Thumbnail for AP CID PV Sunil Kumar Inspirational Story | PV Sunil Kumar Police Journey | SumanTV by SumanTV

AP CID PV Sunil Kumar Inspirational Story | PV Sunil Kumar Police Journey | SumanTV

SumanTV

4m 41s490 words~3 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:00]Section 1

పోలీస్ వర్గాల్లో ఆయన పేరు చెప్తే రోమాలు నిక్కబడతాయి. ఆయన నడుచుకుంటూ వస్తే అలర్ట్ అవుతారు, సెల్యూట్ కొడతారు. ఎందుకంటే పోలీస్ శాఖలోనే కాదు...

[0:29]Section 2

నక్సలిజానికి, రౌడీజానికి, ఫ్యాక్షన్ జానికి తన పోలీస్ జానికి రుచి చూపించారు. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన...

[1:42]Section 3

సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో డిప్లమా హోల్డర్ అయిన పి.వి. సునీల్ కుమార్ 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేర...

[3:51]Section 4

కానీ సమాజంలో ఎంత మంచి పేరు వచ్చినా ప్రజలకు ఎంత సహాయం చేసినా వివాదాలు మాత్రం సహజమే. అలా పి.వి. సునీల్ కుమార్ కూడా పలు విషయాల్లో ఆరోపణలు ఎద...

[4:20]Section 5

తప్పును తప్పు అని చెప్పే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఖాకీ చొక్కా వేసుకున్నప్పటి నుంచి ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఎన్ని హోదాలు మారినా...

Pull quotes
[0:00]పోలీసు ఉద్యోగం అంటే కాకీ చొక్కా చేతిలో లాటీ, బెల్ట్ కు గన్ను, తిరగడానికి జీప్ అని అనుకునే వారికి నానానికి ఉన్న రెండో వైపును చూపించారు.
[0:29]దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపమే కనిపిస్తుంది అంటారు.
[0:29]సినిమాల్లో ఎన్నో రీల్ సింగములను చూసాం కానీ రియల్ సింగంగా పేరు తెచ్చుకున్నారు పి.వి సునీల్ కుమార్.
[0:29]ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఎంతమంది వివాదంలోకి లాగాలని ప్రయత్నించినా తాను పట్టుకొని కేసును మూలాల్లోకి వెళ్లి శోధనలో ప్రత్యేకమైన శైలి అనుసరించి పూర్తి పారదర్శకతను చూపిస్తున్నారు.
Use this transcript
Related transcript hubs

[0:00]పోలీస్ వర్గాల్లో ఆయన పేరు చెప్తే రోమాలు నిక్కబడతాయి. ఆయన నడుచుకుంటూ వస్తే అలర్ట్ అవుతారు, సెల్యూట్ కొడతారు. ఎందుకంటే పోలీస్ శాఖలోనే కాదు ప్రజల్లో ఆయనకున్న పాపులారిటీ అలాంటిది. పోలీసు ఉద్యోగం అంటే కాకీ చొక్కా చేతిలో లాటీ, బెల్ట్ కు గన్ను, తిరగడానికి జీప్ అని అనుకునే వారికి నానానికి ఉన్న రెండో వైపును చూపించారు. ఆయనే ఐపీఎస్ పి.వి సునీల్ కుమార్.

[0:29]నక్సలిజానికి, రౌడీజానికి, ఫ్యాక్షన్ జానికి తన పోలీస్ జానికి రుచి చూపించారు. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపమే కనిపిస్తుంది అంటారు. సినిమాల్లో ఎన్నో రీల్ సింగములను చూసాం కానీ రియల్ సింగంగా పేరు తెచ్చుకున్నారు పి.వి సునీల్ కుమార్. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఏపీ సీఐడీ చీఫ్ స్థానాన్ని సంపాదించారు. నో నాన్సెన్స్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఎంతమంది వివాదంలోకి లాగాలని ప్రయత్నించినా తాను పట్టుకొని కేసును మూలాల్లోకి వెళ్లి శోధనలో ప్రత్యేకమైన శైలి అనుసరించి పూర్తి పారదర్శకతను చూపిస్తున్నారు. పి.వి. సునీల్ కుమార్ జూన్ 8, 1966లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. సునీల్ కుమార్ కుటుంబంలో అంతా చదువుకున్న వారే కానీ బయటి ప్రపంచం నుంచి ఆయనకు చిన్నచూపు అందుకు కారణం ఆయన దళితుడు. స్కూల్ రోజుల్లో నుంచి ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే సమాజం చూసిన చిన్నచూపును దృష్టిలో పెట్టుకున్నారు. ఎవరైతే వేలెత్తి నవ్వుతున్నారో వాళ్ళతోనే సెల్యూట్ చేయించుకునేలా అవ్వాలని కలలు కన్నారు. ఆ కలలనే నిజం చేసుకున్నారు. రియల్ సింగంగా కాకి చొక్కా వేసుకొని అందరి చూపును తన వైపు తిప్పుకున్నారు.

[1:42]సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో డిప్లమా హోల్డర్ అయిన పి.వి. సునీల్ కుమార్ 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరారు. వివిధ పోలీస్ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా పనిచేశారు. ఏఎస్పీగా కడప పులివెందలలో ఫ్యాక్షన్ ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ఎటువంటి అవాంచన సంఘటనలు లేకుండా శాంతియుతంగా సాధారణ ఎన్నికలను నిర్వహించడంలో కీలకంగా పనిచేశారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన మెదక్, వరంగల్, ఆదిలాబాద్ మరియు శ్రీకాకుళంలోను తన మార్క్ సెట్ చేశారు. అర్బన్ పోలీసింగ్ లో నిష్ణాతులు. డీసీపీ ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీగా విధులు నిర్వహించారు. ఇలా వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అత్యున్నత ఇన్వెస్టిగేషన్ విభాగమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అంబేద్కర్స్ ఇండియా మిషన్ పేట ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ప్రొఫెషనల్ గా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో పర్సనల్ లైఫ్ లో అంత జాలిగా ఉంటారు పి.వి. సునిల్ కుమార్. ఖాళీ సమయాన్ని తన కుటుంబానికే కేటాయిస్తారు. పైగా టెక్నాలజీ పై కూడా అవగాహన ఉంది. రచయితగా తెలుగులో 40 కథలు, మూడు నవలలు కూడా రాశారు. స్పోర్ట్స్ లో గోల్ఫ్, టెన్నిస్, క్రికెట్ ఆడతారు అంతేకాదు. సోషల్ కాజ్ కోసం చాలా పనులు కూడా చేస్తున్నారు. ఏపీ సీఐడీకి సునీల్ కుమార్ బాస్ అయిన తర్వాత సీఐడీలో ఛేదన, శోధన సామర్థ్యం పెరిగింది. ఏపీ సీఐడీ అంటే దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 2019, 2020, 2020, 2021కి గాను ఏపీ సీఐడీ జాతీయ స్థాయిలో స్క్యాచ్ అవార్డులు కూడా అందుకుంది. అత్యధిక కేసులని సులువుగా ఛేదించిన విభాగంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. అలా గడిచిన రెండేళ్లలో సీఐడీకి ప్రత్యేకత తీసుకొచ్చి తన సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత సునీల్ కే దక్కుతుంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ సమయంలో కూడా రాష్ట్రంలో ఏ అధికారి ముందుకు రాకమునుపే తన నెల రోజుల వేతనాన్ని ఉచిత వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు.

[3:51]కానీ సమాజంలో ఎంత మంచి పేరు వచ్చినా ప్రజలకు ఎంత సహాయం చేసినా వివాదాలు మాత్రం సహజమే. అలా పి.వి. సునీల్ కుమార్ కూడా పలు విషయాల్లో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ వీటికి సిద్ధపడిన ఆయన వాటిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలని సులువుగా పరిష్కరించుకొని పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన నిజాయితీ పై ఎన్ని నిందలు వేసినా వాటిని తోసి పుచ్చుతూ ముందుకు సాగుతున్నారు.

[4:20]తప్పును తప్పు అని చెప్పే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఖాకీ చొక్కా వేసుకున్నప్పటి నుంచి ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఎన్ని హోదాలు మారినా తనలోని ధైర్యాన్ని ఏ క్షణం కోల్పోలేదు. ఎన్ని ఆరోపణలు చేసినా క్లారిటీ ఇచ్చుకున్నారే తప్ప ప్రత్యారోపణలు చేయని వ్యక్తి. పి.వి. సునీల్ కుమార్ లాంటి వారు చాలా అరుదు.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript