[0:00]సామెతల గ్రంథం 31వ అధ్యాయము, 10వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుదాం నేను ఇవాళ మదర్స్ డే ఎంతమందికి తెలుసో మరి తల్లులందరికీ తల్లుల దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సో దాని పురస్కరించుకొని రెండు భాగాల్లో ఈ వర్తమానాన్ని త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక భాగం ఏంటని అంటే తల్లులు ఏ విధంగా ఉంటారు. వాక్యానుసారమైన తల్లులు ఏ విధంగా ఉంటారు అనేది ఒక భాగం అయితే రెండో భాగం ఏంటని అంటే ఆ ఆ తల్లులను ఎలాగు గౌరవించాలి. ఆ తల్లులను మనం ఎలాగ చూసుకోవాలి అనే దాని గురించి రెండవ భాగంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మొదటి భాగం చాలా క్లియర్ గా ఈ వాక్యాల్లో రాయబడి ఉంది కాబట్టి మనం చదివినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలను ఒక్కొక్కటిగా నేను చెప్తూ వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఒక మంచి తల్లి మొదటిగా మంచి భార్యగా ఉంటదని వాక్యం చెప్తా ఉంది. ఎలా ఉంటదంట మంచి భార్యగా ఉంటది. మనం చదివినటువంటి మాట 10 వ వచనం నుండి చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును అతని లాభ ప్రాప్తికి వెలుతి కలగదు. ఆ తర్వాత దాని కంటిన్యూవేషన్ ఏంటంటే ఆ అతనికి మేలు ఓకే ఆమె తాను బ్రతుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. సో ఈ నాలుగు వచనాలు 12 వ వచనం వరకు లేదా మూడు వచనాలు. 10, 11, 12 వచనాలు ఈ మూడు వచనాలు దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే మంచి తల్లిగా ఉండేటటువంటి స్త్రీ మొదటి మంచి భార్యగా ఉంటుంది. మంచి భార్యగా ఉండడం అన్నది అంత ఈజీ కాదు, అందరూ మంచి భార్యలుగా ఉండరు. గుణం కలిగినటువంటి భార్యలు, మంచి భార్యలు చాలా అరుదు అని వాక్యమే చెప్తుంది. ఎందుకు లోకంలో ఆ లేనిపోని గందరగోళాలు జరుగుతా ఉన్నాయి కుటుంబాల్లో అని అంటే ఎక్కువ అంటే పురుషులు తక్కువ ప్రాబ్లం స్త్రీలు ఎక్కువ ప్రాబ్లం అనేది కాదు. స్త్రీలలో కూడా ఇప్పుడు మనం స్త్రీల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీలలో ఎక్కువమంది సరిగా మంచి భార్యలుగా ఉండకపోవడం వలన కుటుంబాలు సరిగా ఉండట్లేదని వాక్యం తెలియజేస్తా ఉంది. సో ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేయాలి. స్త్రీలైన వారు ఒకవేళ ఇంకా పెళ్లిళ్లు కాకపోతే గనుక మీకు పెళ్లి అయిన తర్వాత దేవుని వాక్యం నిర్వచిస్తున్నటువంటి ఈ గొప్ప వచనానికి అనుకూలంగా మీరు ఉండగలరా? ఈ ఇది ఆశగా మీరు పెట్టుకొనగలరా? నేను గుణం కలిగిన మంచి భార్యగా ఉంటాను. మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లేకపోతే నా స్నేహితులు వాళ్ళు ఎలాగో వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకుంటున్నా ఎలాగో వాళ్ళ జీవితాల్ని జీవిస్తా ఉన్నప్పటికీ నేను మాత్రము అలా వాళ్ళని మాదిరిగా పెట్టుకోడు, నేను వాక్యాన్ని మాదిరిగా పెట్టుకొని నేను గుణం కలిగినటువంటి మంచి భార్యగా నేను ఉండాలి. ఓకే గుణం కలిగిన మంచి భార్యగా ఉండాలి. రెండు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాడు గుణవతి అయిన భార్యకి ఉండే రెండు లక్షణాలు అక్కడ చెప్పాడు అక్కడిందన్నియు కూడా అవే లక్షణాలు గుణవతి అయిన భార్యకు ఉండే లక్షణాలే కానీ భర్త పట్ల రెండు లక్షణాల్ని అక్కడ రాశాడు. మొదటి లక్షణం ఏంటని అంటే భర్త నమ్మే విధంగా ఉండాలి భార్య. నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్య ఈ డబ్బులు ఏం చేసేస్తదో లేకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్య టీవీ చూసుకుంటా కూర్చుంటదా? నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత నా భార్య ఏం చేస్తుందో అన్న టెన్షన్ భర్తకి ఉండకూడదు. నా భార్య నాయొక్క సమక్షంలోనూ నేను లేనప్పుడును నా భార్యను నేను నమ్మొచ్చు. నా భార్యను డబ్బులతో నమ్మొచ్చు. నేను డబ్బులు ఇస్తే ఆమె జాగ్రత్త ఖర్చు పెడతది. లేకపోతే మాట విషయంలో నమ్మొచ్చు ఎవరికైనా ఏమైనా మాట చెప్పమంటే సరిగ్గా ఉన్నదున్నట్టుగా చెప్తాది. భార్య ఎప్పుడైతే భర్త యొక్క నమ్మకాన్ని పొందుకుంటదో అక్కడ భార్య సంతోషంగా ఉంటది భర్త కూడా సంతోషంగా ఉంటాడు. గుణవతి అయిన భార్య అంటే ఎవరు అని అంటే భర్త దగ్గర నమ్మకంగా ఉండేటటువంటిది. ఏ భర్త అయితే ఆ భార్యను చూసి నమ్మకంగా ఉండగలడో ఎస్ నా భార్యను నేను కాన్ఫిడెంట్ గా నేను నా భార్యను నమ్మగలను అంటాడో ఆమె గుణవతి అయిన భార్య. మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా భర్త ఒకవేళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే భర్త ఒకవేళ సరిగ్గా లేకపోతే సరిగా లేకపోతే సరిగా చేసుకోవాలి సరిగా అయ్యేలాగా ఉండాలి ఆయన సరిగ్గా లేడని మన నమ్మకత్వాన్ని మనము కోల్పోనక్కర్ల. నమ్మకత్వం అన్నది అవతల వాళ్ళ పైన ఆధారపడి ఉండక్కర్ల. అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే నీ నమ్మకత్వాన్ని నీవు నిలుపుకోవచ్చు. సో ఈ ఉదయకాల సమయంలో గుణవతి అయిన భార్యగా స్త్రీలు ఉండాలి. మంచి మహిళ మంచి ఉమెన్ గా ఒక స్త్రీ ఉండాలి అని అంటే ఆమె మంచి వైఫ్ గా ఉండాలి. మంచి వైఫ్ కి మంచి గుణం ఉంటది ఆమె నమ్మకత్వంగా ఉంటది మూడవది ఆమె మేలు తలపెడతది కానీ హస్బెండ్ కి నష్టం కలిగించదు. ఆమె తాను బ్రతుకు దినములన్నియు అతనికి మేలు చేయును గానీ కీడేమియు చేయదు. సో మొట్టమొదట మంచి మదర్ ఎవరు అని అంటే గుణవతి అయిన భార్య అయి ఉండాలి. మంచి మదర్ ఎవరు అని అంటే భర్త యొక్క నమ్మకాన్ని పొందుకోవాలి. మంచి మదర్ ఎవరు అని అంటే తన భర్తకి ఎప్పుడూ మేలు చేసేదై ఉండాలి. సో ఆ ఈ ఈ విషయాల్ని ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఆల్రెడీ స్త్రీలు ఈ విషయాలు లేని వారేం కాదు ఉన్నవారే కానీ వాటిని పట్టుకొని వెళ్ళాలి. ఈ రోజుల్లో నమ్మకంగా ఉండడం లేకపోతే గుణం కలిగి ఉండడం అన్నవి పెద్ద గొప్ప విషయాలుగా చూడబడట్లే. ఏముంది మనం గుణం కలిగి ఉండడం వల్ల ఏంటి లాభం అందరూ చూడు ఎలా ఉంటున్నారో వాళ్ళలాగా మనం ఉండాలి. కదా ఏ సినిమా చూసినా ఏ సీరియల్ చూసినా ఏ లైఫ్ చూసినా ఒక పది మంది నిన్ను నిల్చోబెడితే ఆ పది మందిలో మనం చూసేది భయంకరమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఏ. అయితే ఇక్కడ ఉన్నటువంటి యవ్వన స్త్రీలు గాని పెళ్లైన వారు గాని పిల్లలు కలిగినటువంటి వాళ్ళు గాని ఎవరైనా సరే. పిల్లలు లేకపోయినా సరే మీరు వాక్యానుసారమైనటువంటి మంచి స్త్రీగా జీవించాలనుకుంటే గనుక గుణాన్ని వదలకూడదు మీరు నమ్మకత్వాన్ని భర్త పట్ల నమ్మకత్వాన్ని ఆ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. చివరిది మేలుకరంగా ఉండాలి కానీ నష్టం కలిగించేలాగా ఉండకూడదు. సో నేను ఈ మధ్య చదువుతా ఉంటే ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి చాలా మంది ప్రాబ్లమ్స్ చాలా ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. పెళ్లిళ్లు అవుతది ఆరు నెలల్లోనే ఆ మేము కలిసి ఉండలేం అని అంటున్నారు. లేతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుద్ది ఇంకా వద్దు అనుకుంటారు. లేదా 10, 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి కథ అని అంటే ఎక్కువగా వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటని అంటే భర్త నమ్మకత్వాన్ని భార్య కోల్పోవడం చాలా సందర్భాల్లో ఒక కారణంగా కనిపిస్తది. నేను ఐ కెనాట్ ట్రస్ట్ హర్ అని అంటాడు. ఆయన కూడా అలాగే నమ్మకత్వం లేకుండా జీవించవచ్చు డెఫినెట్లీ సో అది కూడా కారణమై ఉండొచ్చు కానీ స్త్రీలు మీ యొక్క నమ్మకత్వాన్ని నిలుపుకోవాలి మీ యొక్క గుణాన్ని నిలుపుకోవాలి మీ యొక్క మేలు చేసే తత్వాన్ని మర్చిపోకూడదు. ఎ గుడ్ వైఫ్. రెండవ ప్రధానమైన లక్షణం స్త్రీకి ఉండవలసింది ఏంటి అని అంటే 13వ వచనం నుండి కష్టపడే తత్వం ఉండాలంట అఫ్ కోర్స్ మనవాళ్ళు కష్టాన్ని గురించి ఏం నేర్పించనక్కర్ల మన స్త్రీలందరూ ఎక్కువ కష్టపడి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునే స్త్రీలు ఉన్నారు ఇక్కడ. సో కష్టాన్ని గురించి వీళ్ళకి నేర్పించనక్కర్లేదు. చూడండి 12వ వచనం నుండి 13 ఆమె గొర్రె బొచ్చును అవిసెనారును వెతుకును. తన చేతులారా వాటితో పని చేయును వర్తకపు వాడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటి తోటే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొని పోనును.
[9:19]అక్కడ వరకు చూద్దాం ఆమె కష్టపడే తత్వం కలిగిన స్త్రీ. మంచి మదర్స్ అందరూ కూడా బాగా కష్టపడే వాళ్ళు. మంచి మదర్స్ అందరూ మంచి వైఫ్స్ ఫస్ట్ మంచి మదర్స్ అందరూ మంచి హార్డ్ వర్కర్స్ కష్టపడతారు. కష్టపడతారు అన్ని విధాలా కష్టపడతారు. కుటుంబానికి సేవ చేయడానికి వంటలు వండడానికి కదా అన్ని ఇంటి పని అంతా చేయడానికి కష్టపడతా ఉంటారు. రెండో 14 వ వచనంలో ఏమని ఉంటదంటే ఆమె కుటుంబానికి బెస్ట్ ఇస్తది. బెస్ట్ ఇస్తది అని ఎలా తెలుసు వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. దూరం నుంచి ఎందుకు తేవాలి ఆ మాట చదువుతుంటే దూరం నుంచి తేవడం ఏంటి అని అనుకుంటున్నా. దూరం నుంచి తేవడం ఏంటి. మన వీధిలో ఉన్నాయో ఎందుకు తేవట్లేదు. దూరం నుంచి తేవడం అంటే అర్థం ఏమై ఉండొచ్చు. ఎక్కడ బెస్ట్ దొరుకుతాయో అక్కడ తెస్తుంది. వర్తకపు ఓడలు అని అంటే ఈ బిజినెస్ ఓడలు కమర్షియల్ షిప్స్ అన్నమాట. అవి ఏంటంటే మన దేశంలో ఉన్న బెస్ట్ థింగ్స్ ని తీసుకొని వెళ్తాయి వేరే చోటకి. అప్పుడు ఆ దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ బెస్ట్ వాటిలో నుంచి కొనుక్కుంటారు. వాళ్ళ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ నుంచి ఉన్న వేస్ట్ క్వాలిటీ తీసుకెళ్తే ఎవరైనా తీసుకుంటారా. బెస్ట్ క్వాలిటీవి తీసుకుంటారు. అలా ఈమె కూడా ఏం చేస్తదంట అంటే హార్డ్ వర్క్ చేస్తది రెండోది ఏం చేస్తదో తెలుసా బెస్ట్ ఇస్తది ఫ్యామిలీకి. ఏం చేస్తుందండి ఫ్యామిలీకి బెస్ట్ ఇస్తది. ఆమె ఫుడ్ లో బెస్ట్ ఇస్తది. టైం లో బెస్ట్ ఇస్తది ఆలోచనలో బెస్ట్ ఇస్తది. కుటుంబానికి ఏది కావాలో దాంట్లో ప్రతిదీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తది. అలాంటి వాళ్ళు గుడ్ మదర్స్ అని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత ఆమె చీకటి తోటే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును అంటే ఆమె టైం కి పని చేస్తది. హార్డ్ వర్క్ లో భాగం ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా అని క్వాలిటీ మిస్ అవ్వకూడదు టైం మిస్ అవ్వకూడదు. నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా కాబట్టి ఈ మాడిపోయిన దోసె తినే వెళ్ళు అని అనకూడదు. నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి ఇలా అయితే ఏమైంది ఏం కాదులే పో అని అనకూడదు. నేను కష్టపడుతున్నాను కానీ క్వాలిటీ కూడా బెస్ట్ ఇస్తాను. భర్త అనుకోవాలి ఆ హోటల్ దగ్గరికి వెళ్లి తిని బదులు ఇక్కడే బెస్ట్ లే అక్కడ ఒక 10 రూపాయలు వేస్ట్ అవుద్ది స్త్రీలు బెస్ట్ ఇవ్వడం కోసం ఆలోచన చేయాలి. రోజు చేసే పనే కానీ రోజు చేసేదే బెస్ట్ గా ఎట్లా చేయగలం. రోజు వండే వంట చిమిడిపోయి ఉంటది కదా కొద్దిమంది ఇళ్లల్లో భోజనం. ఇప్పుడు దానికి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు పిల్లలకి అట్లా ఉంటే ఎక్కువ తినలేరు. అంటే నచ్చదు బేసికల్లీ వాళ్ళకి కూడా నచ్చదు మదర్స్ కూడా నచ్చదు మదర్స్ హ్యాపీగా తింటారా చిమిడిపోయిన అన్నం. ఆ సూపర్ గా ఉండా నేను అని తినరు కదా వాళ్లకు కూడా ఏమనిపిస్తది ఏంటో ఏదో ఇలా అయిపోయింది ఇవాళ అని అనుకుంటూనే తింటాడు. ఒకసారి అయింది పర్వాలేదు. రెండో పూట అయింది మూడో పూట కన్నా జాగ్రత్త పడాలి. నేర్చుకోవాలి వెళ్లి అడగాలి అమ్మ ఆ లేతే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నో ఎవరినో ఒకళ్ళని అడగాలి ఇది చిమిడిపోతుంది నీళ్లు ఎక్కువ అవుతున్నాయా కారణం నీళ్లు తక్కువ అవుతున్నాయా లేతే ఎట్లా వండాలి ఇవి. కష్టపడాలా. మీరు కష్టపడట్లేదు అని నేను అన్నాను మీరు అత్యంత కష్టపడేటటువంటి వాళ్ళు వి రియల్లీ సల్యూట్ ఆల్ ద మదర్స్ యర్. నేను ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను. సో మదర్స్ కి చెప్పట్లేదు ఇక్కడ ఉన్న విషయాలు ఒక విధంగా మదర్స్ కి కూడా వర్తిస్తాయి కానీ మదర్స్ కాబోయే వాళ్ళు కూడా ఈ విషయాల గురించి ఆలోచన చేయాలి. వెన్ యు బికమ్ మదర్స్ వాట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేయింగ్ దేవుని వాక్యం ఏమని చెప్తుంది తల్లులు ఎట్లా ఉండాలి. స్త్రీలు ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. నేను ఎప్పుడూ దీని పైన ప్రసంగం చేయలా ఇదే ఫస్ట్ టైం ప్రసంగం చేయడం ఈ వాక్యభాగం పైన. చూస్తా ఉంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తది ఇంత విజ్డమ్ ఒక్క చిన్న అధ్యాయంలో 10 వచనాలు తర్వాత స్టార్ట్ అయింది కదా అక్కడి నుంచి ఉన్న జస్ట్ 21 వచనాల్లో ఇంత జ్ఞానం ఉందా వాక్యంలో ఇన్ని వచనాల్లోనే ఇంకా ఎక్కడికి వెళ్లక్కర్ల. అంటే వాక్యంలో ఇంక ఎంత జ్ఞానం ఉంటదండి. సరే ఎనీవే. క్వాలిటీ మిస్ అవ్వకూడదు టైం మిస్ అవ్వకూడదు. చేసాంలే అని 10న్నరకి చేస్తే పదింటికి వెళ్ళేవాడు అక్కడ తింటాడు తిట్లు. ఏందయ్యా 10న్నరకి వచ్చావు అంటారు వాళ్ళు. నా భార్య లేట్ చేసిందండి టిఫిన్ అండడానికి కుదిరిద్దా కుదరదు. పొద్దున్నే లెగుస్తదంట. స్త్రీలకు ఉండవలసిన మంచి లక్షణం ఇది ఆ ఉదయాన్నే లేచి ఇల్లు చక్కపెట్టడం. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం. ఉదయాన్నే లేచి ఈ రోజుకి ఏం చేయాలి అని ఆలోచన చేయడం. సాడ్ విషయం ఏంటో చెప్పనా. ఈ మధ్య స్త్రీలు ఎట్లా అయిపోతున్నారు అంటే ఇంట్లో అందరి కన్నా లేట్ లెగుస్తారు అన్నమాట వాళ్లే. లేదు అది ఆ అది మంచి పద్ధతి కాదు మన సంప్రదాయ ప్రకారంగా కూడా ఇప్పుడు గర్ల్స్ కి కోపం రావొచ్చు అన్న ఏంటన్నా నువ్వు ఇప్పుడు మా అమ్మ రేపటి నుంచి ఎరగదేస్తది. ఏది మంచిదో అది కానీవాలి తప్పదు ఏం చేస్తాం. చదువుకునే నెపంతోటో లేతే ఉద్యోగం లేతే ఇంకొకటి ఇంకో నెపంతోటో మనం కొన్ని డిసిప్లిన్స్ ని వదిలేయకూడదు.
[15:05]ఆమె చీకటి తోటే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును అంటే ఆ పనికత్తెలు మనకు పని చేసే వాళ్ళు లేరు కానీ ఒకవేళ ఉంటే గనుక వాళ్ళకి ఏం పని ఇవ్వాలి అని ఆలోచన చేస్తారంట. అంటే ఈమె చేయగా పని ఇంకా ఆమె చేయలేనటువంటి పని ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి అప్పగిస్తది. కానీ పని మాత్రం చేస్తారు అందరూ కలిసి ఇంటి పని మాత్రం అయిపోవాలి అంతే. పని డివైడ్ అవుతది టైం కి అయిపోద్ది పని క్వాలిటీ తోటి అవుతది అర్థమవుతుంది కదా. ఈ చివరిది కూడా ఇంపార్టెంట్ అది ఏంటంటే తన పనికత్తెలకు కింద రాసింది కదా పనిని ఏర్పరచును అని ఉందా మీకు కింద చిన్న అక్షరాల్లో పనిని ఏర్పరచును. పని మీరు చేయలేనంత పని ఉంటే గనుక పని సహాయం తీసుకోవడంలో తప్పు లేదు తీసుకోవాలి. పని సహాయం తీసుకోవడంలో తప్పు లేదు కానీ పని చేయకపోవడంలో తప్పు ఉంది. పని చేయాలి నువ్వు చేయలేకపోతున్నావు పని హెల్ప్ తీసుకునైనా చేయాలి పని అయిపోవాలి అంతే. మన మదర్స్ కి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటని అంటే మా మదర్ తోటి కూడా చాలా రోజులు ప్రాబ్లం ఏంటని అంటే ఆమె పని చేయలేకపోయినా ఆమెకి మించిన పని అయినా కూడా చేయాలనుకుంటారన్నమాట. వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు. వేరే వాళ్ళు హెల్ప్ అవసరం లేదు వేరే వాళ్ళు వచ్చి గ్లాస్ కడిగినా నచ్చదు వాళ్ళకి ఏం కడిగారు చూడు ఇదిగో కడగమంటారు ఏంటి కడగడం ఇదేనా కడగడం. వేరే వాళ్ళు కర్చీఫ్ ఉతికినా నచ్చదు. వేరే వాళ్ళు ఇల్లు తుడిచినా నచ్చదు. కష్టపడాలి ఎట్ ది సేం టైం పని అవసరమైనప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి ఎందుకని అంటే పని ఉండే కొందకి విస్తరిస్తా ఉంటది పెరుగుతా ఉంటది. అలా పెరిగిన తర్వాత కూడా పనిని మీ పైన వేసుకుంటే మీకు ఆరోగ్యము పాడవుతది. సో ఆ ఈ విషయం ఇది వరకు కూడా చెప్పి ఉంటాను ఆ స్త్రీలు ఎంత పని చేస్తారో పురుషులకి యాక్చువల్లీ అర్థం కాదు. పురుషులకి అర్థం కాదు. పురుషులు ఏమనుకుంటారంటే ఇంట్లోనే ఉంటారు ఏంది నేను అక్కడికి వెళ్లి వచ్చాను నువ్వు ఏం చేసావ్ అన్నట్టుగా ఉంటది. కానీ యాక్చువల్లీ పురుషులకి స్త్రీలు పని అర్థం అవ్వాలి అని అంటే ఇంట్లో ఉండి వాళ్ళు టైం వేస్ట్ చేయట్లేదు వేస్ట్ గా వాళ్ళు ఏం చేయట్లేదు నేనే ఇరగదీసినను అనుకునే వాళ్ళు ఒక్క రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మొత్తం స్త్రీ చేసేవన్నీ చేయాలి అప్పుడు తెలిసిపోద్ది వాళ్ళు ఇంట్లో ఉండి టైం పాస్ చేయట్లేదు అని. సో నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అయిందంటే నేను యూబీఎస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి అట్లా ఉంటది కదా. అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్నగా ఏదో జాడించి అట్లా చేసేవాడినేమో అసలు మా అమ్మ ఏం చేయనిద్ది నేను తిన్న ప్లేట్ కూడా తీసేవాడిని కాదు అంత దారుణంగా ఉండేది నా పరిస్థితి. తిన్న ప్లేట్ కూడా మా అమ్మయే తీసుకెళ్ళాలి అట్లా ఉండే పట్టుకి సడన్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతకాల్సి వచ్చింది. అక్కడ వాషింగ్ మెషిన్ ఉంటది కానీ డబ్బులు సింగిల్ స్టూడెంట్స్ కదా అదన్నా డబ్బులు మిగులుతాయని వాషింగ్ మెషిన్ కి ఇవ్వకుండా నేను ఉతుకుదాం అనుకున్నాను. ఫస్ట్ టైం ఉతకడానికి కూర్చున్నాను వారం బట్టలు. వారం అంటే ఏడు జతలు ఉంటాయి కదా యూజువల్లీ ఏడు లేదా ఇంకా ఓ పది జతలు అట్లా ఉన్నాయేమో. ఆ పది జతలు అయిపోయినాయి ఇప్పుడు ఉతుక్కోవాలి వీకెండ్ వచ్చింది సాటర్డే ఉతకాలి మండే కల్లా మళ్ళీ రెడీ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటాయి. ఇది ప్లాన్ వచ్చేసావ అన్ని వేసుకుని కూర్చున్నాను ఒక అరగంట అయ్యే పట్టుకి ఉతకాల్సిన బట్టలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్నే బట్టలు అయినాయి కానీ నేను కూర్చున్నాను కదా లెగలేక పోయాను. అరేయ్ ఇదేంటి ఇంత కష్టంగా ఉంది సరే ఇంకేం చేసే ఇంక ఎలాగో నేనే చేయాలి ఇంక వేరే వాడిని వచ్చి ఉతుకరా అంటే ఉతకడు కదా. వేరే వేరే అంటే చేస్తారేమో కానీ ఉతకడం దగ్గర ఎవరు నేను కూడా వస్తాను అని అనరు కదా. నేను ఇంచుమించుగా రెండు గంటలు ఉతుక్కుంటాను అది ఆ బట్టలే. ఎందుకు రాదు కదా మెల్లిగా చేసుకుంటే ఏదో చేసుకుంటే టు అవర్స్. టు అవర్స్ ఉతికే పట్టుకి నా ఎనర్జీ మొత్తం అయిపోయినట్టు నడువంతా పట్టేసినట్టు. ఒరే నీకు ఇంత కష్టమా బట్టలు ఉతకడం ఊరికే ఏదో ఇట్టా అని తిప్పేట్టు పడేస్తున్నారు వీళ్ళు మనకేంటి ఇంత కష్టంగా ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళ ప్రాక్టీస్ ని బట్టి వాళ్ళు కొంచెం బెటర్ గా ఉండొచ్చు ఏమో కానీ ఈజీ ఏమి కాదు అది. అదేమి ఈజీ కాదు దెబ్బకు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా డాడీని ఫోర్స్ చేసి వాషింగ్ మెషిన్ కొనిపించా ఇంట్లో. వాషింగ్ మెషిన్ కొనిపించా ఎనీవే అది చేసినప్పుడే దాని కష్టము తెలుస్తది. స్త్రీలు కూడా వాళ్ళు చేయలేనంత కన్నా ఎక్కువ కష్టాన్ని నెత్తి పైన వేసుకో అక్కర్ల సహాయం తీసుకోవాలి. ఇంకా ఇళ్లల్లో పిల్లలు ఉంటే వాళ్ళ సహాయం తీసుకోవాలి తప్పేమీ లేదు నేను వాళ్ళకి పని చెప్పడం వల్ల వాళ్ళు ఏమి తక్కువ అయిపోరు. పని నేర్పించాలి. ఇప్పుడు నాలాంటి వాడికి బట్టలు జాడించడం కూడా నేర్పించకపోవడం బట్టి వెళ్ళినప్పుడు ఏమైంది నేను ఒక్కడినే బతకాల్సి వచ్చినప్పుడు కష్టం అవుతది. పురుషులైన స్త్రీలైన కొంచమైనా పని వచ్చేలాగా నేర్పియాలి. మదర్స్ ప్రేమ అంటే ఓన్లీ ఏమి చేయకుండా వాళ్ళని పెంచడమే ప్రేమ కాదు. వాళ్ళకి పని నేర్పించడం కూడా ప్రేమలో భాగమే మనకి ప్రేమ అంటే ఏంటంటే అవతల వాళ్ళు అలా కూర్చుని ఉండాలి మనం వాళ్ళు కూర్చుని ఉంటే చూసుకోవాలి. లేదు లేదు అలా కాదు పని కూడా నేర్పించాలి. పని కూడా నేర్పిస్తే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి లైఫ్ లో అవసరమైనప్పుడు ఆ పని నేర్చుకున్నందుకు సంతోషిస్తారు అమ్మ నాకు ఈ పని వచ్చు. నాతో పాటు కొద్ది మంది ఉండే వాళ్ళు వాళ్ళ అన్ని చేసేసుకునే వాళ్ళు నాకు అన్ని కొత్త కొత్తగా ఉండేవి వెళ్లి ఏమైనా వస్తువులు కొనుక్కొచ్చుకోవాలి అన్న వీళ్ళు ఏంటంట ఒకసారి ఒకరిని అడిగాను ఏంట్రా బాబు పరిస్థితి అంటే వాళ్ళు వాళ్ళ మదర్ కి ఇద్దరు అబ్బాయిలే. సో వాళ్ళ మదర్ కి కొంచెం హెల్త్ బాగోదు సో ఇల్లు పని అంతా వీళ్ళిద్దరే చేసే వాళ్ళంట. ఇంట్లో పని మొత్తం ఈ అబ్బాయిలే షేర్ చేసుకుని చేసేవాళ్ళు అమ్మ కూర్చుని ఉండేదన్నమాట. సో వీళ్ళకి అన్ని పనులు వచ్చేసినాయి ఆ సరుకులు తేవడం దగ్గర నుంచి వంట చేయడం దగ్గర నుంచి ఉతకడం కడగడం అన్నీ వచ్చు. వాళ్ళు బయటకు వచ్చి బతకాల్సి వచ్చినప్పుడు నా కన్నా బెటర్ గా వాళ్లే బతుకుతున్నారు. వాళ్ళకి కొనడం తెలుసు వాళ్లకి తేవడం తెలుసు వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉండాలి అలా కాదు కానీ అవసరాన్ని బట్టి చేయగలగాలి. ఎనీవే నేను అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే మంచి మదర్స్ హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు క్వాలిటీతో వర్క్ చేస్తారు. మంచి క్వాలిటీ కోసం చూస్తారు ఎంత కష్టమైన ఎంత దూరమైన వెళ్లి మంచిది తీసుకొస్తారు. నాసిరకంవి తీసుకొని రారు. స్త్రీలు కూరగాయలు కొనడానికిని పురుషులు కూరగాయలు కొనడానికిని కొంచెం తేడా ఉంటది. ఉంటదా ఏంటి తేడా.
[22:04]ఇది కొన్ని సంవత్సరాలకు ఉంటాయి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఏది నెక్స్ట్ పూట కొండేటటువంటి టమాటాలను కూడా ఎప్పటి కోసమో ఇంక ఈ చాలా వాల్యూబుల్ అన్నట్టు అంటే అసలు ఏం చిన్న ప్రాబ్లం కూడా లేకుండా ఉండాలని కొంటారు అంత జాగ్రత్తగా తీసుకుంటారు. యా పురుషులండి ఆ ఇక్కడ ఎంతసేపు నుంచుంటాం అని. నాలుగు వేసేసుకుంటారు వచ్చేస్తా బాగాకపోతే అవతలోడే తీయాలి ఇది బాలేదు అని ఆ రేంజ్ లో ఉంటారు కొద్దిమంది పురుషులు. ఆ సో ఇంటికి వచ్చిన తర్వాత స్త్రీల నుంచి డెఫినెట్ గా పడతా ఉంటాయి అసలు ఏంది ఈ తేవడం ఏంటి నువ్వు తెచ్చుకోవచ్చుగా అంటారు ఇంక అంతకన్నా ఏమంటాం. అంతే స్త్రీలు బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు అది వాళ్ళకి ఇన్స్టింటివ్ గా వచ్చింది అంటే వాళ్ళకి స్వతహాగా దేవుడు పెట్టాడు అది. దాన్ని మీరు చక్కగా కాపాడుకుంటూ బెస్ట్ ఇవ్వాలి ఫ్యామిలీకి. వంట వండినా బెస్ట్ ఇవ్వాలి చాయ పెట్టినా బెస్ట్ ఇవ్వాలి ఇల్లును చూసుకోవడంలో బెస్ట్ ఇవ్వాలి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా. సో కొద్దిమంది వంటలు సరిగా చేయట్లేదు కొద్దిమంది టీ సరిగా పెట్టడం రాదు కొద్దిమందికి మనం వాళ్ళు ఇంట్లోకి వెళ్తే వీళ్ళు ఇల్లు తుడిచి ఎంత కాలం అయిందా అని అనిపిస్తది. ఏమనిపిస్తది వీళ్ళు అసలు ఇల్లు తుడుచుకుంటారా వీళ్ళు అని అనిపిస్తది అన్నమాట. ఎందుకు అట్లా ఉండాలి నీట్ గా ఉండాలా.
[23:26]నీట్ గా పెట్టుకోవాలి కష్టపడి చేతులతోటి పని చేస్తది. బెస్ట్ ఆహారాన్ని సిద్ధపరుస్తది. పని తాను చేయలేనిది తన కన్నా ఎక్కువగా ఉంటే గనుక వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తది పనిని వేరే వాళ్ళకి అసైన్ చేస్తది వేరే వాళ్ళని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి వెనకాడదు. ఆ తర్వాత 16 నుంచి ఆమె నెక్స్ట్ చేసేటటువంటి పని ఏంటంటే ఫస్ట్ ది ఫస్ట్ క్వాలిటీ ఏంటండీ మంచి. ప్రతి స్త్రీ కూడా మంచి భార్యగా ఉండాలి. రెండోది మంచి మంచి పని చేయగలిగేటట్లుగా ఉండాలి బెస్ట్ పని చేయాలి. మూడోది ఏంటంటే మంచి దాన్ని ఏమంటారు ఆ సేవ్ సేవింగ్ చేసే మనసు అయి ఉండాలి. చూద్దాం ఆ వచనాలు.
[24:28]ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును తాము కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి కూడబెట్టాలి. స్త్రీ ఎవరై ఉండాలి కూడబెట్టే స్త్రీ అయి ఉండాలి. కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్షతోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పని చేయును. తన వ్యాపార లాభము అనుభవించే అనుభవముచే తెలుసుకొనును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును తన వేళ్ళతో కుదురు పట్టుకొని ఉడుకును. ఈ మూడు వచనాలు ఆమె చేసే పనిలో లాభం ఉండేలాగా చూస్తది. ఆమె చేసే పనిలో వచ్చే డబ్బును జాగ్రత్త చేయడానికి చూస్తది.
[25:23]భర్తలు కష్టపడి పని చేస్తున్నాం అని హడావిడి చేస్తారు కానీ చేసిన తర్వాత యూజువల్లీ తీసుకొచ్చి భార్యల మెయింటెనెన్స్ కి ఇస్తున్నారు చాలామంది. ఇప్పుడు భార్యకి ఇవ్వడం తప్ప అంటే నన్ను కొడతారు కూడా కొద్దిమంది. ఓకే ఎందుకనంటే వాళ్ళకి ఇవ్వకపోతే ఇక వాళ్ళకి కుదరదు ఇళ్లల్లో. ఇప్పుడు భార్యలకి ఇవ్వడం కరెక్టా కాదా అనేది నేను చెప్పట్లేదు భార్యకి ఇస్తే భార్య ఏం చేస్తుంది. చాలామంది ఇళ్లల్లో ఫైనాన్స్ స్త్రీలు సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటది వాళ్ళ ఇల్లు పరిస్థితి. ఎందుకో తెలుసా ఆ స్త్రీలు తమ డబ్బుల్ని ఎట్లా దాచుకోవాలి అన్న ఆలోచన వాళ్లకు ఉండదు. ఏ రూపాయి వస్తే ఆ రూపాయి ఖర్చు అయిపోవాలి అంతే. ఓకే మే బి మనం నెలకు 30 గుడ్లు వాడుతున్నాం అనుకుందాం ఇంట్లో. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తది మనం 30 గుడ్లు వాడుతున్నాం 30 అంటే 30 * 5 కదా ఇప్పుడు ఐదు రూపాయలేనా 30 * 5 ఎంత. ఓకే ఏదో వస్తది ఇంత అవుతుంది ఒరే ఇంత అవుతుంది ఒక 500 తగ్గిద్దాం. అనుకుంటే పర్వాలేదు ఈ నెల ₹1000 ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంకొక ఐదు గుడ్లు ఎక్కువ తెచ్చుకుందాం. అలా ఉంటదన్నమాట వాళ్ళ పరిస్థితి అర్థమవుతుందా. స్త్రీల పరిస్థితి ఎట్లా ఉంటదంటే డబ్బులు వచ్చే కొందకి ఖర్చు పెరుగుద్ది.
[26:50]ఖర్చు పెరగకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు డబ్బుల్ని జాగ్రత్తగా వాడడం పైన మనసు పెడతారో ఆ ఇల్లు వర్ధిళ్లుతాయి.
[27:08]ఏ ఇళ్లల్లో అయితే ₹10000 ₹10000 తెస్తుంటే ₹11000 అవుతున్నాయో ఇక అక్కడ అప్పులే ఉంటాయి.
[27:25]స్త్రీ చేతిలో ఉంటది పురుషులు మరి పురుషుల చేతిలో కూడా ఉంటది పురుషులు ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీల గురించే చెప్తాను. అంటే మరి పురుషులు చేయరా అని అంటే చేస్తారు పురుషుల వల్లే అష్ట దరిద్రాలు వస్తున్నాయి ఫ్యామిలీస్ లోకి అది నేను కాదనం. డెఫినెట్లీ అది కూడా ఉంది పురుషులేమి పురుషుల్లో ప్రాబ్లం లేదని చెప్పట్లా కానీ స్త్రీలు కూడా ఇలా లేకపోతే నష్టం. ఒకవేళ భర్త దుబారా ఖర్చు చేసేవాడై ఉంటే స్త్రీ కూడా జాగ్రత్త లేనిది అయితే ఇక ఆ ఇల్లు పరిస్థితి ఏంటి. వాక్యానుసారమైన మంచి స్త్రీ అయితే తాను కూడబెడతదంట ద్రవ్యాన్ని. ఏం చేస్తదంట కూడబెడతది కూడబెట్టడమే కాదు అక్కడ ఉన్న మంచి విషయం ఏంటో తెలుసా ఆమె కూడబెట్టడమే కాదు కూడబెట్టి ఆమె ఏం చేసింది బంగారం కొనుక్కోలా. నన్ను ఏమి అనుకోవద్దే ఇవాళ చాలా వచ్చేస్తున్నాయి మీకు కూడబెట్టి చీర కొనుక్కోవట్లే. కూడబెట్టిన డబ్బులు తన కోసం కాదు. కూడబెట్టడమే కష్టం స్త్రీలకి ఎందుకంటే వాళ్ళకి వచ్చింది ఖర్చు పెట్టాలనిపిస్తది కూడబెట్టడమే కష్టం కానీ కూడబెట్టింది తమకు ఖర్చు పెట్టుకోవడానికి పెడతారు.
[28:43]కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే కూడబెడుతుంది తన కోసం కాదు. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకొక ఇన్కమ్ స్ట్రీమ్ జనరేట్ చేస్తుంది. ఆ ఫ్యామిలీకి ఇంకా డబ్బులు వచ్చేలా చేస్తుంది. ఈమె ఏం చేస్తుందంట దాంతోటి ద్రాక్ష తోట కొందంట లేదా నాటించిందంట. ఇప్పుడు ద్రాక్ష తోట నాటిచ్చింది ద్రాక్ష తోట నుంచి వచ్చేటటువంటి పంట ఏమవుద్ది. రాబడే కదా. అంటే ఆమెకు వచ్చిన డబ్బులను జాగ్రత్త చేయడం వల్ల ఏం చేసిందంటే తన ఇంటికి ఇంకా డబ్బులు వచ్చేలా చేసిందంట. దాని వల్ల ఏమైందో తెలుసా ఆ చివరికి అంటాడు 21 వ వచనం తన ఇంటి వారికి చలి తగులదని భయపడదు. అంటే మా ఇంట్లో వాళ్ళకి ఏమవుద్దో మా ఇంట్లో వాళ్ళకి స్వెట్టర్ వేసుకోవడానికి లేదు లేతే మా ఇంటికి సరిగా ఇల్లు లేదు అలాంటి టెన్షన్ ఏమి ఉండదు ఆమెకు ఎందుకని అంటే ఆల్రెడీ ఇంటికి కావలసిన ప్రొటెక్షన్ అంతా కూడా తీసుకుంటుంది ముందే ఆలోచిస్తుంది. పురుషులు ఆలోచిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే స్త్రీలు ఆలోచన చేయాల్సిందే. ఏ స్త్రీలు అయితే పొదుపు చేయరో ఏ స్త్రీలు అయితే ఇన్కమ్ ని జాగ్రత్తగా చూడరో ఆ ఇల్లు ఎప్పటికీ గ్రో అవ్వవు. నేను కూడా చాలా ఫ్యామిలీస్ ని చూస్తా ఉంటాను వాళ్లకి చాలా రాబడి ఉంటది ఆశ్చర్యం వేస్తది 50000 60000 70000 ఇంట్లో నలుగు ఐదుగురు పని చేస్తా ఉంటారు. అంత పని చేసినా సరే అప్పుల్లో ఉంటారు అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తది. ఎంత సూపర్ ఫ్యామిలీస్ అయినా ఒక ఇద్దరు పని చేస్తే ఇల్లు నడిచిపోతది ఇక్కడ హైదరాబాద్ లో. ఇక ముగ్గురు పని చేస్తున్నారు నలుగురు పని చేస్తున్నారు అయినా గాని డబ్బులు లేవంటే ఎక్కడో తేడా ఉంది మెయింటెనెన్స్ లో. మెయింటెనెన్స్ లో ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడో మనం డబ్బుల్ని నెక్స్ట్ ఇక్కడ చెప్పబడలేదు కానీ ఆ ప్రిన్సిపుల్ చెప్తాను అదేంటని అంటే ఇక్కడ ఏమంటారు హిడెన్ గా ఉంది అది అది ఏంటని అంటే వచ్చే డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవాలి బెటర్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేయాలి. అది ఇక్కడ ఉన్న ప్రిన్సిపుల్ అంతే కదా. వచ్చే డబ్బులను జాగ్రత్త చేసుకోవాలి మళ్ళీ డబ్బులు వచ్చే చోట దాన్ని పెట్టుబడి పెట్టాలి. అర్థమవుతుంది కదా అంతే గాని ఇక్కడ ఎక్కడ అప్పు చేయట్లేదు ఆమె. ఏం చేయట్లే అప్పు చేయట్లేదు అప్పు లాస్ట్ ఆప్షన్ అయి ఉండాలి మనకి. ఏదో హాస్పిటల్ లోకి వెళ్లాల్సి వచ్చింది లేదా ఏదో ఉద్యోగం కోసం లేదా ఏదో విషయం కోసం అననుకోని పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చదువుకోవడానికి వెళ్ళాను 3 లక్షలు అప్పుడు కావాల్సి వచ్చింది వేరే వేరే వాటికి ఇప్పుడు 3 లాక్స్ కావాలంటే సడన్ గా మన దగ్గర ఉన్న అప్పు తెచ్చారు సరే ఇల్లు కొన్నాం అప్పు తేవాల్సి వచ్చింది సరే ఇది మేజర్ కాబట్టి సరే దీన్ని కొంద దానికి తెస్తే ఇల్లు ఉంటది కదా అట్లా మేజర్ వాటికి చేయాలి గానీ ప్రతి చిన్న దానికి అప్పు చేయకూడదు. ఈ మధ్య ఇన్స్టాల్మెంట్లు పెరిగిపోయి ఇన్స్టాల్మెంట్ అన్నది అప్పులాగా అనిపించట్లే మనకి ఇన్స్టాల్మెంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చేయి చూపించండి నాకు. ఊరికే మాకు ఏ ఇన్స్టాల్మెంట్ కట్టేది లేదన్న అనే వాళ్ళు ఒకసారి చేయి చూపించండి నువ్వు మీ డాడీని అడగాలి డాడీని అడిగి డాడీ సేవ పూజకే అన్న. ఓకేనా నాకు ఇన్స్టాల్మెంట్ లో లేవు అని ఎత్తుతున్నాడు ఆయన వాళ్ళ డాడీని అడగాలి ఆయన వెళ్లి. ఓకే ఎనీవే ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పని లేని వారు ధన్యులు.



