Thumbnail for తన కోసం కాదు తన వాళ్ల కోసం బ్రతికే వాడే నిజమైన hero#menreality#telugushorts#shortsviral#trending#fyp by MileswithPrash

తన కోసం కాదు తన వాళ్ల కోసం బ్రతికే వాడే నిజమైన hero#menreality#telugushorts#shortsviral#trending#fyp

MileswithPrash

1m 4s135 words~1 min read
Auto-Generated

[0:00]మగాడు తన బాధను నవ్వు వెనుక ఎందుకు దాచుకుంటాడో తెలుసా? ఒక వయసు వచ్చాక అతనికి సొంత ఇష్టాల కంటే బాధ్యతలే లోకమవుతాయి. నాకు ఇది కావాలి అని అడిగే స్థాయి నుండి నా వాళ్ళందరికీ అన్ని ఉన్నాయా అని చూసుకునే స్థాయికి అతను తెలియకుండానే ఎదిగిపోతాడు. లోపల ఎన్నో అనిచివేసిన కలలు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నా జేబులో ఉన్న ₹100 రూపాయలను తన కోసం వాడుకోవడానికి వెయ్యి సార్లు ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో స్వార్థం లేదు తన వారిని లోటు లేకుండా చూసుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉంటుంది. బయట ప్రపంచం ఎంత అవమానించిన ఇంటి గడప దాటగానే వాటన్నింటిని మర్చిపోయి నవ్వాలి. ఎందుకంటే అతను నీరస పడితే చేతకాని వాడని ఏడిస్తే బలహీనుడని ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది. తన కలలన్నీ బాధ్యతల కింద సమాధి అయిపోయినా పర్వాలేదు. కానీ తనను నమ్ముకున్న వారి కళ్ళల్లో చిరునవ్వు మాత్రం చెదిరిపోకూడదు. మనసు విరిగిపోయినప్పుడు కూడా నేను బాగున్నాను అని చెప్పే ఆ అబద్ధం వెనుక ఒక అంతులేని సముద్రమంత ధైర్యం ఉంటుంది. తన భుజాల మీద ఒక ప్రపంచాన్ని మోస్తూ ఓటమి అంచున ఉన్న తన వారి కోసం గెలవాలని ఆరాటపడే ప్రతి మగాడు ఒక నిజమైన యోధుడు.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript