Thumbnail for 👉 హనుమాన్ చాలీసా వెనుక అసలు కథ ఇదే 🔥 మీరు ఎప్పుడూ వినని నిజం! by PRASAD MAHARISHI SWAMIJI

👉 హనుమాన్ చాలీసా వెనుక అసలు కథ ఇదే 🔥 మీరు ఎప్పుడూ వినని నిజం!

PRASAD MAHARISHI SWAMIJI

1m 46s213 words~2 min read
Auto-Generated

[0:00]ఒకప్పుడు తులసీదాస్ గారు గంగా వద్దును నిలబడి ఉన్నారు. ఒక ఆవిడ గబగబా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. ఎప్పుడు అలవాటు మీద తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళి భవ అన్నారు. అయ్యా నన్ను దీర్ఘ సుమంగళి భవ అంటున్నారు. నా భర్త మరణించాడు అదిగో చితి మీద పడుకోబెడుతున్నారు దహన సంస్కారానికి. నీ నోట వెంట వచ్చిన మాట అబద్ధం కాకూడదు అంది ఆవిడ. నా నోట రావడం ఏంటమ్మా రాముడు పలికించాడు. ఆయన వెంటనే అక్కడికి వెళ్లి ఆ కమండలంలో నీళ్లు తీసి ఆ శవం మీద చల్లి రామనామం చెప్పారు చటుక్కున లేచి కూర్చున్నారు. ఇది చూశారు పాదుషా యొక్క గూడచారులు ఆ గంగా తీరంలో తిరుగుతూ. తులసీదాస్ గారి దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలు ఉన్నాయి ఆయన ఏవైనా చేయగలడని పాదుషాకు చెప్పారు. పాదుషా తులసీదాస్ ని పిలిపించాడు. పిలిపించింది చూడు చచ్చిపోయిన వాడిని బతికించావు కదా ఏవి కొన్ని అటువంటి వింత చేష్టితములు చెయ్యి అన్నారు. తులసీదాస్ గారు అన్నాడు వింత చేష్టితములు చేయడానికి నేను గారడి వాడిన. కాదు రాముడు నన్ను పనిముట్టుగా అనుగ్రహించాడు అది రామానుగ్రహం అన్నాడు. అంటే నేను చెప్పిన మాట పాటించట్లేదు కాబట్టి కొరడాలతో కొట్టండి అన్నాడు. అప్పుడు హనుమాన్ చాలీసా చేశారు తులసీదాస్ గారు. కళ్ళు మూసుకొని హనుమని తెలుసుకొని హనుమాన్ చాలీసా చేస్తుంటే భటులు వచ్చి కొరడాలు పట్టుకొని కొట్టడానికి పైకెత్తుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున పాదుషా కోట అంతా అంతఃపురం అంతటా పెద్ద పెద్ద కోతులు వచ్చి ప్రతి సైనికుడు చెయ్యి పట్టుకున్నాయి కదలకుండా. పాదుషా భయపడిపోయి సింహాసనం దిగి కిందకు వచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు కచ్చితంగా పూర్తి అయిపోయింది హనుమాన్ చాలీసా. ఆ తులసీదాస్ గారు చదివినప్పుడు అన్ని కోతుల రూపంలో వచ్చి ఎదురుగుండా హనుమన్ నిలబడి కాపాడారు తులసీదాస్ గారిని. అందుకే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా హనుమాన్ చాలీసాకి అంత శక్తి.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript