారం ఎటువంటి ఫ్యూజన్ జరగకుండా ఎలా పుట్టింది? బంగారం, వెండి, ప్లాటినం, యురేనియం వంటి బరువైన లోహాలు పుట్టాలంటే న్యూట్రాన్ క్యాప్చర్ అనే ఒక ప్రక్రియ జరగాలి. ఎప్పుడైతే ఒక నక్షత్రం ఇలా ముందుకు వెళ్ళే ప్రక్రియలో తన శక్తిని తానే కోల్పోయి ఒక్కసారిగా పేలిపోతుందో అప్పుడు జస్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలో అసంఖ్యాకమైన న్యూట్రాన్లు విడుదల అవుతాయి. ఐరన్ అణువులు ఈ న్యూట్రాన్లని చాలా వేగంగా తమలో కలుపుకుంటాయి. ఎంత వేగంగా అంటే ఈ అణువు విడిపోయి శక్తిని కోల్పోయే లోపలే ఇంకొక న్యూట్రాన్ వచ్చి యాడ్ అయిపోతుంది. ఇది కాలం చేసిన ఒక అద్భుత ప్రదర్శన. శక్తి కోల్పోతుందని తెలుసు కానీ సమయాన్ని వేగవంతం చేసి శక్తి కోల్పోయే లోపలే సృష్టి ముందుకు కదిలింది. ఈ ప్రాసెస్ లోనే బంగారం, ప్లాటినం, యురేనియం వంటి భారీ లోహాలు సెకండ్ల వ్యవధిలో తయారయ్యాయి. ఇదే ఆ మాయాజాలం. మనం ధరించే బంగారం మొత్తం ఇలా పుట్టిందే. దీనినే ఆర్-ప్రాసెస్ అని అంటారు. రాపిడ్ న్యూట్రాన్ క్యాప్చర్ ప్రాసెస్. కానీ ఇంకొక ప్రాసెస్ కూడా జరిగింది. ది ఎస్-ప్రాసెస్, స్లో న్యూట్రాన్ క్యాప్చర్. ఇది ఒక చనిపోతూ ఉన్న సాధారణ స్టార్స్ లో వేల సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతుంది. దీని ద్వారా కాపర్, లెడ్, బిస్మత్ వంటి లోహాలు తయారవుతాయి. ఆగస్టు 17, 2017. అమెరికాలోని లూసియానా మరియు వాషింగ్టన్ లోని డిటెక్టర్లు ఒక వింత సిగ్నల్ ని పట్టుకున్నాయి. వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టెలిస్కోప్ లు దాని వైపే ఫోకస్ చేశాయి. 13 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఎన్ జి సి 4993 అనే గ్యాలక్సీలో ఒక అద్భుతం జరుగుతూ ఉంది. అక్కడ రెండు న్యూట్రాన్ స్టార్ లు ఒక దానితో ఒకటి డీకొట్టబోతున్నాయి. ఒక నక్షత్రంలో ఫ్యూయల్ అయిపోయినప్పుడు దాని కోర్ నాశనమయ్యి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అన్నీ న్యూట్రాన్ లోపలికి కలిసిపోయేలా ఫోర్స్ పుడుతుంది. దాని వెడల్పు కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కానీ దాని బరువు సూర్యుని కంటే రెట్టింపు ఉంటుంది. అంటే ఆ స్టార్ లో ఉన్న పదార్థాన్ని ఒక స్పూన్ లోకి తీసుకుంటే ఆ స్పూన్ బరువు 10 బిలియన్ టన్నులు ఉంటుంది. అప్పుడు ఆ స్టార్ ని న్యూట్రాన్ స్టార్ అని అంటారు. అలాంటి రెండు న్యూట్రాన్ స్టార్ లు సెకండ్ కి 400 సార్లు ఒక దాని చుట్టూ ఒకటి తిరుగుతూ వచ్చి డీకొట్టాయి. ఆ తాకిడికి విశ్వంలో ఉన్న అన్ని నక్షత్రాల శక్తి కలిస్తే ఎంత ఉంటుందో అంతటి శక్తి ఒక్క సెకండ్ లో విడుదల జరిగింది. దీనినే కిలోనోవా అని అంటారు. ఆ ఒక్క ప్రమాదంలో మన భూమి బరువుకి 10 రెట్లు సమాన బరువు ఉన్న బంగారం పుట్టింది. అంతరిక్షంలోకి జస్ట్ అలా విసిరివేయబడింది. ఇలా సృష్టి యొక్క ఎవల్యూషన్ లో భాగంగా అయిన ఒక నక్షత్రం యొక్క అంతం నుండి విధిరాతని, కాలాన్ని శాసించి ఆవిర్భవించినదే బంగారం. ప్రస్తుతం మనం ఉంటూ ఉన్న ఈ భూమి, సూర్యుడు, గ్రహాలు ఆఖరికి మనం ఈ ఎలిమెంట్ల సమూహమే కదా. మనకి కాన్షియస్నెస్ ఉంది అంటే వాటికి ఉండక తప్పదు. ఇలా ప్రతి మెటల్ కి ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. కానీ బంగారానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని చెప్పుకోవాలంటే మనం ఇంకో ఎపిసోడ్ ఖచ్చితంగా చేయాలి. బంగారం చాలా ప్రత్యేకమైనది. అందుకే మొదటిసారి మానవుడు దానిని చూసినప్పుడు ఏదో తెలియని ఒక స్పర్శ, ఒక రహస్యం, ఒక తేజస్సు అందులో కనిపించింది. కాలక్రమేనా ఈ బంగారం వలనే మానవుడు ఎన్నో చీకటి రోజులను చూడాల్సి వచ్చింది. ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కాలాన్నే శాసించే ఈ బంగారం ఈనాటిది కాదు. దీన్ని సృష్టించడం ఎవరి తరమూ కాదు. కానీ మానవుడు ఈ గీతని చెరిపేయాలని తలిచాడు.
[14:22]అసలు సృష్టిలో ఒక పదార్థం ఐరన్ గానో, కాపర్ గానో, బంగారంగానో ఎందుకు ఉంటుంది? దానికి ఒకే కారణం దాని న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్ల సంఖ్య. ఐరన్ యొక్క అటామిక్ నంబర్ 26. అంటే అందులో 26 ప్రోటాన్లు ఉంటాయి. దానిలో నుంచి ఒక ప్రోటాన్ ని తీసేస్తే అది 25 ప్రోటాన్లు గల మాంగనీస్ గా మారుతుంది. అదే దానికి ఇంకో మూడు ప్రోటాన్లని యాడ్ చేస్తే అది కాపర్ గా మారుతుంది. అంటే ఆ ప్రోటాన్ల సంఖ్యను మార్చగలిగితే మీరు తుప్పు పట్టిన ఇనుముని కూడా బంగారంగా మార్చొచ్చు. దీన్ని నిరూపించడానికి 1980 లో గ్లెన్ సేబార్గ్ అనే ఒక నోబుల్ విన్నర్ ఒక సాహసం చేశాడు. ఆయన బిస్మత్ అనే లోహాన్ని తీసుకున్నాడు. దాని అటామిక్ నెంబర్ 83. దాన్ని ఒక న్యూక్లియర్ రియాక్టర్ లో పెట్టి విపరీతమైన శక్తితో వేరే పార్టికల్స్ తో డీ కొట్టించి ఆ బిస్మత్ లో నుంచి బలవంతంగా నాలుగు ప్రోటాన్లని విడగొట్టాడు. ఇక మిగిలింది 79 ప్రోటాన్లు. అంటే సాక్షాత్తు బంగారమే. సైన్స్ ప్రకారంగా మొట్ట మొదటి సారిగా మనిషి ఒక లోహాన్ని బంగారంగా మార్చాడు. ఆల్కమి అనేది కథ కాదు నిజం అని తేలింది. మరి ఆ టెక్నాలజీని వాడి మనం ఇప్పుడు బంగారాన్ని ఎందుకు తయారు చేయట్లేదు? అతనికి ఆ పద్ధతిలో కేవలం ఒక ఔన్స్ బంగారాన్ని తయారు చేయడానికి ఆయన ఖర్చు 270 కోట్లు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం రేటు కొన్ని లక్షల రూపాయలు మాత్రమే. అంటే 270 కోట్లు ఖర్చు పెడితే మన చేతికి వచ్చేది బూడిద మాత్రమే. కానీ ఇది నాకు అంత ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వీళ్ళకి న్యూక్లియర్ రియాక్టర్ కావాల్సి వచ్చింది. కానీ వేల సంవత్సరాల క్రితం మన భారతీయులు ఇంతకంటే తెలివైన పద్ధతిని ఎంచుకున్నారు. వాళ్ళు బిస్మత్ జోలికి వెళ్ళలేదు. వాళ్ళు ఎంచుకున్నది