Thumbnail for 2026లో మళ్ళీ అదేరోజు - ఏప్రిల్ 3 -JESUS CRUCIFIXION- 3 APRIL 33 AD - యేసు సిలువ వేయబడి మరణించిన రోజు by LOVE GOSPEL

2026లో మళ్ళీ అదేరోజు - ఏప్రిల్ 3 -JESUS CRUCIFIXION- 3 APRIL 33 AD - యేసు సిలువ వేయబడి మరణించిన రోజు

LOVE GOSPEL

13m 29s1,721 words~9 min read
Auto-Generated

[0:00]మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వ శుభాలు. చరిత్రకారులు, బైబిల్ పండితులు, శాస్త్రవేత్తలు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి మరణించిన అత్యంత కరెక్ట్ అయిన రోజుగా క్రీస్తు శకం 33 ఏప్రిల్ మూడవ తారీఖున శుక్రవారం. ఆ రోజునే ఏకాభిప్రాయానికి తీసుకొచ్చారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు మరణించిన అన్ని రోజులు క్యాలిక్యులేట్ చేస్తే అన్ని కారణాల్లో కన్నా ఇది బెస్ట్ గా ఎక్కువగా ప్రాబబిలిటీ ఉంది. ఈ 2026 వ సంవత్సరాన్ని అత్యంత ఎగ్జైటింగ్ గా మార్చే విషయం ఏంటి అంటే ఈ 2026 గుడ్ ఫ్రైడే కూడా ఏప్రిల్ మూడవ తారీఖున రావడం. ఏప్రిల్ 3 శుక్రవారం సరిగ్గా దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడిన సంవత్సరం ఆయన సిలువ వేయబడిన తేదీ కూడా ఇదే. ఈ కోయిన్సిడెన్స్ అనేది చారిత్రక పరంగాను ఆస్ట్రోనామికల్ గాను ప్రవచనాత్మకంగాను కూడా ఆధారాలన్నీ ఏకతాటిపై తీసుకొచ్చిన డేట్ అది. ఈ 2026 గుడ్ ఫ్రైడే కూడా ఏప్రిల్ 3 శుక్రవారం రావడమే ఇక్కడ అద్భుతమైన కోయిన్సిడెన్స్ గా మనం చూస్తున్నాం. క్రీస్తు శకం 33 ఏప్రిల్ మూడవ తారీఖు శుక్రవారం నాడే యేసుక్రీస్తు వారు చనిపోయారు అని చెప్పడానికి ఈ రీజన్స్ ఏంటి ఆ రోజే ఎందుకు అనేది మనం చూస్తే ఈ తేదీని ఖచ్చితంగా సూచించేటువంటి బైబిల్ ఆధారాలు మనం చూద్దాం. ఏడు బైబిల్ ఆధారాలు ఉన్నాయి. మొదటిది కయాఫా. కయాఫా యొక్క ప్రధాన యాజకత్వం జరిగిన కాలం. ఇది చారిత్రకమైన వాస్తవం. రోమన్ చరిత్రకారుడు జోసెఫస్ ప్రకారం కూడా కయాఫా ఈ కాలంలోనే అధికారంలో ఉన్నాడు. సిలువ వేయడానికి ప్రేరేపించినటువంటి కయ్యాఫా ఆయనే. క్రీస్తు శకం 18 నుంచి 36 వరకు ఆయన ప్రధాన యాజకుడిగా సేవ చేశాడని సువార్తలు కూడా ధృవీకరిస్తున్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3, 4 వాక్యాలు, యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి 53 వాక్యాలు. దీని ప్రకారం ఈయన ఉన్న ఈ కాలంలో 18 నుంచి 36 వరకు ఉన్న ఈ కాలంలోనే యేసుక్రీస్తు వారి మరణం జరిగింది. ఇక రెండోది పంతు పిలాతు యొక్క పరిపాలన. రోమన్ రికార్డులు పిలాతు యొక్క రాయి, పిలాతు స్టోన్ అనేటువంటి పురావస్తు ఆధారాలు కూడా పిలాతు ఈ కాలంలోనే యూదయ గవర్నర్ గా ఉన్నారు అని చెప్పి నిరూపిస్తున్నాయి. అలాగే బైబిల్ లో ఉన్న నాలుగు సువార్తలు కూడా పంతు పిలాతు ఈ మరణ శిక్షణ ఆదేశించాడని చెప్పి ధృవీకరిస్తున్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24 నుంచి 26 వాక్యాలు, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం, లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వాక్యం, యోహాను సువార్త 19వ అధ్యాయం 15, 16 వాక్యాల ప్రకారం. పిలాతు క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు యూదయాను పరిపాలించాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించిన కాలం అనేది పరిధి మరింత కుదించబడింది. అంటే 26 నుంచి 36 మధ్యలోనే ఉండాలి. ఇక మూడవ కారణం తిబేరియస్ సీజర్ యొక్క 15 సంవత్సరాల తర్వాత. అంటే లూకా సువార్త మూడవ అధ్యాయం మొదటి రెండు వాక్యాల ప్రకారం తిబేరియస్ పాలన యొక్క 15వ సంవత్సరంలో అంటే సుమారుగా క్రీస్తు శకం 28, 29 లో బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య ప్రారంభమైంది. బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య తర్వాతే యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభమైంది. ఆయన సిలువ మరణం క్రీస్తు శకం 30 తర్వాత మాత్రమే జరిగి ఉండాలి. ఇప్పుడు దీని ప్రకారం క్రీస్తు శకం 30 తర్వాత క్రీస్తు శకం 36 కు ముందు మధ్యలో జరిగి ఉండాలి. ఇక నాలుగోది శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. నాలుగు సువార్తలు కూడా యేసుక్రీస్తు వారు సబ్బాతుకు ముందు రోజు సిద్ధపరచుకునే రోజు అంటారు దాన్ని ఆ శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు అని ఏకీభవిస్తున్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వాక్యం, మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వాక్యం, లూకా సువార్త 23వ అధ్యాయం 54వ వాక్యం, యోహాను సువార్త 19వ అధ్యాయం 42వ వాక్యాల ప్రకారం. ఇక ఐదవ రీసన్ పస్కా పండుగలో చనిపోయారు. కాబట్టి పస్కా రోజు వచ్చిన శుక్రవారం నాడు ఆయన చనిపోయారు. నాసా వారి క్యాలిక్యులేషన్స్ ప్రకారం లూనార్ ఎక్లిప్స్ వచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం క్రీస్తు శకం 33 ఏప్రిల్ మూడవ తారీఖున పౌర్ణమి వచ్చింది. ఆ పౌర్ణమి శుక్రవారం రోజే వచ్చింది. దాన్ని పాస్కల్ ఫుల్ మూన్ అంటున్నారు అంటే పస్కా ఫుల్ మూనే, పస్కా పౌర్ణమి శుక్రవారం రోజే వచ్చింది. బైబిల్ లో నాలుగు సువార్తలు కూడా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డం పస్కా పండుగ సమయంలోనే జరిగింది అని పేర్కొంటున్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వాక్యం, మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం, యోహాను సువార్త 18వ అధ్యాయం 28, 29 వాక్యాల ప్రకారం పస్కా పండుగ సమయం లోనే యేసుక్రీస్తు వారు మరణించారు. క్రీస్తు శకం 29, 36 మధ్య కేవలం రెండు శుక్రవారాలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు శుక్రవారాలు మాత్రమే పస్కా పండుగతో ఏకీభవించాయి. ఒకటి క్రీస్తు శకం 30 ఏప్రిల్ 7. రెండోది క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3. ఈ రెండు డేట్లలో కూడా ఏదో ఒక రోజు యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు. ఇక ఆరో విషయం యోహాను యొక్క మూడు పస్కా పండుగల గురించి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి పరిచర్య కాలంలో మూడు వేరువేరు పస్కా పండుగలు నమోదు చేయబడింది. యోహాను సువార్త రెండవ అధ్యాయం 13వ వాక్యంలో ఒక పస్కా, ఆరవ అధ్యాయం నాలుగవ వాక్యంలో ఒక పస్కా, 14వ అధ్యాయం 55వ వాక్యంలో ఒక పస్కా. ఇది కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల పరిచర్యను వివరించారు. మూడవ పస్కా క్రీస్తు శకం 33 లోనే వస్తుంది. అంటే క్రీస్తు శకం 33 ని ఇది స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రకారం క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖునే యేసుక్రీస్తు వారి మరణ సంభవం అనేది జరిగింది అని చెప్పి తెలుస్తుంది. ఇక ఏడవ విషయం తొమ్మిదవ గంట గురించి. మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటల సమయంలో తొమ్మిదవ గంట వస్తుంది. యూదుల క్యాలిక్యులేషన్ ప్రకారం ఉదయం 6 గంటల నుంచి వాళ్ళ టైమింగ్ లెక్కిస్తారు. తొమ్మిదవ గంట అంటే ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు. ఈ సమయంలోనే దేవాలయంలో సాయంకాలపు బలి అర్పించేవారు అని చరిత్ర చెబుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అందరూ కూడా యేసుక్రీస్తు వారు తొమ్మిదవ గంటలో అంటే మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటలకు మరణించారు అని చెబుతున్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి 50 వాక్యాల్లో, మార్కు సువార్త 15వ అధ్యాయం 34 నుంచి 37 వాక్యాల్లో, లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుంచి 46 వాక్యాల్లో. ఆయన మరణించిన ఖచ్చితమైన సమయం ఇదే. క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖున శుక్రవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం. ఇది బైబిల్ ప్రకారము క్యాలిక్యులేషన్స్ ప్రకారము కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఉన్న అన్ని కాలాల్లో కన్నా ఈ క్యాలిక్యులేషన్ మాత్రమే ఎక్కువ ప్రభావవంతంగా ఉంది. చారిత్రక కాలక్రమం క్రొనాలజీ ప్రకారం క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు యేసుక్రీస్తు వారు సిలువపై ప్రాణ త్యాగం చేశారు అనేది వాస్తవం. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు ప్రవచనాత్మకమైన దానియేలు ప్రవచనం (70 వారముల ప్రవచనం) ఖచ్చితమైన రోజును సూచించేదిగా ఇది కనబడుతుంది. దానియేలు యొక్క 70 వారాల ప్రవచనం ఈ ఖచ్చితమైన రోజును సూచిస్తుంది. అత్యంత అద్భుతమైన నిర్ధారణలో క్యాలిక్యులేషన్స్ లో ఇది కూడా ఒకటి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డానికి 500 సంవత్సరాల కంటే ముందే వ్రాయబడిన పాత నిబంధన గ్రంథం, ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథంలో ఇది మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం 25వ వాక్యం ప్రకారం యెరూషలేము పునర్నిర్మించాలి అని శాసనం వెలువడిన రోజు నుంచి ఆ రోజు నుంచి మెస్సయ్య వరకు మెస్సయ్య వచ్చే వరకు 483 ప్రవచన సంవత్సరాలు. నెహెమ్యా 2:1 ప్రకారం రాజైన అర్తహసస్తా యెరూషలేము ప్రాకారాలను కట్టమని ఆజ్ఞ ఇచ్చిన రోజు క్రీస్తుపూర్వం 444 మార్చ్ 5 అయితే. దానియేలు 9:25 ప్రకారం ఈ 70 వారాలు 7, 7 వారాలు అంటే 69 వారాలు. 69 వారాలు అంటే వారానికి 7 రోజుల చొప్పున 483 సంవత్సరాలు. ఈ బైబిల్ ప్రవచన సంవత్సరం 360 రోజులు ఎందుకంటే యూదుల క్యాలెండర్ 360 రోజులే ఉంటుంది. ఈ 360 రోజులకి 483 సంవత్సరాలకి క్యాలిక్యులేషన్ చేస్తే 173,880 రోజులు. అంటే ఆజ్ఞ జారీ చేయబడిన క్రీస్తుపూర్వం 444 మార్చి 5వ తారీకు నుంచి ఈ 173,880 రోజులు లెక్కిస్తే లీపు సంవత్సరాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే క్రీస్తు శకం 33 మార్చ్ 30వ తారీఖున వస్తుంది. అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం నీసాన్ 10వ రోజున అది ఆగుతుంది. ఇది క్రీస్తు సిలువ వేయబడ్డానికి నాలుగు రోజులు ముందు ఖచ్చితమైనటువంటి రోజు. ఎందుకు అంటే యెరూషలేము ప్రయాణం జరిగిన రోజు, యెరూషలేములోకి ప్రవేశించే రోజు యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద యెరూషలేములోకి ప్రవేశించారు. దాన్నే మనం పామ్ సండే అని, మట్టల ఆదివారం అని మాట్లాడతాం. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖున శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డారు. ఇది యాదృచ్ఛికం కాదు దైవ ప్రణాళికలో ఒక భాగం అని చెప్పి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకు చెబుతున్నాయి. ఇక ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ కూడా దీన్ని నిర్ధారించాయి. ఇక ఖగోళ నిర్ధారణలు కూడా మనం చూస్తే క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖున యెరూషలేము ఆకాశంలో పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడింది అని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు శాస్త్రవేత్తలు 1983 లోనే ధృవీకరించారు. నాసా ఈ గ్రహణాల యొక్క ఆర్కీవ్స్ ప్రకారము నిర్దిష్టమైన తేదీ, నిర్దిష్టమైన సంఘటన గురించి కూడా పాక్షిక చంద్ర గ్రహణం క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖున జరిగింది అని చెప్పి నాసా కూడా ధృవీకరించింది. యేసుక్రీస్తు వారు మూడు గంటలకు మరణించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్యుడు అస్తమించగా అప్పటికే గ్రహణంతో కూడిన చంద్రోదయం అనేది సంభవించింది అని శోకంలో ఉన్న ఆ నగరానికి అది గాఢమైన, భయంకరమైన ఎరుపు రంగులో కనిపించింది అని ఈ ఖగోళ విషయాలను బట్టి తెలుస్తుంది. ఇక చారిత్రక పరమైన హిస్టారికల్ విషయాలు ఏంటి అంటే ఆర్కియాలజికల్ గా దొరికిన పంతు పిలాతు యొక్క నివేదికలను బట్టి అలాగే అపోక్రిఫల్ గ్రంథాలను బట్టి కూడా ఆ సమయంలో చంద్రుడు రక్తవర్ణంలోకి మారినట్లుగా ధృవీకరించబడ్డాయి. వీటిని బట్టి చూస్తే క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖునే సిలువ వేయబడిన ఆ దినముగా బలమైన ఆధారాలుగా కనబడుతున్నాయి. ఇక ఈ ప్లానెట్స్ అరేంజ్మెంట్ లో కూడా గ్రహాల అమరికలో కూడా ఒక చిన్న విషయం ఉంది. విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త పరిశోధకుడు అయిన మిగ్యూల్ ఆంటోనియో ఫియోల్ ఒక సౌర వ్యవస్థ నమూనాను ఉపయోగించి ఒక అద్భుతమైన ఆవిష్కరణను ఇచ్చారు. క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3వ తారీఖున శని గ్రహం, యురేనియస్, బృహస్పతి, భూమి, శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా ఒకే లైన్ లోకి అమరాయి. సౌర వ్యవస్థకు పై నుంచి చూసినప్పుడు ఈ అమరిక స్పష్టంగా సిలువపై ఉన్న ఒక ఆకారాన్ని పోలి ఉంటుంది. శని గ్రహం, శని గ్రహము దాని యొక్క ఉపగ్రహాల యొక్క వలయముతో తల మరియు ముళ్ళ కిరీటాన్ని ఏర్పాటు చేసిందని కనబడుతుంది. బృహస్పతి, యూరేనియస్ అనేది చాచిన చేతులు ఏర్పరిచాయి. అలాగే భూమి, శుక్రుడు కూడా పాదాలను ఏర్పరిచాయి. ఇలా ఈ గ్రహాల అమరిక అనేది అద్భుతంగా కనిపిస్తుంది.

