[0:00]ఆ స్వామి ఇటు హిందువులకు అటు ముస్లింలకు కూడా ఆరాధ్య దైవం. సాధారణంగా మనం విష్ణుమూర్తి దశావతారాల గురించి ఇతర అవతారాల గురించి కథలు కథలుగా వింటూ ఉంటాం. కానీ శివుడి అవతారాల గురించి అంతగా వినబడదు. అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పుకోబోయే కథనం మాత్రం శివుడి అంశగా ఇంకా చెప్పాలంటే శివుడి అవతారంగా చెప్తారు. మహారాష్ట్రులకు అత్యంత ప్రీతి పాత్రమైన దేవుడు ఆ స్వామి. మహారాష్ట్రులతో పాటు కర్ణాటక తెలంగాణలో కొంత భాగంలోని ప్రజలకు కులదైవం. ఇంతకీ ఆ స్వామి ఎవరు? ఆ కథ ఏంటి? ఈ విశేషాలు తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు
[1:12]లో కొంత భాగంలో ఇటు బ్రాహ్మణుల నుంచి ముస్లింల వరకు అటు గిరిజనుల దగ్గర నుంచి నాగరికుల వరకు ఎంతో మంది తమ కులదైవంగా ఆరాధించే దేవుడు ఖండోబా. ఇంతకీ ఎవరు ఈ ఖండోబా? ఖండోబాను కొన్ని చోట్ల భైరవునిగా పూజిస్తారు. మరికొన్ని చోట్ల సూర్యుడిగా ఆరాధిస్తారు. ఇంకొన్ని చోట్ల శివుడి కుమారుడైన కుమారస్వామిగా పూజిస్తారు. అయితే భక్తులు ఎక్కువగా నమ్మేది మాత్రం ఖండోబా శివుడి అవతారం అని. ఇంతకీ ఈ ఖండోబా దేవుడు ఎవరు? సూర్యుడా? కుమారస్వామా? కుమారుని తండ్రి శివుడా? ఒకవేళ అందరూ నమ్మినట్టుగా ఖండోబా దేవుడు శివుడే అయితే అసలు శివుడు ఖండోబాగా ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చింది? దానికి సంబంధించిన కథనం చూద్దాం. మల్ల మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడి కోసం తీవ్ర తపస్సు చేసి ఎవరి వల్ల మరణం కానీ ఓటమి కానీ ఉండకూడదు అనే వరాన్ని పొందారు. ఆ వర గర్వంతో భూమ్మీద గందరగోళం సృష్టిస్తూ మునుల్ని సామాన్య మానవుల్ని బాధించడంతో పాటు దేవతలను కూడా ఇక్కట్లకు గురి చేయడం మొదలు పెట్టారు. ఇదంతా చూసిన ఇంద్రాది దేవతలు ఋషులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. కానీ తానే వరమిచ్చిన ఆ రాక్షసులని మట్టుపెట్టడం తన వల్ల కాదు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీ మహా విష్ణువు కూడా ఆ రాక్షసుల్ని సంహరించడం తన చేతుల్లో లేదని తేల్చి చెప్పడంతో సప్తర్షులు ఇంద్రాది దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుల నుంచి రక్షణ కల్పించవలసిందిగా వేడుకున్నారు. వారి బాధను విన్న శివుడు మార్తాండ భైరవుడిగా అవతారం ఎత్తి దేవతల సైన్యంతో ఆ రాక్షసుల మీదికి దండెత్తాడు. ఆ మార్తాండ భైరవుడే ఖండోబా. మార్తాండ భైరవుడి దగ్గర ఉండే కుక్కలు రాక్షసుల సైన్యాన్ని చీల్చి చెండాడాయి. చివరకు మల్ల మణి అనే ఆ రాక్షసులని మార్తాండ భైరవుడు వధిస్తాడు. మార్తాండ భైరవుడి చేతిలో మరణిస్తున్న సమయంలో మణి అనే రాక్షసుడు పశ్చాత్తాపంతో తన తెల్లని గుర్రాన్ని ఖండోబాకు సమర్పించి ఒక వరాన్ని కోరతాడు. ఖండోబా యొక్క ప్రతి విగ్రహం ఎదుట తాను ఉండే విధంగా వరాన్ని కోరతాడు. సరేనంటూ అతడు కోరిన వరాన్ని ఖండోబా అనుగ్రహిస్తాడు. ఇక రెండవ రాక్షసుడైన మల్ల కూడా ఖండోబా దేవుడిని ఒక వరాన్ని కోరాడు. ఆ వరం ఏంటంటే ప్రపంచాన్ని నాశనం చేయాలని మానవ మాంసాన్ని తనకి ఇవ్వాలని. ఆ రాక్షసుని అనుచితమైన కోరికకు కోపగించుకున్న మార్తాండ భైరవుడు అతడి తలను ఖండిస్తాడు. అలా రాక్షసుల తలలను ఖండించిన మార్తాండ భైరవుడు ఖండోబాగా ప్రసిద్ధి చెందాడు. మల్ల అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి మల్హార్ అని కూడా పిలుస్తారు ఖండోబా దేవుడిని. ఈ కథనం ప్రకారం ఖండోబా ఆలయాల్లో మెట్ల దగ్గర ఉన్న రాక్షసుడి తల ఈ మణి అనే రాక్షసుడి తలగా చెప్తారు. ఖండోబా దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ తలను చూసిన వారికి భూతప్రేత పిశాచాల భయం ఉండదు అని కూడా చెప్తారు. అందుకనే ఖండోబా ఆలయానికి వెళ్ళిన వారు స్వామి దర్శనంతో పాటు ఈ రాక్షసుడి తలను కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో ఈ ఖండోబా ఆరాధన పురాతన కాలం నుంచి ఉందని సాహిత్య కథనాలు చెప్తున్నాయి. కర్ణాటక మహారాష్ట్ర సాహిత్యంలో ఈ ఖండోబా ప్రస్తావన దాదాపు 1000 సంవత్సరాలుగా కనిపిస్తూనే ఉందని చెప్తారు పరిశోధకులు. 15వ శతాబ్దికి వచ్చేసరికి ఖండోబా ఆరాధన మరింత ఎక్కువైనట్టుగా చారిత్రక కథనాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో చాలా మంది శివుడ్ని ఖండోబా రూపంలోనే పూజిస్తారు. ఖండోబా చిత్రాలు మరాఠా సర్దార్ వస్త్రధారణలో కనబడతాయి. తరచుగా ఖండోబా గుర్రం మీద తిరుగుతున్న యోధుని గాను కొన్ని చిత్రాల్లో తన భార్యలతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. మహారాష్ట్రలో ఖండోబాను ఈ మానవ రూపంతో పాటు శివలింగ రూపంలో కూడా కొలుచుకుంటారు. ఇక కొన్ని కథనాల ప్రకారం ఖండోబాకు ఐదుగురు భార్యలుగా చెప్తారు. ఆ ఐదుగురు భార్యలు కూడా వివిధ మతాలు తెగలకు చెందిన వారు. అందులో ఒక ముస్లిం వర్గానికి చెందిన ఆమె కూడా ఉంది. ఖండోబా ఇలా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారని నమ్మకం ఆయనను అన్ని వర్గాలకు చేరువ చేసిందని భక్తులు నమ్ముతారు. ఈ కారణంగానే కుల మత జాతి భేదాలు ఏవి లేకుండా అందరూ ఆయనను తమవాడిగా భావించేవారట. అందుకే కొందరు ముస్లిములు కూడా ఆయనను ఆరాధిస్తూ ఉండేవారట. ముస్లింలు ఖండోబాను మల్లు అని అజ్మత్ ఖాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఖండోబాకు ఐదుగురు భార్యలని కథనాలు ఉన్న ఆలయాల్లో ఖండోబాతో పాటు పూజలు అందుకునేవారు మాత్రం మల్సా బనాయి అన్న ఇద్దరు భార్యలే. వీరిద్దరిని పార్వతిదేవి గంగమ్మ తల్లికి ప్రతిరూపాలుగా భావిస్తారు. ఆమె ధనికుడైన వ్యాపారి తీర్మార్సేట్ కు కుమార్తెగా జన్మించి పుష్యమాస పౌర్ణమి నాడు ఖండోబాని వివాహం చేసుకుంది. అందుకే ప్రతి పుష్య పౌర్ణమిని వార్షిక పండుగగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు మహారాష్ట్రయులు. ఇక కొన్ని జానపద కథల ప్రకారం ఖండోబా ఇద్దరు భార్యలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. అందుకనే ఖండోబా ప్రధాన దేవాలయం అయిన జేజురి వద్ద ఉన్న కొండలో పై భాగంలో మల్సాతో కూడిన ఖండోబా ఉంటాడు. అదే విధంగా క్రింది భాగంలో బనాయితో కూడిన ఖండోబా ఉంటాడు. అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఖండోబా ఈ ఇద్దరితో కలిసి భక్తులకు దర్శనం ఇస్తాడు. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఖండోబాకు సుమారు 600 దేవాలయాలు ఉన్నాయని తెలుస్తుంది. వీటన్నిటిలో మహారాష్ట్రలో పూణేకి 48 కిలోమీటర్ల దూరంలో జేజూరిలో ఉన్న ఆలయం ప్రధానమైనదిగా చెప్తారు. మహారాష్ట్రలో ఊరూరా ఈ ఖండోబా ఆలయాలు ఉంటాయి. అయితే వాటన్నిటిలోనూ పూణేకు సమీపంలో ఉన్న జేజూరి అనే ప్రాంతంలో ఉన్న ఖండోబా ఆలయం మాత్రం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ జేజూరిని రాజధానిగా చేసుకునే ఖండోబా ప్రభువు ప్రపంచాన్ని పాలించేవాడని అక్కడే ఆయన తన ఇద్దరు భార్యలతో కలిసి ఉండేవాడని ఓ కథనం. ఈ ప్రాంతానికి చారిత్రాత్మకంగా కూడా ఎంతో చరిత్ర ఉంది. ఛత్రపతి శివాజీ తన తండ్రిని చాలా కాలం తర్వాత ఇక్కడే కలుసుకున్నట్టు చెప్తారు. ఈ ప్రాంతంలో తిష్ట వేసిన మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసేందుకు వారిద్దరూ కొద్ది కాలం ఇక్కడే నివసించి వివిధ ప్రణాళికలు రూపొందించినట్టుగా కూడా చెప్తారు. సాధారణంగా ఖండోబా ఆలయాలు కోటల మాదిరిగా ఉంటాయి. మిగిలిన అన్ని దేవాలయాల మాదిరిగా ఇక్కడ బ్రాహ్మణులు పూజారులుగా ఉండరు. గురవాస్ అనే తెగవారు అర్చకులుగా ఉంటారు. మహారాష్ట్రలో కొత్తగా వివాహం అయిన వారు తప్పనిసరిగా ఖండోబా దేవుడిని దర్శించుకుంటారు. ఖండోబా దేవుడు నాలుగు చేతులు కలిగి ఒక చేతిలో బండార్ పాత్ర అంటే పసుపుతో నిండిన పాత్ర ఇంకో చేతిలో రాక్షస సంహారానికి కట్టె పట్టుకొని దర్శనం ఇస్తాడు. ఖండోబా దేవుడికి పసుపు అంటే ఎంతో ప్రీతిగా చెప్తారు. అందుకే భక్తులు పసుపు, ఉల్లిపాయలు ఇంకొన్ని కూరగాయలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
[8:30]అలా చేస్తే సిరిసంపదలతో ఉండే విధంగా ఖండోబా వారిని దీవిస్తాడని వారి నమ్మకం. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు సోమావతి అమావాస్య అని పేరు. ఈ సోమావతి అమావాస్య రోజున భక్తులు ఆడుతూ పాడుతూ ఒకరి మీద ఒకరు పసుపు చల్లుకుంటూ ఉంటారు. దీనిని మరాఠీ భాషలో బండారా అంటే పసుపు పండుగ అని పిలుచుకుంటారు. సంవత్సరంలో సోమవారం నాడు వచ్చే అమావాస్యలు ఎన్ని ఉంటే అన్ని రోజులు ఈ వేడుక అత్యంత వైభవంగా జరుపుకుంటారట. ఖండోబాకు పసుపు, బేల్ పళ్ళు, ఆకులు, ఉల్లిపాయలు, కూరగాయలు నైవేద్యంగా సమర్పిస్తారు. పురాన్పోలి అని పిలిచే ఒబ్బట్ల లాంటి వంటకాన్ని ఉల్లిపాయలు, వంకాయలతో తయారైన భరిత్రోద్గా అనే వంటకాన్ని ప్రసాదంగా పెడతారు. ఖండోబాకు దేవాలయాల్లో శాఖాహార నైవేద్యాన్ని సమర్పించిన దేవాలయం బయట మాత్రం కొంతమంది భక్తులు మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం కూడా ఉంది. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ఇద్దరు రాక్షసులతో ఖండోబా ఆరు రోజులు యుద్ధం చేశాడు కాబట్టి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఆరు రోజుల పాటు జేజూరి యాత్ర అన్న పేరుతో జాతర చేస్తారు. ఈ జాతర సందర్భంలోనే మహల్సాపతి షిరిడి నుండి పల్లకి తీసుకుని జేజూరి వెళ్ళినట్టు అక్కడే సాయిబాబాను చూసినట్టు చెప్తారు. పూర్వపు దేవదాసి వ్యవస్థను పోలిన ఒక వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నట్టు కొన్ని కథనాలు చెప్తున్నాయి. అయితే దేవదాసి వ్యవస్థలో కేవలం ఆడపిల్లలు మాత్రమే దేవునికి అంకితమై ఉంటే ఈ జేజూరి ఖండోబా ఆలయంలో ఖండోబా కోసం అంకితమైన బాలికలతో పాటు బాలురు కూడా ఉండేవారు. ఖండోబా కోసం అంకితమైన మగపిల్లల్ని వాఖ్య లేదా పులులు అని పిలుస్తారు. ఆడపిల్లల్ని మురళి అని పిలుస్తారు. ఈ వ్యాఖ్యాలు, మురళీలు ఖండోబాను కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ ఆలయాల్లో ఈ పద్ధతి అంతరించింది. ఈ జేజూరి ఖండోబా ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. షిరిడి వెళ్ళిన వారిలో చాలా మంది ముఖ్యంగా మహారాష్ట్రీయులు తప్పనిసరిగా ఖండోబా దర్శనం చేసుకుంటారు. ఇక పూణే నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది జేజూరి. ఇక్కడి నుంచి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఇక రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే పూణే మిరాజ్ రైల్వే మార్గంలో ఉంది జేజూరి రైల్వే స్టేషన్. అక్కడి నుంచి జేజూరి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక తెలంగాణలోని తెలుగు వారు కొమరవెల్లి మల్లన్నగా పిలుచుకునే దేవుడు ఈ ఖండోబాయే అని కూడా ఒక భావన ఉంది. మల్ల అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి మల్లన్న అయ్యాడని ఒక భావన. అందుకే కొమరవెల్లిలో వెలిసిన దైవాన్ని తెలుగు వారు మల్లన్నగా కొలుచుకుంటే మహారాష్ట్రీయులు ఖండోబాగా భావిస్తారు. ఇక కర్ణాటకలో ఈ ఖండోబాయే మైలారా అన్న పేరుతో ఎన్నో దేవాలయాల్లో పూజలు అందుకుంటున్నాడు. కొన్ని జానపద పురాణ కథనాల ప్రకారం ఖండోబాను శివుడి యొక్క 11వ అవతారంగా చెప్తారు. ఖండోబా సామ్రాజ్యంగా ఖండోబా ప్రధాన దేవాలయంగా చెప్పే జేజూరి ఆలయంతో పాటు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఖండోబా ఆలయాలు ఉన్నాయి. కర్ణాటకలోని బీదర్లోనూ, ఉస్మానాబాద్ జిల్లా, ధవాడ్, బెల్గాం, హవేరి మొదలైన ప్రాంతాల్లోనూ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో కూడా ఖండోబా ఆలయాలు ఉన్నాయి. ఇవి శివుడి 11వ అవతారంగా మహారాష్ట్రీయుల కులదైవంగా భాసిల్లుతున్న ఖండోబా దేవుని విశేషాలు.



