Thumbnail for ఉదయం ఇది తాగితే… కొవ్వు కరిగిపోతుంది | Lose Weight in 7 Days with These Powerful Natural Drinks! by Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official

ఉదయం ఇది తాగితే… కొవ్వు కరిగిపోతుంది | Lose Weight in 7 Days with These Powerful Natural Drinks!

Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official

9m 28s1,201 words~7 min read
Auto-Generated

[0:00]అధిక బరువు ఓవర్ వెయిట్ ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ కింద మారిపోయింది దీన్ని తగ్గించుకోవడం ఎందుకంటే దీని కోసం మీరు వాడేటటువంటి ఆ పద్ధతులు గాని లేకపోతే అడాప్ట్ చేసుకునేటువంటి విధానాలు గాని ఇవన్నీ కూడా మూసపూసినట్టుగా ఉండేటప్పటికీ అది శరీరానికి అలవాటు అయిపోతూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే వెరైటీ. బరువుని కంట్రోల్ చేయడానికి ఏడు రోజుల సహజ పానీయాల అద్భుత శక్తి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దీని గురించి మనం తెలుసుకుందాం.

[0:34]తుప్పు పట్టిన యంత్రానికి నూనె వేశారు అనుకోండి అది ఎలా వేగంగా పనిచేస్తుందో మందగించిన మన జీవక్రియ అంటే మెటబాలిజం ప్రక్రియని ఉత్తేజనం చేయడానికి మన వంటింటి సుగంధ ద్రవ్యాలు పనిచేస్తాయి.

[0:50]ఈ రహస్య పానీయాలు కేవలం రుచి కోసం కాకుండా శరీరంలో ఉండేటువంటి కొవ్వుని కరిగించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. ఎలా చేస్తాయి?

[1:03]మనం వంటింట్లో ఉండేటటువంటి జీలకర్ర కేవలం ఆ పోపు దినుసు మాత్రమే కాదు ఇది ఒక శక్తివంతమైన ఔషధం అన్న విషయం మీకు తెలుసా?

[1:17]ఆధునిక జీవనశైలి వల్లలో వచ్చేటటువంటి అనారోగ్యాన్ని వదిలించుకొని కొత్త ఉత్సాహంతోటి మీ ఆరోగ్యాన్ని మార్చుకోవడానికి ఇలాగే జీలకర్ర లాంటి ఒక ఏడు రోజుల ఆ సమాహారం అంటే ఒక సెవెన్ డేస్ ఒక ఛాలెంజ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం.

[1:38]ఈ కీలకమైన అంశాలని రహస్యాలని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

[1:46]మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మొహర మనోహర్ ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏడు వారాల నగల ఉన్నట్టుగానే ఆ మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఏడు రోజుల వెరైటీ పానీయాలు. వీటితోటి బరువు తగ్గొచ్చు ఈ ముఖ్య అంశాలు తెలుసుకుందాం. శరీరంలో బరువు పెరగటానికి ప్రధాన కారణం ఏమిటి మన జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు ఇది వైద్య శాస్త్రం చెప్తుంది. నేటి కాలంలో శారీరక శ్రమ తగ్గటం అలాగే ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల భారతీయుల్లో స్థూల కాయం అంటే ఒబెసిటీ అనేది ఒక పెద్ద సమస్య కింద ఒక పెద్ద పరిష్కారం లేని ఒక నాక్ అంటే ప్రియతి అనేటటువంటి ఒక సమస్య కింద పెరిగిపోతుంది. ఆయుర్వేద ప్రకారంగా మన శరీరంలో ఉండేటువంటి జటరాగ్ని అనేది ఆహారాన్ని అరిగించడమే కాకుండా శరీరంలో ఉండేటటువంటి అనవసర వ్యర్థాలని బయటకు పంపుతుంది. ఈ ఏడు రోజుల పానీయాలు అనేవి ఒక మీరు ఒక ఛాలెంజ్ కింద తీసుకుంటే ఇది మీ జటరాగ్నిని బలోపితం చేసి సహజంగా బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. అంటే ఒక ఏడు రోజులు ప్రతి రోజు చేసింది చేయకుండా చేస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. దీంతోటి శరీరానికి ఇది అలవాటు కాకుండా ఉంటుంది. ఆ కొత్త ఉత్సాహంతోటి మీకు కూడా దీన్ని తీసుకోవాలన్న ఉత్సాహం అనిపిస్తుంది. ఈ వివరాల లోతులోకి వెళ్దాం. మొదటి రోజు జీలకర్ర నీటితోటి జీర్ణక్రియకి మీరు ఊత ఇవ్వబడింది. అంటే జీలకర్ర అనేది కేవలం వంటలకి రుచిని ఇచ్చేటటువంటి పదార్థం మాత్రమే కాదు మన శరీరంలో ఉండేటువంటి జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది. ఒక టీ స్పూన్ జీలకర్రని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు పరిగడుపును తాగాలి. ఈ పద్ధతి తోటి కడుపు ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ తగ్గుతుంది. అలాగే శరీరంలో అనవసర వాయువులను ఇది తొలగించేస్తుంది. జీర్ణ క్రియని మెయిన్ గా మెరుగుపరుస్తుంది. దీనితోటి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇది పేగుల కైలికని క్రమబద్ధం చేసి శరీరంలో ఉండేటటువంటి విషతుల్యాలను బయటికి పంపించేస్తుంది. రెండో రోజు నిమ్మ తేనెతో కూడినటువంటి గోరువెచ్చని నీళ్లు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అనుసరించేటటువంటి ది బెస్ట్ పద్ధతి ఇది చాలా ఫేమస్ అయింది కూడా. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లకి అర చెక్క నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. నిమ్మరసం లో ఉండేటటువంటి విటమిన్ సి శరీరంలో ఆ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె అనేది తక్షణ శక్తిని ఇస్తూనే అనవసరమైనటువంటి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఈ మిశ్రమం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచగలుగుతుంది. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల జీల క్రియ అంటే మెటబాలిజం వేగవంతం అవుతుంది వేగాన్ని పుంచుకుంటుంది. మూడో రోజు అల్లం మిరియాల టీ. శారీరక ఉష్ణగ్రతను స్వల్పంగా పెంచుతూ కొవ్వుని కరిగించే గుణం అంటే థర్మోజెనిక్ ఎఫెక్ట్ ఈ అల్లం మిరియాలకి ఉంది. అల్లం ముక్కల్ని నీటిలో వేసి మరిగించి దానికి చిటికెడు మిరియాల పొడి చేర్చి అల్పాహారం తర్వాత తాగాలి. ఇది రక్త ప్రశనని మెరుగుపరుస్తుంది. అల్లం అనేది ఆకలిని కంట్రోల్ చేస్తూనే ఇది జీన క్రియని ఇంప్రూవ్ చేస్తుంది. మిరియాలు శరీరంలో ఉండేటువంటి కణాల్లో కొవ్వు పెరిగిపోకుండా నివారిస్తాయి. ప్రధానంగా బయో అవైలబిలిటీని ఈ మిరియాలు పెంచుతుంది. నాలుగవ రోజు దాల్చిన చెక్క నీళ్లు అంటే రక్తంలో ఉండేటువంటి చెక్కర స్థాయిని సమతుల్యత చేయటంలో దాల్చిన చెక్క మంచి ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఒక దాల్చిన చెక్క ముక్కని రాత్రంతా నీటిలో నానబెట్టి మరసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఇది ముఖ్యంగా తీపి పదార్థాల మీద ఉండే కోరికని ఆ క్రేవింగ్స్ ని తగ్గించగలుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం తోటి శరీరంలో కొవ్వు నిలువలు పెరుకోకుండా ఇది చూస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఐదవ రోజు ఆపిల్ సైడర్ వెనిగర్ పానీయం. భోజనానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఒక గ్లాసు నీళ్లకి ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇది మనం తీసుకున్నటువంటి ఆహారం నుండి పిండి పదార్థాలు త్వరగా చక్కర కింద మారకుండా నివారిస్తుంది. దీంతో తక్కువ క్యాలరీలు ఉండేటటువంటి ఆహారం తీసుకునేలాగా మనల్ని ఇది ప్రేరేపిస్తుంది. అయితే దీన్ని ఎప్పుడు కూడా నేరుగా తీసుకోకుండా నీటితో డైల్యూట్ చేసి తీసుకోవాలి. ఆరవ రోజు గ్రీన్ టీ నిమ్మరసం కలయిక. సాయంత్రం వేళ ఒక కప్పు గ్రీన్ టీలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. గ్రీన్ టీలో ఉండేటటువంటి క్యాటిజిన్స్ అనేటటువంటి మూలకాలు కొవ్వు ఆక్సీకరణని అంటే ఫ్యాట్ ఆక్సిడేషన్ ప్రక్రియకి తోడ్పడతాయి. నిమ్మరసాన్ని కలుపుతాం కాబట్టి ఈ పోషకాలు శరీరానికి మరింత మెరుగ్గా అందుతాయి. ఇది శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఏడవ రోజు వాము నీటితోటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించడం. వాము అనేది ప్రాచీన కాలం నుంచి అరుగుదలకి మనం ఉపయోగిస్తున్నటువంటి గొప్ప ఔషధం. ఒక టీ స్పూన్ వాముని నీటికి వేసి బాగా మరిగించాలి. వడపోసుకున్న తర్వాత గోరువెచ్చగా తాగాలి. ఇది కడుపులో గ్యాస్ సమస్యలని నివారిస్తూ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా భారీ భోజనం తర్వాత కలిగేటటువంటి అసౌకర్యాన్ని తొలగిస్తుంది. శరీరంలో మెటబాలిక్ రేట్ ని పెంచడంలో వాము నీళ్లు ఎంతో తోడ్పడతాయి. అయితే ఇదే సందర్భంగా ఆ జీవన శైలి మార్పులు అతర రియాలిటీస్ కూడా మీరు తెలుసుకోవాలి. మీ జీర్ణక్రియను మెరుగుపరచడం ఆకలిని నియంత్రించడం శరీరంలో విష పదార్థాలను తొలగించడం లాంటి పునల ద్వారా బరువు తగ్గటానికి ఇవన్నీ సహకరిస్తాయి. అయితే నిజమైన బరువు తగ్గింపు అనేది మీరు తీసుకునే ఆహార నియమాలు అలాగే శారీరక శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజు కూడా 30 నుంచి 45 నిమిషాల పాటు నడవాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి ఇది తప్పనిసరి. అలాగే తగినంత ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం సరైన నిద్ర పోవడం లాంటివి కూడా ఆరోగ్యకరమైనటువంటి బరువుకి మార్గదర్శకాలు. చక్కెర వేపుళ్ళు నూనె పదార్థాలు వీటిని ఆహారంలో తగ్గించినప్పుడు మాత్రమే ఈ పానీయాల తరపు ఫలితం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనికి సహకరించే చికిత్సా విధానాలు కూడా మీరు తెలుసుకోవాలి. బరువు తగ్గడం అనేది కేవలం ఆహారానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది శరీరంలో ఉండేటటువంటి దోషాల తాలూకు సమతుల్యతని సంబంధించి సంబంధించిన బ్యాలెన్స్ చేస్తుంది. ఒక ఆ మెయిన్ గా ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ పానీయాలని ఒక క్రమ పద్ధతిలో మీరు వాడాలి. ఇది ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో కఫదోషం పెరిగినప్పుడు బరువు పెరుగుతారు కాబట్టి కఫాన్ని తగ్గించే వేడి గుణం ఉన్న మూలికల్ని మనం ఎంచుకోవాలి. మీకు సహాయపడే కొన్ని గృహ చికిత్సలు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవలసింది జీలకర్ర దాల్చిన చెక్క మిశ్రమం. అర టీ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ముక్కని ఒక గ్లాస్ నీళ్లకి వేసి సగానికి అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకి రెండు సార్లు భోజనానికి ముందు తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం తులసి పానీయం. అంటే చిన్న అల్లం ముక్క ఐదు తులసి ఆకులను నీటిలో మరగించి తాగాలి. ఇది శరీరం నుండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూనే కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది. వాము సైంధవ లవణం కూడా ఇదే రకంగా మీకు సహాయపడుతుంది. వాముని తోరగా వేయించి పొడి చేసుకొని దానికి చిటికెడు సైంధవ లవణం కలిపి గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోవాలి. ఇది దీర్ఘకాలంగా ఉన్న గ్యాస్ సమస్యలని నివారిస్తుంది. ఇవన్నీ మీకు ఇంటి వైద్యాలుగా ఉపయోగపడతాయి. అవసరం ఉంటే మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకం ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. నౌకా గుగ్గులు లాంటివి వీటిని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఈ ఏడు రోజుల సహజ పానీయాల సవాలు అంటే ఒక ఛాలెంజ్ ఇదేమిటి ఏడు రోజులతోటే మీరు ఏదో బరువు తగ్గుతారని కాదు మీకు ఒక వెరైటీ మీ శరీరానికి కూడా ఒక వెరైటీ. దీంతోటి శరీరం ఏ రోజుకి ఆ రోజు నిత్య నూతనంగా రెస్పాండ్ అవుతుంది. ఇలాగ ఆ మనం శరీరానికి ఒక కొత్త దాన్ని లాగే ఇచ్చినప్పుడు ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి వీటి ఫలితాలు మీకు మెరుగ్గా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని శుభ్రం చేస్తూ బరువు తగ్గే ప్రక్రియకి సహాయపడుతుంది. క్రమబద్ధమైనటువంటి వ్యాయామం పోషక ఆహారంతో పాటు ఈ పద్ధతులు పాటించినప్పుడు మీకు మంచి ఫలితాలు అందుతాయి. ఆరోగ్యం అనేది మన వంటింటి నుంచే మొదలవుతుంది. కాబట్టి సహజమైనటువంటి మార్గాల ద్వారా మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి. మీ వంటిట్లోనే ఒక అద్భుతమైన ఔషధాలకి అని గుర్తించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యం మీకు సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవ్వడం తోటే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి. అది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తరకు పర్పస్ అనేది జరుగుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి. శతం జీవ సరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript