[0:17]కొత్త ముక్కు కోసం ఎదురు చూస్తుంది, కొత్త ముక్కు రావాలని, ఆ తర్వాత బండకి కొట్టి కొట్టి తన రెండు కాళ్ళ పంజాలను కూడా విరగొట్టుకుంటుంది. ఎంత కష్టమైనా కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. కొంత కాలంలోనే తనకి కొత్త పంజాలు, కొత్త ముక్కు వచ్చేస్తాయి. ఆ తర్వాత అంతటితో ఆగదు. ఆ పంజాలతో తన ముసలితనంగా మారిపోయినటువంటి రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈకలను కష్టతరమైన ఒకొక్కటిగా పీకేస్తుంది. పీకేసి ఎదురు చూస్తుంది కొత్త రెక్కల కోసం, మొత్తం దాదాపుగా 150 రోజుల ప్రక్రియ ఐదు నెలల పాటు కఠోర పరిశ్రమ తర్వాత కొత్త ముక్కుతో, కొత్త పంజాలతో, కొత్త రెక్కలతో ఎగురుతుంది దాదాపుగా 35 సంవత్సరాలు పడు ఆనందంగా మరీ జీవిస్తుంది. అయితే, ఆ 40 సంవత్సరాల వయసులో మరి గద్దకి రెండే మార్గాలు కదా, ఇంత కఠోర శ్రమ చేస్తే కానీ మరో జీవితం లభించదు లేకపోతే మరణమే కదా. మన జీవితంలో కూడాను ఇలాంటి అనేక పరిస్థితులు వస్తుంటాయి. వదిలేస్తామా? ప్రయత్నించి కష్టపడి ముందుకు వెళ్తామా? ప్రయత్నించి కష్టపడి ముందుకు వెళ్తామా? ప్రయత్నించి కష్టపడి ఫలితాలు మనకి లభించాలంటే, మరో జీవితం మనకి లభించాలంటే ఉన్నతమైన జీవితం లభించాలంటే కఠోర పరిశ్రమ మనకి తప్పదు. అలాంటి పరిస్థితి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అయితే, మరి ఇక్కడ తన యొక్క పాతవి అన్ని వదిలేసింది. పాతవన్నీ విరగ్గొట్టేసింది. కొత్త వాటి కోసము. మన జీవితంలో కూడాను గత చేదు అనుభవాలు బహుశా అయ్యుండొచ్చు మనల్ని ఆపేసేవి. ఆ చేదు అనుభవాలు మన జీవితాన్ని ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నాయేమో అలాంటి వాటిని తెంచివేయాలి వదిలివేయాలి. పాత ఆలోచనలను వదిలివేయాలి. కొత్తదనంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు కూడా కొత్త జీవితము ఉన్నతమైన జీవితం. అయితే సోదరులారా, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించొచ్చు మీకు స్క్రీన్లో. ఇండియా, పాకిస్తాన్ అనగానే అందరూ లేచి ఇలా చూశారు ఏం జరుగుతుంది ఇండియా, పాకిస్తాన్ మధ్యలో అనేసి. ఇండియా పాకిస్తాన్ మధ్యన క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. అది ఎప్పుడంటే 1989లో. 1989లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. అది లాస్ట్ డే. మ్యాచ్ నడుస్తుంది. పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించండి. పరిస్థితి ఎలా ఉందంటే ఆ క్రికెట్ మ్యాచ్లో అయితే డ్రా అవ్వాలి లేకపోతే ఇండియా ఓడిపోతుంది అలాంటి పరిస్థితి. మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ నడుస్తుంది, మ్యాచ్ నడిచిన పరిస్థితి ఎలా వచ్చిందంటే దాదాపుగా వన్ సైడెడ్ మ్యాచ్. వన్ సైడెడ్ గా వచ్చేసింది. పూర్తిగా ఇండియా ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చేస్తుంది. పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారో వసీమ్ అక్రమైనా కానీ వఖార్ యూనుస్, వఖార్ యూనుస్, వసీమ్ అక్రమ్ ఫాస్ట్ బౌలర్స్ ముందు ఇక్కడ పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ కూడా నిలబడలేకపోతున్నారు ఔట్ అయిపోతున్నారు. అజారుద్దీన్, శ్రీకాంత్, రవిశాస్త్రి. పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్.
[2:53]అజారుద్దీన్, రవిశాస్త్రి, శ్రీకాంత్ లాంటి పెద్ద దిగ్గజాలు కూడా ఔట్ అయిపోయారు. ఇంకా మ్యాచ్ని కాపాడే వాళ్ళు ఎవరు అంటే ఎవరు కూడా పెద్ద బ్యాట్స్మెన్స్ ఎక్కడ కనపడడం లేదు. అలాంటి పరిస్థితిలో ఒక 16 సంవత్సరాల యువకుడు గ్రౌండ్ లో దిగుతున్నాడు బ్యాట్ పట్టుకొని. ఎలాంటి పిచ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్లేయర్ అంటున్నాడు ఇంత ఫాస్ట్ పిచ్ ని నేను ఎప్పుడూ చూడలేదు. వచ్చేటటువంటి బాల్ ఎట్లా వస్తుందంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వస్తుంది. అలాంటి ఫాస్ట్ పిచ్. మరి అక్కడ ఆ 16 సంవత్సరాల బాలుడు వచ్చాడు నిలబడ్డాడు. మ్యాచ్ పూర్తిగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వఖార్ యూనుస్ బౌలింగ్ చేస్తున్నాడు బాల్ వదిలాడు అది స్పీడ్ గా వచ్చేసి బౌన్స్ అయింది బౌన్స్ అయినటువంటి ఆ బాల్ వచ్చేసి ముక్కు మీద పోయింది. ముక్కు అదిరిపోయింది. కళ్ళు తిరిగిపోయాయి ఆ బాబు అక్కడ పడిపోయాడు. మొత్తం రక్తసిక్తమైపోయాడు. ముక్కు నుంచి కారుతుంది రక్తం. గ్లౌజుల్లో, చేతుల్లో, బ్యాట్ మీద, తన డ్రెస్ మీద మొత్తం రక్తమే కళ్ళు తిరుగుతున్నాయి. ఇది చూసి అక్కడ ఉన్నటువంటి ఫిజియోథెరపీస్ట్ పరిగెత్తుకుంటూ గ్రౌండ్ దగ్గరకు వచ్చేసాడు. కాటన్ తీసుకొని తన ముక్కును అదిమి పట్టేసాడు రక్తం కారుతుంటే. ఆ పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ కూడా ఏం జరిగిపోయిందో అని చెప్పి అక్కడ దగ్గరికి పరిగెత్తుకుంటూ చూస్తున్నారు. ఆ గ్రీజ్ కి అటువైపు బ్యాట్ పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు సిద్దు కూడా నడుచుకుంటూ తొందర తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు సిద్దు. ఏం జరిగింది ఏం జరిగింది చూస్తే మొత్తం రక్తసిక్తమైపోయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో సిద్దు అంటాడు నువ్వు ఓ పని చెయ్ ఇంత పెద్దగా ఇంజ్యూర్ అయిపోయావు నువ్వు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అంటే లేదు లేదు అంటున్నాడు అతను. ఒక వైపు నుంచి రక్తం కారుతుంది కళ్ళు తిరుగుతున్నాయి లేదు లేదు అంటున్నాడు ఆ బాబు. లేదు కనీసం ఒక పని చెయ్ పెవిలియన్లోకి వెళ్ళేసి రెస్ట్ తీసుకో. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత గ్రౌండ్లోకి వద్దు కానీ ఈ లోపల ఫేస్ బౌలర్స్ అయిపోతారు ఫాస్ట్ బౌలర్స్ అయిపోతారు తర్వాత వచ్చి నువ్వు ఆ ఈజీగా ఆడుకోవచ్చు ముందు బయటికి వెళ్ళి అంటే అతను మౌనంగా ఉంటాడు. వెనక నుంచి పట్టుకొని ఫిజియోథెరపిస్ట్ లేపుతున్నాడు పద పెవిలియన్లోకి వెళ్ళా రెస్ట్ రూమ్ లోకి పోదాం అని. అతను అప్పుడు అంటాడు ఒక రెండో రెండు పదాలు పలుకుతాడు ఆ రెండు పదాలు భారతదేశ చరిత్రే కాదు భారతదేశాన్ని కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసాయి. ఏమిటది అతను అంటాడు నేను ఆడతాను. నేను ఆడతాను నేను సైతం ఆడతాను అన్నాడు. నెక్స్ట్ బాల్ వఖార్ యూనుస్ బాల్ వేస్తున్నాడు. 150 కిలోమీటర్ల స్పీడ్ తో బాల్ వస్తుంది. ఈ 16 సంవత్సరాల బాబు బ్యాట్ పట్టుకున్నాడు ఒక్క షాట్ ఇచ్చాడు ఫోర్ వెళ్ళిపోయింది. అప్పటివరకు ఏ ఒక్కరు కూడా వఖార్ యూనుస్ కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం చేసేవారు ఎవరు లేరు అప్పుడు 16 సంవత్సరాల కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూశాడు. ఆ మ్యాచ్ ఓడిపోకుండా మ్యాచ్ ని డ్రా చేస్తాడు ఓడిపోకుండా ఆ మ్యాచ్ ఇండియా మ్యాచ్ ని కాపాడుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి ఆ పడిపోయినటువంటి ఆ బాలుడు పడిపోయినటువంటి బాలుడు ముందు రెండు దారులు ఉన్నాయి. అతను పెవిలియన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఎవరు అతన్ని ఏమీ అనేవారు కాదు ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా ఏం చేస్తామో అనేవాళ్ళు. అతను 100 మందికి సమాధానం చెప్పేవాడు ఎందుకు ఆడలేదు అంటే ఎందుకు ఆడలేదు అంటే అవును కదా కరెక్టే అంటారు కానీ తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు. తనకు తానేం సమాధానం చెప్పుకుంటాడు. లేదు నేను సైతం ఆడాలి ఆ స్టార్ ఆ రోజే పుట్టాడు. ఆ రోజే పుట్టాడు. మన జీవితంలో కూడా ఈ బౌన్సర్స్ బాల్ బౌన్స్ అయి ముక్కు మీద తగిలింది ఈ బాల్ బౌన్స్ అన్నట్టుగా అనేక పరిస్థితులు మన జీవితంలో కూడా బౌన్స్ అవుతూ ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కావచ్చు, ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ కావచ్చు, మీ జీవితంలో ఒక ఇంటర్వ్యూ కావచ్చు, మీ జీవితంలో ఒక ఎగ్జామ్ కావచ్చు. అనుకోకుండా అనారోగ్యానికి గురైపోవచ్చు. అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరగొచ్చు. కాలికి చేతికి ఫ్రాక్చర్ అయిపోయి ఉండొచ్చు. మీరు బాగా ఇష్టపడేవారు మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ రిలేషన్ తెగిపోవచ్చు. మిమ్మల్ని బాగా ఇష్టపడేటటువంటి వారు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోవచ్చు. మీరు బాగా నమ్ముకున్న జాబ్ అనుకోకుండా పోవచ్చు. మీ బిజినెస్ లో గొప్ప లాస్ రావచ్చు ఏదైనా బౌన్స్ అవ్వొచ్చు పరిస్థితులు. మనం అనుకున్నట్టుగానే అన్ని ఉండవు. మరి అలా బౌన్స్ అయినప్పుడు అలా పరిస్థితుల్లో అవరోధాలు వచ్చినప్పుడు మనమేం చేస్తాం. పడినవాడు పడ్డట్టుగా ఉండిపోతామా? లేచి నిలబడతామా? లేచి నిలబడతామా? పరిస్థితులు ఎలా ఉంటాయి? పరిస్థితులు రకరకాల పరిస్థితులు మన జీవితంలో. పరిస్థితులు మానవుడిని ఏం చేస్తాయి స్ట్రాంగ్లీ మెంటల్గా చేస్తాయా మెంటల్లీ స్ట్రాంగ్ గా చేస్తాయా? మానసికంగా పూర్తిగా బలహీనంగా పడేస్తాయా? మానసికంగా బలవంతుడిగా తయారు చేస్తాయా? ఒక పరిస్థితి అదే పరిస్థితిలో ఒక మానవుడు మానసికంగా ధైర్యాన్ని కోల్పోతున్నాడు. అదే పరిస్థితి ఒక మానవుడు నిలబడుతున్నాడు ధైర్యంగా. లేదు అని లేచి నిలబడుతున్నాడు. విన్నర్స్ ఒక్కసారి కాదు వందసార్లు పడ్డా లేచి నిలబడతారు నిలదొక్కుకుంటారు. లూజర్స్ ఏం చేస్తారు? పడ్డారంటే పడడానికి కదా అని చెప్పేసి పెవిలియన్లోకి వెళ్ళిపోతారు. పరిస్థితులు వచ్చాయి ఏం చేస్తాం? అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు బ్రేక్స్ యు నా మేక్స్ యు నా. కష్టతరమైన పరిస్థితులు వచ్చాయి. ఏమవుతుంది మీరు మేక్స్ యు నా బ్రేక్స్ యు నా? అది మిమ్మల్ని విరగ్గొడుతుందా నిలబెడుతుందా? దాన్ని చూసి మీరు వదిలి పారిపోతారా ఆ కష్టాన్ని చూసి మీరు గెట్ అప్ స్ట్రాంగ్గా నిలబడతారా?
[7:40]అలాంటి పరిస్థితుల్లో మీరు హోప్లెస్గా నిరాశ చెందుతారా లేక అంతులేని ఆశలు మీకు కనబడతాయా? లేదు చాలా అవకాశాలు ఉన్నాయి చాలా అవకాశాలు కనిపిస్తాయా? ఒకసారి ఆలోచించండి ప్రయత్నాలు ఏడ్చుకుంటూ కూర్చుంటారా? ప్రయత్నించుకుంటూ ముందుకు వెళ్తారా? క్రైయా, ట్రై నా? నేను సైతం అనేవాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాడు అతన్ని అతను నిలబెడుతుంది అతను ప్రయత్నించుకుంటూ ముందుకు వెళ్తాడు. అయితే, నేను సైతం నేను చేయగలను అనేది ఏంటి అది? ఇది ఆత్మవిశ్వాసం. ఒక మనిషికి ఉండాలా వద్దా? ఉండవలసిందా లేదా? నేను చేయగలను నా వల్ల సాధ్యమే ఇది చేయగలుగుతాను ప్రయత్నిస్తే సాధ్యమే అన్నది ఇది నేను సైతం అన్న ఆలోచన ఒక మనిషికి ఉండవలసినటువంటి ఆత్మవిశ్వాసము. ఇది మానవుడికి ఉండాలి మరి ఇది నేను నా అంతటివాడే లేడు నేనంటే ఏమనుకుంటున్నావ్ నేను మాత్రమే చేయగలను అనేది ఏమిటది? ఇది అహంకారం. కావాల్సింది ఆత్మవిశ్వాసమా అహంకారమా? ఆత్మవిశ్వాసం మానవుడిని ముందుకు తీసుకెళ్తుంది. అహంకారం మానవుడిని లోపలికి తొక్కిస్తుంది పాతాళానికి.
[8:43]నువ్వు చేయగలవు నువ్వు మాత్రమే చేయగలవా? కాదు నీతోపాటు వేరేవాడు కూడా చేస్తాడేమో నేను చేయగలను నేను సైతం నేను మాత్రమే చేయగలను అంటే అది అహంకారం. నేను చేయగలను నా వల్ల అవుతుంది. నా వల్ల మాత్రమే అవుతుంది అహంకారము. మరి ఈ అహంకారం ఎలాంటిదంటే ఒక అహంకారంతో మానవుడు ఏమైపోతాడు అంటే ఇనుముకు తుప్పు పడితే ఆ తుప్పు ఇనుమును ఎలా తినేస్తుందో చెక్కకు చెదలు పడితే ఆ చెదలు చెక్కను ఎలా తినేస్తుందో మనిషికి అహంకారం వస్తే మనిషిని అహంకారం అలా తినేస్తుంది వాడు నాశనం అయిపోతాడు.
[9:17]అయితే, ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి దారి? ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసంగా జీవితం గడుపుతున్నాడు చూస్తూ చూస్తూ చూస్తూ ఆ ఆత్మవిశ్వాసం కాస్త అహంకారంగా మారిపోతుంది గర్వం వచ్చేస్తుంది రాకుండా ఉండాలంటే ఏంటి దారి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి? ఆత్మవిశ్వాసంలోనే ఆపుకోవాలి మనల్ని అహంకారం దాకా తీసుకువెళ్లకూడదు అంటే ఏమి చేయాలి ఏంటి దారంటే ఒక గొప్ప వాస్తవాన్ని తెలుసుకోవాలి ఆ వాస్తవం ఏంటో తెలుసా? ఏంటది నేను ఏది సాధించినా ఏది చేయగలిగినా దేని ద్వారా దేవుడు నాకు ప్రసాదించిన ఈ నైపుణ్యతల ద్వారా దేవుడు నాకిచ్చిన ఈ శక్తి ద్వారా దేవుడు నాకు ఇచ్చేటటువంటి మేధాశక్తి ద్వారా దేవుడు నాకు చాలా నైపుణ్యతలు ఇచ్చాడు.
[9:56]వాటిని మెరుగుపెడుతున్నాను అదే అంటారు నీలో దాగి ఉన్న నైపుణ్యతను వెతుకు అంటారు. దాగి ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు పుట్టించిన నీ సృష్టికర్త నీకిచ్చాడు. దాన్ని వెతుకు. అంటే ఈ నైపుణ్యతలు దేవుడు నాకు ప్రసాదించాడు కాబట్టి ఆ దైవానికి సృష్టికర్త నా దైవానికి కృతజ్ఞతలు తెలపాలి. మనల్ని పుట్టించినటువంటి ఆ దైవానికి కృతజ్ఞతలు తెలపాలి. ఈరోజు నేను ఇంత గొప్ప పని చేస్తున్నాను అంటే ఇంత గొప్ప పని చేయడం కోసం దేవుడు నాకు ఒక నైపుణ్యతను ఇచ్చాడు ఆ నైపుణ్యతను నేను గుర్తించి దాన్ని సాధన పట్టి దాన్ని మెరుగుపెట్టి ఈ సైగ రాగలిగాను అసలా నైపుణ్యతే లేకపోతే లేదు కదా అంటే మేము కాదు నేను చేస్తున్నాను నాకు ఈ చేసే శక్తిని దేవుడు ప్రసాదించాడు. దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్న వ్యక్తి ఆత్మవిశ్వాసంతో నిలబడి ఉంటాడు. లేదు సమస్తము నేనే అంటే వాడు అహంకారంలో పడిపోతాడు. కాబట్టి మరి ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కి నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆ దైవం ఇచ్చినటువంటి శక్తి ద్వారానే నేను ఈరోజు నిలబడ్డాను. నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఆ దైవమే కదా ఇంకా ఈ మాట్లాడే శక్తిని ఇవ్వకలేకపోతే ఆ దైవమే కనక నాకు ఈ తెలివితేటలు ఇవ్వకపోతే ఆ దైవమే కనుక నాకు ఈ నైపుణ్యతలు ఇవ్వకపోతే నేను వీటిని స్థాన పట్టితే వాడినే కాదు నేను ఈ స్థాయికి వచ్చి మీ ముందు ఏదో మాట్లాడేవాడిని కాదు. కాబట్టి సృష్టికర్త నా దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మరియు ఈ రోజు ఇంత గొప్ప అవకాశం నాకు కలిపించినటువంటి మన షెఫ్ యాదిగిరి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
[11:22]వారు నాకేంటి అని ఆలోచించినట్లయితే మరొక బిజినెస్ చేద్దామా మరొక కస్టమర్ కోసం వెతికేవారు నాకేంటి కాదు మేమెలా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అన్న ఆలోచనతో వారు అందరి కోసము ఈ వర్క్ షాప్ని ఏర్పాటు చేసి తిరిగింది. మరి ఈ స్నేహబంధం ఏదైతే యాదిగిరి గారితో మాతో ఏదైతే స్నేహబంధం ఉందో ఇది ఇంకా ముందుకు వెళ్తుంది అనేసి అనేకమంది జీవితాలలో వెలుగులు నింపడం కొరకు కలిసి మనం పని చేద్దాం అనేసి నేను వారికి మాట ఇస్తూ ఆ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి అదే విధంగా ఈ ఇన్స్పిరేషన్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఇన్స్పిరేషన్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కంటిన్యూగా మీరు చూడాలంటే నా పేజ్ ఉంది బ్రదర్ షఫీ పేరుతో దాన్ని లైక్ చేయండి ఫేస్బుక్లో ఫేస్బుక్లో బ్రదర్ షఫీ పేజ్ ఉంది దాన్ని మీరు తప్పకుండా లైక్ చేయండి. వచ్చిన ప్రతి వీడియో కూడా షేర్ చేయండి. ఎందుకంటే తెలుసుకోవడం గొప్ప కాదు తెలుసుకున్నది ఆచరించాలి. ఆచరించడం గొప్ప కాదు ఆచరించి నలుగురికి పంచడం అది గొప్ప. కాబట్టి పేజ్ ని లైక్ చేయండి వచ్చిన వీడియోస్ తప్పకుండా చూడండి వాటిని మీరు షేర్ చేయండి. మీలో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది 10 మంది కూడా ఇన్స్పిరేషన్ ని పంచండి థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ అల్హందులిల్లా.