మెర్క్యురీ. పాదరసం యొక్క అటామిక్ నెంబర్ 80. బంగారం అటామిక్ నెంబర్ 79. కేవలం ఒకే ఒక్క ప్రోటాన్ ని తీసేయగలిగితే మన కళ్ళ ముందు బంగారం మెరుస్తుంది. పైగా ఖర్చు తక్కువ. మరి మన సిద్ధులు ఆ ఒక్క ప్రోటాన్ ని ఎలా తీశారు? వాళ్ళు ఎటువంటి పెద్ద పెద్ద మెషినరీ ని వాడలేదు. వాళ్ళు వాడింది క్వాంటం సైన్స్. ఒక అణువుని విడగొట్టడానికి వాళ్ళు వాడింది సౌండ్ మరియు కెమిస్ట్రీ. ఒక ఆటం లోని ప్రాపర్టీస్ ని కేవలం వైబ్రేషన్ ద్వారా మార్చొచ్చు అని వాళ్ళకి బాగా తెలుసు. భారతీయ విజ్ఞానం అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆర్య భట్ట కనుగొన్న సున్నా లేక ఆస్ట్రాలజికల్ సైన్స్ మాత్రమే. కానీ ప్రపంచానికి తెలియని ఎందుకో మన చరిత్రకారులు దాచిపెట్టిన అసలైన అద్భుతం మరొకటి ఉంది. అదే ఆల్కమి అండ్ మెటలర్జీ. నిజం చెప్పాలంటే ఈ విద్య మన భారతీయులకు తెలిసినంత బాగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దీనికి ఆద్యుడు 84 మంది మహా సిద్ధుల లో ఒకరు. రసాయన శాస్త్రంలో, మెటలర్జీలో ఆరితేరిన మహర్షి. ఆయన కేవలం ఋషి మాత్రమే కాదు. మనుషులకి కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా త్వరగా వ్యాధి నయం చేసే విధానాన్ని కనుగొన్న వైద్యుడు. పాదరసంతో అద్భుతాలు సృష్టించిన మాంత్రికుడు. చావు చివరి దశలో ఉన్న పేషెంట్లకి ఆయుష్షుని పెంచే ట్రీట్మెంట్ ని కనుగొనడమే కాదు. తాను స్వయంగా 600 సంవత్సరాలు బతికాడని బౌద్ధ పుస్తకాలు చెబుతూ ఉన్నాయి. ఆయనే ఆచార్య నాగార్జునుడు. రెండవ శతాబ్దంలోనే రసరత్న సముచ్చయం అనే గ్రంథంలో మేటర్ యొక్క ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయనకు పాదరసం అంటే కేవలం ఒక లిక్విడ్ మెటల్ లా కనిపించలేదు. అది మెటల్స్ ని మార్చే పాసిబిలిటీ లాగా మనిషి రోగాలని తగ్గించే సంజీవినిలా కనిపించింది. దీనికి సాక్ష్యం కావాలంటే ఢిల్లీలో ఉన్న ఐరన్ పిల్లర్ ని చూడండి. నాలుగవ శతాబ్దం నుండి అంటే 1600 ఏళ్లుగా ఎండలో, వానలో నిలబడే ఉంది. ఇప్పటి వరకు దానికి చిన్న తుప్పు కూడా పట్టలేదు. ఈ రోజుటికి మోడర్న్ సైన్స్ కి కూడా సాధ్యం కాని రస్ట్ ప్రూఫ్ ఐరన్ టెక్నాలజీని క్రియేట్ చేసిన ఇంజనీర్లు సైంటిస్టులు వాళ్ళు. వీళ్ళు చూడటానికే గడ్డాలు పెంచుకొని కాషాయ బట్టలతో కనిపిస్తున్నారు కదా అని తక్కువ అంచనా వేయకండి. ఒక ఋషి అయినంత మాత్రాన తాను కేవలం మంత్రాలు, పూజలు చేసేందుకే పుట్టాడు అని అనుకుంటే అది మన అజ్ఞానం. జింక్ మరియు కాపర్ ని కలిపి ఇత్తడి అనే ఒక కొత్త లోహాన్ని సృష్టించింది ఈ సూటు బూటు వేసుకున్న మోడర్న్ సైంటిస్టులు కాదు. ఎప్పుడో వేల ఏళ్ల క్రితం ఈ గడ్డం ఉన్న సిద్దులే ఈ అల్లాయిస్ ని క్రియేట్ చేశారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. భారతీయులకి సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు కాదు. బేస్ మెటల్స్ ని బంగారంగా మార్చడం, అజ్ఞానంలో ఉన్న మనిషిని జ్ఞానోదయం వైపు నడిపించడం వాళ్ళకి ఈ రెండు ఒకటేలా కనిపించాయి. ఒకటి మెటీరియల్స్ లో హైయెస్ట్ అచీవ్మెంట్ అయితే మరొకటి మానవ ధర్మాల్లో హైయెస్ట్ అచీవ్మెంట్. ఈరోజు మనం వాడుతూ ఉన్న మోడర్న్ కెమిస్ట్రీకి, మెటీరియల్ సైన్స్ కి పునాది ఆనాడు మన ఋషులు వేసినదే. వాళ్ళు చెప్పిన మెథడ్స్ లో నుంచి తీసిన ఫార్ములాల్లో కొన్ని మీకు ఇప్పుడు చెబుతాను. ఇది మొదటిగా మనం చెప్పుకున్న ఫార్ములా. మొదటిగా దీని అర్థం శుద్ధి చేసిన గంధకాన్ని అంటే ప్యూరిఫైడ్ సల్ఫర్ ని నిమ్మరసంతో 19 సార్లు నూరాలి. తర్వాత దానికి కోడిగుడ్డులోని ద్రవాన్ని కలిపి నాలుగు సార్లు మర్దన చేసి దాన్ని మంటలో పెట్టి భస్మంగా మార్చాలి. ఇలా ఒక దాన్ని భస్మంగా మార్చడానికి కూడా ఒక స్పెషల్ ప్రాసెస్ ఉంది. ఆ భస్మాన్ని పలుచటి రాగి రేకులకు లేపనంగా పూసి గాలి చొరబడకుండా మట్టి మూసల పెట్టి 70 సార్లు పుటపాకం చేయాలి. పుటపాకం అంటే ఒక సర్టెన్ డిగ్రీస్ లో హీట్ చేయటం. దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసిన రాగికి మూడు భాగాలు వెండి కలిపి కరిగించాలి. ఆ వెండిలో రాగి పూర్తిగా కరిగిపోయి మాయమయ్యేంత వరకు వేడి చేయాలి. అప్పుడు అది 12 వన్నెల బంగారంగా మారుతుంది. ఇక్కడ ఒక వన్నె = 1.5 క్యారెట్. 12 వన్నెల బంగారం = 18 క్యారెట్ గోల్డ్. కానీ ఇక్కడే నాగార్జునుడు ఒక అద్భుతమైన సైన్స్ ని దాచాడు. శ్లోకం చివరి లైన్ లో పూర్వం స్వర్ణం చతుర్దశభాగం మిలితం భవేత్ అని ఉంది. దీన్నే ఆల్కమి భాషలో బీజ స్వర్ణం అని అంటారు. మీరు తయారు చేసిన ఆ 12 వన్నెల బంగారానికి ఇంకా పూర్తిగా బంగారంలా ఎలా అవ్వాలో తెలియదు. దాని అణువుల నిర్మాణం ఇంకా అస్థిరంగానే ఉంటుంది. అందుకే దానికి ఒక 14 భాగాలు అసలైన బంగారాన్ని కలపాలి. దీన్నే సీడ్ గోల్డ్ అని అంటారు. మీరు 10 గ్రాములు ఈ పద్ధతిలో చేసిన బంగారానికి 14 రెట్లు అంటే 140 గ్రాములు సీడ్ బంగారాన్ని కలపాలి. అప్పుడు మీ దగ్గర 150 గ్రాముల స్వచ్ఛమైన బంగారం తయారవుతుంది. ఓవరాల్ గా మీరు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ని తయారు చేసినట్టే. మీరు ఇదే రేషియో తో ఎంత బంగారాన్నైనా తయారు చేయొచ్చు. ఇది ఒక నీటి చుక్కను సముద్రంలో కలిపి దాన్ని కూడా సముద్రంగా మార్చడం లాంటిది. అంతా బాగానే ఉంది ఫార్ములా కూడా ఉంది మరి అందరూ దీన్ని ఎందుకు చేయట్లేదు? దానితో కావాల్సినంత బంగారం చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే ఒక పెద్ద రహస్యం ఉంది. మనం మ్యాథమెటిక్స్ లో ఒక నెంబర్ ని రాసినప్పుడు దాన్ని ఏ వరుసలో ఉపయోగిస్తాం? ఎడమ నుండి కుడికి రాస్తాం. కానీ దాని విలువని ఎలా లెక్కిస్తాం కుడి నుండి ఎడమ వైపుకి. అంటే యూనిట్స్ నుండి మొదలు పెడతాం. మీరు బాగా గమనిస్తే సంస్కృతంలో కూడా ఇదే నెంబర్ సిస్టమ్ ని వాడతారు.
[20:39]ఉదాహరణకు 14 అనే పదం తీసుకోండి. 1 అండ్ 4 అని రాస్తాం. కానీ సంస్కృతంలో దీన్ని ఎలా చదువుతారో తెలుసా రివర్స్ లో. చతుర్దశి అంటే నాలుగు మరియు 10. చతుర్షష్టి అంటే నాలుగు మరియు 60. ద్వాదశి అంటే 2 మరియు 10. ఈ నెంబర్ సిస్టం మనకు ఏనాడో తెలుసు కానీ మధ్యలో మనం మర్చిపోయాం. ఇదే లాజిక్ ని ఇందాక మనం చెప్పుకున్న నాగార్జునుడి ఫార్ములాకి అప్లై చేయండి. అక్కడ ఏకోనవింశతి అని ఉంది. చాలా మంది దీన్ని 91 అనుకుంటారు లేదా 21 అనుకుంటారు. కానీ సంస్కృత పద్ధతిలో విడదీస్తే ఏక అంటే ఒకటి, ఊన అంటే తక్కువ, వింశతి అంటే 20. అంటే 20 కి ఒకటి తక్కువ. కచ్చితంగా 19 సార్లు నూరాలి. ఒక్కసారి ఎక్కువైనా తక్కువైనా పనికి రాదు.
[21:34]అలాగే చతుర్వారం. ఆధునిక తెలుగులో ఏడు రోజులు. ఆయుర్వేదం అండ్ రసాయనం. ఎన్ని సార్లు చేయాలో చెప్పే పదం. వారం. ఏకవారం = one time. ద్వివారం = two times. సో చతుర్వారం అంటే నాలుగు వారాలు కాదు నాలుగు సార్లు. ఈ విధంగా విషయం మన కళ్ళ ముందే ఉన్నా దాన్ని మోడర్న్ మైండ్ సెట్ తో చూసి నాలుగు వారాల పాటు వెయిట్ చేసి టైమింగ్ మిస్ అయ్యి ఫలితం రాక ఇదంతా అబద్ధం అని అంటాం. ఈ విధంగా ఒకదాని అర్థం పూర్తిగా తెలియక సాధించలేకపోతున్నాం. మరి అయితే ఇప్పుడు అర్థం తెలిసింది కదా. ఇప్పుడు మనం చేయగలమా అంటే ఎస్ చేయగలం. కానీ మనకు తెలియాల్సింది ప్రపోర్షన్స్. ఎంత మోతాదులో ఆ పదార్థాలని వాడాలి అన్న విషయం. శుద్ధం గంధకం ఎంత మోతాదులో వాడాలో తెలియకపోతే అది ఫెయిల్ అవ్వటమే కాక భయంకరమైన విష వాయువులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది పుస్తకాల్లో డైరెక్ట్ గా రాయలేదు. ఇది కేవలం గురు పరంపరలో ఉన్నవాళ్లకే తెలుస్తుంది. అటువంటి పరంపరలో మనకు బాగా తెలిసిన తెలుగు వ్యక్తి ఒకరు ఉన్నారు. అతడికి పరిచయం అవసరం లేదు. అతడే యోగి వేమన. వేమన కేవలం ఉప్పు కప్పు రంబు పద్యం రాసిన కవి కాదు. అతడు రసశాస్త్రంలో ఆరితేరిన ఒక గొప్ప వైద్యుడు. పాదరసాన్ని అమృతం అయ్యం చేసి ఎన్నో అద్భుతాలు చేసిన ఒక మహాగ్యాని. చూడటానికి పిచ్చి వాడిలా, వస్త్రాలు కూడా లేకుండా ఉంటాడు. కానీ అతడు అలా అవ్వడానికి కారణం బంగారమే. అతడు మెటల్స్ ని మెడిసిన్స్ గా మార్చేవాడు, కెమికల్ ట్రీట్మెంట్స్ చేసేవాడు. సో బేసికల్లీ ఒక ఎలిమెంట్ లోని ప్రాపర్టీస్ ని మార్చగలిగేవాడు. ఒక రసవాది ఎప్పుడైతే బేస్ మెటల్స్ ని అత్యంత విలువైన ప్రీమియం మెటల్ గా మార్చగలడో ఆ క్షణం అతడు హైయెస్ట్ పాయింట్ ని అచీవ్ చేసినట్టే. అందుకే వేమన దాని కోసం ప్రయాణించాడు. ఒకసారి బంగారాన్ని సాధించిన తర్వాత అతడు ఇనుముని, బంగారాన్ని వేరుగా చూడలేకపోయాడు. ప్రతి ఒక్క మెటల్ ఒకే సోర్స్ నుండి వస్తున్నాయని మనుషులు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని వెర్రివాళ్ళని ఈ మెటీరియల్ ప్రపంచంలో ఉన్నది ఇదేనా అని వైరాగ్యం పొందాడు. నిజానికి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు బంగారాన్ని తయారు చేయగలిగితే అప్పుడు బంగారానికి విలువ ఉండదు. అది ఇనుముతో సమానం అవుతుంది. అప్పుడు మనిషి వేరొక విలువ కోసం పరిగెడతాడు. అందుకే తాను ఆల్కమిని వదిలేశాడు. కానీ వెళ్లే ముందు అతడు తన జ్ఞానాన్ని వేమన శతకాల పద్యాల్లో ఎన్కోడ్ చేసి వెళ్ళాడు. ఆ పద్యాలు చూడటానికే నీతి వాక్యాలుగా ఉంటాయి కానీ చాలా పద్యాల్లో ఈ ఆల్కమి గురించే వివరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ పండు పొట్టు తోడ పదిలముగా దెచ్చి... నల్ల బెల్లమును నయముగాను... రసము గూర్చి వండ రంజిళ్లు హేమము... విశ్వదాభిరామ వినుర వేమ! ఇది ఒక ఆల్కమి. ఒక పండు యొక్క పొట్టుని జాగ్రత్తగా తీసుకుని వచ్చి దానికి నల్ల బెల్లమును కలపాలి. ఇందులో ఐరన్ మరియు కార్బన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక రసము గూర్చి అంటే పాదరసముతో కలిసి ఉండలుగా చేసి పుటపాకం చేయాలి. అప్పుడు ఆ పాదరసం స్టెబిలైజ్ అయ్యి అందులో నుండి ఒక ప్రోటాన్ విడిపోయి బంగారంగా మారుతుంది. కానీ వేమన ఎంత బ్రిలియంట్ అంటే ఇక్కడ పండు పొట్టు అని చెప్పాడు కానీ ఏ పండో చెప్పలేదు. నేను ఒక గురువుని కలిశాను. అతన్ని అడిగితే అది వేప పండు అని చెప్పాడు. ఎందుకంటే కేవలం వేప పండు లోనే మెర్క్యురీని కట్టడి చేయగలిగే స్పెషల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయని చెప్పాడు. అమేజింగ్. ఇటువంటి విషయాలు ఒక నిజమైన రసవాదికి మాత్రమే అర్థమవుతాయి. ఇదే విధంగా వేమన కొన్ని పద్యాల్లో పదార్థాల గురించి 100 పద్యాల తర్వాత మరికొన్ని పద్యాల్లో టైమింగ్స్ గురించి మరో 100 పద్యాల తర్వాత ప్రపోర్షన్స్ గురించి ఎన్కోడ్ చేసి ఉన్నాడు. అండ్ దానితో పాటు వాటిని కూడా డైరెక్ట్ గా చెప్పకుండా సంధ్యా భాష అనే ఒక టెక్నిక్ ని యూస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరు అనే రేషియో ని డైరెక్ట్ గా చెప్పకుండా ఋతువులు అని చెప్పి ఉంటాడు. మరొక పద్యంలో ఇలా ఉంది. ఉప్పు కర్పూరము నొక గది లోపల చేర్చి... రాగి రేకు చలగబూసి పుటము బెట్టె... రాగి పొలువు బంగారు విశ్వదాభిరామ వినుర వేమ! ఇక్కడ ఉప్పు అంటే మనం వంటల్లో వాడే సాల్ట్ అని అనుకుంటాం. కానీ రసవాద పరిభాషల్లో దీన్ని నవక్షారం అని అంటారు.
[25:59]అంటే అమోనియం క్లోరైడ్. ఇలా తను సంధ్యా భాషని పజిల్ సిస్టమ్స్ ని క్రియేట్ చేసి ఇది కేవలం అర్హత కలిగిన వాళ్ళకే పొందే విధంగా వదిలి వెళ్ళాడు. ఇలా రసశాస్త్రంలోనే కాకుండా రహస్యాలని అత్యంత తెలివిగా తన కవిత్వంలో బంధించడం అనేది ఒక మాస్టర్ మైండ్ అని చెప్పాలి. వేమన రాసిన పద్యాలు ఒక బ్రహ్మాండమైన క్రిప్టోగ్రఫిక్ వాల్ట్ లా ఉంటాయి. వాటిని తెరవాలంటే వీటిపై పూర్తిగా అవగాహన ఉన్న గురువు ఖచ్చితంగా అవసరం. అప్పుడు ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కానీ ఒక విషయం. ఆచార్య నాగార్జునుడు, యోగి వేమన వీళ్ళు తయారు చేసిన బంగారాన్ని ఎన్నడూ వాళ్ళ సొంత ప్రయోజనాలకు ముట్టుకోలేదు. మొత్తం నిస్వార్థంగా ప్రజల కోసమే వాడారు. మే బీ ఇటువంటి వాళ్ళకే ఈ విద్య లభిస్తుందేమో. మొదట్లో బంగారం మన భవిష్యత్తును చెబుతుంది అని చెప్పుకున్నాం గుర్తుందా? అందులో ఇంకొక రహస్యం ఉంది. మన భూమిని అంతరిక్షం నుండి వచ్చే ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతూ ఉన్నది జూపిటర్. అండ్ ఈ జూపిటర్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నది సాటర్న్. ఈ గురువు మరియు శని. ఇవి రెండూ మన భూమిని కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా కాపాడుతూ, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి. ఈ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. అలా ఆస్ట్రాలజీ ప్రకారం జూపిటర్ కి బాగా కనెక్ట్ అయి ఉన్న మెటల్ గోల్డ్. అండ్ సాటర్న్ కి కనెక్ట్ అయి ఉన్న మెటల్ ఐరన్. ఒకసారి బాగా ఆలోచించండి. మన భూమి యొక్క కోర్ లో కూడా ఇవే ఉన్నాయి. ఐరన్ అండ్ గోల్డ్. ఒకటి శక్తినిస్తుంది, మరొకటి బ్యాలెన్స్ చేస్తుంది. అచ్చం అంతరిక్షంలో ఎలాగో అలాగే. గ్రహాలు అక్కడ ఉన్న సాటిలైట్స్ అయితే ఇక్కడ ఉన్న మెటల్స్ వాటి సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునే రిసీవర్స్ లా పని చేస్తున్నాయి. అంటే గ్రహాల కదలికలతో మన భవిష్యత్తు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అందుకే మనుషులు మెటల్స్ ని దరిస్తారు. ఏదో రిసీవ్ చేసుకోవడానికి. ఆర్ మే బీ బ్యాలెన్స్ అవ్వడానికి.
[28:13]మరి అయితే, ఆల్కమి ప్రస్తుతం అంతరించిపోయినట్టేనా అని అడిగితే లేదు. అది ఇంకా మన మధ్యే దాగి ఉంది.



