[0:00]ఒక దేశం తాలూకు ప్రెసిడెంట్ ని వాళ్ళ కంట్రీలో, వాళ్ళ సొంత ఇంట్లో అర్ధరాత్రి కిడ్నాప్ చేసి, ఫ్లైట్ ఎక్కించి అమెరికాకి తీసుకురావడం. ఇంకో దేశపు తాలూకు అత్యున్నత సుప్రీమ్ లీడర్ ని అసలు ఎటునుంచి అటాక్ వస్తుందో తెలిసేలోపే మిసైల్స్ వేసి ప్రాణాలు తీయడం. ఇవన్నీ ఏదో హాలీవుడ్ స్పై త్రిల్లర్ మూవీస్ సీన్స్ కాదు బ్రో. అక్షరాలా ఈ 2026 స్టార్టింగ్ లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరుగుతున్న రియల్ లైఫ్ ఆపరేషన్స్. జనవరి 3న వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదూరోని ఆయన భార్యని అమెరికా ఫోర్సెస్ కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకెళ్లి క్రిమినల్ ట్రైల్ కి ముందు నిలబెట్టాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే అంటే ఫిబ్రవరి 28న అమెరికా అండ్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద ఎపిక్ ఫ్యూరీ అనే ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేసాయి. ఈ ఆపరేషన్ లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయితుల్లా అలీ ఖమేనితో పాటు వాళ్ళ టాప్ కమాండర్స్ అందర్నీ ఎలిమినేట్ చేసేశారు. ఇప్పుడు ఈ దెబ్బకి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఇదంతా చూస్తే ట్రంప్ తన పాత స్ట్రాటజీలన్నిటినీ పక్కన పెట్టేసి డైరెక్ట్ గా డీక్యాపిటేషన్ స్ట్రైక్స్ అనే ఒక భయంకరమైన స్ట్రాటజీని అమలు చేస్తున్నాడని మనకి క్లియర్ గా అర్థమైద్ది. అసలు ఈ డీక్యాపిటేషన్ స్ట్రైక్ అంటే ఏంటో తెలుసా? మన శరీరానికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో, ఒక దేశానికి ఆ దేశపు మెయిన్ లీడర్ అంత ముఖ్యం. బ్రెయిన్ ని కొట్టేస్తే బాడీ ఎలా పడిపోద్దో, ఒక దేశపు టాప్ లీడర్ ని ఎలిమినేట్ చేసేస్తే ఆ దేశం మొత్తం కన్ఫ్యూషన్ లో పడిపోద్ది. ఎవ్వరికీ ఏం చేయాలో అర్థం కాదు. పవర్ కోసం లోపలే కొట్టుకుని చస్తారు. గతంలో అమెరికా సద్దాం హుస్సేన్ ని, బిన్ లాడెన్ ని, గడ్డాఫీని ఇలాగే టార్గెట్ చేసింది. ఇప్పుడు ట్రంప్ అదే పవర్ఫుల్ గేమ్ ని ఇంకా అగ్రెసివ్ గా స్టార్ట్ చేశాడు. సరే, వెనిజులా అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, క్యూబా మీద ట్రంప్ కన్నుబడింది. క్యూబా మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేయొచ్చు, చేద్దాం. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నా లేదా భయపడుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే? అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మామా. ఈ ప్రశ్న ఇప్పుడు మన కేవలం మనకే కాదు. యోంగ్ యోంగ్ లో కూర్చున్న సాక్షాత్తు కిమ్ మామా మైండ్ లో ఉన్న క్వశ్చన్ కూడా ఇదే. అయితే ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే? ఇరాన్ లో ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ ని కమెయిన్ ని చంపేశాయి. ఈ విషయం నార్త్ కొరియా ప్రజలకి ఎవ్వరికీ ఇది పెద్దగా తెలియదు. కొంతమందికే తెలుసు. అవును, కిమ్ మామా ఈ నిజాన్ని తన సొంత ప్రజలకి తెలియకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతకాలం దాస్తాడో తెలియదు. నార్త్ కొరియా స్టేట్ మీడియాలో అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ మీద చేస్తున్న దాడులను ఖండిస్తూ న్యూస్ వచ్చింది. కానీ కమెయిన్ చనిపోయాడన్న న్యూస్ మాత్రం ఒక్క లైన్ కూడా రానివ్వలేదు. ఎందుకు అలా దాచాడని మీరు ఆలోచిస్తే