Thumbnail for 100 Targets in 10 Minutes: Lebanon Hit by Wave of Israeli Strikes | NTV Digital Exclusive by NTV Telugu

100 Targets in 10 Minutes: Lebanon Hit by Wave of Israeli Strikes | NTV Digital Exclusive

NTV Telugu

3m 13s357 words~2 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[0:00]శాంతి ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే అక్కడి ఆకాశం నుంచి మళ్ళీ నిప్పుల వర్షం కురిసింది.
[0:00]కానీ లెబనాన్ పై ఇజ్రాయిల్ చేసిన దాడులు చూస్తే మాత్రం అసలు పీస్ డీల్ అమలులోకి రాలేదేమో అనిపించింది.
[0:59]ఈ ఒప్పందం ఇరాన్ తో ఉన్న ఘర్షణకే పరిమితమని లెబనాన్ ఇందులో భాగం కాదని తేల్చి చెప్పాయి.
[0:59]అప్పటి నుంచి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ నెల మళ్ళీ యుద్ధం చూసే పరిస్థితి వస్తూనే ఉంది.
Use this transcript
Related transcript hubs

[0:00]10 నిమిషాల్లో 100 దాడులతో లెబనాన్ అల్లకల్లోలంగా మారింది. శాంతి ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే అక్కడి ఆకాశం నుంచి మళ్ళీ నిప్పుల వర్షం కురిసింది. బీరూట్ మీద పొగ మబ్బులు కమ్ముకున్నాయి. సైరన్ల కేకలు గాలిలో నిండిపోయాయి. ఇల్లు కూలిపోతున్న శబ్దం కంటే గుండలు పగిలిపోతున్న శబ్దమే ఎక్కువగా వినిపించింది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య రెండు వారాల పాటు శాంతి ఒప్పందం జరిగిందని ప్రపంచం నమ్మింది. కానీ లెబనాన్ పై ఇజ్రాయిల్ చేసిన దాడులు చూస్తే మాత్రం అసలు పీస్ డీల్ అమలులోకి రాలేదేమో అనిపించింది. ఒకవైపు ఒప్పందాలు మరోవైపు బాంబులు. ఒకవైపు మాటలు మరోవైపు మృతదేహాలు. ఇలా 250 మందికి పైగా ప్రాణాలు క్షణాల్లో మాయమయ్యాయి. 837 మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. జీవితం ఒక్కసారిగా సిధిలాల కింద నలిగిపోయింది. ఇంతకీ సీస్ ఫైర్ అమలులో ఉన్నా కూడా లెబనాన్ పై ఇజ్రాయిల్ ఎందుకు విరుచుకు పడింది? ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరానికి కారణం ఏంటి?

[0:59]నిజానికి సీస్ ఫైర్ ఒప్పందం విషయంలోనే ఇరు వర్గాలు వేరు వేరుగా మాట్లాడాయి. లెబనాన్ కూడా ఒప్పందంలో భాగమేనని ఇరాన్ పాకిస్తాన్ ఆ ఒప్పందంలో స్పష్టం చేశాయి. అంటే యుద్ధం ఎక్కడ జరుగుతున్నా ఆగాలన్నది వారి భావన. అయితే అమెరికా ఇజ్రాయిల్ మాత్రం పూర్తిగా భిన్నంగా స్పందించాయి. ఈ ఒప్పందం ఇరాన్ తో ఉన్న ఘర్షణకే పరిమితమని లెబనాన్ ఇందులో భాగం కాదని తేల్చి చెప్పాయి. ఇలా ఒకే ఒప్పందం కానీ రెండు వేరువేరు అర్ధాలు అదే ఇప్పుడు రక్తపాతానికి కారణమైంది. నిజానికి లెబనాన్ ను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన కారణం ఉంది. లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా తో ఇజ్రాయిల్ కు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఇరాన్ మద్దతుతో పెరిగిన హిజ్బుల్లా ఇజ్రాయిల్ పై ఈ యుద్ధంలోనూ దాడులకు దిగింది. దీనికి ప్రతికారంగా ఇజ్రాయిల్ టైం చూసి దెబ్బ కొట్టింది. అయితే ఈ వైరానికి మూలాలు ఇప్పుడే మొదలవ్వలేదు దశాబ్దాల క్రితమే ఈ కథ ప్రారంభమైంది. లెబనీస్ సివిల్ వార్ సమయంలో దేశం పూర్తిగా అస్థిరత్వంలోకి జారిపోయింది. అదే సమయంలో హిజ్బుల్లా లాంటి శక్తులు ఎదిగాయి. తర్వాత 2026 లెబనాన్ వార్ ఈ విభేదాలని మరింత తీవ్రతరం చేసింది. అప్పటి నుంచి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ నెల మళ్ళీ యుద్ధం చూసే పరిస్థితి వస్తూనే ఉంది. పేర్లు మారుతున్నాయి కారణాలు మారుతున్నాయి కానీ రక్తం మాత్రం అదే విధంగా పారుతుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కథకు కొత్త అధ్యాయం. ఒకవైపు ఇజ్రాయిల్ తన భద్రత పేరుతో దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ తన ప్రభావాన్ని విస్తరించడానికి లెబనాన్ ను వేదికగా ఉపయోగిస్తోంది. మధ్యలో చిక్కుకున్నది మాత్రం సాధారణ ప్రజలే. యుద్ధం దేశాల మధ్య జరుగుతున్నట్టే కనిపించినా దాని భారాన్ని మోస్తుంది మాత్రం ఇల్లు కోల్పోయిన కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన నిరపరాధులేనని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 20న మొదలైన యుద్ధంలో 1500 మందికి పైగా లెబనాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది తమ ఇళ్ళను వదిలి పారిపోయారు. సీస్ ఫై ప్రకటించిన తర్వాత తిరిగి వస్తామని ఆశించిన కుటుంబాలు మళ్ళీ నిరాశతో ఎదురుచూస్తున్నాయి. ఇలా పెద్ద దేశాలు తీసుకున్న నిర్ణయాల ధర ఎప్పటికీ చిన్న దేశాలే చెల్లించాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఏ వర్గం నుంచి సమాధానం మాత్రం లేదని చెప్పాలి.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript