[0:00]మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మాటలు ఏడు మాటలు. ఈ ఏడు మాటల్లో ఆరు మాటలు కూడా ఇంతకుముందు వీడియోలుగా మనం ధ్యానించుకున్నాం వివరించుకున్నాం. అయితే ఆఖరి మాట ఏడవ మాట ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. Father, into your hands, I commit my spirit తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23 వ అధ్యాయం 46 వ వాక్యం ఇది ఏడవ మాట ఆఖరి మాట. ఈ మాటలో ఉన్నటువంటి విషయాలు వివరణ అంతా కూడా స్పష్టంగా తెలియజేస్తాను పూర్తిగా చూడండి. ఇంచుమించు మధ్యాహ్నం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. చీకటి సూర్యుడు కనబడటం లేదు దేవాలయపు తెర రెండుగా చీరిపోయింది భూకంపం కలిగింది బండలు బద్దలయ్యాయి. అప్పుడు ఆయన గొప్ప కేక వేసి గొప్ప శబ్దముతో పలికిన మాట అప్పుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అలా చెప్పి ప్రాణం విడిచారు లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుంచి 46 వాక్యాలు. రోమన్ల క్రింద ఉంది అధికారం సో రోమన్ ఎంపైర్ రోమన్ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. అత్యంత దారుణమైనటువంటి శిక్షలో ఒకటే ఈ సిలువ సిలువ మరణ శిక్ష అత్యంత దారుణమైనటువంటి వాటిలో. సిలువ మరణం అనేది సిలువ వేసిన వెంటనే చంపేసేది కాదు ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ సుదీర్ఘమైనటువంటి శిక్ష అది కొన్ని రోజులు కూడా పడుతుంది. ట్రాన్ అవుట్ ప్రాసెస్ అది ఇలా ఎక్కువ రోజులు సుదీర్ఘమైన దుర్బరమైన భయంకరమైన ఈ శిక్షను చూసి ప్రజలు భయపడాలి అని చెప్పి వారి హృదయాలు భయం కలిగి తప్పు చేయడానికి భయపడతారు. అంతే కాదు రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినా బహిరంగంగా ఇది గుర్తు చేస్తుంది అలా వేస్తారు రోమన్ ప్రభుత్వం ఈ సిలువ శిక్షను. నేరస్తులు వారు లొంగే వరకు బుద్ధి తెలిసి వచ్చేంతవరకు సిలువ మీద చాలా రోజులు వేలాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు మాత్రం కేవలం ఆరు గంటలు మాత్రమే సిలువ మీద ఉన్నారు. ఆ రోజే చనిపోయారు అంటే ఎంత దారుణంగా శరీరం కొట్టబడిందో నలిగిందో అర్థం చేసుకోవచ్చు కదా. ఈ దొంగలకు ఆ పరిస్థితి లేదు బ్రతికే ఉన్నారు. ఇలా సిలువ వేయడం సబ్బాతుకు ముందు రోజు కాబట్టి సబ్బాతు రోజుకు నేరస్తులు ఎవరూ కూడా సిలువ మీద వేలాడుతూ ఉండకూడదు. అందుకే జీవించి ఉన్నటువంటి ఈ ఇద్దరు దొంగల యొక్క కాళ్ళు విరగ్గొట్టి చంపేస్తారు. యోహాను సువార్త 19 వ అధ్యాయం 31 నుంచి 33 వాక్యాలు చూడండి. వారు బ్రతికే ఉన్నారు కాబట్టి రేపు సబ్బాతు దినం కాబట్టి కాళ్ళు విరగ్గొట్టి వారే చంపేస్తారు. తెల్లవారితే సబ్బాతు రోజు అని గ్రహించి సిలువ మీద బ్రతికి ఉండకూడదు అని అందుకే వీరి పరిస్థితి వచ్చి చూస్తారు. అయితే అప్పటికే యేసుక్రీస్తు వారు చనిపోయినారు. బల్లెపు పోటుతో పరీక్షించారు ఆయన చనిపోయారు అని కన్ఫర్మ్ అయ్యింది. ఆ దొంగలు మాత్రం బ్రతికే ఉన్నారు కాబట్టే వారి కాళ్ళు విరగ్గొట్టి చంపేస్తారు. విశ్రాంతి దినానికి దూరంగా ఉన్న రోజుల్లో అయితే సిలువ మీద ఉంచుతారు వారు చనిపోయేంతవరకు. అంతే కాదు సిలువ మీద శరీరాలు వేలాడుతూ ఉండకూడదు ఈ సబ్బాతు రోజు ఇది రోమన్ ప్రభుత్వం రూల్ కాదు. యూదుల సబ్బాతు అది యూదులు ఆచరించిన ధర్మం అది వారికి అవమానం అది. అందుకే యూదుల ధర్మాలను అవమానించకూడదు అనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. అంతే కాకుండా ప్రధాన యాజకుడో మధ్య వ్యతిరిక్త్వం చేశాడు ప్రధాన యాజకుని మధ్య వ్యతిరిక్త్వం వహించి చేస్తే అప్పుడే ఆయన్ని సిలువ మీద నుంచి ఆ శరీరాన్ని సిలువ నుంచి తొలగించి కిందకి దింపారు సమాధి చేయడానికి. ఇప్పుడు చూడండి టెంపుల్ కర్తెన్ టోన్ అంటే దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది ఈ సందర్భాన్ని చూస్తే నేను ఆల్రెడీ పూర్తిగా వివరంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వేరే వీడియోలో ఇచ్చిన చూడండి. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ చర్య పరలోకంలోనూ భూలోకంలోనూ కీడు జరిగిందని బాధ కలిగిందని తెలియచెప్పడానికి ఇది ఒక నిదర్శనం తెర చినిగిపోవడం. లూకా సువార్త 23వ అధ్యాయం 44 45 వాక్యాలు చూడండి. దాదాపు మధ్యాహ్నం నుంచి మూడు గంటల వరకు చిమ్మ చీకటి చీకటి కమ్ముకుంది సూర్యుడు అదృశ్యుడయ్యాడు. దేవాలయపు తెర రెండుగా చిరిగింది ఈ మాటలో సూర్యుడు ప్రకాశించకపోవడమే కాకుండా తెర రెండుగా చినిగిపోయింది. అక్కడ ప్రస్తావించబడిన తెర అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి ప్రత్యేక చేసేటువంటి తెర అది. 60 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పు మనిషి చేయి ఉన్నంత మందంగా ఉంటుంది అంత థిక్నెస్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాంటి తెర ఏనుగులు వచ్చినా చిరగని తెరల నిర్మించబడింది అది చిరగాలి అంటే ఎంత శక్తి కావాలి ఆలోచించండి. బహుశా భూకంపం కలిగింది కాబట్టి భూమి స్తంభించి బండలు బద్దలయ్యాయి కాబట్టి అంత ఫోర్స్ వల్ల మాత్రమే చినిగింది మార్కు సువార్త 15 వ అధ్యాయం 38 వ వాక్యం చూడండి. ఇలా తెర చిరగడం ద్వారా రెండు బలమైనటువంటి నిగూడమైనటువంటి విషయాలు మనకు తెలియాలి. నెంబర్ వన్ మొట్టమొదటి ఏంటంటే సిలువపై క్రీస్తు యొక్క విమోచన ద్వారా దేవునికి ప్రజలకు మధ్య వ్యతిరిక్త్వం తెగింది దేవునికి మార్గం తెరుచుకుంది. దేవునికి ప్రజలకు మధ్య వ్యతిరిక్త్వమైనటువంటి దేవాలయాలు గాని పరిశుద్ధ అతి పరిశుద్ధ నియమాలు గాని ఇలాంటివన్నీ కూడా తెగినాయి మార్గం తెరుచుకుంది దేవునికి ప్రజలకు ప్రత్యక్ష మార్గం వచ్చింది. ఇక నెంబర్ టూ రెండోది దేవాలయంపై ఆధారపడటం దేవాలయం వాడుకను ముగించి స్టాప్ చేసి ఆ వ్యవస్థను తీసివేయడం. ఈ రెండిటిని సూచిస్తుంది ఈ తెర చిరగటం అనేది ప్రత్యక్షపు గుడారాలు అలాగే దేవాలయం. వీటి ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం దేవుణ్ణి ప్రత్యక్షతను దేవాలయం నుంచి చూడడం ఆగిపోయింది. దేవునికి మనకు ఉన్న మధ్య వ్యతిరిక్త్వం ఈ దేవాలయం కానీ ఇప్పుడు ఈ మధ్య వ్యతిరిక్త్వం అనేది లేదు దేవునికి మార్గం తెరుచుకుంది. ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సంవత్సరానికి గాని లేదా పండుగలకు గాని దేవాలయానికి రావడం అలాగే అర్పణలు బలులు నైవేద్యాలు ఇవ్వడం. ఇక్కడతో ముగిసింది ఇక్కడితో సమాప్తి ఈ రెండు సాదృశ్యాలను మనకు తెలియజేస్తుంది ఈ యొక్క దేవాలయపు తెర చినగటం అనేది. ఇక యేసుక్రీస్తు వారి ఆఖరి మాట జీసస్ ఫైనల్ వర్డ్ లూకా సువార్త 23 46 లో చూడండి. యేసు బిగ్గరగా కేక వేసి పెద్ద స్వరముతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికారు ప్రాణం విడిచారు. విచిత్రం ఏంటి అంటే ఇవి కూడా ప్రవచన నెరవేర్పులో భాగమే 31 వ కీర్తన ఐదవ వాక్యం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని దావీదు కీర్తనలో కనిపిస్తుంది. ఈ ప్రవచన వాక్యంలో కూడా ఈ ప్రవచనము కూడా నెరవేరడం జరిగింది. దీనిని యూదులు తమ ప్రార్థనలో వాడతారు యూదులు చేసేటువంటి రాత్రికాల ప్రార్థనలో ఈ మాటలు వాడతారు ప్రార్థిస్తారు. ఇదే యేసుక్రీస్తు వారు బిగ్గరగా చెప్పి ప్రాణాన్ని విడిచారు ఆయనకు ఆయనే తన ప్రాణాన్ని అప్పగించారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని దేవుడు ప్రాణాన్ని తీసుకోలేదు సైనికులు చంపలేదు. దేవుడు హస్తం తీయకపోతే ప్రాణం పోయేది కాదు గనుక దేవుడు తన హస్తాన్ని కుమారున్ని చూడలేక తీసినారు కొంతకాలం కొంత క్షణం. కుమారుడు ఆ ఆత్మని ఆయనే అప్పగించుకున్నారు లేకుంటే ఆయనను ఎవరూ చంపలేరు. ఆయన మన కోసమే మరణించుటకు ఇష్టపడ్డారు గనుక ఆయనే ఆ ఆత్మను అప్పగించుకున్నారు. ఆ సందర్భంలో బిగ్గరగా చెప్పి చనిపోయారు ఎవరైనా చనిపోయే వ్యక్తి నుంచి ఆశించేది తక్కువ ఎందుకంటే ఓపిక ఉండదు అలసిపోతారు. కానీ ఆయన బిగ్గరగా కేక వేసి ఆఖరి మాట పలికారు ఆయన మాటలు ధృడంగాను నమ్మకంగాను ఉంటాయి. ఈ ఆఖరి మాటలోని ప్రాముఖ్యమైనటువంటి మూడు అంశాలను మనం పరిశీలించాలి ఆ మూడు అంశాల ద్వారా మనం మంచి విషయాలను మనం తెలుసుకోవాలి. నెంబర్ వన్ దాంట్లో మొదటిది ఏ వర్డ్ ఆఫ్ ఇంటిమసి ఈ మాటలో ఉన్న సాన్నిహిత్యం బంధం దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది.
[7:34]దేవునితో ఆయనకున్న సాన్నిహిత్యంతో మాట్లాడారు ఆయన అప్పగించిన పని ముగిసింది. ఆయన నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు తన పని ముగించుకొని ఆయనకు తన ఆత్మను ఆయనే అప్పగించుకున్నారు. ఆయన ప్రతి సందర్భంలోనూ కూడా తండ్రి అని పలికేవారు తండ్రి అని ప్రార్థించారు. ఆయనతో ఎప్పుడూ ఉన్న పరమ తండ్రి ఈయనకు ఉన్న సంబంధం ఈ ఆత్మే ఆత్మ ద్వారా భూమి మీదకు వచ్చి అదే ఆత్మను తిరిగి అప్పగించే సమయం ఇది. దేవుని మహిమ వలన దేవుని ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి భూమి మీదకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన అలా ఆత్మ ద్వారా వచ్చి ఇప్పుడు ఆ ఆత్మనే దేవునికి అప్పగించేటువంటి సమయం అది. అదే ఆత్మను తిరిగి అప్పగించే సమయం ఇది అదే ఆఖరి మాటలో మనకు తెలుస్తుంది. యేసు వారికి మరణం అనేది శత్రువు కాదు ఆయనే అర్పించారు. ఎంత దుర్బరమైన సమయమైనా తండ్రి విడిచి వెళ్లరు తనతోనే ఉంటారు అని ఆయనకు తెలుసు. ఎప్పుడు కూడా తన ఆత్మను స్వీకరించడానికి ఆయన ఉన్నారు అప్పగించారు వెంటనే శరీరాన్ని విడిచి ఆత్మ దేవుని చేతికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రాణం విడిచారు అని మనం చదువుతాం. మనకు కూడా దేవుని పట్ల అదే సాన్నిహిత్యం కలిగి ఉండాలి అదే విధేయత నమ్మకము చూపించాలి. దేవుని ఆత్మను మనలో ఉంచినప్పుడు మనల్ని బలపరచడానికి మనతో ఉండడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆ ఆత్మ శక్తిని కోల్పోకూడదు దేవునితో అప్పుడే సాన్నిహిత్యం బలంగా ఉంటుంది. మనము కూడా బలముగాను ధైర్యంగాను ఉండగలం పోరాడగలం. ఇక నెంబర్ టూ రెండవ పాయింట్ ఏంటి అంటే ఏ వర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఈ మాటలో ఉన్నటువంటిది ఏంటి అంటే నమ్మకం. నమ్మకమైనది మాట యేసు వారు తనని తాను అప్పగించుకొనుచున్నారు. 31 వ కీర్తన ఐదవ వాక్యంలో చూడండి కమిట్ అని ఉంటుంది అంటే కమిట్ అనేటువంటి పదం వాడారు అంటే అది హిబ్రూ పదం. పాకడ్ అనేటువంటి పదం వాడారు అక్కడ అంటే దాని అర్థం అప్పగించబడడం లేదా అప్పగించడం అని అర్థం. దీనికి కరెస్పాండింగ్ గ్రీకు పదం ఏంటి అంటే పారాతిథిమి అంటే భద్రత కోసం ఎవరికైనా అప్పగించడం అని అర్థం. సంరక్షణలో ఉంచడం అని అర్థం యేసు వారు తన తండ్రికే తన ఆత్మని నమ్మకంతో అప్పగించారు. యేసుక్రీస్తు శాశ్వతంగా ఉండేటువంటి విధిని తండ్రి యొక్క శాశ్వతమైన చేతులకు అప్పగించారు విశ్వసించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన చిత్తాన్ని నమ్మి ప్రాణం అప్పగించారు. నేడు మనుషుల వద్ద అలాంటి నమ్మకం లేదు నమ్మకం లేకుండానే జీవిస్తున్నారు చాలా సందర్భాల్లో నమ్మకం కూడా తరిగిపోతుంది. ఇది ఎక్కడ మనకు బాగా తెలుస్తుందంటే ఒకరి చేతుల్లో డబ్బు పెడదాము అంటే నమ్మకం అక్కడ మిస్ అవుతుంది. తమ పిల్లల్ని వదలాలి అంటే వేరే వాళ్ళతో పంపించాలి అన్నా వదలాలి అన్నా నమ్మకం. దాంపత్యంలో కూడా నమ్మకం ఏదైనా సరే నమ్మకం ఉండటం లేదు నమ్మకాన్ని కోల్పోయారు. లేదు లోకంలో ఆయన ప్రాణాన్నే చేతుల్లో పెట్టినంత నమ్మితే మనం ప్రాణం పోయినా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. కనీసం దేవుని యందు నమ్మిక ఉంచండి దేవుణ్ణి నమ్మకాన్ని కోల్పోకండి. ఇక మూడవది మూడవ సందర్భం ఈ మాట ద్వారా నేర్చుకోవాల్సిన మూడవది ఏంటంటే ఏ వర్డ్ ఆఫ్ సరండర్ దేవునికి లోబడినారు. లోబడటం సరండర్ అవ్వటం యేసుక్రీస్తు చెప్పిన మాటలో ఏ వర్డ్ ఆఫ్ సరండర్ లోబడిన మాట మనకు కనిపిస్తుంది. ఆ తండ్రి ఇచ్చిన మానవ జీవితం 33న్నర సంవత్సరాల జీవితాన్ని ఇచ్చి కాచినటువంటి తండ్రికి తనకి మరలా తిరిగి తన ప్రాణం తన ఆత్మను అప్పగించారు. యేసుక్రీస్తు వారి హ్యూమన్ లైఫ్ ముగించబడిన ఆ ఆత్మని లోబడి విధేయతతో అప్పగించారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 వ వాక్యం మొదటి తెసలోనికుర పత్రిక ఐదవ అధ్యాయం 23 వ వాక్యం చూడండి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుకొనుము అంటారు. యేసుక్రీస్తు వారు ఆయనే అప్పగించారు ఆత్మని జీవాన్ని శరీరాన్ని ఉంచారు అప్పగించారు మనము కూడా ఆయన రాకడలో అప్పగించాలి. యేసు వారు యూదునిగా జీవించినంత కాలంలోనూ ఇలా ప్రార్థించి ఉండవచ్చు కానీ ఆ ప్రార్థనే నిజ జీవితంలో కూడా ప్రార్థనకు మాత్రమే పరిమితం చేయలేదు. నిజ జీవితంలో కూడా నెరవేరింది నిజముగానే ఆత్మను అప్పగించారు. కీర్తనలు చాలా మంది చదువుతారు కీర్తనలు యూదులు చదువుతారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఏనాడు కూడా ఎవరూ కూడా దాన్ని సార్థకం చేసిన వ్యక్తులు లేరు ఆ వాక్యాన్ని నిజం చేసినటువంటి వ్యక్తులు లేరు. ప్రార్థనగా చేసినా వాక్యంగా తీసుకున్నా వాటిని కూడా నిజం చేసినటువంటి ఏకైక దైవమే యేసుక్రీస్తు వారు నిజముగానే ఆ ఆత్మను అప్పగించారు. ప్రార్థన వరకు మాత్రమే పరిమితం చేయలేదు. సో ఈ విధంగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించారు సిలువ మరణంలో ఆయన పస్కా వధువుగా వధించబడి ఆయనే తనను తాను రృత్తినిగా చేసుకొని ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు మానవ ప్రయాణాన్ని ముగించారు. ఇది ఏడవ మాట యొక్క సారాంశము ఏడవ మాట యొక్క వివరణ అయితే మొదటి నుంచి కూడా ఈ ఏడు మాటలు. ఏడు మాటలు కూడా సిలువలో పలికిన ఏడు మాటలు వాటి సారాంశాలు సందర్భాలు వాటి అర్ధవంతమైనటువంటి వివరణ అంతా కూడా చక్కగా వివరంగా ఇచ్చాను గనుక అన్నీ కూడా ఒకసారి గమనించండి చూడండి. ఆయన సిలువ మీద నలిగి నలిగి ఆఖరిగా మాట్లాడినటువంటి మాటలు ఏడు మాటలు. ఈ ఏడు మాటల యొక్క సందర్భాలు వివరణ అంతా కూడా మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజున కాదు అనుదినము కూడా మనం ధ్యానించే వాటిగా వాటి అర్థాలు తెలిసిన వాటిగా వాటి సారాంశం ఏంటో గ్రహించే వారిగా మనం ఉండాలి అని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ప్లే లిస్టులో ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మీరు చూడండి గ్రహించండి. ఇవన్నీ కూడా ఇతరులు కూడా పరిచయం చేయండి మీకు మీ సంఘాల్లో గాని మీ వర్తమానాల్లో గాని ఉపయోగించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. అయితే మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమెన్



