Thumbnail for చావు చూడకుండా నేరుగా పరలోకానికి వెళ్లిన ప్రవక్త! | Elijah #Bible #History #teluguchristian #elijah by Telugu Christian Post

చావు చూడకుండా నేరుగా పరలోకానికి వెళ్లిన ప్రవక్త! | Elijah #Bible #History #teluguchristian #elijah

Telugu Christian Post

2m 6s213 words~2 min read
Auto-Generated

[0:00]చావు చూడకుండానే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిన ప్రవక్త ఆయనే మన ఏలియా ప్రవక్త అండి. ఆయన ప్రార్థన చేస్తే చాలు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చేదంటే అర్థం చేసుకోండి ఆయన పవర్ ఏంటో. మూడున్నర ఏళ్ళు వర్షం పడకుండా చేశాడు. 450 మంది అబద్ధ ప్రవక్తల ముందు సింగిల్ గా నిలబడి గెలిచాడు. అలాంటి ఏలియా గారిని దేవుడు తీసుకెళ్లే టైం రానే వచ్చింది. తన శిష్యుడు ఎలీషాతో కలిసి యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఏలియా గారు తనపై వస్త్రం తీసి అలా నీటి మీద కొట్టగానే చూస్తుండగానే నది రెండూగా చీలిపోయిందండి. ఇద్దరు ఆరిన నీళ్ల మీద అవతలికి వెళ్లారు. అప్పుడు ఏలియా గారు నేను వెళ్ళేలోపు నీకు ఏం కావాలో అడుగు అనగానే ఎలీషా నీకున్న ఆత్మ బలం నాకు రెండింతలు కావాలి అని అడిగాడు. చాలా కష్టమైనది అడిగావు కానీ కానీ దేవుడు నన్ను తీసుకెళ్లేటప్పుడు నువ్వు చూస్తే అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అన్నారు ఏలియా. అంతేనండి ఒక్కసారిగా ఆకాశం తెరుచుకుంది. ఒక అగ్ని రథం అగ్ని గుర్రాలు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేశాయి. క్షణాల్లో ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఎలీషా కళ్ళ ముందే ఏలియా గారిని పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఎలీషా గట్టిగా నా తండ్రి అని అరుస్తూ కింద పడ్డ ఏలియా వస్త్రం తీసుకుని నది దగ్గరికి వచ్చి నీటిని కొట్టగానే మళ్ళీ నీళ్లు విడిపోయాయి. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏలియా వెళ్ళిపోయినా దేవుని శక్తి మాత్రం అదృశ్యం కాలేదండి. అది ఎలీషాకు వచ్చేసింది. మన జీవితంలో కూడా అంతే ఎవరినైనా కోల్పోయి శూన్యంలో ఉన్నాం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని పైకి లేపి ఆయన పని చేయమని పిలుస్తున్నాడేమో ఆలోచించండి. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితానికి బలం ఇస్తే దేవునికి కృతజ్ఞతగా కామెంట్స్ లో హల్లెలూయా అని టైప్ చేసి మన ఛానల్ లోని ఈ వాక్యాన్ని మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript