[0:00]అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన ఆదివారం నాడు అక్షయ తృతీయ పండుగ మొదలై ఏప్రిల్ 20వ తేదీన సోమవారం మధ్యాహ్నం వరకు అక్షయ తృతీయ ఘడియలు ఉన్నాయి. పంచాంగం ప్రకారం ఏ రోజున అక్షయ తృతీయను జరుపుకోవాలి? ఈ పండుగ రోజున బంగారం వెండి కొనలేని వారు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? పూజలో అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి? అక్షయ తృతీయ పండుగకు సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు తదియ తిధి ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11 గంటల వరకు తదియ తిధి ఉంటుంది. అంటే ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్ 20వ తేదీ ఈ రెండు రోజులు పాటు అక్షయ తిధి పండుగను జరుపుకోవచ్చు. కానీ ఉదయం తిధి ప్రకారం ఏప్రిల్ 20వ తేదీన మాత్రమే అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మంది బంగారం వెండి వస్తువులు కొంటారు కానీ మన శాస్త్రంలో ఎక్కడ కూడా ఈ రోజున బంగారం కొనాలని వివరించలేదు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ బంగారం రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని కొంతమంది నమ్మకం. అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ అక్షయ తృతీయ నాడు అంటే ఏప్రిల్ 20వ తేదీ సోమవారం నాడు బంగారం కొనలేని వారు ఒక కొబ్బరికాయను కొని ఇంటికి తెచ్చి లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది అలాగే రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఈ అక్షయ తృతీయ నాడు ఒక చిన్న మట్టి కుండను కొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడట. విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు పూజ గదిలో అక్షయపాత్రను పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అక్షయ పాత్రను ఎలా తయారు చేయాలంటే ముందుగా ఒక చిన్న రాగి చెంబును తీసుకోండి లేదా ఒక చిన్న మట్టి కుండను తీసుకోండి. ఈ రాగి చెమ్ముకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ చెంబు అడుగు భాగాన బియ్యం పోసి దానిపైన కొన్ని నవధాన్యాలను కూడా పోసి ఒక రూపాయి బిల్లను పెట్టుకోండి. దీన్ని అక్షయ పాత్రగా పూజించాలి. మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన ఈ అక్షయపాత్రను పెట్టి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల వరకు అక్షయ తృతీయ ఘడియలు ఉన్నాయి కాబట్టి 11 లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. అలాగే ఈ అక్షయ తృతీయ పండుగ నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది మీ భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ విధంగా అక్షయపాత్రను పూజ గదిలో పెట్టి దీపారాధన చేస్తే మీరు ఊహించలేని సంపద వరిస్తుందట అంతటి శక్తి ఈ అక్షయ తృతీయ పూజకు ఉంటుంది. ఈ అక్షయ తృతీయ నాడు ఏ చిన్న మంచి పని చేసిన అక్షయ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఇక మీ వ్యాపారంలో ఊహించలేని లాభాలు పెరుగుతాయి అలాగే ఈ రోజున కొత్త వాహనాలు కొన్నా చాలా మంచిది. ఈ అక్షయ తృతీయ నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు చీకటిగా ఉండకూడదు ఎందుకంటే ఈ అక్షయ తృతీయ నాడు ఎన్నో అమృత ఘడియలు ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించవచ్చు. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకోండి. ఇల్లు చీకటిగా ఉండకుండా చూసుకోండి లేదంటే మీ ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి వెను తిరిగి వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు తలస్నానం చేయాలి. నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ వేళ ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు మీ బంగారపు నగలు అన్నీ పసుపు నీటితో కానీ ఆవు పాలతో కానీ శుభ్రం చేసుకోండి. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు ఇత్తడి వస్తువులను కొన్నా సరే ధనప్రాప్తి కలిగిస్తుంది. అలాగే ధాన్యలక్ష్మి స్వరూపమైన బియ్యాన్ని కొంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులతో పోలుస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే ఎంతటి కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవుతారు. ఇక ఈ పండుగ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు. అలాగే ఈ రోజున కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు డబ్బును చాలా తక్కువగా ఖర్చు చేయాలి. ఈ రోజున అనవసరపు ఖర్చులు చేస్తే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా దానాలు చేయాలి. ఈ ఒక్క రోజున చేసే దానాలకు సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందట. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి. మీ ఇంటికున్న నరదిష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా తులసిని పూజించండి. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక అక్షయ తృతీయ నాడు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు తినకూడదు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది మాంసాహారం తింటారు కానీ ఆదివారం మరియు సోమవారం ఈ రెండు రోజుల పాటు మాంసాహారాన్ని తినకండి. ఎందుకంటే ఈ రెండు రోజుల పాటు అక్షయ తృతీయ అమృత ఘడియలు ఉన్నాయి. ఇక మీ ఇంట్లో పాత చీపురు ఉంటే వెంటనే తీసేయండి అక్షయ తృతీయ నాడు కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే తలస్నానం చేసి రెండు యాలకులను బాగా దంచి అందులో కొద్దిగా గులాబీ నీరు, చిటికెడు గంధం పొడి కలిపి మెత్తగా నూరి దీన్ని మీ నుదిటిపైన బొట్టు లాగా పెట్టుకోండి. ఇలా ఎవరైతే అక్షయ తృతీయ రోజు చేస్తారో అలాంటి వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ రోజు పూజ చేసేటప్పుడు ఒక తమలపాకు పైన తడి గంధంతో "శ్రీ" అని రాసి ఆ తమలపాకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టుకోండి. లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య తరచు గొడవలు ఏర్పడుతుంటే ఈ అక్షయ తృతీయ నాడు భార్యాభర్తలిద్దరూ గులాబీ రంగు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అలాగే ఈ రోజున ఆడవారు కంటతడి పెట్టకూడదు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఆడవారు ఏడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది దీనివల్ల మీ ఇంట్లో సమస్యలు కష్టాలు ప్రారంభమవుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక ఎర్రటి వస్త్రంలో పసుపు అక్షింతలను మూట కట్టి మీ గల్లా పెట్టెలో పెట్టుకోండి. మీ వ్యాపారానికి దిష్టి తగలకుండా అఖండ లాభాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఏడు మామిడి ఆకులను కట్టి, ప్రతి ఆకుపై కుంకుమతో 'శ్రీ' అని రాయండి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది ఇంట్లో కి దుష్టశక్తులు ప్రవేశించలేవు. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు మీ పూజ గదిలో బియ్యప్పిండితో శ్రీ చక్రం ముగ్గు వేసి మధ్యలో ఒక దీపం వెలిగించండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసిన సరే కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే Like & Subscribe
[9:51]జై శ్రీరామ్