ఇక్కడే కిమ్ మామా అసలు భయం బయటపడిద్ది. నార్త్ కొరియా అనేది ఒక డిఫరెంట్ కంట్రీ, అక్కడ లీడర్ అంటే ఒక దేవుడు. కిమ్ ని ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన ఒక అజేయుడు అని నార్త్ కొరియా ప్రజలు బలంగా నమ్ముతారు. ఆ నమ్మకమే కిమ్ కి శ్రీరామ రక్ష. ఇప్పుడు అంతటి పవర్ఫుల్ కంట్రీ అయిన ఇరాన్ కి చెందిన సుప్రీం లీడర్ ని అమెరికా ఎలిమినేట్ చేసిందన్న నిజం గనక నార్త్ కొరియా ప్రజలకి తెలిస్తే రేపు మన కిమ్ పరిస్థితి కూడా ఇంతేనా అనే డౌట్ వాళ్ళకి మైండ్ లోకి వస్తది. ఆ లీడర్ మీద భక్తి నమ్మకం కొంచెం తగ్గిద్ది. ఈ భయంతోనే కిమ్ ఈ న్యూస్ ని బయటికి రానివ్వకుండా పూర్తిగా తొక్కేస్తున్నాడంట. కానీ కిమ్ కి లోపల పరిస్థితి ఎంత డేంజర్ గా ఉందో బాగా తెలుసు. మీకు తెలుసా? 2003లో అమెరికా ఇరాక్ మీద దండెత్తి సద్దాం హుస్సేన్ ని టార్గెట్ చేసినప్పుడు అప్పట్లో కిమ్ వాళ్ళ నాన్న అయిన కిమ్ జోంగ్ ఇల్ ప్రాణభయంతో కొన్ని వారాల పాటు బయటికి రాకుండా అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. కానీ ఇప్పుడు కిమ్ అలా దాక్కోవడం లేదు, బయట తిరుగుతున్నాడు. రీసెంట్ గా మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్యోంగ్యాంగ్ జిమ్నాసియం లో జరిగిన ఒక పెద్ద ఈవెంట్ కి ఆయన అటెండ్ అయ్యాడు కిమ్. అక్కడ ఆడవాళ్ళను ఉద్దేశించి మీరు శారీరకంగా బలహీనంగా ఉన్నా, మనోధైర్యం లో చాలా స్ట్రాంగ్ అని ఒక స్పీచ్ ఇచ్చాడు. సో, కిమ్ దాక్కోవడం లేదు అంటే ఆయన భయపడటం లేదని కాదు. ఆయన నమ్ముకున్న సెక్యూరిటీ సిస్టం అలాంటిది. ఈ ప్రపంచంలోనే మోస్ట్ టైట్ సెక్యూరిటీ ఎవరికైనా ఉందంటే అది కిమ్ మామాకి. ఇది ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. కిమ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ ఉండే బాడీగార్డ్స్ చేతుల్లో బ్యాలిస్టిక్ బ్రీఫ్ కేసెస్ ఉంటాయి. ఎవరైనా గన్ ఫైర్ చేస్తే అవి క్షణాల్లో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లాగా మారిపోతాయి. అంతే కాదు, కిమ్ ట్రావెల్ చేసేటప్పుడు డెకాయ్ మోటార్ కేడ్స్ వాడతారు. అంటే ఏ కార్లో కిమ్ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. అప్పటికప్పుడు రూట్లు మారిపోతాయి. ఒకవేళ యుద్ధమే వస్తే ఆయన సేఫ్ గా ఉండడానికి నార్త్ కొరియా కొండల్లో, భూమి అడుగున కూడా అండర్ గ్రౌండ్ బంకర్స్ రెడీగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ అంతా ఒక ఎత్తు అయితే తన తర్వాత ఎవరు, కిమ్ తర్వాత ఎవరు అన్నదానికి సక్సెసర్ ఎవరు, వారసత్వం ఎవరు అన్నదానికి కిమ్ మామా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ ఉమెన్స్ డే ఈవెంట్ కి కిమ్ తన భార్యతో పాటు తన కూతురు కిమ్ జూ ఏను కూడా తీసుకొచ్చాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా మీరు గమనిస్తే కిమ్ తో పాటు కిమ్ యొక్క డాటర్ ఫోటోస్ కూడా బయటికి వస్తున్నాయి. సో, సౌత్ కొరియా స్పై ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం తన తర్వాత నార్త్ కొరియా బాధ్యతలు తీసుకునే వారసురాలిగా కిమ్ తన కూతుర్నే రెడీ చేస్తున్నాడు. కిందటి నెల్లో ఆ పాప కూడా ఒక మిలిటరీ షూటింగ్ రేంజ్ కి వెళ్లి గన్ పట్టుకుని ట్రిగ్గర్ మీద ఏలు పెట్టి ఉన్న ఫోటోస్ చూసి ప్రపంచం కూడా షాక్ అయింది. ఇదంతా చూస్తుంటే కిమ్ తన బ్లడ్ లైన్ ని కంటిన్యూ చేయడానికి పక్కా ప్లాన్ తో ఉన్నాడని అర్థం అయింది. అండ్ ఈ వీడియోకి అసలు స్టోరీ ఇక్కడి నుంచి అంటే కరెక్ట్ గా మధ్యలో నుంచి మొదలైద్ది. చైనా నార్త్ కొరియాలు కలిసి ఆడుతున్న ఈ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే మాస్టర్ ప్లాన్ లోకి వెళ్ళే ముందు చిన్న మాట. మేం వెతికిన ఈ డేటా, ఈ డీప్ రీసెర్చ్ మీకు నిజంగా వర్తనిపిస్తే మన ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా ఎక్కువగా వస్తాయి. క్యూబా మీద కూడా వస్తది. అండ్ ఈ బెల్ ఐకాన్ గట్టిగా కొట్టి వీడియో ని లైక్ చేసి షేర్ చేయండి బ్రో. మీరు ఇచ్చే సపోర్ట్ ఏ ఇలాంటి హిడెన్ ఫ్యాక్ట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఒక మోటివేషన్ లా ఉంటది. ఇక లేట్ చేయకుండా అసలు గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఇదంతా పక్కన పెడితే ట్రంప్ ఇరాన్ ని కొట్టినట్టు నార్త్ కొరియాని ఎందుకు డైరెక్ట్ గా కొట్టలేకపోతున్నాడు అన్నదానికి అసలు పాయింట్. దానికొక ఒకే ఒక్క కారణం న్యూక్లియర్ బాంబ్స్. ఇరాన్ దగ్గర, వెనిజులా దగ్గర లేని ఒక బ్రహ్మాస్త్రం కిమ్ దగ్గర ఉంది. కిమ్ దగ్గర అయితే డజన్ల కొద్దీ వర్కింగ్ కండిషన్ లో ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అవి అమెరికా మెయిన్ ల్యాండ్ ని కూడా హిట్ చేయగలవని ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. అంతే కాదు ఎవరైనా తన మీద అటాక్ చేయడానికి వస్తే ముందుగా న్యూక్లియర్ బాంబ్స్ వాడే హక్కు తనకు ఉందని కిమ్ ఏకంగా ఒక లా కూడా పాస్ చేశాడు. ఈ న్యూక్లియర్ డెటరెన్స్ వల్లే అమెరికా నార్త్ కొరియా మీద డైరెక్ట్ గా అటాక్ చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తది. అయినప్పటికీ కిమ్ కి ప్రశాంతత లేదు. ఎందుకంటే 2019లో వియత్నాంలో, హనోయి లో ట్రంప్ తో జరిగిన మీటింగ్ ని కిమ్ ఇంకా మర్చిపోలేదు. ఆ మీటింగ్ లో ఏదో ఒక పెద్ద డీల్ సెట్ అవుతుందని అమెరికా శాంక్షన్ ఎత్తేస్తుందని కిమ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. ట్రంప్ తన టీమ్ తో సహా సడెన్ గా మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. అండ్ ఈ దెబ్బకి కిమ్ ఖాళీ చేతులతో పరువు పోగొట్టుకుని వెనక్కి రావాల్సి వచ్చింది. అంతే కాదు ఈ సమ్మిట్ జరగడానికి ముందే అమెరికా కి చెందిన నావి సీల్స్ టీమ్ సీక్రెట్ గా నార్త్ కొరియాలో కి వచ్చి లిజనింగ్ డివైసెస్ పెట్టడానికి ట్రై చేసారని న్యూస్ కూడా బయట ఉంది. అప్పుడు కిమ్ కి ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. కూర్చుని మాట్లాడుతున్నాం కదా అని యుఎస్ఏ వాళ్ళని గుడ్డిగా నమ్మారంటే వెనక నుంచి గుణపొందిస్తారని కిమ్ మామా ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్ గెలిచి మళ్ళీ పవర్ లోకి రాంగానే కిమ్ ఏమి సైలెంట్ గా కూర్చోలే. మీరు ఇరాన్ ని కొడితే కొట్టారు. నేను కూడా నా పవర్ ఏంటో చూపిస్తాను అన్నట్టుగా కౌంటర్ స్టార్ట్ చేశాడు. మార్చి ఫస్ట్ వీక్ లో కిమ్ ఒక పెద్ద మిలిటరీ టెస్ట్ చేశాడు. 5000 టన్నుల బరువు ఉన్న చోయ్ హ్యూన్ అనే ఒక కొత్త తరహా నావెల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక ని రంగంలోకి దించాడు. అందులో నుంచి సముద్రం మీదగా దూసుకెళ్లే ఒక స్ట్రాటజిక్ క్రూజ్ మిసైల్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేశాడు. కిమ్ మాటల్లో చెప్పాలంటే గత 50 ఏళ్ళలో నార్త్ కొరియా నావీ లో ఇలాంటి మార్పు రాలేదంట. వాళ్ళ నావీని న్యూక్లియర్ వెపన్స్ తో నింపేస్తున్నానని కిమ్ ఓపెన్ గానే చెప్తున్నాడు. కిమ్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నవాట వాస్తవమే అయినా వాటిని చిన్న సైజులో చేసి మిసైల్స్ లో పెట్టి వదిలే టెక్నాలజీ నార్త్ కొరియా దగ్గర ఉందా లేదా అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కానీ కిమ్ మాత్రం ఎప్పటికప్పుడు వాడి మిలిటరీ పవర్ ని అప్గ్రేడ్ చేస్తానే వచ్చాడు. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే? నార్త్ కొరియా మీద అమెరికా సహా యుఎన్ విధించిన ఇన్ని శాంక్షన్స్ ఉన్నా కిమ్ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వెపన్స్ ఎలా తయారు చేస్తున్నాడు. అక్కడే కిమ్ వాడిన ఒక మాస్టర్ మైండ్ స్కామ్ ఇప్పుడు బయటపడింది. మార్చి 13న అమెరికన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. నార్త్ కొరియా కి చెందిన ఒక వందలాది మంది ఐటి వర్కర్స్ ఫేక్ డాక్యుమెంట్స్, దొంగ ఐడెంటిటీలు వాడి అమెరికాలో టాప్ కంపెనీస్ లో జాబ్స్ సంపాదించారు. వీళ్లు కేవలం అక్కడ ఉద్యోగాలు చేసి జీతాలు తీసుకోవడమే కాదు ఆ కంపెనీల నెట్వర్క్ లో మాల్వేర్ పంపిచ్చి వాళ్ళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని స్టోల్ చేస్తున్నారు. ఇలా వీళ్ళు కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 800 మిలియన్ డాలర్స్ అంటే సుమారు 6,800 కోట్లు అమెరికా నుంచి నార్త్ కొరియాకి పంపించారు. ఈ డబ్బు అంతా కిమ్ తన వెపన్స్ తయారీ కోసమే వాడుతున్నాడు. ఇది కనిపెట్టిన అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ వెస్ట్ వెంటనే నార్త్ కొరియా కి చెందిన అమ్నెకాం టెక్నాలజీ ఆర్గనైజేషన్ తో పాటు వియత్నాం కి చెందిన ఇంకో ఆర్గనైజేషన్ మీద అలాగే ఆరుగురు వ్యక్తుల మీద బ్యాన్ ప్రకటించారు. అండ్ ట్రంప్ త్వరలోనే చైనా విజిట్ చేస్తున్నాడు అన్న టైంలో అమెరికా కావాలని శాంక్షన్స్ విధించి నార్త్ కొరియాని ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టాలని చూస్తుంది. అయితే ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ట్రంప్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేశాడు? ఎందుకు వెనిజులా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేశాడు? నెక్స్ట్ కిమ్ ని టార్గెట్ చేస్తాడా? వీటన్నిటి వెనకాల ఉన్నది కేవలం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లేదా వాళ్ళ డిక్టేటర్షిప్ మాత్రమే అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. ఇదంతా కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ట్రంప్ ఆడుతున్న ఈ భయంకరమైన డీక్యాపిటేషన్ స్ట్రైక్స్ వెనక ఒక పెద్ద ఎకనామిక్ అండ్ జియోపొలిటికల్ మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ఈ బాంబుల మోత వెనక సైలెంట్ గా జరుగుతున్న ఇంకో పెద్ద గ్లోబల్ వార్ కూడా ఉంది. ఈ వార్లో కిమ్ గాని ఇరాన్ గాని కేవలం పావులు మాత్రమే. అసలు ఈ గేమ్ నడిపిస్తున్న సైలెంట్ ప్లేయర్ వేరే ఉన్నాడు. ట్రంప్ వేసిన ఈ ప్లాన్ ని రివర్స్ చేస్తూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న ఆ డ్రాగన్ కంట్రీ మాస్టర్ స్ట్రోక్ ఏంటో అలాగే ఆ డ్రాగన్ కంట్రీ కిమ్ తో మళ్ళీ చేతులు కలిపి అమెరికాకి ఎలా చిక్ పెట్టబోతుందో ఇప్పుడు మాట్లాడదాం. ఆ సైలెంట్ ప్లేయర్ ఎవరో కాదు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది డ్రాగన్ కంట్రీ అనంగానే చైనా. అసలు అమెరికాకి, మిడిల్ ఈస్ట్ దేశాలకి, నార్త్ కొరియాకి జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధాల వెనక మెయిన్ రీసన్ ఆయుధాలు కాదు. న్యూక్లియర్ బాంబ్స్ అంతకంటే కాదు. ఒక రీసనే బట్ మెయిన్ రీసన్ కాదు. ఈ గ్లోబల్ వార్ వెనక అసలు కారణం డబ్బు. అవును బ్రో. ప్రపంచాన్ని శాసిస్తున్న కరెన్సీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరిది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేసిన వెనిజులా గాని ఇరాన్ గాని అలాగే ఇప్పుడు టార్గెట్ చేయబోతున్న క్యూబా గాని ఈ మూడు కంట్రీస్ మధ్య ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఏంటో తెలుసా? ఈ మూడు కంట్రీస్ అమెరికన్ డాలర్ ని కాదని చైనా కరెన్సీ అయిన యువాన్స్ లో బిజినెస్ చేయడం స్టార్ట్ చేసాయి. ఇక్కడే ట్రంప్ కి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డబ్బుతో పాటు ఆయిల్ కూడా. ఆయిల్ ఎక్కడ ఉంటే యుఎస్సే అక్కడ ఉంటది. అసలు ఈ డాలర్ కి ఆయిల్ కి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అయిద్ది. 1974 లో అమెరికా సౌదీ అరేబియా తో ఒక సీక్రెట్ డీల్ చేసుకుంది. అదే పెట్రో డాలర్ డీల్. దీని ప్రకారం ప్రపంచంలో ఏ దేశం అయినా సరే ఆయిల్ కొనాలంటే అది కచ్చితంగా అమెరికన్ డాలర్స్ లోనే కొనాలి. ఆ వచ్చిన లాభాలని మళ్ళీ అమెరికాలోనే ఇన్వెస్ట్ చేయాలి. దానికి బదులుగా సౌదీకి అమెరికా మిలిటరీ ప్రొటెక్షన్ ఇస్తది. ఈ ఒక్క డీల్ తోనే అమెరికన్ డాలర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. గ్లోబల్ ట్రేడ్ లో దాదాపు 82% వాటా డాలర్దే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. చైనా తన యువాన్ కరెన్సీతో ఈ డాలర్ సామ్రాజ్యం మీద సైలెంట్ గా దెబ్బ కొడుతుంది. ఇరాన్ తో చైనా ఏకంగా 25 ఏళ్ళ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ చేసుకుంది. దీని వాల్యూ అక్షరాల 400 బిలియన్ డాలర్స్. 2021 నుంచి ఇప్పటి వరకు అమెరికా శాంక్షన్స్ లో నలిగిపోతున్న ఇరాన్ ని కాపాడింది చైనానే. దాదాపు 140 బిలియన్ డాలర్స్ ఆయిల్ ని ఇరాన్ నుంచి చైనా కొనుక్కుంది. అది కూడా డాలర్స్ లో కాదు. యువాన్ లో. చైనా కొంటున్న ఆయిల్ లో 80% కేవలం ఇరాన్ నుంచే వెళ్తుంది. అది కూడా అతి పెద్ద డిస్కౌంట్ ట్రేడ్స్ కి.
[10:19]అటు వెనిజులా ప్రెసిడెంట్ మదూరో కూడా పబ్లిక్ గానే మేము ఇక డాలర్ వాడం, చైనా యువాన్ తోనే ఆయిల్ అమ్ముతాం అని చెప్పి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మీద 13 డాలర్స్ డిస్కౌంట్ ఇచ్చి మరి చైనాకి ఆయిల్ పంపించాడు. ఇక క్యూబాలో కూడా చైనా 6 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఆయిల్ రిఫైనరీస్ కడుతుంది. ఇదంతా చూస్తుంటే ట్రంప్ కి ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ లో అమెరికన్ డాలర్ కి వాల్యూ ఉండదు. ఆటోమేటిక్ గా అమెరికన్ ఎకానమీ పడిపోతుంది. అందుకే ట్రంప్ డైరెక్ట్ గా చైనా మీద యుద్ధం చేయడు. చైనాకి ఆయిల్ సప్లై చేస్తున్న చైనా కరెన్సీ వాడుతున్న ఇరాన్, వెనిజులా లీడర్స్ మీద ఈ డీక్యాపిటేషన్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ లీడర్స్ ని లేపేస్తున్నాడు. అయితే ట్రంప్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ ని చైనా చాలా కూల్ గా తనకి ఎంత అనుకూలంగా మార్చుకుందో తెలిస్తే మళ్ళా షాక్ అవుతారు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ కలిసి బాంబుల వర్షం కురిపిస్తుంటే చైనా మాత్రం బయటికి మేము శాంతి కోరుకుంటున్నాం, యుద్ధం వద్దు అనే స్టేట్మెంట్స్ ఇస్తుంది. కానీ లోపల జరుగుతున్న స్టోరీ వేరే ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ సీ లో చైనాకి చెందిన లియా వోవాంగ్-1 అనే ఒక పెద్ద స్పైషిప్ సైలెంట్ గా అక్కడ ఉంది. దీని బరువు ఎంతో తెలుసా 30,000 టన్స్, 224 మీటర్ల పొడవున ఈ షిప్ మీద ఫైవ్ బిగ్ రాడార్ డోమ్స్ ఉన్నాయి, హై గెయిన్ యాంటీనాలు కూడా ఉన్నాయి. ఇది యుద్ధ నౌక కాదు దీని నుంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వదు. కానీ ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కూడా ఇదే. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉంటానే అమెరికాకి చెందిన క్యారియర్ మూవ్మెంట్స్ ని, ఆకాశంలో ఎగురుతున్న ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ని, మిసైల్స్ ఎక్కడి నుంచి లాంచ్ అవుతున్నాయో రియల్ టైంలో ట్రాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇరాన్ మిలిటరీకి పాస్ చేస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఇరాన్ ఏ డిఫెన్స్ సిస్టమ్స్ 80% నాశనం అయిపోయినా సరే చైనా ఇస్తున్న ఈ గార్డ్స్ వ్యూ డేటాతో ఇరాన్ మళ్ళీ అమెరికా మీద కౌంటర్ అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక్కడ ఇంకో క్రేజీ విషయం ఏంటంటే పర్షియన్ గల్ఫ్ లో తిరుగుతున్న వేరే దేశాల కమర్షియల్ షిప్స్ మీద కూడా ఇరాన్ డ్రోన్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ డిజిటల్ ట్రాన్స్పాండర్స్ లో చైనీస్ ఓనర్ అంటే లేదా ఆల్ చైనీస్ క్రూ ఆన్ బోర్డ్స్ మార్చేసుకుంటున్నాయి. అంటే సముద్రంలో చైనా పేరు చెప్తే తప్ప బ్రతికే ఛాన్స్ లేని పరిస్థితి క్రియేట్ అయింది. డైరెక్ట్ గా యుద్ధంలోకి దిక్కుండానే అక్కడ సముద్రం మీద రూల్స్ ని చైనా మాండరిన్ భాషలో రాసేస్తుంది. అంతే కాదు ఇప్పుడు ఈ యుద్ధం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఆయిల్ సప్లై ఆగిపోయి క్రూడ్ ఆయిల్ రేట్ బ్యారెల్ కి 100 డాలర్స్ దాటిపోయింది. అండ్ ఓల్డ్ కంట్రీస్ అన్నీ ఆయిల్ రేట్స్ చూసి వణికిపోతున్నాయి. కానీ ప్రపంచంలో అతి పెద్ద ఆయిల్ ఇంపోర్టర్ అయిన చైనా మాత్రం చాలా కూల్ గా ఉంది. ఎందుకు? ఎందుకంటే చైనాకి ఈ పరిస్థితి వస్తుందని 20 ఏళ్ల క్రితమే తెలుసు. అందుకే వాళ్ళు ఏకంగా 1.2 బిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ని రిజర్వ్స్ లో పెట్టుకున్నారు. ఈ స్టాక్ తో కనీసం వాళ్ళు మూడు నెలల నుంచి నాలుగు నెలల పాటు బయట నుంచి ఒక్క చుక్క ఆయిల్ రాకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి తోడు చైనాలో ఇప్పటికీ సగానికి పైగా కార్లు గాని, ట్రక్కులు గాని అన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్ గా మారిపోయాయి. దీని వల్ల చైనాకి దాదాపు 1 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ డిమాండ్ తగ్గిపోయింది. అలాగే సీ రూట్ మీద ఆధారపడకుండా పక్క దేశాల నుంచి భూమార్గం ద్వారా పెద్ద పెద్ద పైప్ లైన్స్ కూడా వేసుకుంది. ఇదే టైంలో మన ఇండియా పరిస్థితి చూస్తే మనం మన ఆయిల్ అవసరాల్లో 25% ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. కానీ చైనా కేవలం 14% మాత్రమే డిపెండ్ అయింది. అంటే ట్రంప్ ఆయిల్ సప్లైని దెబ్బ కొట్టి చైనాని ఆపుదాం అనుకుంటే అది రివర్స్ లో మన లాంటి కంట్రీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడే చైనా ఆడుతున్న ఇంకో మైండ్ బ్లోయింగ్ జియోపొలిటికల్ గేమ్ కూడా ఉంది. అదే తైవాన్ తో మాస్టర్ ప్లాన్. చైనా ఎప్పటికైనా తైవాన్ ఆక్రమించుకోవాలి. దాన్ని మన దేశంలో కలుపుకోవాలనేది వాళ్ళ అల్టిమేట్ గోల్. అంటే వాళ్ళ దేశంలో. కానీ తైవాన్ కి అమెరికా వెనక ఉండి వెపన్స్ సప్లై చేస్తూ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు చైనా ప్లాన్ ఏంటంటే అమెరికాకి ఇరాన్ తో యుద్ధం ఎంత ఎక్కువ కాలం జరిగితే చైనాకి అంత లాభం. ఎలాగంటే రీసెంట్ గా హమాస్ తో గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా కేవలం ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేయడానికి 17.9 బిలియన్ డాలర్స్ ఖర్చు చేసింది. ఓవరాల్ గా మిడిల్ ఈస్ట్ సెక్యూరిటీ కోసం అమెరికా పెడుతున్న ఖర్చు దాదాపు 33 బిలియన్ డాలర్స్. అమెరికా బడ్జెట్ అంతా ఇలా ఇరాన్ తో వాళ్ళ ప్రాక్సీలతో యుద్ధం చేయడానికే ఖర్చు అయితే రేపు తైవాన్ కి సపోర్ట్ చేయడానికి అమెరికా దగ్గర డబ్బులు ఉండవు. ఫోకస్ ఉండదు. ఇదే అదను చూసుకుని చైనా ఈజీగా తైవాన్ ని ఆక్రమించేయొచ్చు. అందుకే చైనా ఇరాన్ ని ఒక పావులా వాడుకుని అమెరికన్ రిసోర్సెస్ ని, డబ్బుని మొత్తం లాగేస్తుంది. మిడిల్ ఈస్ట్ లో పడే ప్రతి అమెరికన్ బాంబ్ చైనాకి తైవాన్ ని ఇంకా దగ్గర చేస్తుంది అనేది ఇక్కడ పచ్చి నిజం అర్థం చేసుకోవాల్సిన నిజం కూడా. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడు మనం నార్త్ కొరియా కిమ్ మావ దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఈ గ్లోబల్ చెస్ బోర్డ్ లో కిమ్ రోల్ చాలా కీ. గత రెండేళ్లుగా చూసుకుంటే కిమ్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కి చాలా క్లోజ్ అయిపోయాడు. ఉక్రెయిన్ వార్ లో రష్యాకి వెపన్స్ గాని, ఆర్టిలరీ షెల్స్ గాని, ఆఖరికి సోల్జర్స్ ని కూడా పంపిస్తా రష్యాతో స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు. ఈ విషయం చైనాకి అసలు నచ్చదు. ఎందుకంటే తన గుప్పెట్లో ఉండాల్సిన కిమ్ రష్యా వైపు వెళ్ళిపోవడం చైనాకి అంతగా ఇష్టం ఉండదు కదా. అందుకే ఇప్పుడు మళ్ళీ కిమ్ ని తన వైపు తిప్పుకోవడానికి చైనా ఒక పెద్ద స్కెచ్ వేసింది. నార్త్ కొరియా ఎకానమీ పూర్తిగా శాంక్షన్స్ ఉన్నా సరే చైనా సైలెంట్ గా వాళ్ళతో ట్రేడ్ పెంచేసింది. గత ఏడాది చైనా నార్త్ కొరియా మధ్య జరిగిన ఎక్స్పోర్ట్స్ 2.3 బిలియన్ డాలర్స్. గత ఆరేళ్లలో ఆల్ టైం రికార్డు ఇది. ఆ ట్రేడ్ లో ఏం జరుగుతుందో తెలుసా? యుఎన్ శాంక్షన్స్ వల్ల నార్త్ కొరియా బొగ్గు లాంటి కోల్ వాటిని అమ్మలేకపోతుంది. అందుకే కిమ్ ఒక డిఫరెంట్ ఐడియాతో వచ్చాడు. చైనా వాళ్ళు నార్త్ కొరియాకి ముడి సరికి ఇస్తే అక్కడ చాలా తక్కువ కాస్ట్ కి లేబర్ కాస్ట్ కి పనిచేసే జనాలతో ఫేక్ ఐలాషెస్ గాని, ఫేక్ బియర్డ్స్ గాని చేయించి వాటిని మళ్ళీ చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ హెయిర్ ప్రొడక్ట్స్ బిజినెస్ గత 10 ఏళ్ల లోపు ఎంత పెరిగిందో తెలుసా? ఎన్ని రెట్లు పెరిగిందో తెలుసా 10 ఏళ్లలో? 327 రెట్లు పెరిగింది. దీంతో పాటు నార్త్ కొరియా దగ్గర ఉన్న టంగ్స్టన్, మాలిడెనం లాంటి మోస్ట్ కాస్ట్లీ రాకెట్స్ అండ్ మిసైల్స్ తయారీలో వాడే మెటల్స్ ని చైనా భారీగా కొంటుంది. రీసెంట్ డేటా ప్రకారం 31.5 మిలియన్ డాలర్స్ టంగ్స్టన్, 17.2 మిలియన్ డాలర్స్ మాలిడిడెనం ఓర్ ని చైనా కొని స్టాక్ పెట్టుకుంది. బయట దేశాలకి వెళ్లకుండా తక్కువ రేటుకి కిమ్ దగ్గర నుంచి లాగేస్తుంది. ఈ బిజినెస్ ని ఇంకా పెంచడానికి చైనా నార్త్ కొరియా బోర్డర్ లో ఉన్న డాంగ్ సిటీ లో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేస్తుంది. న్యూ యాలు రివర్ బ్రిడ్జ్ దగ్గర కొత్తగా ట్రక్ లైన్స్ వేస్తున్నారు. బోర్డర్స్ లో కస్టమ్ బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ వారమే బీజింగ్ నుంచి ప్యోంగ్యాంగ్ కి మళ్ళీ ప్యాసింజర్స్ ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ట్రంప్ త్వరలో చైనా విజిట్ చేస్తున్నాడు. ఆ టైంలో కిమ్ తో మళ్ళీ మాట్లాడాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నాడు. అందుకే ట్రంప్ వచ్చేలోకి కిమ్ ని పూర్తిగా కంట్రోల్ లో పెట్టుకోవాలని చైనా ఈ ఎకనామిక్ సపోర్ట్ అంతా ఇస్తుంది. వీటన్నిటికీ మించి చైనా తీసుకున్న ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ ఏంటంటే ఎప్పటినుంచో నార్త్ కొరియాని మీ అన్వాయుధాలు వదిలేయండి. డీ న్యూక్లియరైజేషన్ అని చెప్తూ వస్తున్న చైనా రీసెంట్ గా తన అఫీషియల్ డిఫెన్స్ వైట్ పేపర్ లో ఆ పదాన్ని తీసేసింది. అంటే ఇన్ డైరెక్ట్ గా నీ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉంచుకో నాకేం ప్రాబ్లం లేదు. నేను నీకు సపోర్ట్ ఉంటాను అని కిమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, ఇది ఓవరాల్ గా ప్రపంచంలో జరుగుతున్న అసలు గేమ్. పైకి చూస్తే ట్రంప్ ఇరాన్ ని కొడుతున్నాడు. వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశాడు. నెక్స్ట్ నార్త్ కొరియా కిమ్ ని టార్గెట్ చేస్తాడు అన్నట్టు కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో డేటా అనలైజ్ చేస్తే ఇదంతా డాలర్ ని కాపాడుకోవడానికి ట్రంప్ ఆడుతున్న గేమ్. ఈ గేమ్ ని చైనా తన 30,000 టన్నుల స్పైషిప్ తో ఆయిల్ రిజర్వ్స్ తో తైవాన్ మాస్టర్ ప్లాన్ తో నార్త్ కొరియా బోర్డర్ ట్రేడ్ తో ఎంత సైలెంట్ గా ఎంత బ్యూటిఫుల్ గా రివర్స్ చేసిందో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. అటు ఇరాన్ లో అమెరికా డబ్బు తగలబెడితే తైవాన్ లో పని ఈజీ అయిద్ది. ఇటు నార్త్ కొరియాని గుప్పెట్లో పెట్టుకుని ట్రంప్ కి చెక్ పెట్టొచ్చు అన్నదే డ్రాగన్ కంట్రీ పక్కా స్ట్రాటజీ. నాకొకటి అర్థమైంది ఆయుధాలతో యుద్ధాలు చేసేవాడు గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఎదుటోడి ఆయుధాలతో యుద్ధం చేద్దాం అనుకున్నవాడు మాత్రం అంటే ఈ స్ట్రాటజీలు వాడే వాళ్ళు మాత్రం ఎప్పటికైనా గ్లోబల్ విన్నర్ అవుతాడని చైనా ప్రూవ్ చేస్తుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ట్రంప్ చైనా విజిట్ కి వెళ్ళినప్పుడు ఈ కోల్డ్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుద్దో కిమ్ ఎవరి వైపు ఉంటాడో ఇదంతా టైమే డిసైడ్ చేయాలి. సో, ఇది మేటర్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారంటే కచ్చితంగా మా రీసెర్చ్ మీ లైఫ్ లో మీ నాలెడ్జ్ లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసిందని నేను అనుకుంటున్నా. మరి నేను మీకు వాల్యూ యాడ్ చేసినప్పుడు మీరు కూడా మా లైఫ్ కి చిన్న వాల్యూ యాడ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానెల్ ని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు కచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తది, ఫాస్ట్ గా చూడొచ్చు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ లవ్ యు సో మచ్. దిస్ ఈజ్ యువర్ వి ఆర్ సైనింగ్ ఆఫ్.



