Thumbnail for దయచేసి తొందరపాటు నిర్ణయాలు వద్దు ..! | Minister Ponnam Prabhakar Request To RTC Employees | ABN by ABN Telugu

దయచేసి తొందరపాటు నిర్ణయాలు వద్దు ..! | Minister Ponnam Prabhakar Request To RTC Employees | ABN

ABN Telugu

3m 48s359 words~2 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[0:00]ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
[0:38]కొంత క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి మూడు అంశాలే ఉన్నాయని పిఆర్సి కావచ్చు లేదా విలీనం కావచ్చు గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది.
[0:38]కానీ సరే కారణాలు ఏమైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి నాలుగు వారాలు జీవోలు వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది.
[0:38]సో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులందరం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
Use this transcript
Related transcript hubs

[0:00]మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి ఈ రిసోర్స్ మినిస్ట్రీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నరసంపేటలో జరిగిన సంఘటన గాని ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్డ్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2013

[0:38]దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టిసికి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొంత క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి మూడు అంశాలే ఉన్నాయని పిఆర్సి కావచ్చు లేదా విలీనం కావచ్చు గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే కారణాలు ఏమైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి నాలుగు వారాలు జీవోలు వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులందరం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసిటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందని మాట మనవి చేస్తూ మీ అందరికీ కూడా తెలుసు కొంత పత్రికల ద్వారా సమానంగా చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే గాక 2013 పిఆర్సి పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినం. 2017 పిఆర్సి ని ఇవ్వడంతో పాటుగా కార్య నియామకాలు కావచ్చు లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు కొత్త ఉద్యోగాలు కావచ్చు కొత్త బస్సులు కొనుగోడ చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు. అన్ని రకాల ఆర్టిసి కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. మొన్న ఈ మధ్యల మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కూడా కొంత యాజమాన్యం తరపున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొద్ది సమస్యలు ఉన్నాయని అంటే వాటిని కూడా తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తుంటే ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి ఒక అపోహ సృష్టించిన సందర్భంలో కూడా అనేక సందర్భంలో ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం తీసేసే పరిస్థితి లేదు తీయదు అనే మాట కూడా స్పష్టంగా చేసినాం. కానీ బయట నుంచి కొత్త ప్రోత్సాహం జరిగిందా లేకపోతే ఇంకొక ఉద్రేకపరితమైన వాతావరణం కలిగిందా ఏది ఏమైనా దయచేసి మరొక్కసారి అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈరోజు క్యాబినెట్ లో చర్చించిన మేరకు గాని వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల గాని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఈరోజు ఒక రవాణా శాఖ మంత్రిగానో లేకపోతే ఇంకొక మంత్రి కాకుండా మొత్తం క్యాబినెట్ అంతా కూడా మీ పట్ల కన్సర్న్డ్ ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript