[0:03]Love Gospel. మక అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశక్తి కలిగిన క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మట్టల ఆదివారం అని ఉంటూ ఉంటాం. అంతే కాకుండా ఏసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కొనబోయి జయము జయము అంటూ కూడా మట్టలను తీసుకొని వాళ్ళంతా కూడా జయనాదాలు పలుకుతూ ఉంటారు. అయితే ఈ యొక్క ఖర్జూరపు మట్టల గురించి ఉన్నటువంటి విశేషాలు ఏంటి? ఎందుకు వాడకూడదు? వాడితే తప్పేంటి అనేటువంటి విషయం చర్చించుకునే ముందు యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యం చూద్దాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయే జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఈ సందర్భాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు ప్రభువును ఖర్జూర మట్టలతో ఊరేగించారు? ఫస్ట్ థింగ్ ఎందుకు ఖర్జూరపు మట్టలను వాడారు? సెకండ్ థింగ్ పరిశుద్ధ గ్రంథంలో ఈ చెట్టు గురించి విస్తారంగా కూడా చాలా చోట్ల రాయబడింది. దాదాపు 60 వాక్యభాగాలు దీని గురించి ఉన్నాయి. 60 వాక్యభాగాలు దీని గురించి ఉన్నాయి. అయితే మరి ఎందుకు వాడకూడదు అంటున్నారు అనేది చూద్దాం. ఈ ఖర్జూరపు వృక్షానికి ఇంగ్లీష్ లో పామ్ ట్రీ అని ఉంటుంది. అంతే కాకుండా తెలుగులో తామల వృక్షం, తాళ వృక్షం, అంతే కాకుండా సరళ వృక్షం, రెండోది ఈత వృక్షం, కొబ్బరి చెట్టు, పామ్ ఆయిల్ చెట్టు. ఏంటి సార్ కొబ్బరి చెట్టు, పామ్ ఆయిల్ చెట్టు, ఈత వృక్షం ఇవన్నీ వేరు వేరు కదా అనుకుంటారేమో ఇంగ్లీష్ బైబిల్ లో వీటన్నిటికీ కూడా పామ్ ట్రీ అని రాయబడి ఉంది. ఖర్జూరపు వృక్షం ప్రభువునకు మరియు విశ్వాసులు అయిన వారికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. ఏంటి సాదృశ్యాలు అనేది చూస్తేనే మీకు వాడొచ్చో, వాడకూడదో లేకపోతే ఎందుకు వాడాలి? ఎందుకు వాడకూడదు అనే విషయాలు మీకు అర్థం అవుతాయి. అయితే ఖర్జూరపు మట్టల ద్వారా ఇచ్చేటువంటి సూచనలు ఏంటి అనేది మనం చూస్తే గనుక దాంట్లో మొదటిది ఖర్జూరపు మట్టలు జయమునకు పండుగకు సంతోషానికి కూడా సూచన. జయము, పండుగ, సంతోషం. ఇలాంటి వాటికి సూచన యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యం ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయే ప్రభువు పేరట వస్తున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తున్నారు. ఇక్కడ లేవీ కాండం 23వ అధ్యాయం 40వ వాక్యం కూడా చూడండి. మొదటి దినమున మీరు డబ్బది పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల వద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. అనేటువంటి వాక్యం అక్కడ కనబడుతుంది అంటే పండుగలు చేసేది ఈ యొక్క ఈత మట్టలు లేదా ఖర్జూరపు మట్టలు తీసుకొని చేస్తూ ఉంటారనే సందర్భం. అందుకోసమే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనబోయేందుకు కూడా ఆ విధంగానే. అంతే కాకుండా ప్రభువు విజయశీలుడు, విజయం సాధించిన వాడు. మనకు విజయాన్ని అందించిన వాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించాడు, సాధించాడు. సో విజయానికి కూడా గుర్తు ఆయన. ప్రభువు వారితోనే కాదు కదా పోల్చేది. విశ్వాసులతో కూడా పోలుస్తున్నాము అంటే విశ్వాసులు కూడా విజయం సాధించిన వాళ్ళని అనొచ్చు. ఎందుకో అంటే. కొలసి పత్రిక రెండో అధ్యాయం 15వ వాక్యం. ఆయనతో కూడా మిమ్మును జయింపచేసెను అంటే ఆయనతో కూడా క్రీస్తు వారితో కూడా మనం కూడా జయించాం. అంతే కాకుండా రెండో కొరింది పత్రిక రెండో అధ్యాయం 14వ వాక్యం, మొదటి కొరింది పత్రిక 15వ అధ్యాయం 57వ వాక్యం చూస్తే సిలువ చేత జయోత్సవములతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచునని వాక్యాలు మనం అక్కడ చూస్తాం. అంటే దేవునితో పాటు ఆ బాహాటంగా జయోత్సవములతో మనం కూడా ఉన్నామని అర్థం. ఖర్జూరపు చెట్టు ఆ యొక్క జయానికి పండుగకి, సంతోషానికి కూడా సూచన అయి ఉంటుంది. దేవుని జయం పొందుకున్నటువంటి నీవు ఖర్జూరపు మట్టలని జయానికి సూచనగా పెడుతున్నావే గాని జయాన్ని స్వీకరించలేకపోతున్నాం. రెండో సాదృశ్యం కూడా చూద్దాం. రెండో సాదృశ్యం ఏందంటే ఖర్జూరపు వృక్షం సౌందర్యం గలది అని ఉంటుంది. ఎరికో పట్నం ఖర్జూర చెట్లతో నిండిపోయింది. సిటీ ఆఫ్ పామ్స్ అంటారు దాన్ని. న్యాయాల పుత్రుడి గ్రంధం మొదటి అధ్యాయం 16వ వాక్యంలో చూస్తే. హెబ్రీ భాషలో ఖర్జూరపు చెట్టుని తామరు అంటారు అంటే సౌందర్యము అని అర్థం. ఖర్జూరం సౌందర్యానికి సూచన అని చెప్పుకుంటున్నాం. దేవుడు అతి సౌందర్యవంతుడు అని చెప్పుకుంటున్నాం. అతి సుందరుడు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరి విశ్వాసుల సంగతి ఏంది? విశ్వాసులకు దేవుని బిడ్డలకు కావలసింది ఆత్మీయమైనటువంటి సౌందర్యం. ఈ లోక సౌందర్యం కాదు. ఈ లోక సౌందర్యం మోసకరం అని సామెతల గ్రంధంలో మనం చదువుకుంటాం. అతి సౌందర్యం మనకు ఉండేది ఎక్కడ అంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యంలో. తర్వాత మూడో విషయం. ఖర్జూరపు వృక్షం ఎప్పుడు కూడా తిన్నగా పెరుగుతది. ఖర్జూరపు వృక్షం చక్కగా నిదానంగా పెరుగుతూ ఉంటుంది. పరమగీతం ఏడవ అధ్యాయం ఏడవ వాక్యం చూడండి. ఈ నువ్వు తాళ్ళ వృక్షమంత తిన్నగా నిదానంగా ఉన్నావు అనే ఒక వాక్యం కనబడుతుంది. యువర్ స్టేచర్ ఇస్ లైక్ ఏ పామ్ ట్రీ. అంటే వంకర లేనటువంటిది అని అర్థం. ఇక్కడ తాళ్ళ వృక్షంతో దాన్ని పోల్చబడింది. పరిశుద్ధ గ్రంధంలో వంకర అనేది పాపానికి సాదృశ్యం. కీర్తన గ్రంథం 125వ కీర్తన ఐదవ వాక్యం చూడండి. సామెతల గ్రంథం రెండో అధ్యాయం 15వ వాక్యంలో ఉంటుంది. ఆ విధంగా నడుచుకునేటువంటి వారు త్రోవలు వంకరవి. వాళ్ళ త్రోవలు వంకరవి. వారు కుట్టిన వర్తనులు అంటుంది. యెషీ గ్రంథం 59వ అధ్యాయం ఎనిమిదవ వాక్యం సెలవిస్తుంది. వారి నడవడికలన్నీ కూడా న్యాయం ఉండదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు అని అక్కడ కనబడుతుంది. ఈ యొక్క ఖర్జూరపు వృక్షము ఏ విధంగా అయితే తిన్నగా చక్కగా నిదానంగా పెరుగుతుందో ఆ విధంగా మనం కూడా దేవునిలో నిదానంగా ఆయన మార్గంలో ప్రవేశించాలి. ఆ సాదృశ్యాన్ని తెలిపేదే ఈ యొక్క ఖర్జూరపు వృక్షం. ఇక నాలుగో సాదృశ్యం చూడాలి అన్న నాలుగో సాదృశ్యంలో ఖర్జూరపు చెట్టు నీతిని చూపిస్తది. నీతికి సాదృశ్యంగా ఉంటుంది. యూదా వారి కోడలు తామరు. తామరు అంటే మనకు తెలుసు ఖర్జూరపు చెట్టు అని అర్థం. ఆదికాండం 38వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే ఆమె నాకంటే నీతిమంతురాలు అని కనబడుతుంది అక్కడ. తామరు అనగా ఖర్జూరపు చెట్టు అని అర్థం. అంటే నీతికి అది సింబాలిక్ గా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నీతిపరుడు గనుకనే నీతిని చూపించేటువంటి ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు. అక్కడ ఖర్జూరపు మట్టలతో ఊరేగించడానికి అసలు రీజన్ ఆయన నీతిపరుడు అని సింబాలిక్ గా చూపించడమే. జక్కరయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం చెప్తుంది. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని ఆ వాక్యం అక్కడ కనబడుతుంది. అంతే కాదు 11వ కీర్తన ఏడవ వాక్యం సెలవిస్తుంది. యెహోవా నీతిపరుడు నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు అని అక్కడ కనబడుతుంది. అంతే కాకుండా ఇది ప్రభువు వారు ఎలాగు నీతిపరుడు కాబట్టి సింబాలిక్ గా ఆ యొక్క ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు అని మనకు తెలుసు. ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి ఏంటి? విశ్వాసులు కూడా నీతిమంతులుగా ఉండాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మూడవ వాక్యం చూడండి. నీతి అని మస్తకీ వృక్షములని యెహోవా నాటిన చెట్లనుని వారికి పేరు పెట్టబడును అని. ఆ విధంగా మనము కూడా నీతిని ధరించాలి అనే సింబాలిక్ గా అది చూపించాలి అంతే. ఇక ఐదవ విషయం ఏందంటే ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. 92వ కీర్తన 12వ వాక్యం చూడండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షముల వలె మొవ్వు వేయుదురు. ఆశీర్వదించబడినటువంటి వృక్షంలో లెబనూను వృక్షము అలాగే ఖర్జూరపు వృక్షము కూడా ఉన్నాయి అని గ్రహించాలి. అంతే కాదు యెహెజ్కేలు దేవాలయంలో ఖర్జూరపు చెట్లను చెక్కించారు. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ప్రతి స్తంభం మీద ఖర్జూరపు చెట్లు నిరూపించబడి ఉన్నాయి అని వాక్యం కనబడుతుంది. సొలోమోను దేవాలయం కట్టించేటప్పుడు కూడా సొలోమోను కూడా ఖర్జూరపు వృక్షాలను చెక్కించాడు. మొదటి రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం 29వ వాక్యం. అంటే ఇక్కడ ఆలయంలో కూడా ఆశీర్వదించబడినటువంటిది కాబట్టే ఈ యొక్క ఖర్జూరపు వృక్షాన్ని ఆలయంలో కూడా వాళ్ళు చెక్కించడాన్ని మనం చూస్తున్నాం. అంతే కాకుండా ఆరవ సూచనకు వస్తే. ఆరవ సూచన ఏంటి అంటే ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలము ఉంటది. దీర్ఘకాలం ఉంటది ఖర్జూరపు చెట్టు కాబట్టి దీర్ఘకాలానికి సూచక క్రియగా ఉంటుంది. అంటే దేవుని యొక్క కాపుదల మనకు దీర్ఘకాలం ఉంటది.
[6:36]కాబట్టి దానికి సాదృశ్యం. 92వ కీర్తన 12వ వాక్యం చెప్తుంది. నీతిమంతులు ఖర్జూరపు వృక్షముల వలె మొవ్వు వేయుదురు. లెబనూను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని ఉంటుంది. నీతిమంతులు ఖర్జూరపు వృక్షాల వలె మొవ్వు వేస్తారు. 92వ కీర్తనలోనే 15వ వాక్యం చూడండి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి ఇంకా పచ్చగా ఉంటారు అని. అంటే ముసలితనం అంటే దీర్ఘకాలం కూడా ఉండేటువంటి పరిస్థితి. దేవుని యొక్క కాపుదల ఆ విధంగా ఉంటది. దేవుని బిడ్డలు దీర్ఘకాలం కూడా బ్రతుకుతారు. బ్రతకగలరు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల ఉంటుంది కాబట్టి. దేవుని యొక్క బిడ్డలు కూడా దీర్ఘకాలం ఉండాలి. దీర్ఘకాలం కూడా విశ్వసించాలి. దేవునితో బ్రతకాలా. 46వ కీర్తన నాలుగవ వాక్యం చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకోవాలి నేను అంటాడు దేవుడు. మనము కూడా ఖర్జూరపు వృక్షం వలె దీర్ఘకాలం సహిస్తూ వహిస్తూ దేవునితో ఉండాలా. ఇప్పుడు కాసేపు విశ్వాసం వస్తది మళ్ళీ పడిపోతాం. కాసేపు రక్షణ లేకపోతే వాక్యం అద్భుతమైనటువంటి జీవితం గడపాలి అని ఆత్మీయమైనటువంటి పరిస్థితి వస్తది మళ్ళా కొన్ని రోజులకు పోతది. ఈ విధంగా మనం పడి లేస్తూ పడి లేస్తూ పడి లేస్తూ దీర్ఘకాలంగా కాకుండా స్వల్పకాలంలోనే చచ్చిపోతున్నాం. చిన్న ఉదాహరణ ఏందంటే మోషే గారు చనిపోయేటప్పుడు 120 సంవత్సరాల వాడు. 120 సంవత్సరాలకి కూడా అతనికి ఇంకా దృష్టి మాంజ్యం లేదు, సత్తువు తగ్గలేదు, బలం తగ్గలేదు. అటువంటి పరిస్థితి ఉంది. అంటే దీర్ఘకాలం జీవించేటువంటి పరిస్థితి. మెత్రీషియల్ బైబిల్ అంతటిలోనూ కూడా ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి. అబ్రహం 100 సంవత్సరాల తర్వాత సంతానం గ్రహించినటువంటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుడు దీర్ఘకాలం జీవింప చేస్తాడు. తన కృప కాపుదల ఉన్నంత కాలము కూడా. అంతే కాకుండా ఖర్జూరపు చెట్టు యొక్క కాండం చాలా గట్టిగా ఉంటుంది. అనేక శ్రమలకు తట్టుకుంటది. ఆ చెట్టు యొక్క స్థిరత్వం చాలా బలమైనది. అందునుబట్టే ఇది ఎటువంటి తీవ్ర పరిస్థితులనైనా సరే తుఫాన్లైనా సరే తట్టుకుంటది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ సామ చెప్తుంది. నీతిమంతుడు నిత్యము కూడా నిలుస్తాడు. నిత్యము కూడా నిలుచు కట్టడము వలె ఉంటాడు అని. కాబట్టి ఆ నీతిని మనము నిత్యము కూడా దీర్ఘకాలము కూడా సహిస్తూ వహిస్తూ భరిస్తూ కూడా నిత్యము దేవుని కృప చొప్పున మనము ఉండాలి అనే సాదృశ్యమే ఈ ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలం. ఆఖరిగా ఏడవది ఆఖరిది ఖర్జూరపు మట్టలు ప్రభువు యొక్క పరిచర్యలో వాడబడ్డాయి. ఇప్పుడు ఖర్జూరపు మట్టలు మనకు విశ్వాసులకు దేవునికి సాదృశ్యం అని చెప్పుకుంటున్నాం. అలాగే మన విశ్వాసులమైన మనము దేవుని బిడ్డలము ప్రభువు పరిచర్యలో వాడబడాలి. అనే సాదృశ్యమే ఈ ఖర్జూరపు మట్టల యొక్క సాదృశ్యం. మార్కు సువార్త 11వ అధ్యాయం ఎనిమిదవ వాక్యం చూడండి. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచి కొందరు తమ పొలంలో నరికినటువంటి కొమ్మలను పరిచి ప్రభువునకు ఎండవీడు తగలకుండా ఈ కొమ్మలు వాడారు అని ఆ వాక్యం కనబడుతుంది. అంతే కాదు. రోమా పత్రిక 12వ అధ్యాయం ఒకటవ వాక్యం ప్రకారం ఇప్పుడు మనము ఏం పరచాలి అంటే దేవునికి సంబంధించి పరిశుద్ధంగా మన శరీరాలని సజీవ యాగం మన శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. వాస్తవీయులను బట్టి దేవుడు మనలను బ్రతిమాలుతున్నాడు. దేవుడికి మనం పరిచర్యలో వాడబడాలి, వాడబడేటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేయాలి. ఈ యొక్క ఖర్జూరపు మట్టల గురించినటువంటి ఈ ఏడు సాదృశ్యాలను మనం బాగా జాగ్రత్తగా గమనించాలి. ఖర్జూరపు వృక్షం యొక్క మట్టలు పరలోకంలో కూడా ఉంటాయి. ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుంచియు కూడా ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడుద్ది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్లను ఎదుట నిలబడిన సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహా శబ్దంతో ఎలిగెత్తి చెప్తున్నటువంటి సందర్భం తొమ్మిది 10 వచనాల్లో ప్రకటన గ్రంథంలో కనబడుద్ది. అంటే ప్రకటన గ్రంథంలో కూడా అంటే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని అక్కడ వాళ్ళు ఎలిగెత్తి చెప్పటం మహా శబ్దం చేయటం ఆ వాక్య గ్రంథంలో చదువుకుంటాం. కాబట్టి ఏడు విషయాల పట్ల ఏడు సాదృశ్యాల పట్ల మనం గ్రహించవలసింది ఖర్జూరపు మట్టల ద్వారా మనం నేర్చుకోవాల్సింది అది. అంతే గాని ఖర్జూరపు మట్టలు వాడి దేవుడిని పూజించాలి అని కాదు. చాలా మంది మట్టల ఆదివారం రోజున మట్టలను తెచ్చి ఇంట్లో పెట్టుకొని అలంకరించి పువ్వులు పళ్ళు ఏదే అలంకరించి ఆలయానికి తెచ్చిపెట్టి ఉంచుతారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అది. కానీ నిజముగా మట్టలు తెచ్చి ఆరాధించవలసిన పని లేదు. ఆ మట్టలు దేనికి సాదృశ్యం? ఆ లక్షణాలు మనం ధరించుకొని ఆలయానికి వెళ్ళాలి అది సాదృశ్యం. అంతే గాని ఈ మట్టలను తీసేసి వాటిని అలంకరిస్తే దేవుడికి కావలసింది నువ్వా మట్టలా. అయితే నిజానికి ఇప్పుడు మాటల ద్వారా జరగాలా జరగకూడదా అనే విషయం గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడేది అది పక్కన పెట్టేస్తే మట్ల ఆదివారం రోజున నిజంగానే మట్లని తెచ్చి పూజ చేసి ఇంట్లో పెట్టుకొని ఒక సంవత్సరం వరకు వాటిని కాపాడుకోవాలి. సంవత్సరం కాపాడుకొని వాటిని అలంకరించి వాటిని దైవంలా చూసి ఆరాధించాలి. ఆరాధించిన తర్వాత మరలా వచ్చే సంవత్సరం అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం కూడా దాన్ని కాపాడుకొని. సంవత్సరం తర్వాత దాన్ని ఆలయంలో పెట్టాలి మనం ఆరాధించినది. ఇది అన్యాచరాలకు కనబడట్లేదా. నేనే నాకు నచ్చినటువంటిది మట్టితో తయారు చేసుకుని దానికి అన్నీ కూడా రంగులు, ఆర్బాటాలు నేనే అద్ది, నేనే తిట్టి లేకపోతే నేనే దాన్ని చెరిపేసి మళ్ళీ నేనే అలంకరించి, నేనే పూజలు చేసి మళ్ళీ నేనే చూసి దాన్ని దైవంలా భావించి దాని కోసం ప్రాణాలైన తెగించి అంతగా చేసి దాన్ని తర్వాత మళ్ళీ నేనే మట్టిలో కలిపేసి చంపేస్తాను, తొక్కేస్తున్నాను. దీనికి దానికి పోలికేంటి? కాబట్టి మట్టలు అనేది ఇక్కడ మనకు ముఖ్యం కాదు. మనకు నిత్యమైన, సత్యమైన, సజీవుడుగా ఉన్న దేవుడు మనకు ఉండగా ఈ మట్టలకి వాటికి వీటికి మొక్కి దాన్ని ఆరాధించి వాటిని దైవంలా చూసేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఆదివారం రోజున మట్టలను జాగ్రత్తగా ఇంట్లోకి తెచ్చి పెట్టుకొని సంవత్సరం వరకు దాన్ని కాపాడుకొని దైవంలా చూడటం, ఆరాధించడం పనులు చేయకండి దరిద్రం అది. మూర్ఖులు చేసే పని అది. అజ్ఞానంలో బ్రతికేటువంటి విగ్రహారాధనకి తెలియక విగ్రహారాధన చేస్తూ అదే మూర్ఖత్వంలో బ్రతుకుతున్నారు. మరి నువ్వు బ్రతికేది ఏంటి అది మూర్ఖత్వం కాదా? వాళ్ళు చెట్టుకి పొట్టికి మొక్కుతారు అని చెప్పేటువంటి నీవే ఇప్పుడు మొక్కకి మొక్కుతున్నావు. ఇప్పుడు ఒక ఖర్జూరపు మట్టకి మొక్కుతున్నావు. అది కొన్ని సాదృశ్యాలను తెలియజేయాలి. సాదృశ్యాలను తెలియజేస్తుంది కానీ ఇప్పుడు మరి మీరు చేసింది అంటే విగ్రహారాధన అయిపోతుంది. విగ్రహారాధన. మట్టలో దేవుడిని చూసుకోవడం వెర్రితనం. కొన్ని కొన్ని సందర్భాలకి సూచనలకి జయానికి విజయానికి విశ్వాసానికి నీతికి అండ్ ఆఫ్ కోర్స్ ఇట్లాంటి పరిస్థితులకి అది యొక్క సాదృశ్యంగా ఉంటుంది. అటువంటి గుణాలు, లక్షణాలు మనకి కావాలి. మనలో ఉండాలి అని మనకు తెలియాలి. అదే విశ్వాసంతో దేవుడిని ఆరాధించాలి. జయోత్సవములతో సంతోషముతో నీవు కూడా దేవుడిని ఆరాధించు. నీవు కూడా దేవునికి జయధ్వనులు చెయ్. తప్పులేదు. మనకు కావలసింది వాటిలో ఉన్న లక్షణాలు. ఆ లక్షణాలతో దేవుడిని ఆరాధించు. అది దేవునికి మనకి కావలసినటువంటి మంచి వ్యక్తిత్వం, మంచి విశ్వాసం. అంతే కట్టిన వాటిని మొక్కడమా, ఆరాధించడం, పూజ చేయడం, సంవత్సరం దాచడం అనేది వెర్రితనం, దరిద్రం. వీటి ద్వారా దేవుడు ఏమి చూడాలనుకుంటున్నాడు? ఖర్జూరపు వృక్షం ఎంత ఉన్నతంగా పెరుగుతుందో అంత ఉన్నతమైన నీతి మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఖర్జూరపు వృక్షం వలె తిన్ననైన సరైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అని యదార్ధంగా కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఖర్జూరపు వృక్షం ఎలా అయితే చెక్కబడిందో మనము కూడా దేవుడిని ఎల్లప్పుడూ కూడా మహిమ పరిచే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మందిరపు తలుపులపై ఖర్జూరపు వృక్షం చెక్కబడినట్టు ప్రభువుకు మన హృదయపు తలుపులు తెరిచి ఆయన వాక్యం ఎల్లప్పుడూ హృదయంలో సమృద్ధిగా జీవించేటట్లు మన హృదయ ద్వారాలు ప్రభువు కొరకు తెరిచి ఉండాలి. అంతే కాదు ఖర్జూరపు వృక్షం అమితంగా ఫలించేటట్లు మనం అలభరితమైన జీవితం జీవించాలి. ఖర్జూరపు వృక్షము ద్వారా ఖర్జూరపు ఆకుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు అవి. అవి తప్పితే మనము ఖర్జూరపు వృక్షాన్ని దేవునిని చేసేసి ఆరాధించేసి సంవత్సరం ఇంట్లో పెట్టుకునే మూర్ఖత్వాన్ని వదులుకోమని చెప్తున్నాను. ఇవన్నీ అర్థం చేసుకొని ఆ రీతిగా కాకుండా లక్షణాలను మనం పెంపొందించుకుంటూ దేవునికి మంచి బిడ్డల వలె జీవిస్తూ ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైన కృప కాపదల మీకు తోడై నడిపించును గాక. ఆమెన్.