[10:07]క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఆ మార్చి మధ్య నుంచి ఏప్రిల్ మధ్య వరకు కూడా కొనసాగింది. అందుకే గుడ్ ఫ్రైడే ఎప్పుడూ కూడా మార్చ్ 21 తర్వాత ఏప్రిల్ మొదటి వారానికి ముందు మధ్యలోనే ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఇలా క్రీస్తు శకం నుంచి 2000 సంవత్సరాల మధ్య కాలం వరకు కూడా ఇప్పటివరకు కూడా ఇలా ఆరు సార్లు మాత్రమే కనిపించింది. అంటే ప్రతి 333 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పునరావృత్తం అవుతుంది. ఇదే క్యాలిక్యులేషన్, ఇదే అమెరికా ఇంతకుముందు క్రీస్తు పూర్వం నాలుగు ప్రాంతంలో కనిపించింది. కొంతమంది ఏం చెబుతారంటే దీని యేసుక్రీస్తు వారు పుట్టిన సంవత్సరంగా భావిస్తారు. అప్పుడు కూడా ఇలానే ఏర్పడింది అని చెబుతారు. ఇలా అన్ని కోణాలు, అన్ని కారణాలను బట్టి ఏప్రిల్ 3 క్రీస్తు శకం 33 మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన సంభవం యేసుక్రీస్తు వారు మరణ సంభవం అని మనకు స్పష్టంగా క్లియర్ గా తెలుస్తుంది. ఇది అన్ని అంచనాల కన్నా కొంచెం ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి ఎక్కువగా సపోర్ట్ చేసే అంచనా. ఇక 2026 గురించి మాట్లాడితే 2026లో గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3నే వస్తుంది. సేమ్ డేట్ అదే శుక్రవారం నాడు వస్తుంది. చంద్రమాన క్యాలెండర్ ఆధారంగా గుడ్ ఫ్రైడే అనేది ప్రతి సంవత్సరం మారుతుంది. మళ్ళీ ఏప్రిల్ 3న రావాలి అంటే 2037 వ సంవత్సరంలో మరలా ఏప్రిల్ 3వ తారీఖున గుడ్ ఫ్రైడే వస్తుంది. ఇదంతా యేసుక్రీస్తు వారు మరణం సంభవించిన రోజుగా, మరణించిన రోజుగా మనం చూస్తున్న విషయం. అయితే ఈ రోజు ఆ రోజే అని చెప్పినా, ఆ రోజు అని చెప్పకపోయినా యేసుక్రీస్తు వారు మరణించింది అయితే ఖచ్చితంగా నిజం. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న, ఎక్కువగా ఎవిడెన్స్ లతో సహా నిరూపించబడుతున్న రోజు కాబట్టి ఆ రోజు గురించి మనం ధ్యానించుకున్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు మరణించిన రోజును ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యేసుక్రీస్తు వారిని స్మరించుకుంటూ ఆయన సిలువపై చేసిన త్యాగాన్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుకుని స్మరించుకొని మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకొని సువార్త చేస్తూ ఆయన వైపు చూస్తున్నారు. ఆయన త్యాగాన్ని చూస్తున్నారు. కానీ ఆ ఒక్క రోజుకు పరిమితం కాదు ఆయన త్యాగం ఆయన విమోచన ఆయన ఇచ్చే నిత్యజీవం అది ఒక్క రోజుకు పరిమితం కాదు. ఆయన వైపు చూసే వారి కోసం, ఆయన దగ్గరకు వచ్చే వారి కోసం, ఆయన ప్రేమను పొందుకునే వారి కోసం సిలువపై రక్తం కారింది ఒక ఓటమి కోసం కాదు. ఆ దేవుని ప్రేమ యొక్క గెలుపు కోసం మన పాపాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు చూపించిన ప్రేమకు హద్దులు లేవు. అది తేదీలతో కొలవలేము. ఒక రోజును మాత్రమే ధ్యానించే విషయం కాదు కానీ ఈరోజు ఆయన మరణాన్ని మాత్రమే కాదు మన జీవితాల్లో ఆయన ప్రేమను జీవింపచేయాలి. సిలువను చూస్తే బాధ గుర్తుకు రాకూడదు ఆశ గుర్తుకు రావాలి ఆయన ఇచ్చిన విమోచన గుర్తుకు రావాలి. ఆయన చేసిన త్యాగం గుర్తుకు రావాలి. ఆయన మన పట్ల చేసిన నిత్య నిబంధన గుర్తుకు రావాలి. ఎందుకంటే ఆ సిలువే మనకు రక్షణ మార్గం. చీకటి ఎంత గాఢంగా ఉన్నా సిలువ వెలుగు దాన్ని జయిస్తుంది. మరణం ఎంత బలంగా కనిపించినా యేసు ప్రేమ దానికంటే బలమైనది గొప్పది అని నిరూపించబడుతుంది. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ విషయం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా మీరు నేర్చుకున్నట్లే ఇతరులకు కూడా షేర్ చేయండి వాళ్లు కూడా తెలుసుకుంటారు. సో ఇంకేదైనా ప్రార్థనాంశాలు గానీ మీరు ఏదైనా సందేహాలు గానీ ఉంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయప్రయాసలకు పరిచర్యలకు సహాయం చేయాలి అన్నా మీ కానుకలు పంపించాలన్న స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ సహాయాన్ని పంపించి మాతో పాలిభాగస్తులుగా ఉండండి. సో ఇది ఈ వీడియోలోని అంశం మరొక అద్భుతమైన మంచి టాపిక్ తో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతిదేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమెన్

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript