[0:00]శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మొన్న ఈ మధ్య ఇంట్లో హోమం ఎలా చేసుకోవాలి అనే వీడియో చేయగా చాలా మంది ఏవండీ హోమం చేయాలంటే గనక సాత్వికమైన ఆహారం తింటూ ఋషి జీవితం గడపాలని చెప్పారు కదా అయ్యో మాకు కుదరదండి మేమేం చేయాలి అని చెప్పి కొన్ని వేల మంది ఈమెయిల్స్ పంపించారట. మీరందరూ కూడా నిత్య పూజ చేసుకోవచ్చు హోమం చేయకపోయినా సరే హోమం చేస్తే ఎంత శక్తి వస్తుందో ఈ షోడసోపచార పూజ చేసినా సరే అంతే శక్తి వస్తుంది. ఈ రోజు వీడియోలో అసలు షోడసోపచార పూజ శాస్త్రోక్తంగా ఎలా చేయాలి అవన్నీ మీకు చేసి చూపిస్తాము దీంట్లో మంత్రాలు ఏమి ఉండవు కాబట్టి దీనికి గురూపదేశం నియమాలు ఏమి అక్కర్లేదు. మీ ఇంట్లో చిన్న పిల్లలకు కూడా నేర్పించి వాళ్ళ చేత కూడా హాయిగా చేయించుకోవచ్చు మీరు ఏ కులం వాళ్ళైనా చేయొచ్చు ఏ మతం వాళ్ళైనా చేయొచ్చు భగవంతుడి మీద భక్తి ఒక్కటి ఉంటే చాలు. అసలు షోడసోపచార పూజ చేయటానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇందులో మాండేటరీ ఉన్నాయి చూసారా ఆ 11 ఖచ్చితంగా కావాలి ఆ పక్కన ఆప్షనల్ ఐటమ్స్ ఐదు ఉన్నాయి చూడండి అవి ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు. ఇందులో చాలా మటుకు మనకి ఇంట్లో ఉండేవి ఒక దేవుడి పటం అలాగనే ఒక చిన్న పళ్ళెంలో ఏదో చిన్న దేవుడి విగ్రహం ఏమన్నా మన ఇంట్లో ఉన్న మూర్తి. అసలు పంచాయతనం ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచిది అంటే పంచాయతనం మీకు తెలుసు కదా విష్ణువు, శివుడు, అమ్మవారు, సూర్యుడు, గణపతి ఐదుగురు ఉంటే పంచాయతనం ఇదిగో ఇక్కడ ఈ పళ్ళెంలో ఉంది చూడండి. అలాగా అలా ఏర్పాటు చేసుకోగలిగారు అనుకోండి చాలా మంచిది అది కుదరకపోతే మీ ఇష్ట దేవత ఎవరున్నారో వాళ్ళ విగ్రహం ఒకటి కృష్ణుడో శివుడో ఎవరో ఒకటా చిన్నది పెట్టుకోండి ఒక పళ్ళెంలో. అలాగనే రెండు పంచపాత్రలు సిద్ధం చేసుకోవాలి ఒకటేమో మనకి ఆచమనం అలాంటివి రెండోది భగవంతుడికి ఉపచారాలు చేయడానికి. ఇంకా మిగతావన్నీ ఇక్కడ మీకు బొమ్మలు చూస్తే అర్థమైపోతాయి ఇప్పుడు మీకు తీర్థం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఆ రెండు పంచపాత్రల్లో ఒక పంచపాత్ర తీసుకుని దాంట్లో జలంలో తీర్థం తయారు చేయండి. పచ్చ కర్పూరం ఇలా చిన్నది తీసుకుని ఇదిగో ఇలాగ నలిచారు అనుకోండి ఆ పొడు వస్తుంది ఆ తీర్థంలో వేయండి అలాగే యాలకులు పొడి చేసి చక్కగా ఇందులో వేయండి. అలాగే ఎంత చక్కగా రెండు తులసి దళాలు కూడా వేసుకోండి వేసుకుంటే అప్పుడు మీకు ఆ తిరుమలలో తీర్థం ఉంది అచ్చం ఆ సువాసన వస్తుంది తీర్థానికి అదే దాని రహస్యం. సరే ఇంక పూజ ప్రారంభిద్దాం ఇప్పుడు మొట్టమొదట ఏ పూజకైనా గణపతి ప్రార్థనతో ప్రారంభించాలి కాబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి ఇప్పుడు జలం తీసుకుని అంటే ఆ రెండో పంచపాత్రలో తీసుకోవాలి దేవుడి కోసం పెట్టినవి కాదు దాంతో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిహి ఏమిటండీ ఇది అంటే మీరు ఎంత శుచిగా స్నానం చేసినా సరే మీ శరీరంలో ఏదో ఒక చోట ఏదో ఒక చిన్న మాలిన్యం అయినా ఉంటుంది. అలాంటివి ఏవీ లేకుండా ఈ అపవిత్ర పవిత్రోవా మంత్రం చెప్తే కనక అవన్నీ శుద్ధి అయిపోతాయన్నమాట అవి చెప్పి అప్పుడు పూజ ప్రారంభించాలి ఇప్పుడు ఆచమనం చేద్దాం. ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా మూడు సార్లు చేశాక కొంచెం జలం తీసుకుని ఆ చెయ్యి కడిగేసుకోండి ఎందుకంటే ఇంగిలి చేశారు కదా ఇప్పుడు దాని కోసం. తర్వాత ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః 24 నామాలు చదవాలి ఇవన్నీ కూడా మీకు ఒక ఆడియో చేసి పెడతాను దీని కిందే. అంటే ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అలా కాకుండా ఆడియో పెట్టుకుంటే మీరు పక్కనే పూజ చేసేయొచ్చు అలాంటి ఆడియో కూడా ఇస్తాను మీకు. అలాగనే స్త్రీలు అయితే కనక కేశవాయ స్వాహా కాకుండా కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః అని చేయాలి. దాని తర్వాత ఉత్తిష్టంతు భూత పిశాచా యేతే భూమిభారకాః ఏతేశామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటే కొంచెం జలం తీసుకుని ఈ మంత్రం చదివి ఆ జలాన్ని ఇలా వదిలేయండి పక్కకి ఇదే పక్కన భార్య కూర్చుని ఉందనుకోండి పూజ చేసేటప్పుడు అప్పుడు మధ్యలో వదులుకోండి భార్య కన్నా తర్వాత వదలాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం ఎలా చేయాలండి ఆ మధ్య ఎక్కడో ప్రాణాయామం చేయాలని అనగానే ఒక ఆవిడ వెంటనే అని మొదలెట్టేసింది రామదేవ్ బాబా గారికి నమస్కారం ప్రాణాయామానికి ఇది ముద్ర. అంటే ఈ వేలు ఇక్కడ తెరవండి ఈ రెండు వేళ్ళు ఇక్కడ తెరవండి మధ్యలో ఈ రెండు మూసేయండి మూసేసి ఇదిగో ఈ బొటన వేలుతో కుడి ముక్కుని గట్టిగా మూసేయండి లోపలికి గాలి వెళ్ళకుండా. వెళ్లి ఇప్పుడు లోపలికి గాలి పూర్తిగా పీల్చి దీన్ని మూయాలి మూసి లోపల ఉంచాలన్నమాట గాలి అంటే ఇదిగో ఇలాగ ఇది మూసారు కదా తర్వాత ఇది వదిలేయాలి ఇటు పక్క నుంచి. లోపల ఏం చదవాలండి లోపల అంటే ఓం భూహు ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మపూర్భువస్సువరోం ఆ మొత్తం గాయత్రీ మంత్రం ఆ వ్యాహృతులు అవన్నీ లోపల చదువుకోవాలి. దీన్నే పూరకం కుంభకం రేచకం అంటారన్నమాట అంటే మొత్తం నింపడం నింపిన గాలి లోపల ఉంచడం చివరికి బయటికి వదిలేయడం అలా చేయాలి. ఇప్పుడు తర్వాత చేయాల్సింది సంకల్పం సంకల్పం చెప్పడంలోనే చాలా మందికి కష్టం అవుతుంది ఎందుకంటే అందులో దేశ కాలస్తుతి అవన్నీ ఉంటాయి కదా మన శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నాం. అవన్నీ చెప్పుకోవాలి కదా అది కష్టం కాబట్టి ఈ నిత్య పూజలో చిన్నగా ఉండేలాగా కానీ ఎఫెక్టివ్ గా ఉండేలాగా ఒక సంకల్పం పెడుతున్నాము ఇక్కడ చూడండి అది చాలా తేలికగా చేసుకోవడం. మమ ఉపాత్త సమస్త దురితక్షేద్వారా శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృత్యర్థం ధన ధాన్య సమృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ముద్దిస్య ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు ఎప్పుడు సంకల్పంలో ఈ వేలుని ఇలా నీటిలో ముంచాలి ఇది మనం పెట్టుకునే పంచపాత్ర దేవుడిది కాదు. ఇంతకీ ఇందులో చూస్తే లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్ధం ఇది అనగానే ఇంతకుముందు వీడియోలో కూడా వచ్చేసింది ఈయన వైష్ణవులు కాబట్టి విష్ణుమూర్తి గురించి చెప్తున్నారు అని. ఒకటి గుర్తు పెట్టుకోండి ఇదే షోడసోపచార పూజ మీకు శివుడికి ఎలా చేయాలి అమ్మవారికి ఎలా చేయాలి అన్ని చూపిస్తాం గణపతికి ఎలా చేయాలి సూర్యుడికి ఎలా చేయాలి మొత్తం అన్ని. కానీ ఈ ముందు ఈ ప్రాసెస్ నేర్చుకోండి వీడియోలో నేర్చుకుంటే కనక ఇంకా అక్కడి నుంచి చాలా ఈజీ షోడసోపచార పూజలు మంత్రాలు మారుతూ ఉంటాయి అంతే మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇప్పుడు అసలు పూజ మొదలు పెడదాం ఏమిటండీ ఇది అంటే భగవంతుడికి 16 ఉపచారాలు ఉన్నాయి వాటిని షోడసోపచారాలు అంటారు షోడస అంటే 16 కదా ఇప్పుడు మీ ఇంటికి దేవుడు వచ్చేసారు అనుకోండి లక్ష్మీనారాయణలు పార్వతీ పరమేశ్వరులు వచ్చారు ఇంటికి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మనం ఏమి చేస్తామో అదే సేమ్ పూజా మందిరంలో చేస్తాం. ఇంతకీ ఇందులో 16 ఉపచారాలు ఎందుకు ఉన్నాయండి అంటే దాని వెనకాల అంతా లాజిక్ ఉంది అది మీకు ఒక విజయవాడ ఉపన్యాసంలో చెప్పాను షోడసోపచార పూజ గురించి ఆ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఇదే వరుసలో షోడసోపచార పూజ నేర్పిస్తా మీకు మొట్టమొదటి ఉపచారాన్ని ఆవాహనం అంటారు అంటే భగవంతుడిని ఆహ్వానించడం అన్నమాట. ఎలాగండీ ఇదిగో దీని మంత్రం ఇక్కడ ఇస్తున్నాను.
[7:36]ఓంకారక్ష్యం యోగి రుధ్యాన గమ్యం సాంగం శక్తిం సాయుధం భక్త సేవ్యం సర్వాకారం శ్రీ విష్ణుమావాహయామి శ్రీ లక్ష్మీనారాయణమావాహయామి ఇది మొట్టమొదటి మంత్రం. అంటే ఇందాక అదేమిటండి ఇందులో వేద మంత్రాలు ఉండవు ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు కదా ఇప్పుడు పైన పురుష సూక్తం వచ్చింది ఏమిటి షోడసోపచార పూజ ఎప్పుడు పురుష సూక్తంతో కానీ శ్రీ సూక్తంతో కానీ రుద్రంతో కానీ అనుసంధానం చేసి చదివితే చాలా గొప్పది. కానీ మీకు పురుష సూక్తాలు శ్రీ సూక్తాలు రావు అనుకోండి ఏమీ భయం లేదు ఆ పైన మంత్రం వదిలేసేసి కింద శ్లోకం ఉపచారం చేయండి చాలు అంతే. నేను మీకు ఆడియోలో కూడా శ్లోకం ఉపచారం మాత్రమే చెప్తాను పురుష సూక్తం వచ్చిన వాళ్ళైతే ఇదిగో ఈ స్క్రిప్ట్ చూసుకుని చక్కగా ఆ పైన మంత్రం చదువుకున్నప్పుడు కింద చదువుకోండి రాకపోయినా శ్లోకం చదివితే సరిపోతుంది. ఇప్పుడు ఇంతకీ ఇందులో ఏం చెప్తున్నారండి అంటే హఠాత్తుగా భగవంతుడు మన ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు అనుకోండి తలుపు తీస్తే ఎదురుగుండా లక్ష్మీనారాయణులో లేకపోతే శివపార్వతులో ఏం చేస్తాం మనం పొంగిపోయి స్వామి మీరు వచ్చారా మా ఇంటికి అయ్యో బాబోయ్ నా జన్మ ధన్యం అయిపోయింది రండి స్వామి లోపలికి రండి రండి అంటాం. అదే ఆహ్వానం వాళ్ళు ఎలాగో మన ఇంటికి రావచ్చు రాకపోవచ్చు ఎంతో పుణ్యం ఉండాలి భగవంతుడు రావాలంటే కానీ ఆ ఆర్తితో చేయండి పూజ చేసేటప్పుడు షోడసోపచార పూజలో ఆ ఫీల్ ముఖ్యం. మీరు ఆ తన్మయత్వంతో అంటే ఆ శ్రీ లక్ష్మీనారాయణ మావాహయామి అన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి మీ పూజా మందిరంలో కూర్చున్నారు అని ఫీల్ అవ్వగలిగితే మీరు అంతే షోడసోపచార పూజ ఫలించేస్తుంది. ఇప్పుడు తర్వాత ఉపచారం ఈ ఉపచారాన్ని ఆసనం అంటారన్నమాట దీనికి ఏమిటండి శ్లోకం అంటే కల్పద్రుమూలే మణిమధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్ర వస్త్రావృత మచ్చుత ప్రభో గృహాన లక్ష్మీ ధరణీ సమన్విత ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈ మొట్టమొదటి రెండు ఉపచారాలకి కూడా సమర్పయామి అన్నప్పుడు అక్షింతలు తీసి కొంచెం వేయండి అక్షింతలు పక్కన పెట్టుకోండి సిద్ధంగా ఇప్పుడు ఇంతకీ ఇందులో ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇది కూడా భావన స్వామి కల్ప వృక్షం కింద మణిమయ వేదిక ఉంది దాని మీద ఒక నవరత్న ఖచిత బంగారపు సింహాసనం వేసి నిన్ను శ్రీదేవి భూదేవితో సహా అమ్మలతో సహా అక్కడ కూర్చోబెడుతున్నాను స్వామి వచ్చి కూర్చో అని అది భావించారనుకోండి మన దగ్గర సింహాసనం లేదు కల్ప వృక్షం లేదు వేదిక లేదు ఇక్కడ ఉన్నాయి అవన్నీ వచ్చి ఇక్కడ కూర్చుంటాడు స్వామి. అదే షోడసోపచార పూజలో కీ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఆ అనుభూతి పొందారా మీరు నేను చెప్తున్నా ఒక రోజు పూజ చేసి ఆ అనుభూతి పొందితే కళ్ళ మట్టి నీళ్లు వచ్చేస్తాయి అది అవ్వగానే నాకు మెయిల్ చేస్తారు ఈరోజు పూజ నేను చేశానండి నాకు చాలా సంతోషంగా ఉందండి అంత సంతోషాన్ని ఇస్తుంది పూజ. ఇప్పుడు మూడో ఉపచారం పాదాలకి పాద్యం అంటే ఇప్పుడు ఆలోచించండి మన ఇంటికి ఎవరో వచ్చారు ఆహ్వానించాం మొట్టమొదట తర్వాత ఆసనం అంటే తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాం. కూర్చోబెట్టాక ఏం చేయాలి ఇప్పుడు ఎవరో గురువుగారు వచ్చారనుకోండి ఒక పళ్ళెం తీసుకొచ్చి పాదాలు పెట్టి చక్కగా కడుగుతాం అంతే కదా అలాగ భగవంతుడికి పాదాలు చేతులు కడగడం అన్నమాట తర్వాత రెండు ఉపచారాలు వాటిల్నే పాదయో పాత్యం హస్తయో రర్ఖ్యం అంటారు. ఇప్పుడు ఆ శ్లోకం చదివి వినిపిస్తా ధర్మ స్వరూప ధర్మజ్ఞ తులసీ ధామ భూషణ కంబుగ్రీవమయా దత్తం గృహానార్థ్యం నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయోరర్గ్యం సమర్పయామి.
[11:51]మళ్ళీ ఇది చెప్పినప్పుడు ఒక ఉద్ధరిణతో నీళ్లు తీసి అభిషేకం చేయండి ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఉన్నాయి జనం పాటించేవి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది పంచాయతనం పెట్టుకుంటే ఇందులో పరమేశ్వరులు అందరూ ఉంటారు కదా అందుకని అభిషేకం లాగా జలం భగవంతుడి మీద వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా చూపి పక్కన ఒక పళ్ళెంలో వేసేస్తూ ఉంటారు అవి రెండు రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ అన్నమాట ఏదైనా చేయొచ్చు మనం మనం ఏం చేద్దాం అంటే ఇలా అభిషేకం చేద్దాం ఇదే మనం తీసుకునే తీర్థం అన్నమాట దాని కోసం. ఇప్పుడు పాదాలకి పాద్యం అయిపోయింది ఇప్పుడు హస్తాలకి అర్ఖ్యం అంటే స్వామి చేతులు కడగడం అన్నమాట దానికి శ్లోకం ఏమిటి అంటే ధర్మ స్వరూప ధర్మజ్ఞ తులసీ ధామ భూషణ కంబుగ్రీవమయా దత్తం గృహానార్ఖ్యం నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయోరర్ఖ్యం సమర్పయామి మళ్ళీ ఇది చెప్పినప్పుడు ఒక ఉద్ధరిణతో నీళ్లు తీసి ఇలా స్వామికి అభిషేకం చేయండి అర్ఖ్యం సమర్పిస్తున్నట్లు అన్నమాట. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి పైకి చేసే ఉపచారాలు అదే అక్షింతలు వేయడం పువ్వులు వేయడం లేకపోతే ఉద్ధరిణతో నీళ్లు సమర్పించడం ఇవన్నీ పైకి చేస్తున్నాం లోపల అవన్నీ ఇక్కడ చేయాలి దర్శించగలగాలి అది. అంటే ఇప్పుడు స్వామికి చేతులు కడిగాం అనుకోండి సుతి మెత్తని చేతులు చక్కగా నీళ్లు పోసి కడిగి అబ్బా స్వామి ఎంత బాగుంది ఈ చెయ్య అని ఇలా చంపకి ఒక్కసారి ఆంచుకున్నాం అనుకోండి ఆ స్పర్శని మీరు పొందగలిగారా షోడసోపచార పూజలో కళ్ళమట్టి నీళ్లు వచ్చేస్తాయి అంతే ఆ స్పర్శ ఆ అనుభూతి ఇంపార్టెంట్ అందుకే ఈ 16 ఉపచారాలు చెప్తారు. తర్వాత ఉపచారం ఆచమనీయం అంటే స్వామికి నీరు సమర్పించడం అన్నమాట ఇప్పుడు ఇంటికి ఎవరైనా రాగానే మొట్టమొదటి ఏమిటి సంస్కారం ఉంటే కనక తీసుకెళ్లి గ్లాస్ తో నీళ్లు ఇస్తారు. ఇప్పుడు దానికి మంత్రం ఏమిటి అంటే కర్పూరవాసితం తోయం సువర్ణ కలశ స్థితం దదామ్యాచమనం భక్త్యా దేవదేవ నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఆచమనీయాన్ని సమర్పించండి భగవంతుడికి ఇప్పుడు తర్వాత ఉపచారం స్నానం అంటే భగవంతుడి విగ్రహాలకి తిరుమంజనం అంటాం మనం అలా స్నానం చేయించడం అన్నమాట చక్కగా. ఇది ఎలాగండి అంటే ఇదిగో ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క విగ్రహాన్ని చక్కగా చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఇదిగో అమ్మవారు ఉన్నారు శ్రీ చక్రం రూపంలో తల్లికి చక్కగా స్నానం చేయిస్తూ అంటే ఇవన్నీ నేను ఈ పీట మీద చూపిస్తున్నాను కాబట్టి ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది పూజా మందిరంలో అయితే చక్కగా చేయొచ్చు. ఇదిగో ఇలా చేయిస్తూ చక్కగా మృదువుగాను అప్పుడు ఆ మంత్రాన్ని చదవండి తీర్థోదకై కాంచన కుంభ సంస్థితైహి సువాసితైర్ దివ్య మంత్ర పూతైహి మయార్పితం స్నానం మిదం గృహాన పాదాభ్య నిష్యుత నదీ ప్రవాహ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః స్నానం సమర్పయామి. ఒక చిన్న పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి మీ ఇంట్లోనూ ఒక నెల పిల్లవాడో రెండు వారాల పిల్లవాడో స్నానం చేయించినప్పుడు ఎంత సున్నితంగా మృదువుగా ప్రేమగా చేయిస్తారో అలా చేయించాలి. అంతేగాని ఏదో గిన్నెలు తొలినట్టు పీ చేసి బరబర తోమేసినట్టు మాత్రం తోమకండి విగ్రహాలు తర్వాత స్నానం చేసేసి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తారు కదా విగ్రహాలన్నీ ఇప్పుడు స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి మళ్ళీ ఒక ఉద్ధరిణతో నీళ్లు ఇవ్వండి. ఎందుకండీ మళ్ళీ ఈ ఉద్ధరిణతో నీళ్లు ఇవ్వడము అంటే ఈ ఉపచారాలన్నీ చాలా చిత్రంగా ఉంటాయి స్వామి కొంచెం అలసిపోయే పని ఏమైనా చేశాడు అనుకోండి మళ్ళీ తీసుకొచ్చి ఒక గ్లాసుడు మంచి నీళ్లు ఇస్తాం అన్నమాట ఎందుకంటే కుసుమ కోమల మూర్తి ఆయన ఆ తల్లి అలాంటిదే. అందుకని ఇప్పుడు స్నానం చేసేసి వాళ్ళు అలసిపోయారు ఇప్పుడు చూడండి మన చిన్న పిల్లల్లో స్నానం చేయించగానే అలా నిద్రపోతూ ఉంటారు అలసిపోయి చిన్నప్పుడు అలాగన్నమాట అందుకని స్వామికి మళ్ళీ స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి మళ్ళీ ఒక ఉద్ధరిణతో నీళ్లు సమర్పించడం. ఇప్పుడు పురుష సూక్తం వచ్చిన వాళ్ళు గమనిస్తే ఇక్కడ సప్తాస్యా సన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయ ద్యజ్ఞం తన్వానాః ఆ మంత్రం ఇక్కడ రావాలి కదా ఇంకో మంత్రం వచ్చింది ఏమిటండి ఆ ఆలోచన మీకు వచ్చింది అంటే శ్రద్ధగా వింటున్నట్టు ఆ ఇంకో మంత్రం ఇంకో చోట వస్తుంది ఎందుకు ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టారు అనేది మీకు తర్వాత చెప్తాను నీరాజనం దగ్గరికి వస్తుంది. తర్వాత ఉపచారాన్ని వస్త్రం అంటారు అంటే ఇప్పుడు స్వామి అమ్మవారు చక్కగా స్నానం చేశారు వాళ్ళకి కొత్త వస్త్రాలు సమర్పించి స్వామి కట్టుకోండి స్వామి అమ్మాయి చీర కట్టుకో అమ్మ అన్నాం అనుకోండి వాళ్ళు కట్టుకుంటే మనం పొంగిపోతాం పిల్లలం అంతే కదా ఆ వస్త్రం సమర్పించే ఉపచారం దానికి శ్లోకం ఏమిటి అంటే స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం కౌశేయ యుగ్మం పరికల్పితం మయా దామోదర ప్రావరణం గృహాన మాయాచల ప్రాకృత దివ్య రూపాం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వస్త్ర యుగ్మం సమర్పయామి వస్త్ర యుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్ర యుగ్మం అంటే రెండు వస్త్రాలు సమర్పించాలి అంటే స్వామికి అయితే కనుక పంచ కండువ.
[15:43]అమ్మవారికి అయితే చీర రవిక అంటే బాబోయ్ అదేమిటండి నిత్య పూజలో రోజు ఇవన్నీ చేయాలా ఎక్కడి నుంచి తెస్తాం చీరలు అవన్నీ అంటే ఎక్కడి నుంచో తేవాక్కర్లేదు ఇక్కడి నుంచి తేండి ఇక్కడి నుంచి సమర్పించండి. మీరు ముందు రోజు ఏదో కళా మందిరికి వెళ్లారు వెళ్తే అక్కడ ఒక 60 వేల రూపాయలు పట్టు చీర చూశారు అనుకోండి ఆ పట్టు చీర అబ్బా ఇంత పెద్ద అంచు ఉంది కొనేసుకోవాలనిపించింది కానీ కొనుక్కోలేకపోయారు ఇంటికి వచ్చేశారు. పక్క రోజు పొద్దున్న పూజ చేస్తూ ఉంటే ఆ చీరని భావించి అమ్మవారికి సమర్పించాను అనుకోండి అంతే ఆ తల్లికి వెళ్ళిపోతుంది అది అలాగే అలాంటి చీరలే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా తలుచుకుంటే లక్ష్మీదేవి ఎంత విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం ఆ తల్లి తీసుకొచ్చి అనుగ్రహించేస్తుంది. ఇక్కడ ఒక పని చేయొచ్చు ఏమిటంటే బట్టలు పెట్టదలుచుకుంటే పెట్టడం అంటే ఎప్పుడైనా ఏ పండగకో అలాంటివి వచ్చినప్పుడు లేకపోతే ఇదిగో చక్కగా దూదితో ఇలాగ రెండు వస్త్రాలు చేయండి అంటే కొంచెం దూదు తీసుకుని దానికి పసుపు రాసి పైన కుంకుమ పెట్టారు అనుకోండి ఇది వస్త్రం అన్నమాట. ఇవి రెండు అయితే వస్త్ర యుగ్మం వాటిల్నేనా వస్త్ర యుగ్మం సమర్పయామి అని చెప్పి వాటిని సమర్పించొచ్చు స్వామికి అది కూడా చేయలేదనుకోండి చక్కగా ఉద్ధరిణతో వస్త్ర యుగ్మం సమర్పయామి అని సమర్పించడం. మళ్ళీ ఇక్కడ వస్త్ర యుగ్మం సమర్పించాక ఆచమనీయం ఎందుకంటే ఆ బట్టలు కట్టుకుని వెళ్లి వాళ్ళు అలసిపోతారు తల్లి తండ్రి అందుకని వచ్చాక మళ్ళీ కొంచెం నీళ్లు ఇవ్వడం అన్నమాట భలే ఉంటుంది షోడసోపచార పూజ అనుభవిస్తూ చేస్తే. ఇప్పుడు ఎనిమిదో ఉపచారం యజ్ఞోపవీతం సమర్పించడం స్వామికి దానికి మంత్రం ఏమిటి అంటే సువర్ణతం త్రోద్భవ యజ్ఞ సూత్రం ముక్తాఫలం స్యూతం అనేక రత్నం గృహాన తద్వత్ కృత ముత్తరీయం స్వకర్మ సూత్రం ధరణే నమోస్తు ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి ఇలా ఇవ్వడం. రోజు యజ్ఞోపవీతం ఎక్కడి నుంచి తీసుకొస్తామండి అంటే మానసికంగా సమర్పించండి అలాగే స్వామికి ఒకటి అమ్మవారికి ఒకటి అంటే అదేమిటండీ ఆడవాళ్ళకి వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఉపచారాల్లో ఉన్నాయి పూర్వకాలం దేవతలు అలాగనే ఋషిపత్నులు అందరూ కూడా ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం వేసుకుని వేదాధ్యయనం చేశారు. ఈ కాలంలో మన బిజీ బిజీ జీవితాల్లో అవన్నీ చేయలేమని చెప్పి మహనీయులందరూ వాటిని తగ్గించేసి మనకి అందించారన్నమాట అందుకని అమ్మవారికి కూడా యజ్ఞోపవీతం సమర్పించాలి అది మానసికంగా ఇద్దరికీ సమర్పించండి. తర్వాత తొమ్మిదో ఉపచారం గంధం ఆ గంధానికి మంత్రం ఏమిటి అంటే కస్తూరికా చందన కర్ధమాని కాశ్మీర సంయోజిత గంధసారై విలేపనం స్వీకురు దేవదేవ శ్రీ భూమి వక్షోజ విలేపనార్హం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గంధం సమర్పయామి ఈ ఉపచారం చెప్పాక ఏం చేస్తారంటే చక్కగా రెండు పాత్రల్లో కొంచెం గంధం కొంచెం కొంకం తీసుకోండి.
[18:25]తీసుకుని అందరికీ బొట్లు పెట్టి గంధం పెట్టండి తర్వాత కుంకుమ తీసి పెట్టండి మూర్తులందరికీను అలాగే అంతా పెట్టేసాక మళ్ళీ అనుభూతి స్వామి చేతికి కొంచెం గంధం కుంకుమ ఇచ్చి స్వామి నేను నీకు పెట్టేసాను కదా నువ్వు అమ్మకి పెట్టును స్వామి అంటే ఆయన అమ్మవారికి పెడుతూ ఉంటే ఆవిడ కిలకిల మంటూ ఉంటుంది. ఆ చూసి మనం పులకించిపోవడం అందుకే శ్రీ భూమి వక్షోజ విలేపనార్హం అని రాశారు ఇప్పుడు 10వ ఉపచారం ఇది అలంకరణ అన్నమాట అంటే పుష్పాలని ఆభరణాన్ని సమర్పించడం ఈ రెండు కలిపి సమర్పించడం ఒక ఉపచారం ఇందులో మరి రెండు కలిపి చేస్తున్నాం కదా రెండు పెద్ద శ్లోకాలు ఉంటాయి ఇవి మీకు వింటే వచ్చేస్తాయి తేలిక పదాలు నేను చదివి వినిపిస్తా చూడండి. చామంతికా వకుల చంపక పాటలాబ్జ పున్నాగి జాజి కరవీర రసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసీ దళ మల్లికాంబిత్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవా ఆరామ పుష్పాణి మనోహరాణి జలాశయస్థాని సుపల్లవాని సువర్ణ పుష్పాణి మయార్పితాని గృహాన శ్రీవత్సధర ప్రసీదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పుష్పాణి సమర్పయామి ఇక్కడ ఒక్క నిమిషం ఆపి చక్కగా మీరు పువ్వులు కోసి తెచ్చుకుంటారు కదా అవి తీసి స్వామికి అలంకరించండి. మీ పెరట్లో పూసే ఓ రెండు మందార పూలో రెండు గన్నేరి పూలో తెచ్చి స్వామికి ఒక రెండు తులసి దళాలు సమర్పిస్తే చాలు ఏం కోరుకున్నాడు ఆయన ఏమి ఇవ్వగలం మనం అలాగే ఒకటి గుర్తు పెట్టుకోండి స్వామికి పుష్పాలు సమర్పిస్తున్నారు అనుకోండి హృదయం దగ్గి నుంచి ఇలా సమర్పించండి. అంటే వేస్తూ ఉంటాం కదా మనం కొన్నిసార్లు పువ్వులు ఇప్పుడు ఈ ఈ ప్రక్రియలోనే వేస్తూ ఉంటే పువ్వులు చుచ్చుకుని కొట్టకండి దేవుడిని ఎప్పుడును చక్కగా ఇలా సమర్పించండి ఇలాగ ఎందుకో తెలుసా ఇలా నేర్పింది పెద్దవాళ్ళు అలా సమర్పిస్తూ సమర్పిస్తూ షోడసోపచార పూజ చేస్తూ ఉంటే ఒక రోజు పొరపాటున ఇలా అన్నప్పుడు హృదయాన్ని సమర్పించేస్తారేమో సమర్పించారా ఇంకా అంతే అక్కడితో జన్మరాహిత్యం ఇంకో జన్మ ఉండదు అంతే.
[21:04]ఎంత అందంగా కూర్చారు చూడండి అంటే ధ్యానం చేయడం మొదలు పెడితే ధ్యానస్తులు అయిపోతాడు షోడసోపచార పూజ చేసేసరికి ఇప్పుడు షోడసోపచార పూజలో ఈ 10 ఉపచారాలు అయ్యాయి నీకు కావాలంటే ఇక్కడ ఏ స్తోత్రాలైనా చదువుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదో లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం అలాంటివి చేయదలుచుకున్నారు అనుకోండి ఏదో ఆదివారమో కూర్చుని మీకు మామూలుగా ఈ పూజ చేయడానికి 20 నిమిషాలు పడుతుంది అవన్నీ చదవదలుచుకుంటే ఇక్కడ ఆపాలి పూజని ఎందుకంటే ఇప్పటికే దేవుడు ఆయన వచ్చేసి స్నానం చేసి వస్త్రాలు కట్టుకుని అలంకృతుడై హాయిగా కూర్చుని ఉన్నాడు అమ్మవారితో. ఇప్పుడు మన మొరలన్నీ వింటాడు ఇప్పుడు ఆ స్తుతి చేయడానికి అర్హమైన సమయం అన్నమాట అంతేగాని ఆహ్వానం అయిపోయాక లలితా సహస్రనామం మొదలెట్టకూడదు అంటే ఇంట్లోకి ఎవరైనా రాగానే ముందు ఆ బాగున్నావా అప్పు ఇస్తావా అని అడిగేసినట్టు ఉంటుంది అన్నమాట. వాళ్ళు సెటిల్ అయ్యాక కదా అడుగుతారు ఇక్కడ కూడా అలాగనే ఈ 10 ఉపచారాలు చేసి అప్పుడు చదవాలి ఏవైనా అలాగే హోమం చేయదలుచుకున్నారు అనుకోండి ఇక్కడ ఆపి చేయాలి హోమం. అయిపోయి హోమం మళ్ళీ వెనక్కి వచ్చాక అప్పుడు మిగతా ఆరు ఉపచారాలు చేయాలి సరే ఇప్పుడు ఆ మిగతా ఆరు ఉపచారాలు ఏమిటి అన్నది చూద్దాం. 11వ ఉపచారం ధూపం వనస్పతి రసే దివ్య నానా గంధై సమ్యుతం ఆగ్రేయ సర్వ దేవానం ధూపోయం ప్రతిగృష్యతాం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధూపమాగ్రాపయామి ఇక్కడ చూడండి సమర్పయామిక ధూపం ఆగ్రాపయామి ఆగ్రాపయామి అంటే వాసన చూపిస్తున్నాను అని. అలా కూర్చారు చక్కగా అని చెప్పి మళ్ళీ ఒక ఉద్ధరిణతో నీటిని కూడా సమర్పించండి ఇప్పుడు తర్వాత ఉపచారం దీపం దీపానికి మంత్రం ఏమిటి అంటే సాద్యంతి వర్తి సంయుక్తం వహినాయోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతిర్ నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః దీపం దర్శయామి. మొట్టమొదట్లో మీరు పూజ మొదలుపెట్టినప్పుడు ఈ దీపం గంట వాయిస్తూ దీపం తిప్పడం ఆ రెండిటికి సింక్రనైజేషన్ కుదరదు అంటే ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది కదా ఈ చెయ్యి ఇలా అంటుంది ఈ చెయ్యి ఇలా అంటుంది మీరు మొట్టమొదట మొదలెట్టినప్పుడు ఇది ఇలా అన్నారు అనుకోండి ఇది కూడా ఇలా ఇలా ఇలా అంటూ ఉంటుంది ఈ చెయ్యి లేకపోతే ఇది తిప్పుతున్నారు అనుకోండి గంటను కూడా ఇలా తిప్పుతాడు తప్ప దీన్ని వాయిస్తూ దీన్ని తిప్పడం ఒక టెక్నిక్ అది మీకు అలవాట్లో వచ్చేస్తుంది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి ఓరి నాయనోయ్ మేము ఛానల్ తెరిచాక అవి విపరీతంగా మెయిల్స్ వచ్చింది ఈ టాపిక్ మీద సాత్యం తివర్తి సంయుక్తం. మూడు ఒత్తులు వేసి దీపాన్ని చేస్తే సరిపోతుంది అని ఇదిగో ఇక్కడ చెప్తారు అదన్నమాట దానికి ప్రమాణం ఇప్పుడు తర్వాత ఉపచారం నైవేద్యం. నైవేద్యానికి మంత్రాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే మీకు చక్కగా ఇప్పుడు ఈ పురుష సూక్తం మంత్రాలు వస్తే కనక చంద్రమా మనసోజాతశ్చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత ఓం భూర్భువస్వః గాయత్రీ మంత్రం అవన్నీ చదవండి. అవి అవ్వకపోయినా మామూలు ఇప్పుడు శ్లోకాలు చదివే నైవేద్యం ఇప్పుడు శాస్త్రోక్తంగా ఎలా చేయాలో నేర్పిస్తా మీరు ఇంట్లో ఏమైనా పళ్ళు కొని తెచ్చుకున్నారు అనుకోండి అవి కూడా మొట్టమొదట భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లి నివేదన చేసి అప్పుడు తినండి. మామూలుగా ఉంటే అది పండ అవుతుంది నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది ఇదిగో ఇప్పుడు ఏమైనా పళ్ళు ఇలా పెట్టదలుచుకుంటే వీటికి ఒక్క దానికి చివర కొంచెం ఇలా గిల్లండి సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి మీరు పెట్టిన పదార్థాలన్నిటిల మీద నీటిని ఇలా జల్లండి. సాయంత్రం అయితే కనుక ఋతం త్వత్తేన పరిషించామి అని వేరే మంత్రం చదవాలి పొద్దున అయితే సత్యం త్వత్తేన పరిషించామి అని చదవాలి ఇది ఒక్కటే మారుతుంది మిగతాదంతా సేమ్ ఇప్పుడు ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి ఇక్కడ ఆపండి ఆపి కళ్ళు మూసుకుని మీరు ఏది సమర్పించిన ఇప్పుడు ఎక్కడో చక్కెర పొంగళ్ళు పులిహార్లు అవన్నీ రోజు చేయలేరు ఎవరు ఇప్పుడు ఇలాంటి బొమ్మలు చూస్తే అయ్యో బాబోయ్ ఇవన్నీ రోజు చేయాలా అనిపిస్తుంది ఏం అక్కర్లేదు. మీరు కుదిరితే పచ్చిపాలు పెట్టండి అది అన్నిటికన్నా శ్రేష్టం లేకపోతే పచ్చిపాలు అంటే కాయన పాలు లేకపోతే ఇదిగో ఇలా పళ్ళు ఉంటే అవి పెట్టండి మీరు చేయగలిగారు అనుకోండి ఏ శనివారమో ఆదివారమో పులిహార్లు పొంగళ్ళు అవన్నీ చక్కగా అరిగింపు పెట్టండి. ఏమీ చేయలేకపోతే ఖర్జూర పళ్ళో కిస్మిస్ పళ్ళో ఐదిటిక తక్కువ కాకుండా తీసుకొచ్చి పెట్టండి ఏది పెట్టినా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆపి మీరు ఇప్పుడు ఏదో చక్కెర పొంగల్ చేశారు అది తీసుకెళ్లి స్వామి చేతిలో పెట్టారు పెడితే స్వామి తిన్నట్టు తిని అబ్బా బా చేశారా ఎవరు మీ ఆవిడ చేసిందా బాగా చేసిందే అని లక్ష్మి కొంచెం చక్కెర పొంగల్ తిని ఎంత బాగా చేసిందో ఈరోజు అని తీసి అమ్మవారికి నోట్లో పెట్టినట్టు అది భావించారు అనుకోండి ఆ పదార్థం ప్రసాదం అయిపోతుంది అది భావించకపోతే అన్నం అంతే అది. అది భావించడం ఇంపార్టెంట్ అసలు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది ఇప్పుడు ఈ రేఖీ అవన్నీ చేసేవాళ్ళు ఎనర్జీ లెవెల్స్ ని స్కాన్ చేస్తారు చేతులతో తెలుసు కదా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోను ఒక పదార్థాన్ని తీసుకొచ్చి ఆరిగెం పెట్టక ముందు స్కాన్ చేసి అదే పదార్థాన్ని ఒక మహనీయుడు ఈ మంత్రాలు చదువుతూ ఆరిగెం పెట్టాక స్కాన్ చేస్తే ఆ రెండిటి మధ్యలో ఫీల్డ్ ఎంత తేడా వచ్చిందో అంటే అర్థం అవుతుంది కదా ఈ ఈ పదార్థాన్ని ఎలాగ దివ్యమైన ప్రసాదం కింద మారుస్తాయి అని. దీని తర్వాత ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయి అవేమిటంటే ఓం ప్రాణాయ స్వాహా అంటే మీరు ఇందాక ఆ పదార్థం మీద నీళ్లు చిలకరించారు ఇందాక చదువుతూ ఇప్పుడు ఆ పదార్థాన్ని స్వామికి చూపించుతూ ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిధానమసి ఓం ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి పాదౌ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఇదంతా చేస్తే అప్పుడు నైవేద్యం అయినట్టు మీకు అలవాటైపోతుంది కొన్ని రోజులు చేశారు అంటే. ఇప్పుడు తర్వాతవన్నీ ఏమిటండీ మధ్యే మధ్య పానీయం దగ్గి నుంచి అంటే ఇప్పుడు చక్కగా మీరు ఏదో పులిహార్ చేసి పట్టుకొచ్చింది మీ భార్య పట్టుకొస్తే స్వామికి పెట్టేసారు కొంచెం కారం ఎక్కువగా ఉంది అనుకోండి మరి మనమైతే ఏం చేస్తాం మధ్యలో మంచి నీళ్లు తాగామా మరి స్వామికి కూడా అంతే కదా అందుకని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి తింటూ ఉంటే స్వామి పర్వాలేదా కొంచెం నీళ్లు తాగుతావా స్వామి డెక్కు పడుతుందేమో తాగు అలాగ ప్రేమతో పెట్టండి కరిగిపోండి అంతే నైవేద్యం చేసినప్పుడు కరిగిపోతే తింటాడు ఆయన. తర్వాత 14వ ఉపచారం తాంబూలం అంటే స్వామికి తాంబూలం సమర్పించడం అమ్మవారికిను ఇది ఎలాగంటే తాంబూలాలు ఉంటాయి కదా చక్కగా కనుక చక్కగా రెండు తాంబూలాలు తీసుకోండి అందులో కొంచెం పచ్చ కర్పూరం వేసి కొంచెం సున్నం వేసి ఒక వక్క పలుకు పెట్టి అప్పుడు సమర్పించండి అప్పుడు ఈ శ్లోకం చదువుతూ చేయాలి అది ఏమిటి ఆ శ్లోకం. పూగీఫలై సకర్పూరై నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృష్యతాం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః తాంబూలం సమర్పయామి అంటే రోజు తాంబూలాలు ఎక్కడి నుంచి వస్తాయండి అక్కర్లేదు ఇక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఉంది తాంబూలాల చెట్టు చూడండి ఇక్కడ శ్లోకంలో చెప్పారు పూగీఫలై సకర్పూరై. పూగీఫలం అంటే ఒక్క కర్పూరం అంటే పచ్చ కర్పూరం నాగవల్లి అంటే తాంబూలపాకు ముక్తాచూర్ణం అంటే ముత్యం నుంచి తీసిన సున్నం అన్నమాట మనం మామూలుగా సున్నం పెట్టొచ్చు తాంబూలం ప్రతిగృష్యతాం అలాగ కానీ ఆ అనుభూతితో పెట్టి స్వామి వారి నోట్లోనో అమ్మవారి నోట్లోనో పెట్టినట్టు పూజ అయిపోయిన తర్వాత తాంబూలం తీసుకుని వేసుకున్నారు అనుకోండి అబ్బో అనంతమైన ఫలాన్ని ఇచ్చేస్తుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే సందర్భాలు ఉన్నాయి అలాంటివి చేస్తే కానీ చేసేది భక్తితో చేయాలి. ఇప్పుడు 15వ ఉపచారం అది ఏమిటి అంటే నీరాజనం అంటే హారతి ఇవ్వడం అన్నమాట స్వామికి ఈ గిప్పులతో వెలిగించకూడదు గుర్తు పెట్టుకోండి ఇలాంటివన్నీ ఆ దీపారాధన చేసిన దీపం ఉంది కదా దాని నుంచే వెలిగించాలి. చక్కగా గంట వాయిస్తూ అక్కడ చదవాల్సిన శ్లోకాలు ఏమిటంటే కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్ధ ప్రదాయినే శ్రీ గిరీశాయ దేవాయ మలినధాయ మంగళం మంగళ శాసనపరైర్మదాచార్య పురోగమైహి సర్వైష్య పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మొట్టమొదట మనం సప్తాస్య సన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః అన్న మంత్రం వదిలేస్తాం అది ఇక్కడ వచ్చి చూడండి ఎందుకండీ ఇక్కడ పెట్టారు ఇదంతా ఋషుల థాట్ ప్రాసెస్ అండి మాస్టర్ కే గారు ఇచ్చిన పూజ ఇది మీకు ఈ పూజా విధానం బుక్ లో కూడా దాదాపుగా ఉంటుంది నేను చదివిన కొన్ని శ్లోకాలు ఉండవు అవి మాస్టర్ గారు దెగ్గించి మా నాన్నగారు నేర్చుకుని మాకు నేర్పారు ఈ కొత్త పుస్తకాల్లో లేవు ఆ శ్లోకాలన్నీ కానీ దాదాపుగా ఈ పూజ ఉంటుంది. ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే అగ్నిహోత్రాన్ని అందరూ చేయలేరు అందరూ చేయకూడదు కూడా నేను చెప్పాను కదా ఆహారం విహారం అలాంటి నియమాలు ఉండాలి అని మరి రోజు అగ్నిహోత్రం చేయాలంటే ఎలాగా అంటే ఇచ్చే నీరాజనమే అగ్నిహోత్రం అందుకే సప్తాస్య సన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః త్రిసప్త సమిధ అంటే 3*7 సమిధలు 21. నేను మీకు హోమంలో చెప్పలేదు 21 సమిధల్ని ఏడు త్రిభుజాల కింద పేరిస్తే అప్పుడు హోమం చేయొచ్చు అని అది ఇక్కడే భావిస్తూ ఈ నీరాజనంలో చేశారన్నమాట అది అందుకనే ఆ మంత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాగనే మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమైహి అంటే అర్థం ఏమిటి అంటే ఇంతకుముందు నా గురువులు నా ఆచార్యులు అందరూ ఏ స్వామికైతే మంగళాశాసనం చేశారో అదే స్వామికి చేస్తున్నాను అని. అంటే ఇక్కడ మన గురువులని ఒకసారి తలుచుకుంటున్నాం వాళ్ళ దయ వల్లే కదా మనం కూర్చుని పూజ చేసుకోగలుగుతున్నాం వాళ్ళు నేర్పబట్టే కదా అందుకని ఆ గురువులని కూడా తలుచుకుంటూ నమస్కారం చేయడం సంస్కారం అన్నమాట. ఇప్పుడు ఆఖరి పార్ట్ ఏమిటి అంటే నమస్కారం మంత్రపుష్పం మంత్రపుష్పం చేసి నమస్కారం చేయడం స్వామికి దానికి ఏమిటండీ అసలు మంత్రపుష్పం తూకిగా చెప్తాం మీకు.
[31:53]ఇప్పటిదాకా పూజ చేస్తున్నప్పుడు అక్కడ భగవంతుడు మీరు మధ్యలో పూజ ఈ మూడు ఉన్నాయి కదా ఇప్పుడు రియలైజేషన్ రావాలన్నమాట ఏమిటంటే ఆ ఫోటోలో ఉన్న భగవంతుడు కాదు ఆ భగవంతుడే ఇక్కడ నాలో లోపల ఉన్నాడు. అలాగనే నా చుట్టూ ఉన్నాడు ప్రపంచమంతా ఉన్నాడు ప్రతి జీవి లోనూ ఉన్నాడు మా ఇంట్లో పని చేసే పని మనిషిలో ఉంటాడు మా ఇంటికి వచ్చే యాచకుల్లో ఉంటాడు మధ్యాహ్నం నేను భోజనం చేస్తుంటే తోక ఊపుకుంటూ వచ్చే శునకంలో కూడా ఆయనే ఉంటాడు ఆ స్పృహ ఇచ్చేది మంత్రపుష్పం అది అన్నమాట అందుకే పూజ అంతా అయిపోయాక ఆఖర్లో పెట్టారు. అలాగనే మంత్రపుష్పం అయిపోయాక కానీ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని మనం చదువుతూ ఉంటాం పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప శంభవః అని.
[32:39]అది మంత్ర పుష్పం అయ్యాక ఎప్పుడు చదవకూడదు ఎందుకు అంటే మంత్ర పుష్పం దగ్గరికి వచ్చేసరికి నేను భగవంతుడు ఒకటే అనే స్థాయి భావన కలగడమే మంత్రపుష్పం అది కలిగాక మళ్ళీ పాపోహం పాపాత్మా నేను పాపాత్ముడిని నా తల్లిదండ్రులు పాపాత్ములు వాళ్లకు పుట్టాను ఇవన్నీ చెప్పకూడదు ఆ స్థాయి వచ్చేసాక అందుకని మంత్రపుష్పం అయ్యాక అది ఎప్పుడు చదవకూడదు అసలు ప్రదక్షిణ చేయండి నమస్కారం చేయండి మంత్ర పుష్పంతో చేయండి అంతే. ఇక్కడితో షోడసోపచార పూజ అయిపోయినట్టే ఇంక కంక్లూడ్ చేయాలి పూజని అందుకని తర్వాత ఉపచారం ఏమిటి అంటే ఛత్ర చామర గీత నృత్యాందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. చక్కగా స్వామికి మిగతా రాజోపచారాలు ఉంటాయి అంటే చామరం వేయడం గజారోహణం ఛత్రం చూపించడం అవన్నీ అవన్నీ మనం తేవలేము కానీ మనసా సమర్పయామి స్వామి ఇక్కడ సమర్పిస్తున్నా ఏనుగు ఎక్కించమంటే భగవంతుని మనం ఎక్కించలేము మనకి ఏనుగు ఎక్కడ దొరుకుతుంది మానసికంగా ఎక్కించేయొచ్చు చక్కగా ఐరావతాన్ని కూడా తెచ్చుకోవచ్చు మనసులోకి అలా చేయండి మీకు ఎప్పుడైనా కుదిరితే కనుక ఒక చామరం కొనుక్కోండి చిన్నది ఎందుకంటే అంతా అయిపోయాక స్వామికి అలా హాయిగా విస్తూ ఉంటే చూడండి ఇప్పుడు మన చిన్న పిల్లలు వాళ్ళకి సెర్లాక్ పెట్టేసాక వల్లో పడుకుంటే వాళ్ళు హాయిగా అలా ఏదో విసురుతూ ఉంటారు ఏ బలా అలా నిద్రపోతున్నాడు రా అనిపిస్తుంది కదా స్వామి కూడా ఇంకా అన్ని ఉపచారాలు అయిపోయాయి కాబట్టి హాయిగా పడుకుంటాడు ఇప్పుడు అందుకని చక్కగా అలా విస్తూ ఉంటే అది ఒక అనుభూతి కుదిరితే కనక ఒక చామరం కొనుక్కోండి అమెజాన్ లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు తర్వాత ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది నేను మీకు ఆ శ్లోకం చెప్తూ ఉంటాను కదా మనం ఏమి వేద పండితులమో మహనీయులమో కాదు మనం చదివే దాంట్లో బోల్డు తప్పులు ఉంటాయి అందుకని క్షమార్పణ యస్స్మృత్యాచ నామోక్త్యా తపస్ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనారాయణః సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు.
[34:35]అక్కడికి వచ్చేసరికి పూజ అయిపోయింది మొత్తం అంతా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అభిషేక జలం ఉంది కదా మరి ఇదే కదా మనకి తీర్థం అందుకని ఆ జలాన్ని ఇందాకడి ఈ పాత్ర ఉంది స్వామికి మనం ఉపచారాలు చేసింది అందులోకి తీసుకోవాలి అది తీసుకునేటప్పుడు చదవాల్సిన మంత్రం ఒకటి ఉంది ఓం శంఖ మధ్యస్థితం తోయం బ్రాహ్మితం కేశవోపరి అంగ లగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యా యుతం దహేత్ శాలగ్రామ శిలావారీ పాపహారి విశేషతః అశేష కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినేదినే ఈ మంత్రం చదువుతూ మీ దగ్గర ఒక శంఖం ఉందనుకోండి అసలు మామూలుగా అయితే పంచాయతనంలో ఇదిగో నా దగ్గర చిన్న దక్షిణా వత్త శంఖం ఉంటే అది ఇందులో పెట్టాను.
[35:10]ఆ ఎందుకంటే శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అంటారు కదా లేకపోతే ఒక శంఖం తెచ్చి దీని పైన పెట్టుకుని అప్పుడు ఈ జలం అంతా తీర్థ జలం అందులోకి తీసేయండి తీసేసాక ఇప్పుడు ఈ తీర్థం తీసుకోవాలి కదా మనం మహా మృత్యుంజయ మంత్రంతో దీన్ని స్పృశించి అప్పుడు తీసుకుంటారు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఏమిటంటే కుటుంబ సభ్యులందరిని పిలిచి ఇవ్వండి ఎందుకంటే ఈ పూజ అంతటికీ ఫలం ఈ తీర్థం తీసుకునేటప్పుడు చదవాల్సిన మంత్రం అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప క్షేకరం శ్రీ లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని చెప్తూ చక్కగా తీసుకోండి. ఇది అయిపోయాక స్వస్తి చెప్పేయాలి కదా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివి సస్యశాలినీం దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణాస్ సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణస్ సంతు పుత్రిణస్ సంతు పౌత్రిణః అధనాస్ సధనాస్ సంతు జీవంతు శరదాం శతం ఈ స్వస్తి చెప్పేస్తే అయిపోయింది.
[36:11]ఏం చెప్తున్నారండి ఇందులో న్యాయేన మార్గేన మహిం మహిశాః నా మహీషుడు అంటే మా దేశాన్ని పరిపాలించే రాజు మా రాష్ట్రాన్ని పరిపాలించే రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయమైన మార్గంలో వెళ్ళాలి ఈ భూమి సుభిక్షంగా ఉండాలి గోవుకి బ్రాహ్మణుడికి ఎప్పుడు శుభం జరగాలి లోకా సమస్త సుఖినో భవంతు ఇక్కడ వెంటనే మనకి క్యాస్ట్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అంతేనండీ బ్రాహ్మణులు రాసుకున్నారు ఈ మంత్రాలన్నీ అందుకే చూడండి గోవుని బ్రాహ్మణుడిని పెట్టారు మిగతా ఎవరుని పెట్టలేదు అని ఎప్పుడు అలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు రానివ్వకండి అది ఏవండీ బ్రాహ్మణుడు అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఆయన సర్వం భగవంతుడికి అర్పించి ఎవడో వచ్చి ఏదో వెహికల్ తో గుద్దేసాడు అనుకోండి అయినా సరే వాడి మీద కక్ష పూనకుండా స్వామి ఎందుకు చేసావో చేయనిలే అని భగవంతుడి పాదాలు పట్టుకుని తన కోసం తన రక్షణ కోసం ఏం చేయకండానంటాడు ఆయనే బ్రాహ్మణుడు అంటాడు ఏ కులంలో పుట్టినా సరే. మరి అలా తన కోసం తను ఏం చేయకుండా జగత్తు కోసం పూజ చేసేవాడికి మనం ఏం చేయాలి గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిచ్చి గోవు కూడా అంతే చూడండి పాపం వెళ్లి ఏ పాము లాగో పులి లాగో ఎవరిని ఏమీ చేయదు చక్కగా పాలిస్తుంది పోషిస్తుంది అలాంటి వాళ్ళకి శుభం జరగాలని అంటే అక్కడ క్యాస్ట్ కాదు క్యారెక్టర్ అది తర్వాత కాలే వర్షతు పర్జన్యః వర్షాలు సకాలంలో పడాలి పృథివీం సస్యశాలినీం మన రైతన్నలు అందరూ ఉన్నారు కదా వాళ్ళకి సుభిక్షంగా పంటలు పండాలి దేశోయం క్షోభ రహితం దేశంలో క్షోభలు ఏమి ఉండకూడదు ఇదిగో ఇప్పుడు వస్తున్న మహమ్మారు లాంటివి. అపుత్రా పుత్రిణస్ సంతు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి పిల్లలు ఉన్న వాళ్ళకి మనవలు పుట్టి వాళ్ళ వంశం పెరగాలి అలాగే ప్రతి వాళ్ళ జీవితం నిండు నూరేళ్లు ఉండాలి అది చెప్పుకుని ముగించడం పూజలో అసలైన సంస్కారం ఇది ఇక్కడి నుంచి అందరూ పూజ చేయండి దీని రికార్డింగ్ కింద పెడతాం కదా అది వింటూ మీరు పూజ చేసేయొచ్చు. అలాగనే ఇదే పూజ శివుడికో అమ్మవారికో గణపతికో సూర్యుడికో స్కందుడికో ఈ దేవతలందరికీ చేయాలంటే అలాగా ఏదో నృసింహ స్వామికో అందరికీ అంటే వాళ్ళందరి పూజా విధానాలు కూడా ఇలా ఆడియో చేసి పెడతాం.
[38:07]అప్పుడు మీకు ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయను నేను ఈ ప్రాసెస్ మాత్రం దీని నుంచి తెలుసుకోండి ఇదే ప్రాసెస్ ఏ దేవతైనా దేవతా శ్లోకాలు మారుతాయి అంతే అలా చేసి ఇక్కడి నుంచి మీకు ప్రతి పండగ వచ్చినప్పుడు అమ్మవారి పండగ వస్తే అమ్మవారి షోడసోపచార పూజ అలాంటివన్నీ పెడతాం చక్కగా ఆడియో పెట్టుకుని ఈ అనుభూతిని చెందుతూ మీరే చేసుకోండి శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.



