Thumbnail for ప్రపంచ దేశాలన్నీ అప్పుల్లో ఉంటే  అప్పు ఇస్తున్నది ఎవరు? | World Debt Explained in Telugu Badi by Telugu badi (తెలుగుబడి)

ప్రపంచ దేశాలన్నీ అప్పుల్లో ఉంటే అప్పు ఇస్తున్నది ఎవరు? | World Debt Explained in Telugu Badi

Telugu badi (తెలుగుబడి)

14m 47s2,290 words~12 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[0:02]ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకి ఉన్న అప్పు 18 ట్రిలియన్ డాలర్లు.
[0:02]348 ట్రిలియన్ డాలర్లు, అంటే 317 పక్కన 14 సున్నాలు పెడితే ఎంత ఉంటుందో అన్ని రూపాయలు.
[0:02]ఇంత అప్పు తీసుకునే బదులు కావలసినంత మనీ ప్రింట్ చేయొచ్చు కదా లేదా మనీ ప్రింట్ చేసి ఆ అప్పునే తీర్చేయొచ్చు కదా.
[0:02]మనకు డబ్బు అవసరమైనప్పుడు ఎలా అయితే అప్పు తీసుకుంటామో అలాగే ఏదైనా గవర్నమెంట్ కి డబ్బు అవసరమైనప్పుడు కూడా అప్పు తీసుకుంటుంది.
Use this transcript
Related transcript hubs

[0:02]ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. కానీ ఆ దేశానికి ఉన్న అప్పు 38 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకి ఉన్న అప్పు 18 ట్రిలియన్ డాలర్లు. మన భారతదేశానికి కూడా 3.36 ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పు ఉంది. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా 3 కోట్ల కోట్లు. కేవలం ఈ మూడు దేశాలకే కాదు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికి అప్పు ఉంది. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల అప్పు కలిపితే ఎంత అవుతుందో తెలుసా? 348 ట్రిలియన్ డాలర్లు, అంటే 317 పక్కన 14 సున్నాలు పెడితే ఎంత ఉంటుందో అన్ని రూపాయలు. అయితే ఇంత పెద్ద మొత్తంలో దేశాలు అప్పు ఎందుకు తీసుకుంటున్నాయి? ప్రపంచంలోని అన్ని దేశాలకు అప్పు ఉంటే మరి అప్పు ఇస్తున్నది ఎవరు? ఇంత అప్పు తీసుకునే బదులు కావలసినంత మనీ ప్రింట్ చేయొచ్చు కదా లేదా మనీ ప్రింట్ చేసి ఆ అప్పునే తీర్చేయొచ్చు కదా. ఎప్పటికైనా దేశాలు ఇంత అప్పును తీరుస్తాయా? మనం న్యూస్ లో ఎక్కువగా వినే వరల్డ్ బ్యాంక్ అలాగే ఐఎంఎఫ్ అంటే ఏమిటి? అవి ఏం చేస్తాయి? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మనకు డబ్బు అవసరమైనప్పుడు ఎలా అయితే అప్పు తీసుకుంటామో అలాగే ఏదైనా గవర్నమెంట్ కి డబ్బు అవసరమైనప్పుడు కూడా అప్పు తీసుకుంటుంది. సాధారణంగా గవర్నమెంట్ కి ప్రజలు, కంపెనీలు పే చేసే టాక్స్ల ద్వారా ఆదాయం వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం అంటే రోడ్లు వేయడం, స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించడం అలాగే కొన్ని సంక్షేమ పథకాలకు ఈ డబ్బు ఖర్చు పెడుతుంది. అయితే ఒక్కొక్కసారి గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. దీనిని బడ్జెట్ డెఫిసిట్ అంటారు. ఈ లోటుని పూడ్చడానికి గవర్నమెంట్ కి మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆదాయం పెంచడం కోసం టాక్స్లను పెంచడం. కానీ ఇలా టాక్స్లను పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత ఏర్పడుతుంది. రెండు ఖర్చులు తగ్గించడం కోసం డెవలప్మెంట్ ని స్లో చేయాలి. అంటే కొత్తగా ప్రాజెక్టులు, రోడ్స్, స్కూల్స్ వంటివి ఆపేయాలి. అభివృద్ధి సంక్షేమ పనులు తగ్గించాలి. ఇలా చేసినా ప్రజల్లో నమ్మకం పోతుంది. సో ఇక గవర్నమెంట్ కి ఉన్న మరొక ఆప్షన్ అప్పు తీసుకోవడం. మరి గవర్నమెంట్ కి అప్పు కావాలంటే ఏదో నార్మల్ గా బ్యాంక్ నుండి మనం తీసుకున్నట్టుగా తీసుకోదు. ఎందుకంటే మనలా ఒకటి రెండు కోట్లు కాదు కొన్ని వేల, లక్షల కోట్లు అవసరం ఉంటుంది. ఇంత అప్పు బ్యాంకులు ఇవ్వలేవు. దీని కోసమే బాండ్స్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ అప్పు తీసుకోవడం అంతా కూడా ఈ బాండ్స్ ద్వారానే జరుగుతుంది. అసలు ఈ బాండ్స్ అంటే ఏమిటో సింపుల్ గా చెప్పుకుందాం. మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకునేటప్పుడు ఎంత డబ్బు తీసుకున్నాం. ఎంత వడ్డీ పే చేయాలి? ఎన్ని రోజుల్లో పే చేయాలి? ఇలాంటివన్నీ ఉండేలా ఒక ప్రామిసరీ నోట్ రాసుకుంటాం కదా ఆ ప్రామిసరీ నోట్ లాంటిదే ఈ బాండ్. సేమ్ గవర్నమెంట్ కి కూడా డబ్బు అవసరమైనప్పుడు బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ లో ఎంత వడ్డీ వస్తుంది? మెచ్యూరిటీ ఎంత అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు డబ్బు వెనక్కి తిరిగి వస్తుందని అనే వివరాలు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ బాండ్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే రిటర్న్ ప్రామిస్ లాంటిది. సో ఎవరైనా ఈ బాండ్స్ ని కొనుక్కుంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి వడ్డీ వస్తుంది. అలాగే ఆ బాండ్స్ గడువు ముగిసిన తర్వాత పెట్టిన అసలు డబ్బు మొత్తం తిరిగి వచ్చేస్తుంది. సో బాండ్స్ ని కొంటున్నాం అంటే దాని అర్థం మనం గవర్నమెంట్ కి అప్పు ఇస్తున్నామని. ఈ బాండ్స్ అనేవి గ్లోబల్ గా చాలా పాపులర్. ఎందుకంటే బయట ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి వస్తుందో రాదో తెలియదు. కానీ ఏకంగా ఒక దేశ ప్రభుత్వమే రిటర్న్ ప్రామిస్ ద్వారా రిలీజ్ చేసిన బాండ్స్ ద్వారా గవర్నమెంట్ కి అప్పు ఇస్తే ఖచ్చితంగా మన డబ్బు సేఫ్ గా ఉంటుందని నమ్మకం ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ బాండ్స్ ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ గా చెప్తారు. సో గవర్నమెంట్ కి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. సరే మరి ఈ బాండ్స్ ని కొని ఇన్ని కోట్ల అప్పు ఎవరు ఇస్తారు? చాలా మంది ప్రపంచ దేశాలకు కావాల్సిన డబ్బుని కేవలం వరల్డ్ బ్యాంక్ గాని ఐఎంఎఫ్ వంటి సంస్థలు గాని ఇస్తాయని అనుకుంటారు. కానీ కాదు. చాలా వరకు దేశాలకు అప్పు ఇచ్చేది ఆ దేశ ప్రజలే. ఎలా అంటే గవర్నమెంట్ ఇలా బాండ్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఆ దేశంలోని ప్రజలు అలాగే ఆ దేశంలో ఉండే లోకల్ బ్యాంక్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఈ బాండ్స్ ని కొంటాయి. వీటన్నిటి దగ్గర ఉండే డబ్బంతా కూడా ఆ దేశంలోని సామాన్య ప్రజల డబ్బే. మనం బ్యాంకులో దాచుకున్నామని, పెన్షన్ కోసం సేవ్ చేసుకున్నామని, ఇన్సూరెన్స్ కోసం మనం కట్టే ప్రీమియమ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. ఇలా వచ్చిన అమౌంట్ తో ఈ సంస్థలు ఈ బాండ్స్ ని కొంటాయి. అయితే మొత్తం ఇలా మన దేశంలోని ప్రజలు సంస్థలు మాత్రమే కాకుండా వేరే దేశాల గవర్నమెంట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ బ్యాంక్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇలా విదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఈ బాండ్స్ ని కొంటూ ఉంటారు. అంటే వేరే దేశాలు కూడా మన దేశానికి అప్పు ఇచ్చినట్టు. అదే ఒకవేళ మనం యూఎస్ బాండ్స్ ని కొంటే మనం యూఎస్ గవర్నమెంట్ కి అప్పు ఇచ్చినట్టు. సో మనకు యూఎస్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఉదాహరణకి మన దేశానికి ఉన్న మొత్తం అప్పులో 90 నుండి 95% డొమెస్టిక్ డెప్ట్. అంటే మన దేశంలోని ప్రజలు, బ్యాంకులు, సంస్థలు ఈ బాండ్స్ ద్వారా మన గవర్నమెంట్ కి డబ్బు అప్పుగా ఇచ్చాయి. మిగిలింది వేరే దేశాల ఇన్వెస్టర్లు సంస్థలు అప్పు ఇచ్చాయి. సో ఇలా ఈ బాండ్స్ ని ఎవరైనా కొనుక్కోవచ్చు. అంటే ఎవరైనా గవర్నమెంట్ కి అప్పు ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ దేశాలకు అప్పు ఎవరు ఇస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే చాలా వరకు ఆ దేశంలోని ప్రజలే ఆ దేశ గవర్నమెంట్ కి అప్పు ఇస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఈ బాండ్స్ ని ఆ దేశంలోని ప్రజలే కొనుక్కుంటారు. ఇలా ప్రతి దేశం కూడా తమ తమ అవసరాలకు తగ్గట్టుగా బాండ్స్ ద్వారా అప్పు తీసుకుంటుంది. ఇలా ఒక దేశం తన ఆదాయం, ఖర్చులు, అప్పు అన్నిటిని ప్లాన్ చేసుకుంటూ సిస్టం ని నడిపిస్తుంది. ఒక దేశం లాంటి భారీ ఎకానమీకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో మనం చూసాం. అదేవిధంగా ఒక చిన్న బిజినెస్ కి కూడా అకౌంటింగ్, ఇన్వెంటరీ, సేల్స్, హెచ్ఆర్ అన్నీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. అయితే చాలా మంది తమ బిజినెస్ ని రన్ చేయడానికి అకౌంటింగ్ కి ఒకటి, ఇన్వెంటరీ కి ఒకటి, సేల్స్ కి మరొకటి ఇలా ఎన్నో రకాల టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తూ ఉంటారు. దీని వల్ల చాలా టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ వుడు. వుడు అనేది ఆల్ ఇన్ వన్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. దీనిలో మీరు అకౌంటింగ్, ఇన్వాయిసింగ్, సేల్స్, హెచ్ఆర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ, ఈ కామర్స్, వెబ్సైట్ బిల్డింగ్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కాకుండా మొత్తం బిజినెస్ ఆపరేషన్స్ అన్నిటిని కలిపి ఒకటే ప్లాట్ఫామ్ లో మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ఓడులో 45 ప్లస్ అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ అయ్యి రియల్ టైం లో సింక్ అవుతూ ఉంటాయి. సో ఈజీగా ఒకే ప్లేస్ నుండి అన్నిటిని హ్యాండిల్ చేసుకోవచ్చు. వుడు ఇంటర్ఫేస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫస్ట్ టైం యూజర్ కి కూడా ఈజీగా అర్థమవుతుంది. మీది ఒక చిన్న స్టార్టప్ అయినా లేదా ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఎంటర్ప్రైజ్ అయినా బాగా ఎస్టాబ్లిష్ అయినా ఎంఎన్సి కంపెనీ అయినా అన్ని రకాల బిజినెస్ లకు ఈ వుడు యూస్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే వూడోలో ఫస్ట్ అప్లికేషన్ ని లైఫ్ టైం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు విత్ లైఫ్ టైం సపోర్ట్ అండ్ హోస్టింగ్. మరి ఇంకెందుకు ఆలస్యం టైం సేవ్ చేసుకోవడానికి, కాస్ట్ తగ్గించుకోవడానికి, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మీ బిజినెస్ ని ఈజీగా మేనేజ్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వూడో వెబ్ సైట్ ని చెక్ చేయండి. వుడు తో జర్నీని స్టార్ట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇలా ఒక దేశానికి అప్పు ఉన్నంత మాత్రాన ఆ దేశం దివాలా తీస్తుంది కొలాప్స్ అయిపోతుంది అని కాదు. అప్పుగా తీసుకున్న అమౌంట్ ని డెవలప్మెంట్ కోసం యూస్ చేస్తున్నారు కాబట్టి అప్పు అనేది ప్రతిసారి చెడ్డది కాదు. ఎలా అంటే గవర్నమెంట్ బాండ్స్ ద్వారా అప్పు తీసుకున్నప్పుడు ప్రజల దగ్గర ఉండిపోయిన అమౌంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఆ డబ్బుతో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ వంటి వాటికి ఖర్చు చేస్తుంది. కాబట్టి మనీ అనేది ఎకానమీలో సర్క్యులేట్ అవుతుంది. డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నప్పుడు బిజినెస్లు పెరుగుతాయి, వర్కర్స్ కి జాబ్స్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు కూడా ఖర్చు పెడతారు, టాక్స్లు పే చేస్తారు. దీని వల్ల ఎకానమీ గ్రో అవుతుంది. ఇదంతా ఒక లూప్ లా జరుగుతుంది. అదే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు కదా అని డెవలప్మెంట్ ఆపేసి ఎటువంటి అప్పు తీసుకోకుండా ఉండిపోతే ప్రజలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఒక సేఫ్ ప్లేస్ లేక మనీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఎకానమీలో మనీ ఫ్లో ఆగిపోతుంది. బిజినెస్లు తగ్గిపోతాయి, జాబ్స్ తగ్గిపోతాయి. ప్రజలు ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. కాబట్టి టాక్స్ల ద్వారా గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం తగ్గుతుంది. అదే అప్పు చేసినా సరే డెవలప్మెంట్ చేస్తే కొత్త కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి, ఎకానమీ పెరుగుతుంది, టాక్స్ల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఇన్ఫ్లేషన్ని ఇంట్రెస్ట్ రేట్లను కంట్రోల్ చేయడానికి కూడా గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఇలా రకరకాల కారణాల కోసం ఒక గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. కాబట్టి అప్పు అనేది కొంతవరకు మంచిదే. కానీ ఒక లిమిట్ దాటితే మాత్రం ప్రమాదం. మరి ఎంత అప్పు తీసుకుంటే అది ప్రమాదం అని తెలుస్తుంది అంటే దానిని డెట్ టు జిడిపి రేషియో తో కొలుస్తారు. ఇది అర్థం అవ్వడం కోసం ముందుగా జిడిపి అంటే ఏమిటో సింపుల్ గా చూద్దాం. జిడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారయ్యే మొత్తం అన్ని వస్తువుల మరియు సేవల మొత్తం విలువ. సింపుల్ గా చెప్పాలంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం, పప్పులు వంటి ఆహార పదార్థాలు, తయారైన కార్లు, ఫోన్లు వంటి అన్ని వస్తువులు అలాగే హాస్పిటల్స్, సాఫ్ట్వేర్ వంటి సర్వీసెస్. ఇలా అన్నీ కలిపి ఆ దేశంలో ఒక సంవత్సరంలో సంపాదించే మొత్తం ఆదాయాన్ని జిడిపి అంటారు. ఉదాహరణకి ఒక చిన్న గ్రామం ఉందనుకోండి. ఒక సంవత్సర కాలంలో ఆ గ్రామంలో రైతులు పంటలు అమ్మి 50 లక్షలు సంపాదించారు. మిగిలిన వస్తువులు తయారు చేసిన వాళ్ళు, షాపులు ఇవన్నీ కలిపి 30 లక్షలు సంపాదించారు. అలాగే ఆ గ్రామంలో ఉన్న టీచర్లు, డాక్టర్లు, మెకానిక్స్ అందరూ కలిసి 20 లక్షలు సంపాదించారు. మొత్తం ఒక కోటి రూపాయలు కదా. సో ఇప్పుడు ఆ గ్రామం జిడిపి ఒక కోటి రూపాయలు. అదే విధంగా ఇండియా మొత్తం చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఈ జిడిపి గురించి అయితే తర్వాత కంప్లీట్ గా మరొక వీడియో చేస్తాను. ఇప్పుడు డెట్ టు జిడిపి రేషియో అంటే ఒక దేశానికి ఉన్న మొత్తం అప్పుని ఈ జిడిపి తో పోలిస్తే ఎంత శాతం ఉంటుందో దానినే డెట్ టు జిడిపి రేషియో అంటారు. ఉదాహరణకి ఒక దేశ జిడిపి 100 కోట్లు అనుకుందాం. అలాగే ఆ దేశానికి 50 కోట్లు అప్పు ఉంది అనుకుంటే దాని డెట్ టు జిడిపి 50% అవుతుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ కొన్ని బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలకు ఇది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి జపాన్ ని తీసుకుంటే దాని డెట్ టు జిడిపి రేషియో 230% ఉంది. అదే అమెరికా డెట్ టు జిడిపి రేషియో 120%. మన దేశానికి ఉన్న డెట్ టు జిడిపి రేషియో 56% వరకు ఉంది. మరి ఇలా బాండ్స్ ద్వారా తీసుకున్న అప్పు ఎలా తీరుస్తారు అంటే ప్రతి బాండ్ కి ఒక మెచ్యూరిటీ టైం ఉంటుంది. ఆ టైం పూర్తయ్యేసరికి బాండ్స్ కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. అందుకోసం గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. ఈ కొత్త బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ తో ఓల్డ్ బాండ్స్ కి క్లియర్ చేస్తుంది. దీనినే డెట్ రోల్ ఓవర్ అంటారు. ఉదాహరణకి 2015 లో గవర్నమెంట్ బాండ్స్ ద్వారా 100 కోట్లు కలెక్ట్ చేసిందనుకుందాం. ఆ బాండ్స్ మెచ్యూరిటీ టైం 10 ఇయర్స్ అనుకుంటే 10 ఇయర్స్ తర్వాత అంటే 2025 నాటికి ఆ బాండ్స్ కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. సో గవర్నమెంట్ 2025 లో మళ్ళీ 100 కోట్ల కోసం బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ కొత్త బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ తో ఓల్డ్ బాండ్స్ ని క్లియర్ చేస్తుంది. ఇలా ఇంట్రెస్ట్ ని పే చేస్తూ ఎప్పటికప్పుడు అప్పు మేనేజ్ చేస్తున్నంత కాలం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఈ సైకిల్ దెబ్బతిని ఈ అప్పులు పెరిగిపోయి ఇంట్రెస్ట్ కూడా పే చేయలేని స్థితికి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఎకానమీ దెబ్బతింటుంది. 2022 లో శ్రీలంకలో ఇదే జరిగింది. ఎందుకంటే ఈ నేషనల్ డెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత అప్పుని ఒకేసారి క్లియర్ చేయలేదు. అందుకే ఇలా రోల్ ఓవర్ చేస్తూ మేనేజ్ చేస్తారు. అయితే ఇలా అన్ని దేశాల గవర్నమెంట్లు ఇంత అప్పు తీసుకొని ఖర్చు పెట్టేస్తూ ఉంటే మరి ఈ అప్పు అంతా అసలు తీరుతుందా అంటే 2025 ప్రకారం గ్లోబల్ జిడిపి. అంటే మొత్తం అన్ని దేశాల జిడిపి సుమారుగా 114 ట్రిలియన్ డాలర్స్. అదే గ్లోబల్ డెట్. అంటే అన్ని దేశాలకు ఉన్న అప్పు కలిపి 348 ట్రిలియన్ డాలర్స్. అంటే గ్లోబల్ ఎకానమీ కన్నా మూడు రెట్లు ఎక్కువ గ్లోబల్ డెట్ ఉంది. అలాగే యావరేజ్ డెట్ ఇంట్రెస్ట్ రేట్ 5 టు 7%. కానీ గ్లోబల్ జిడిపి ఇయర్ కి 3% చొప్పున పెరుగుతుంది. అంటే జిడిపి కన్నా రెండు రెట్లు ఎక్కువ. సో టెక్నికల్ గా చెప్పాలంటే ఈ అప్పు మొత్తం తీర్చడం చాలా కష్టమని ఎకనామిస్ట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అసలు గవర్నమెంట్లు ఇంత అప్పు తీసుకోవడం ఎందుకు కావలసినంత డబ్బు ప్రింట్ చేసుకోవచ్చు కదా. లేదా ఎక్కువ డబ్బు ప్రింట్ చేసి ఉన్న అప్పు అంతా తీర్చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే గవర్నమెంట్లు డబ్బు అప్పు చేయకుండా ఇష్టం వచ్చినంత డబ్బు ప్రింట్ చేసేసి ఆ డబ్బు అంతటిని ఖర్చు చేసేస్తే ఆ మొత్తం డబ్బు అంతా ఎకానమీలోకి ఎంటర్ అయిపోతుంది. దీని వల్ల మనీకి ఉన్న విలువ తగ్గిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అంటే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఆర్థిక వ్యవస్థ కూప్ప కూలిపోతుంది. దీని వల్ల అసలు ఆ కరెన్సీకి విలువే ఉండదు. ఇలా ఆల్రెడీ వెనిజులా, జింబాంబే వంటి దేశాల్లో జరిగింది. ఆ టైం లో ఆ డబ్బుతో ఏమి కొనలేక కరెన్సీ నోట్లను రోడ్ల మీద పడేసేవారు. దీని గురించి ఆల్రెడీ కంప్లీట్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి. కాబట్టి కొత్తగా మనీ ప్రింట్ చేయడం కాకుండా అప్పు తీసుకుంటే కొత్త మనీ ఎకానమీలోకి ఎంటర్ అవ్వడం కాకుండా ఉన్నదే సర్క్యులేట్ అవుతుంది. సో ఇష్టం వచ్చినంత మనీ ప్రింట్ చేసుకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. అయితే కొన్ని దేశాల ఎకానమీ సరిగ్గా స్టేబుల్ గా లేదు అనుకున్నప్పుడు ఆ దేశాల బాండ్స్ ని ఎవరూ కొనరు. ఆ దేశాలకు ఎవరూ అప్పు ఇవ్వరు. మరి ఇలాంటి దేశాల పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి సమయంలోనే వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ వంటి సంస్థలు ముందుకు వస్తాయి. ఫలానా దేశానికి వరల్డ్ బ్యాంక్ అప్పిచ్చింది లేదా ఫలానా దేశానికి ఐఎంఎఫ్ ఫండింగ్ ఇచ్చిందని మనం న్యూస్ లో ఎక్కువగా వింటూ ఉంటాం. వరల్డ్ బ్యాంక్ కి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి చిన్న తేడా ఉంది. ముందుగా వరల్డ్ బ్యాంక్ గురించి చూస్తే పూర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో డెవలప్మెంట్ కోసం. అంటే రోడ్స్, హైవేస్, స్కూల్స్, హాస్పిటల్స్, వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వంటి వాటి కోసం. చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుంది. అలాగే రీపే చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా ఇస్తుంది. కానీ కొన్ని దేశాలు ఉంటాయి. వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంటే కరెన్సీ వాల్యూ క్రాషెస్ అయిపోవడం, అదుపు తప్పి మరీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడం వంటి ఫైనాన్షియల్ క్రైసెస్ లో ఉంటాయి. అలాంటి దేశాలకు ఆ పరిస్థితి నుండి బయటకు రావడానికి సపోర్ట్ గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అనేది షార్ట్ టర్మ్ లో ఎమర్జెన్సీ లోన్ ఇస్తుంది. కానీ ఈ ఐఎంఎఫ్ లోన్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ పెడుతుంది. గవర్నమెంట్ తన ఖర్చులు తగ్గించాలని, టాక్స్లు పెంచాలని, గవర్నమెంట్ సబ్సిడీలు తీసివేయాలని, గవర్నమెంట్ కంపెనీస్ ఏమైనా ఉంటే వాటిని ప్రైవేటైజ్ చేయాలని వంటి కొన్ని కండిషన్స్ పెడుతుంది. లోన్ త్వరగా పే చేయడానికి ఎకానమీని మళ్ళీ కంట్రోల్ లోకి తీసుకురావడానికి ఇలాంటి రూల్స్ పెడుతుంది. ఈ ఐఎంఎఫ్ లోన్స్ ని క్లియర్ చేయడానికి దాదాపు 3 నుండి 10 సంవత్సరాల టైం ఇస్తుంది. అదే వరల్డ్ బ్యాంక్ లోన్ క్లియర్ చేయడానికి 10 నుండి 20 సంవత్సరాలు టైం ఇస్తుంది. అయితే ఇలా దేశాలకు లోన్స్ ఇవ్వడానికి ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ లకు మనీ ఎలా వస్తుంది అనే డౌట్ రావచ్చు. ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ లో చాలా దేశాలు మెంబర్స్ గా ఉంటాయి. ఈ దేశాలు వాటికి డబ్బును కాంట్రిబ్యూట్ చేస్తాయి. మరి ఇలా మనీ కాంట్రిబ్యూట్ చేసినందుకు వాటికి బెనిఫిట్ ఏంటంటే వాటికి ఓటింగ్ పవర్ వస్తుంది. ఏ దేశం ఎంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే అంత ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటుంది. సో ప్రపంచ దేశాలకు సంబంధించి ఏవైనా రీఫార్మ్స్ తీసుకురావాలన్న, డెసిషన్స్ తీసుకోవాలన్న ఎక్కువ ఓటింగ్ పవర్ ఉన్న దేశాల మాటే చెల్లుతుంది. అలా చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ లో ఈ రెండిటిలోనూ హైయెస్ట్ ఓటింగ్ పవర్ ఉన్న దేశం అమెరికా. అమెరికాకి రెండిటిలోనూ ఆల్మోస్ట్ 16% ఓటింగ్ పవర్ ఉంది. నెక్స్ట్ జపాన్ కు దాదాపు 6% ఓటింగ్ షేర్ ఉంది. ఆ తర్వాత చైనా, జర్మనీ దేశాలు ఉన్నాయి. అదే మన ఇండియాకి సుమారుగా 2.6 నుండి 2.9% ఓటింగ్ పవర్ ఉంది. ఈ ఓటింగ్ పవర్ కోసం దేశాలు వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ లకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఈ డబ్బుని అవి అప్పుగా ఇస్తుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అప్పు మీదే నడుస్తుంది. ఈ అప్పు అనేది నమ్మకం మీద నిలబడి ఉంది. సో ప్రపంచ దేశాలకు ఉన్న అప్పు గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ కి కావాల్సినంత డబ్బు ఎందుకు ప్రింట్ చేయడం లేదు? చేస్తే ఏమవుతుంది? మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇలాంటి ఎన్నో వీడియోలు ఆల్రెడీ మన తెలుగుబడి ఛానల్ లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టైం సేవ్ చేసుకోవడానికి, కాస్ట్ తగ్గించుకోవడానికి, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మీ బిజినెస్ ని ఈజీగా మేనేజ్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వూడో వెబ్సైట్ ని చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript