[0:00]సిలువను గూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఒకటి కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూ.పి.ఎఫ్. నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026, ఫిబ్రవరి 23వ తారీకు నుండి ఏప్రిల్ 3వ తారీకు వరకు ఉ॥ 4 గం||ల నుండి 7 గం||ల వరకు. స్థలం : మెననైట్ బ్రదరన్ బేతేల్ చర్చి, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యు.పి.ఎఫ్. హైదరాబాద్. YouTube, Instagram, Facebook మరియు Zoom ద్వారా ప్రత్యక్ష ప్రసారం. Zoom మీటింగ్ ఐడి: 9550504718 పాస్ కోడ్ : 7777. వివరములకు : 9550504718 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి. 40 రోజుల సిలువ ధ్యాన దినాల్లో మొదటి రోజు మేము ప్రవేశించినాము. నీ అనాది సంకల్పం అని మేము ఒప్పుకుంటున్నాము. మా పట్ల నీ ప్రేమ అపారమైనది గొప్పది. వివరించలేనిది వర్ణించలేని ప్రేమ కొరకు వందనాలు. పాపులమై యుండగాను మమ్మును ప్రేమించినావు. ఈ పరిశుద్ధ మార్గంలో మమ్మల్ని నిలిపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మరి ఈ రోజు చేరి వచ్చిన నీ బిడ్డలందరి కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అనుభవించి విసికి వేసారి కృంగిపోయి నిరాశా నిస్పృహలతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. శరీరంలో ఆరోగ్యం లేకుండా వైద్యులు ఆశ్రయించి వేసరిపోయిన మరి వారి కొరకు కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. రక్షణా ఆనందం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృంగిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. పాపంలో పడిపోయిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి నీ కరము చాపి ప్రతి ఒక్కరిని తాకి వాక్యం ద్వారా స్పందించి జీవ వాక్యము వారి హృదయంలోకి స్వీకరించడానికి కృప దయచేయండి. నీ వాక్యము మాకు మరి తండ్రి ఆధారమై ఉంది. నీ వాక్యము మమ్మును బలపరుస్తుంది. నీ వాక్యము మమ్మును శ్రమ దినమున బ్రతికిస్తుంది. నీ పరిశుద్ధమైన వాక్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. నీ దాసురాలు దేవుని వాక్యాన్ని వెదజల్లుచుండగా నాయనా హృదయాలు సిద్ధపరచుకొని వాక్యాన్ని స్వీకరించడానికి మరి ఆ సిద్ధ బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యము నీవు తండ్రి మాకు పంపుమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము వెళ్ళడి అవుట తోడనే చీకటిలో వెలుగు కలుగుతుంది గనుక నీకు వందనాలు. మరి దాసురాలను నీ సిలువ చాటున మరుగుపరచుకొని చక్కని వర్తమానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్. చేతులెత్తి మన దేవుని స్తుతిద్దాం హల్లెలూయ. సిలువ ధ్యాన దినాలు ఈ రోజు ఆరంభిస్తున్నాము. మనము ఈ గొప్ప కార్యాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాము.
[3:22]ఇది దేవుని అద్భుతమైన ప్రణాళిక అని నేను గ్రహిస్తున్నాను. 2012 నుండి దాదాపు 14 సంవత్సరాలు సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో మనము 40 రోజుల సిలువ ధ్యానములు జరిగించినాము. చాలా అద్భుతంగా జరిగింది. ఒక రెండు సంవత్సరాల నుండి రెండు దఫాలుగా సంవత్సరానికి రెండు సార్లు సిలువ ధ్యానాలు 40 అలాగే ప్రభాత ప్రార్థనలు 40 అని మరి ఫిబ్రవరి మార్చ్ అలాగే నవంబర్ డిసెంబర్ లో రెండు సార్లు మనం ప్రజలకి ఇలాగ ఉపవాస దినాలు ప్రకటిస్తూ వారిని మరి ఆధ్యాత్మికంగా పునరుద్ధరిస్తూ ఉజ్జీవింప చేస్తూ దేవుని పరిశుద్ధమైన వాక్యం తట్టు మళ్ళిస్తున్నాము. ఇది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ యొక్క దర్శనమై ఉన్నది. ఇలాగూ దాదాపు 30 సంవత్సరాల నుండి మనం ఈ కార్యాన్ని జరిగిస్తున్నాము. సిలువ తప్ప మరొక మార్గం లేదు ఒక మనిషి మారుమనసు పొందాలంటే ఒక వ్యక్తి మార్పు నొందాలంటే అది సిలువ మార్గంలోకి రావాలి. సిలువను తీక్షణంగా చూసినప్పుడే ఒక కఠిన హృదయం మెత్తనిదిగా మారిపోతుంది. మరి మన దినదిన జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఇక్కట్లు శోధనలు రోగములు అపాయాలు ప్రమాదాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. కానీ ఎప్పుడైతే సిలువను గురిగా పెట్టుకున్నప్పుడు యేసు ప్రభువు చేసిన బలియాగం త్యాగం చూపిన గొప్ప ప్రేమ ఇవన్నీ మనం తీక్షణంగా సిలువ ఎంతకు చేరి ఆయన వైపు చూసినప్పుడు మన ప్రాణములు తేలికగైపోతుంది. మనము విసగకుండా మనం అలసిపోకుండా పాపాత్ములు ప్రభువుకు చేసిన ఆ తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆ ప్రభువును తలంచుకోవడం ద్వారా మనం ఆ సిలువ శక్తిని మన జీవితంలో పొందుకుంటున్నాం. మరి ఎందుకు సిలువ ధ్యానాలు అని కొంతమంది అడుగుతారు. సిలువ ధ్యానాలు అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా అని అడుగుతారు. 40 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో మాటిమాటికు దాదాపు 150 పర్యాయముల కంటే ఎక్కువగా ఉంది. 40 రోజులు ఒక ప్రాముఖ్యమైన సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో. ఉపవాసం కూడా పాత నిబంధనలో ఉంది క్రొత్త నిబంధనలో ఉంది. ఉపవాసించిన భక్తులు కోకొల్లలుగా ఉన్నారు. మరి సిలువ యేసు నందు విశ్వాసం ఉంచు ప్రతి విశ్వాసికి శక్తిని ఇస్తుందని మనకు తెలుసు అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది.
[6:27]ఎందుకు ఉదయ కాలం సాయంకాలం పెట్టుకోవచ్చు కదా అంటే దానికి కూడా జవాబు ఉంది. వేకువనే దేవుని వెదకాలని 63 వ కీర్తన మొదటి వచనం ఐదో కీర్తనలో ఉదయాన్నే నా కంఠ స్వరము నీకు వినిపిస్తానని వేకువ లేచి దేవుని వెతుకు వారు అది కూడా యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో అన్నాడు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. ఒక దినం ప్రారంభం కాకముందే సూర్యుడు ఇంకా ఉదయించకముందే మనం దేవుని వైపు మళ్తే మనకు సాధించలేని కార్యం ఉండదు. మనకు దొరకని ఆశీర్వాదం అంటూ ఉండదు. అది నా అనుభవం. ఎందుకంటే when we rise up early ఉదయమే లేచినప్పుడు మనం దేవునికి ఘనతను ఇస్తున్నాము. We are honoring God. అది కూడా ఒక సేవ. సేవ అంటే కేవలం ప్రసంగాలు చేయడం కాదు. నీవు నిన్ను నీవు సమర్పించుకొని నీ శరీరాన్ని అనుకూలపరచుకొని ఉదయాన్నే లేచి నీవు పరిశుద్ధాలయానికి వచ్చినావు అంటే అది కూడా ఒక సేవ అది దేవునికి ఘనతనిస్తుంది. మీకు అర్థమైతే చప్పట్లు కొట్టండి. You are honoring God. నువ్వు ఉదయం లేస్తున్నావు అంటే దేవుని వెతుకుతున్నావు అది దేవుని ఘనపరుస్తున్నావు. నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఇలాంటి ఒక ఆత్మీయ క్రమశిక్షణ క్రైస్తవ ప్రపంచంలో తీసుకొని రావడం నా దర్శనం. మరి దాదాపు 30 సంవత్సరాలు పైగా ఈ సిలువ ధ్యాన దినాలు నిర్వహిస్తున్నాము. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కు గొప్ప జనాభా పడటానికి వారిని ఎక్ముడేట్ చేయడానికి స్థలం ఇంత మందిరం లేదు. రామ్ నగర్ లో దాదాపు 2 300 మందిని ఎక్ముడేట్ చేయవచ్చు. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు త్రోవలు కల్పించి అనేక పెద్ద పెద్ద సంఘాలు ముందుకు వచ్చి మరి ఆ మందిరాల్లో సిలువ ధ్యానాలు నిర్వహించడానికి ప్రభువు చేత వారు ప్రేరేపింపబడి అనుమతి ఇచ్చినారు అందుకొరకు కూడా మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో మాకు హోల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది ప్రతి నెల ఆఖరి బుధవారం. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రి జరుగుతుంది. చాలా మంది అన్న అడుగుతారు మీరు ఆదివారం ఎందుకు బ్రేక్ ఇవ్వరని. 40 రోజులు ఏకధాటిగా మరి ఇలాగు బ్రేక్ లేకుండా ఆదివారం కూడా బ్రేక్ లేకుండా అది at a stretch జరగాలనేది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. ఎందుకంటే చాలా మంది ఉపవాసం ఉంటారు. ఆదివారం బ్రేక్ చేస్తారు. మరి అది అంత అనుచితము కాదని నాకు అనిపిస్తుంది. మనము గురి యొద్దకు పరిగెత్తుతున్నాం గురి కలిగి ప్రార్థన చేస్తున్నాం. మనం మన శరీరాలను అణచుకొని దేవునికి సమీపంగా వస్తున్నాం. ఆత్మ కార్యము మన కుటుంబాల్లో జరగాలని ఆశిస్తున్నాం. మన ప్రార్థనలకు జవాబు కావాలని మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఏకదాటిగా చేయడం అది దేవుని చిత్తమని నేను గ్రహించి ఇలాగు కంటిన్యూస్ గా 40 రోజులు ఉదయం ఏర్పాటు చేసినాను. ఇది దేవుని చిత్తం ఎందుకంటే మరి దేవుడు నాకు ఇచ్చిన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనే పరిచర్యలో నేను అద్భుతాల పరంపర చూసినాను. I have seen miracles in the ministry because of this morning prayers. ఉదయాన్నే లేచి దేవుని వెదకడం అది చాలా గొప్ప భాగ్యం అని అదొక తర్బీద్ అని ఒక ఆత్మీయ మరి నేర్పరితనం అని దానిలో ప్రభువు మహిమ పొందుతున్నాడని ప్రభువు దృష్టి అలాంటి వారి మీద ఉంటదని వారి ప్రార్థనలకు వెంట వెంటనే జవాబు రావడం ఇవన్నీ నేను చూస్తున్నాను. సాక్ష్యాలు చెప్పాలంటే కోకొల్లలుగా ఉంది. ఐదు వాల్యూమ్స్ ప్రింట్ చేసినాం. ఇంకా తీరడం లేదు. మరి ఇలాగు దైవ కార్యము క్రీస్తు శరీరమనబడు ఆయన సంఘములో జరుగుతూనే ఉంది. ప్రభువు దాసురాలుగా ఈ యొక్క సంస్థను నడిపించే దేవుని దాసురాలుగా నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. నిండు ప్రేమను ప్రకటిస్తున్నాను. I love God and I love you all. దేవుని మీద ప్రేమ మీ మీద ప్రేమ లేకుంటే ఇంత ఉదయం లేసి మీ దగ్గరికి రావడం అసాధ్యం. ఆ ప్రేమ అనేది గొప్ప శక్తి నన్ను నెట్టుకుంటూ తీసుకొని వస్తుంది దైవ కార్యాన్ని. దేవునికి స్తుతి ఘనత మహిమ ఆరోపిస్తున్నాను. అలాగే మనకు ఉదయం 4 గంటలకే మీరు రండి. మీ కుటుంబాల్లో అనేకమైన అవసరతలు ఉంటాయి. వాటిని ప్రభువు దగ్గర పెట్టండి. నీ బరువు తేలికగా చేస్తాడు నీ కాడిని సులువుగా చేస్తాడు అనే వాగ్దానం మత్తయి సువార్త 11 28 29 లో మనం చూస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనిన సమస్త జనులారా మీరు నా వద్దకు రండి. నేను మీకు ఏమి ఇస్తాను విశ్రాంతిని ఇస్తాను. అది యేసు సత్య దేవుడు ఆయన పేరే సత్యం. రమ్మన్నాడు మీరు వచ్చినారు. మీ భుజముల మీద నుండి బరువు గల గంప దింపివేస్తాడు. మీ చేతులు మూత గల గంపలు మోయకుండా విడుదల పొందుతుంది. కాబట్టి ప్రభువు మాట మీద ఆశ పెట్టుకొని నమ్మి మీరు రండి. మీకు ఆయుస్సు పెరుగుతుంది. మీకు ఆరోగ్యం మెరుగుపరుస్తాడు దేవుడు. మీ కుటుంబాల్లో శాంతి సమాధానం ఇస్తాడు. ఒకవేళ మీ కుటుంబాల్లో విడిపోయిన వారు ఉంటే దేవుడు జతపరుస్తాడు. వివాహం కాకుండా ఈడు మీరిన వారికి తప్పకుండా మంచి సంబంధాలు దేవుడు ఇస్తాడు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాడు. తీరని వ్యాధులు ఉంటే దేవుడు బాగు చేస్తాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. పాపంలో పడి ఉన్న వారిని ఉద్ధరిస్తాడు. జీవితంలో విసికి వేసారిన వారిని తన ఆత్మతో నింపుతాడు. దేవుని సేవలో మిమ్మల్ని అందరిని వాడుకోవాలని నా ప్రార్థన. కాబట్టి take it seriously. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పే దైవ సేవకురాలును. నాకు మిమ్మును మెప్పియడానికి కాదు నేను చెప్పేది. దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీకు అందిస్తున్నాను. సంతోషమే కదా.
[13:03]దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఉట్టి చేతులతో ఎప్పుడూ పంపడు. మీ ఇంటికి నేను వస్తే నన్ను ఖాళీ చేతులతో మీరు పంపరు. నాకేమో మీ ఇంటికి రావడానికి సమయం లేదు. కానీ వస్తే మాత్రం ఏదో చేతులు నింపి పంపుతారు కానీ దేవ దేవుడు ఆయన సన్నిధికి వచ్చి మనల్ని ఎప్పుడూ కూడా రిక్త హస్తాలతో తిరిగి పంపడు. He will do something great. Definitely he will do something great. కనుక నమ్మాలి. దేవుని మాట వినాలి. దేవుడు ఇచ్చే పరిశుద్ధాత్మను మనం నింపుకోవాలి. అడగాలి దేవుని. ఈరోజు నా ప్రసంగ అంశం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఎఫెసీయులకు 3:19. అంటే the love of Christ transcends all human wisdom. మనుష్య జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మొట్టమొదటి దినం నేను వివరించాలని ఆత్మ ప్రేరణ కలిగింది. మరి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉన్నది. అది మీకు తెలుసు ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము 20 వ వచనంలో మనం చూస్తాం. Christ's love which is beyond human wisdom. May be able to comprehend with all saints what is the breadth and length and depth and height.



